బీఫ్‌పై మాట- పాట- ఒక సాంస్కృతిక నిరసన!

వొమ్మి రమేష్ బాబు

 

nandi award 012“పెద్దపులి గడ్డి మేసింది…”’
ఈ వాక్యం శాస్త్రసమ్మతంగా ఉందా..? పోనీ…
“ఆవు మాంసభక్షణ చేసింది..”’
ఈ వాక్యాన్ని లోకం మెచ్చగలదా..? మెచ్చదు. ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధం.
బీఫ్‌ ఈటర్స్‌ కూడా అంతే! వాళ్లు బీఫ్‌నే తింటారు. బీఫ్‌ తినొద్దనీ, పప్పు తినమని వాళ్లని నిర్బంధించడం లోక విరుద్ధం.
తప్పు అని తెలిసి కూడా ఈ పనికి ఇప్పుడు భారత పాలకులు ఒడిగడుతున్నారు. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటికే గోవధ నిషేధం అమలవుతోంది. గోవధ చేసినా, ఎద్దుమాంసం అమ్మినా, కొనినా, తిన్నా కేసులు పెడుతున్నారు. దేశమంతటా గోవధ నిషేధం విధించాలన్న నినాదం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మే 24 ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని లామకాన్‌లో “బీఫ్‌ బచావో ఆందోళన్‌” ఆధ్వర్యంలో బీఫ్‌పై మాట- పాట- కవిసమ్మేళనం జరిగింది. జూపాక సుభద్ర, పసునూరి రవీందర్‌, నలిగంటి శరత్‌, స్కైబాబా, జిలుకర శ్రీనివాస్‌ ప్రభృతుల పిలుపుతో బీఫ్‌ ఈటర్స్‌, ఫుడ్‌ డెమొక్రసీని కోరుకునే యాక్టివిస్టులు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారతదేశంలో కోట్లాదిమంది తినే ఆహారం బీఫ్‌. అది వారి ఇష్ట భోజనం. నోటికాడి విందు. పంటికింద ముక్క. చౌకగా దొరికే మాంసం. ఎద్దుకూరే వారికి దిక్కు- దివాణం. మందు- మాకు. బలం- పోషకం! ఘనత వహించిన మన భారతదేశంలో ఇప్పుడు ఆ కూర తినొద్దని ఆంక్షలొస్తున్నాయి. గోవథ నిషేధ చట్టాల పేరుతో బీఫ్‌ ఈటర్స్‌ గొంతు కోయాలనుకుంటున్నారు. గోవుని దేవతగా ప్రొజెక్టు చేయడం ద్వారా ఈ దేశ మూలవాసుల ఆహార హక్కుమీదే ఉక్కుపాదం మోపే కుట్ర జరుగుతోంది. ఈ కుట్రని కలిసికట్టుగా తిప్పికొట్టాలని “బీఫ్‌ బచావో ఆందోళన్‌” పిలుపునిచ్చింది.

తరతరాలుగా తింటున్న ఆహారం. ఊహ తెలిసినప్పటినుంచి తింటున్న ఆహారం… ఆ రుచికి నాలుక అలవాటుపడిపోయిన జీవితం… ఎద్దుకూరని బ్యాన్‌ చేస్తానంటే చూస్తూ ఊరుకుంటుందా..? ఊరుకోదు కదా..? ఆ మాటే తెగేసి చెప్పారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జూపాక సుభద్ర. గోవధ నిషేధ రాజకీయాలు సాగనివ్వబోమంటూ ఆగ్రహ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని హోటళ్లలో ఇకపై బీఫ్ వంటకాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది కూడా!

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగబద్ధం చేసిన రిజర్వేషన్ల పుణ్యమా అని దళిత, ఆదివాసీ, బహుజన కులాల విద్యార్ధులు విశ్వవిద్యాలయాల గడప తొక్కగలుగుతున్నారు. వారిలో అత్యధికులు తినే బీఫ్‌ వంటకాలకు మాత్రం యూనివర్సిటీ క్యాంటిన్లలో ఇప్పటికీ చోటులేదు. అంటే అప్రకటిత నిషేధం ఏనాటినుంచో అమలవుతోందన్న మాట! దీనిపై గత రెండు దశాబ్దాలుగా బీఫ్‌ ఈటర్స్‌ ఆందోళనలు సాగిస్తూనే ఉన్నారు. తమ నోటికి రుచించే ఆహారం కావాలని కోరుకోవడంలో అప్రజాస్వామికం ఏముందో అంతుబట్టని విషయం. ఈ కోణంలో ఆలోచించవలసింది పోయి బీఫ్‌ గురించి మాట్లాడేవారిపై దాడులు చేసే రోజులొచ్చాయి. ఈ క్రమం అంతటినీ ఈ సమావేశంలో వక్తలు తునకలు తునకలుగా గుదిగుచ్చారు. దళిత బహుజనులను ఇన్నాళ్లూ సామాజికంగా అణగదొక్కుతూ ఉన్న అగ్రవర్ణ హిందూత్వ శక్తులు ఇప్పుడు వారి కిచెన్‌లోకి ప్రవేశిస్తున్నాయనీ, ప్రతిఘటనతోనే ఆ శక్తులకు సమాధానం చెప్పాలని ఊ.సాంబశివరావు దిశ చూపించారు. సమావేశంలో తొలి వక్తగా ఎద్దుకూరపై మాస్టర్జీ రాసిన పాటతో ప్రసంగాన్ని ఎత్తుకున్న ఊసా ఆ వాతావరణాన్ని పదునెక్కించారు. పుట్టుక రీత్యా మనిషి బోత్‌ ఈటర్‌ (శాక- మాంసాహారి) అనీ, బీఫ్‌ ఈటర్స్‌ని వారి సంప్రదాయ ఆహారం తినవద్దు అని చెప్పడం ఫాసిజం తప్ప మరొకటి కాదని ఆయన స్పష్టంచేశారు.

