ముగిసిన తర్వాత

    రాళ్ళబండి శశిశ్రీ
               
కొన్ని యుద్ధాలు ముగిసాక
ఏర్పడ్డ నైరాశ్యపు నిశ్శబ్దం
హఠాత్తుగా ఇద్దరి మధ్యా
పెరిగిపోయిన యోజనాల దూరం
తప్పులు, ఒప్పులు, అజ్ఞానం, అమాయకత్వం,
తోసిపుచ్చలేని, తేలని కొలతలు!
 
 
తెగని అలోచనలతో
అనివార్యమైన రోదనలు
పరిపరివిధాల పోయే మనసులో
పేరుకుపోయే అస్ప్సష్టతలు
కారణాతీతంగా జరిగేదేదీలేదని తెల్సినా
సంజాయిషీలతో సరిపెట్టలేని సందర్భాలు!
 
 
విచ్ఛిన్నమై పోయాక
చేతుల్లో మిగిలేది రిక్తమే-
చూపులు మోసేది నిర్వేదమే-
కాలం కూడా కదలలేదు
భారమైన మనసును మోస్తూ!
 
 
స్తంభించిన కాలాన్ని
దాటాలనే అడుగుల ప్రయత్నం-
జీవితం నడవాలి కదా!
 sasisri
                                   

మీ మాటలు

  1. చాలా బావుంది మీ కవిత శశిశ్రీ గారు

  2. mohan.ravipati says:

    nice one

  3. Wilson Sudhakar says:

    Good

  4. Life in few lines , superb expression !

  5. Jayashree Naidu says:

    మళ్ళీ మళ్ళీ చదివించావు…
    నైస్ వన్

  6. రెడ్డి రామకృష్ణ says:

    “స్తంభించిన కాలాన్ని
    దాటాలనే అడుగుల ప్రయత్నం-
    జీవితం నడవాలి కదా!”
    బాగుంది మేడం

  7. Bhanu Murthy Rao says:

    బాగుంది కవిత శశిశ్రి గారు .

Leave a Reply to Jayashree Naidu Cancel reply

*