పాష్- బతక నేర్చిన కవులకో సవాల్!

నిశీధి 

 

అర్ధరాత్రి వెన్ను వణికించే పోలీసు బూట్ల చప్పుడో , అర్ధరహిత నిందలు మోపి చేయని తప్పుకు రోజుల తరబడి జైలు గదుల్లో గడపడమో మన జీవితాల్లో భయంకర విషయాలు కానే కావు , ప్రతి ఉదయం లేచి గానుగెద్దుల్లా బ్రతకటం కోసం బ్రతుకుతూ ఇంటికి ఆఫీసుకి మధ్య కనిపించని మైలురాళ్లు లెక్కపెట్టుకుంటూ కలలు కనడానికి కూడా భయపడుతూ బ్రతికే జీవితం అంత భయంకరమయినది ఇంకేమి లేదు అని ఎవరన్నా చెప్తే ఒక క్షణం ఆగిపోయి మన మీద మనమే కాసేపు జాలి పడి మరుక్షణం లో తుడుచుకొని మళ్ళీ రొటీన్ లో పడిపోయే జీవితాలకి ఉద్యమాలు , జనం కోసం బ్రతకడం అన్న పదాలు ఏలియన్ గా వినిపిస్తాయి కాబోలు .

శరీరంలో ప్రతి రక్తపు చుక్కని కార్చి ఒకో గింజకి ఆసరా అయ్యే చేతుల్లో పగిలిన రేఖల మీద జాలి చూపలేని దేవుడు లేనట్లే అని దేవుడి ఉనికిని ప్రశ్నించడం . అన్నం పెట్టె రైతులని కుడా వణికించే పవర్ యూనిఫాంకెవరిచ్చారు అని ఎస్టాబ్లిష్మెంట్స్ ని థియోక్రసీలని ప్రశ్నించగలిగే దమ్ము ఉండటం , నలిగిన జీవితాలని చూసిన ప్రతిసారి గొంతుదాటలేని ఏడుపులు పాటల హోరులా ఎలా కురుస్తాయి అని కవిత్వాన్ని హత్తుకోవటం లాంటివి ఖరీఫ్ లో వర్షాలు కరుణించక కోరి తెచ్చుకున్న ప్రభుత్వాలు పవర్ కస్టాలు పట్టించుకోక అసలు రబీలో పంటలు వేసుకోవటానికి బెంబేలు పడ్డ బీద రైతులు ఆత్మహత్యలో ఎండల్లో పిల్లాపాపాల పేగులెండబెట్టలేక అవసరార్ధం కూలీలుగానో మారిపోయి బ్రతుకు జీవుడా అని నిట్టూర్చడాలు అర్ధం కాక అర్ధం చేసుకొనే అవసరం లేక మా ప్రభుత్వాలు కనక బహిరంగంగా ఆడుకొనే బెట్టింగ్ ఆటలు చూసి మురవడానికి 24/7 గంటలు కరెంటిస్తుందో అని చీర్ గర్ల్స్ కి తోడూ బీర్ బాయ్స్ గా AC రూముల్లో బ్రతుకుతున్నాం అనుకొనే శవాలకి అసలు తెలుస్తుందా ? బహుశ ఎప్పటికి తెలియదేమో ఎందుకంటే బ్రతికుండడం అంటే కలలు కనడం , కలలు కనడానికి కావలసింది నిద్ర లేని రాత్ర్లులు కాదు గుండెలో దమ్ము అని చెప్పే “పాష్ ” లాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది . అందుకే అలాంటి వాళ్ళు మరణించినా బ్రతికుంటారు , మిగిలినవాళ్ళు జీవచ్చవాల్లా ఈసోరుమంటూ బ్రతుకీడుస్తుంటారు .

pash3

పాష్ (అవతార్ సింగ్ సంధు September 9, 1950 – March 23, 1988 ) మాక్సిం గోర్కీ అమ్మ చదివిన ఉద్వేగంలో అవతార్ సింగ్ ఎప్పుడు పాష్ (పాషా ) అయ్యాడో రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ కమ్యూనిజం నీడ కంటే మార్క్సిస్టుగా బ్రతకడంలో , నక్సల్బరీ ఉద్యమంలో తన అక్షరాల తూటాలు సంధించినదెప్పుడో , తానూ బ్రతికింది , మిగిలినవాళ్ళకు బ్రతుకు విలువ నేర్పింది అంతా కలిపి 40 ఏళ్ళ లోపే . తిరుగుబాటు దారుడు ట్యాగ్ మోసినా , వందల్లో తన కవిత్వాలు జైలు నుండి బయటకి స్మగుల్ అయ్యి జనాన్ని జాగృతి చేసినా , పైసల కోసం పనికిమాలిన మాటలు రాసి బ్రతకనేర్చిన కవుల మధ్య ఎమర్జెన్సీ టైంలో తన కవితలో కొన్ని పంక్తులు మార్చారన్న విషయంగా పే చెక్స్ రిజెక్ట్ చేసినా అదంతా పాష్ కే చెల్లింది .

