ఇలాతలంలో హేమం పండగ…!

మమత వేగుంట 

 

 

suswaram

చీకట్లో మెరుస్తున్నాయి పల్లెపొలాల చాళ్ళు.
దున్నడం అయిపోయింది,
ఇక విత్తనాల కోసం వాటి ఎదురు చూపులు.

చీకటి ఎంత నల్లగా వున్నా, ఆ నేల ఎరుపుని దాచలేకపోతోంది.
అవునూ, అది నెలవంకా? లేదూ, ఎద్దు కొమ్మా?!

రి- సప్తస్వరాల్లో రెండోది.
వృషభం రంకెలోంచి పుట్టింది ఇది.
అంతే కాదు, దున్నిన నేల లోతుల్లోంచి మొలకెత్తే ప్రతిధ్వని కూడా అది.

ఈ నేల, మన దేశం.
రి- దేశ్ రాగానికి వాది స్వరం.
రాత్రి రెండో ఝాములో పాడే అందమైన, సంక్లిష్టమైన రాగం.

చాలా దేశభక్తి గీతాల్లాగే, వందే మాతరం మూల గీతం ఈ దేశ్ రాగంలో కూర్చిందే.
నా పెయింటింగ్ విషయానికి వస్తే,
వృషభం – నేలని దున్నే దేశభక్త.
సమున్నత శిఖరాలకు ఎగిసే పునాదినిస్తుంది.
ఎదగడానికి శక్తినిస్తుంది.

సస్య శ్యామలం!

Mamata 1

మీ మాటలు

  1. ” రి- సప్తస్వరాల్లో రెండోది , దున్నిన నేల లోతుల్లోంచి మొలకెత్తే ప్రతిధ్వని కూడా అది ” its beautiful అండ్ simple !!

  2. Thank you, Rekha!

  3. Dr.R.Suman Lata says:

    సప్త స్వరాల, సప్త వర్ణాల మేలుకలయిక -నవరస భరిత జీవ నాదానికి మచ్చుతునక –

  4. kandukuri ramesh babu says:

