నెమలి పాడీ..వాన కురిసీ… హరివిల్లే విరిసీ…!

 

suswaramవర్షం-

జీవధార.

వర్షానికీ, “స” స్వరానికీ మధ్య తెగని బంధం.

మన శాస్త్రీయ సంగీతానికి ఆధార స్వరం- స.

వర్షాన్ని ఉత్సవం చేసే రాగం – మేఘ మల్హార.

మేఘ మల్హారకి జీవస్వరం- స.

 

రాగం  విచ్చుకోగానే, తెలిమబ్బుల సంచారం మొదలవుతుంది. అప్పుడు మయూరాల కలకూజితం మీరు విన్నారా?

ఆ కలకూజితం దానికదే పాటా కాదు, సంగీతమూ కాదు. కాని, “స” స్వరాన్ని నిర్వచించే ధ్వని అది. ఆ తరవాతి ఆరు స్వరాలకూ అదే ఆధారం. ఆరు స్వరాలకు జన్మనిస్తుంది కాబట్టి దాన్ని షడ్జమం అంటారు.

సరే, ఆ వాన కురిసీ, కాస్త ఎండ మెరిసే వేళలో ఏడు రంగుల హరివిల్లుని చూడండి. కచ్చితంగా అప్పుడే మయూర స్వరాన్నీ వినండి.

సరిగమల వర్ణాలన్నిటికీ  షడ్జమమే  శ్రీకారం!  

Mamata 1

మీ మాటలు

  1. అమ్మా కవిత చాలా బాగుంది. ఆనందాన్ని కలిగించింది. మీ సంగీత పరిజ్ఞానం మరింత సంతోషాన్ని కలిగించింది. ఇలాగే రాస్తూ ఉండండి.
    పులికొండ సుబ్బాచారి.

  2. ధన్యవాదాలు సుబ్బాచారి గారు !

  3. పెయింటింగ్ చాలా అందంగా వుందండీ ! ‘ వర్షాన్ని ఉత్సవం చేసే రాగం – మేఘ మల్హర్ ‘ , రాబోయే రంగుల కోసం , రాగాల కోసం .. , మనసును తాకగానే కురిసిపోయే మరిన్ని మేఘాల కోసం ఎదురు చూస్తున్నాం మమత గారూ !!

  4. Mythili Abbaraju says:

    ఒక వర్ణం ప్రవహించి వేరొకటి అవటాన్ని చిత్రించేందుకు రెంటిపైనా సమంగా ఉండవలసిన మమకారం మీలో – మబ్బుతునకలపైన తడి తడి గా తేలుతూ నా ఉదయపు కొంత సమయం , నాలుగు గోడల మద్యని ..ధన్యవాదాలండీ .

  5. Kuppili Padma says:

    వొక నెమలి వొక యింద్ర ధనుస్సు – మమతానురాగ సౌందర్యవర్ణం మనసు నిండుగా. Thank you Mamata.

  6. Beautiful Mamata. You ought to raise your own bars…expectations are getting higher here.

  7. Dear Padma, Rekha, Mythili garu – మీ స్పందన కూడా ఎంత poetic గా ఉందొ! థాంక్సండి. Anil garu, I will keep trying :) Thank you!

  8. Arunbavera says:

    బ్యూటిఫుల్ …

  9. P Mohan says:

    పెయింటింగే కాదు, వర్ణనా హరివిల్లులా ఉంది.

  10. ఏడు రంగుల కలయిక స్వచ్ఛధవళం అని చెబుతు సప్తవర్ణాల మధ్య తెల్లనెమలి unity in diversity కి ప్రతీకగా వుంది.

  11. Krishna Keerty says:

    చాలా బాగుంది. ఇలా మన శాస్త్రీయ సంగీతాన్ని నిత్య జీవితం తో ముడి వేసి చెపుతుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది.
    ధన్యవాదాలు!!!

  12. నిశీధి says:

    పెయింటింగ్ తో పాటు పదాలు అందంగా ఉన్నాయి . కుడోస్

  13. N.RAJANI says:

    మమత నీ చిత్రము కవిత రెండూ బాగున్నాయి. మల్లి ఇట్లా సారంగ చిత్రం లో కలవడం ఇంకా బాగుంది.

Leave a Reply to N.RAJANI Cancel reply

*