జీవధార.
వర్షానికీ, “స” స్వరానికీ మధ్య తెగని బంధం.
మన శాస్త్రీయ సంగీతానికి ఆధార స్వరం- స.
వర్షాన్ని ఉత్సవం చేసే రాగం – మేఘ మల్హార.
మేఘ మల్హారకి జీవస్వరం- స.
రాగం విచ్చుకోగానే, తెలిమబ్బుల సంచారం మొదలవుతుంది. అప్పుడు మయూరాల కలకూజితం మీరు విన్నారా?
ఆ కలకూజితం దానికదే పాటా కాదు, సంగీతమూ కాదు. కాని, “స” స్వరాన్ని నిర్వచించే ధ్వని అది. ఆ తరవాతి ఆరు స్వరాలకూ అదే ఆధారం. ఆరు స్వరాలకు జన్మనిస్తుంది కాబట్టి దాన్ని షడ్జమం అంటారు.
సరే, ఆ వాన కురిసీ, కాస్త ఎండ మెరిసే వేళలో ఏడు రంగుల హరివిల్లుని చూడండి. కచ్చితంగా అప్పుడే మయూర స్వరాన్నీ వినండి.
సరిగమల వర్ణాలన్నిటికీ షడ్జమమే శ్రీకారం!
అమ్మా కవిత చాలా బాగుంది. ఆనందాన్ని కలిగించింది. మీ సంగీత పరిజ్ఞానం మరింత సంతోషాన్ని కలిగించింది. ఇలాగే రాస్తూ ఉండండి.
పులికొండ సుబ్బాచారి.
ధన్యవాదాలు సుబ్బాచారి గారు !
పెయింటింగ్ చాలా అందంగా వుందండీ ! ‘ వర్షాన్ని ఉత్సవం చేసే రాగం – మేఘ మల్హర్ ‘ , రాబోయే రంగుల కోసం , రాగాల కోసం .. , మనసును తాకగానే కురిసిపోయే మరిన్ని మేఘాల కోసం ఎదురు చూస్తున్నాం మమత గారూ !!
ఒక వర్ణం ప్రవహించి వేరొకటి అవటాన్ని చిత్రించేందుకు రెంటిపైనా సమంగా ఉండవలసిన మమకారం మీలో – మబ్బుతునకలపైన తడి తడి గా తేలుతూ నా ఉదయపు కొంత సమయం , నాలుగు గోడల మద్యని ..ధన్యవాదాలండీ .
వొక నెమలి వొక యింద్ర ధనుస్సు – మమతానురాగ సౌందర్యవర్ణం మనసు నిండుగా. Thank you Mamata.
Beautiful Mamata. You ought to raise your own bars…expectations are getting higher here.
Dear Padma, Rekha, Mythili garu – మీ స్పందన కూడా ఎంత poetic గా ఉందొ! థాంక్సండి. Anil garu, I will keep trying :) Thank you!
బ్యూటిఫుల్ …
పెయింటింగే కాదు, వర్ణనా హరివిల్లులా ఉంది.
ఏడు రంగుల కలయిక స్వచ్ఛధవళం అని చెబుతు సప్తవర్ణాల మధ్య తెల్లనెమలి unity in diversity కి ప్రతీకగా వుంది.
చాలా బాగుంది. ఇలా మన శాస్త్రీయ సంగీతాన్ని నిత్య జీవితం తో ముడి వేసి చెపుతుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది.
ధన్యవాదాలు!!!
పెయింటింగ్ తో పాటు పదాలు అందంగా ఉన్నాయి . కుడోస్
మమత నీ చిత్రము కవిత రెండూ బాగున్నాయి. మల్లి ఇట్లా సారంగ చిత్రం లో కలవడం ఇంకా బాగుంది.