విప్లవమంటే పేదవాడి కన్నీటికి పట్టాల్సిన దోసిలే కాని దేశాన్నోదలడమో , భూములని మతం సాక్షిగా ముక్కలు చేయడమో కాదని నమ్మిన సిద్ధాంతం యాంటి 47 జర్నల్గా మారి AK 47 ని నమ్ముకున్న ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎదిరించి దాని మూర్ఖపు భావజాలంకే బలయ్యింది కూడాను .సెపరేటిస్ట్ ఐడియాలజీని వ్యతిరేఖించింనందుకు , తన వాక్యాలతో నిజాలని నిప్పులుగా రాజేసినందుకు ఫలితంగా తన ప్రాణాలే వదిలేసుకున్న పాష్ , అతని లాంటి ఎన్నో  జీవితాలు కార్మికులకి కర్షకులకి తోడుగా నిలబడే విప్లవోద్యమం అంటేనే నిజమయిన దేశభక్తి అని ప్రూవ్ చేసినా నుదుటికి మతం పట్టీలు కళ్ళకి కులం కావరాలు పుసుకున్న వాళ్ళ డిక్షనరిలో విప్లవకారుడేప్పుడు దేశద్రోహే కదూ .

pash1

అందుకే మట్టి కోసమో మనుష్యుల కోసం బ్రతికే చాల మంది ” దేశద్రోహుల ” రక్తంలో ప్రవహించే పాష్ కవిత్వం ఈ సారి మన కోసం ఇలా .

The Most Dangerous Thing

The life of a pirate is not so dangerous
nor is a bashup in a police lockup
spying too is not very dangerous

to be woken up in the middle of the night
by the secret police
I admit is nerve wrecking
so is the quiet lonely fear
which follows you
and throttles your chest
when you are locked up in a cell
on a framed up false charge
for a crime you did not commit
all this I admit is bad enough
but all these are still not so dangerous

because the most dangerous thing is
to live like a dead man
when you don’t feel any thing
when the routine of daily life saps you totally
the fixed life of
home to work
work to home
that is a life without dreams
that is the most dangerous thing

that is when
the hour is alive and kicking for everyone
excepting for you
that life is the most dangerous thing

because
like the eyes of a dead fish
you stare at everything
but cannot feel anything
about yourself
or about others
that’s why
the most dangerous are those people
who have forgotten how to love people
for such people
live and shift aimlessly
in the ordinary humdrum orbit of their lives
in which nothing happens
nothing moves
like a placid cemetery

these people
are like that cold blooded moon
which feels nothing
no pain, love, sympathy or revulsion
when it goes over the courtyards
of the innocent victims
butchered in a slaughter

the most ugly sight is
that of a debauched old man
who is trying to sing a melody
but only succeeds in racking his weak chest

So the most dangerous life is the one
in which our conscience doesn’t prick you
because your soul is dead
that’s why I say

piracy is not so dangerous
spying is not so dangerous
bashup in a police lockup is not so dangerous
the most dangerous life is…

Translated by Suresh Sethi

పాష్ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు కలిగే ఆశ్చర్యం ఏమిటంటే అఖండభారత భావజాలం కలిగిన BJP ప్రభుత్వం NCERT పుస్తకాల పాఠాలలో భాగంగా ఉండిన ” sabse Khatarnak ” కవితని సిలబస్ నుండి తొలగించాలని పెద్ద గొడవ చేయటం , చాల ప్రశ్నల్లా ఇలాంటివాటికి మన దగ్గర సమాధానాలు ఉంటే పాష్ చెప్పినట్లు బ్రతికున్నవాళ్ళ జాబితాలో కనీసం ఒకసారయినా ఉండేవాళ్ళం ఏమో బహుశ .

*

మీ మాటలు

  1. పిన్నమనేని మృత్యుంజయరావు says:

    మంచి కవినీ, కవిత్వాన్నీ పరిచయం చేశారు.
    The life of a pirate is not so dangerous
    nor is a bashup in a police lockup
    spying too is not very dangerous
    The most dangerous thing is
    to live like a dead man
    the most dangerous are those people
    who have forgotten how to love people
    the most dangerous life is the one
    in which our conscience doesn’t prick you
    because your soul is dead
    కసిగా ఉంది. ఒక్కసారి కూడా ఇలా ఆలోచించని మనుషుల పైన కసిగా ఉంది.

    • నిశీధి says:

      చదివాక కొన్ని క్షణాల పాటు ఆ కసితో ఒళ్లంతా సెగలు కక్కడమే పాష్ కవిత్వం ! థాంక్స్ సర్ పిన్నమనేని మృత్యుంజయరావు గారు :)

  2. devi varma says:

    కవిత్వం అంటే సరైన అవగాహన లేని మాకు కవిత్వం తో ఒక కసిని చూపారు.
    మట్టి కోసమో మనుష్యుల కోసం బ్రతికే చాల మంది ” దేశద్రోహుల ” రక్తంలో ప్రవహించే పాష్ కవిత్వం రూపంలో..!

  3. venkatakrishna says:

    నిజమే పాష్ వాక్యం రగిలిస్తుంది ,ధన్యవాదాలు

  4. గొప్ప వ్యక్తిత్వాన్ని పరిచయం చేసినందుకు ఎంతో ధన్యవాదాలు

  5. ns murty says:

    ఒక మంచి కవిని ని పరిచయం చేశారు నిశీధి గారూ. థాంక్స్

  6. Aranya Krishna says:

    అవును, పాష్ చెప్పినట్లు అన్నింటికన్నా ప్రమాదకరం మన కలలు చచ్చిపోవటం. కాన్షస్ కీపర్ గా ఉండగలిగిన పాష్ ది చాలా మంచి కవిత ఇచ్చారు. ధన్యవాదాలు.

Leave a Reply to ns murty Cancel reply

*