    రి: సంగీతానికీ చిత్రకళకీ మధ్య ఒక లంకె కాదు, అవశ్యమైన రంకె వేయడానికి మీరు ఆశీస్సులు పొందారు. ధన్యులయ్యారు. తొలకరి సమయంలో మీరు రైతు బిడ్డ అయ్యారు. భూమిపైన మళ్లీ ఒక అవశ్యమైన రంగస్తలం మీరు రచియించినారు. మళ్లీ చిందు ఎల్లమ్మ యాదికొస్తున్నది. నాజర్ బుర్రకథా వినిపిస్తున్నది. ఉద్విగ్నంగానూ వీరోచితంగానూ ఉన్నది చిత్రం. శాస్త్రీయ సంగీతంలో జానపదంలా ఉన్నది ఈ వృషభం. జలవనరులన్నీ ఎరుపు రంగును సంతరించుకుంటే ఒక వృషభ దేవత అలలపై తేలిపోతూ ఉన్నట్లున్నది. ఏ యుద్ధానికో ఏమో తెలుస్తున్నట్టే ఉన్నది. దాని కొమ్ములు లోలోపల నిర్నిద్రలో ఉన్న ఏవేవో ఆత్మల్ని లేలేమ్మని రగుల్కొలుపుతున్నవి. అల్లం రాజయ్య కథలో తల్లీ కొడుకులు నడుస్తూ ఉంటే, తల్లి వేలు విరిస్తే చిటుక్కుమన్న ధ్వనిలా ఉన్నది చిత్రం. బాలుడే అయినా దాని నిశిత స్వరాన్ని విన్న బిడ్డలా ఉన్నది చిత్రం. దశాబ్దాలుగా తనువు వీడిన రైతుల రకతం ఇంకా ఇంకిపోలేదని, మళ్లీ సుస్వరాలతో చెలరేగనున్నదనీ, చీమూ నెత్తురూ ఆత్మలను ఎగదోస్తూ ఉన్నదని భరోసా కలుగుతున్నది. చిత్రం. చూస్తుంటే అతడు అడవిని జయించాడు గుర్తొస్తున్నది. ఏటువంటి ఫలితమైనా సరే అని తన ప్రయత్నం తాను చేసి చివరికి వెన్నువాల్చి విశ్రమించిన అందలి కథా నాయకుడు గుర్తొస్తున్నాడు. చూస్తుంటే దురాశతో కాదుగానీ అంచెలంచెల వ్యవస్థలో రెక్కలు ముక్కలు చేసుకొని స్మశానం దున్నిన చేతులన్నీ గుర్తొస్తున్నాయి. గుమ్మడి విఠల్ ఇటీవలి ఆడిపాడిన పొడుస్తున్న పొద్దు గుర్తొస్తున్నది. అదుగో ఆ కొండల నడుమ సూర్యుడిని చూడు అన్నట్టుగా ఉన్నది. దుక్కిదున్నిన రైతు హస్తాలు పిడికిలి భిగించి, ఈ ఊరు మనదిరో అన్నట్టున్నది. ఈ గట్టు మనది చెట్టు మనది పొలం మనదిరా అన్న గూడ అంజయ్య గద్దింపు స్వరమూ వినవస్తున్నది. కోదాటి శ్రీను అందుకున్న ప్లోరైడ్ దుఃఖం పళ్లు నూరినట్టున్నది చిత్రం. పెద్దమ్మ గుడి కాడ ఆన వినవస్తున్నది. అసలు సిసలు ఇండియా గేటులా ఉన్నది. అటు కళకత్తా కాళి నాలుకలనూ ఉన్నది చిత్రం. సినీ మాయా వినోద జగత్తు బాహుబలి అవుతూ ఉండగా మలుపు తిప్పే చూపులా ఉన్నది చిత్రం. ఒక రైతు నాగలి ఎత్తనా వద్దా అని యోచిస్తుండగా తన ఎద్దులు రెండు భీకర ఘోషతో నేళమాలిగలోంచి నిద్రలేచి ఈ దేశంలో ప్రథమ పౌరుడెవరో నల్లటి వినీలాకాశంలో అరుణతారలా దండోరా వేస్తున్నట్టు ఉన్నది చిత్రం. శత్రుమూకలని చీల్చి చెండాడేలా తెల్లగా ఉన్నది చిత్రం. ఆడ…ఐరిష్ కవి టెరిబిల్ బ్యూటీ ఈజ్ బార్న్ అని గానం చేసిన కవితా చరణాలు ఈడ రంగుల్లో వృషభాన్ని నిద్రలేపాయా అనిపిస్తున్నది. మమత గారు… మీరు ఈ చిత్రంలో భూమిపుత్రికగా అట్టడుగునుంచి స్వరాన్ని తొలిచారు. తినే గింజలపై ‘రి’ అని రాసినట్లనిపిస్తుంది. శిరసారా వందనం.

  5. రమేష్ గారు.. మీ స్పందన లోని ప్రతి వాక్యమూ నాకు అమూల్యం. ధన్యవాదాలు. మమత

  6. వెంకన్న says:

    అయ్యా బాబోయ్ మోహన్ గారూ !
    మమత గారి (స్వర)రాగాల రంగులబొమ్మకి ఇంత మోహ పరవశులైపోయారా.
    మీ రాత కి దిమ్మ తిరిగిపోతోంది సర్.
    ఏ విషయం తో నైనా మోహం లో పడిపోతే ఆలోచన పనిచేయక ఇంత కలగాయ కూర దిమ్మరించేలా చేస్తుంది లెండి .
    అసలు రిషభ(వృషభం) స్వరానికి ఆమె మాటల రూపం కూడా దోవ తప్పింది.
    సప్త స్వరాలూ ఆయా పక్షుల జంతువుల నుండి ఏ స్థితి లో వెలువడ్దప్పుడు వాటిని ఆయా స్వరాలుగా స్వీకరించామో తెలుస్తే ఇంత గందరగోళం ఉండదేమోనండి .
    ఏదేమైనా బొమ్మలు మాత్రం బావున్నై .

    • వెంకన్న says:

      పై వ్యాఖ్యలో మోహన్ గారూ అని తప్పుగా టైపు చేసాను క్షమించండి. రమేష్ బాబు గారూ అని చదువగలరు.

మీ మాటలు

*