ఓ గుల్మొహర్ పువ్వంత..                                    

 

ప్రసూనా రవీంద్రన్ 

 

పూరించమని నువ్వొదిలేసిన ఖాళీల్లో ఇవన్నీ నే రాసుకున్న వాక్యాలు.

నువ్వు చెప్పిన సశేష కథల్లో నేనూహించుకున్న ముగింపులూ ఇవే.

 

వాకిలి తట్టి మరీ ఏ కలలూ రావు గానీ, కల మీద సంతకమంటూ చూశాక, కొన్ని గుర్తుల్ని రెప్పలకే వేలాడదీయడంలో ఆనందం కూడా ఇలాగే ఉంటుంది. ఇక ఆ మిగిలిన రాత్రంతా , సగం తెరిచుకున్న తలుపులోంచి లోపల దూరే ఊహల కువకువలూ అచ్చం ఇలాగే ఉంటాయ్.

 

ఆకాశాన్ని పిలిచి ఆనందమంతా దింపుకున్నాక, ఎక్కడిదక్కడ సర్దేటప్పుడు నుదిటికి పట్టే చెమటలు సరిగ్గా ఇలాగే నవ్వుతాయ్.  మౌనంలోంచి మొదలై మధ్యలోనే తెగిపడితే, ఏరుకుని మబ్బుల కింద మడిచిపెట్టిన మాటలన్నీ ఇక్కడ రాలితే ఇలాగే పరాగాలవుతాయ్. ఆ పరాగాన్నే కళ్ళకి కాస్త రాసుకుని చూడు. తెలియటంలేదూ? వ్యతిరేక భావాలన్నీ వెలేయబడే లోకంలో, నీకూ నాకూ మధ్య దూరం ఓ గుల్మొహర్ పువ్వంత. 

 

PrasunaRavindran

 

మీ మాటలు

 1. indeed a poetic expression of the deep reverberations that knock at heart’s doors at an impromptu moment…just like the dreams that come to us unasked for! Thnq, young lady for a wonderful read…thnq, saaranga…

 2. Dr. Vijaya Babu, Koganti says:

  Simply ecstatic !
  How beautifully you have measured the distance ?
  Congrats Prasuna garu.

 3. P Mohan says:

  …వ్యతిరేక భావాలన్నీ వెలేయబడే లోకంలో, నీకూ నాకూ మధ్య దూరం ఓ గుల్మొహర్ పువ్వంత.

  ఎంత గొప్పగా చెప్పారు! ఆకాశం అందుకున్నంత సంతోషాన్నిచ్చింది మీ కవిత. థాంక్స్.

 4. ధన్యవాదాలు మోహన్ గారూ.

 5. ఎంత అందమైన భావన!

 6. ప్రసూనా రవీంద్రన్ గారూ,

  ఈ రోజుల్లో పేరాగ్రాఫ్ కవితను (prose – poem అనటంకన్న పేరాగ్రాఫ్ కవిత అనటమే నచ్చుతుంది నాకు) బాగా రాసేవాళ్లలో మీరు ముందువరుసలో ఉంటారన్నది నా అభిప్రాయం. Congrats and keep it up.

Leave a Reply to indira Cancel reply

*