కోట్లాది మంది తినే ఆహారం ఒక కానిపనిలాగా, గోప్యతకి గురయ్యే పరిస్థితి నేటికీ ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందా..? వస్తే గిస్తే ఎవరికి వచ్చింది..? అని నిలదీసి కడిగేయాలనిపిస్తుంది. ఎందుకంటే పప్పు తినేవాళ్లో, కూరగాయలు, దుంపలు తినేవారో తమతమ వంటకాల గురించి బహిరంగంగా చర్చిస్తారు, గొప్పగా చెప్పుకుంటారు. అదే బీఫ్‌ ఈటర్స్‌ దగ్గరికి వస్తే వీరికి అలాంటి ఆస్కారమే లేకుండాపోయిందని బాధేస్తుంది. కూర, పెద్దకూర, తునకలు, దస్‌ నెంబర్‌, కల్యాణి… ఇలా రకరకాల మారుపేర్లతో మాట్లాడుకోవడం… న్యూనతతో గొంతు పెగలకపోవడం ఎందుకు జరుగుతోంది?ఎందుకని బీఫ్‌ గురించి బహిరంగంగా చర్చించకూడదు? ఫుడ్‌ ఫెస్టివల్స్‌లో ఎద్దుకూరని ఎందుకు చేర్చరు..? ఆహార సర్వేలలో ఎద్దుమాంసంలో పోషక విలువల ప్రస్తావన ఎందుకు చేయరు..? నాన్‌వెజ్‌ హోటల్స్‌ మెనూలో బీఫ్‌ అన్న పేరు ఎందుకు కనిపించదు..? ఇలాంటి అనేక ప్రశ్నలను సమావేశంలో వక్తలు లేవనెత్తారు. సజయ, ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, సంగిశెట్టి శ్రీనివాస్‌, జి. రాములు (సిపిఎం), తిప్పర్తి యాదయ్య, వహీద్‌ తదితరులు బీఫ్‌పై నిషేధపర్వాన్ని ధిక్కరిస్తూ ప్రసంగించారు. ఒకరికి ఇష్టమైన ఆహారంపై నిషేధం విధించడం, ఇష్టం లేని ఆహారాన్ని తినమని నిర్బంధించడం- ఈ రెండూ కూడా క్షమించలేని నేరాలతో సమానమని సజయ చాలా సూటిగా చెప్పారు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా క్యాంపస్‌లో, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇద్దరు విద్యార్థుల ఉద్యమ ఫలితంగా ఘనంగా బీఫ్‌ ఫెస్టివల్స్‌ జరిగాయి. జరుగుతున్నాయి కూడా. ఆ ఇద్దరే నలిగంటి శరత్‌ చమర్‌, పసునూరి రవీందర్‌. తమ సంప్రదాయ ఆహారం తాము తినడం కోసం వారు ఒక యుద్ధమే చేశారు. చేసి గెలిచారు. గెలిచి అందరితో శహబాష్‌ అనిపించుకున్నారు. ఆ కథలోకి వెళ్లాలంటే అంతకు ముందు జరిగిన ఒక ఘోరాన్ని గుర్తుచేసుకోక తప్పదు.

ఇఫ్లూ క్యాంపస్‌లో (ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ) బీఫ్‌ని వండుకు తినాలని గతంలో కొందరు విద్యార్థులు తీర్మానించుకున్నారు. మేనేజ్‌మెంట్‌ అంగీకరించనప్పటికీ ఆ పని చేసి తీరాలనుకున్నారు. అందుకు తగ్గ సన్నాహాలు చేసుకున్నారు. ఫుడ్‌ డెమొక్రసీని గౌరవించే పెద్దలను అతిథులుగా పిలిచారు. తామె స్వయంగా రంగంలోకి దిగి బీఫ్‌ వంటకాలు గుమాయించేలా వండారు. కానీ ఈ విషయం బయటికి పొక్కింది. హిందూత్వశక్తులు భరించలేపోయాయి. క్రూరంగా దాడికి దిగాయి. కొందరు ఉన్మాదులైతే బీఫ్‌ వంటకాలపై మూత్రం పోశారు. నానా రభస సృష్టించారు. తినే ఆహారాన్ని అలా అవమానించడం ఏ విలువల కిందకి వస్తుందో వారికే తెలియాలి.

ఈ చర్యతో బీఫ్‌ ఈటర్స్‌ వెనక్కి తగ్గలేదు. ఏమైనాసరే బీఫ్‌ తినాల్సిందే అని నిశ్చయానికొచ్చారు. ఏ ప్రదేశంలో అయితే హిందూత్వశక్తులు దుర్మార్గానికి పాల్పడ్డారో అదే చోట బీఫ్‌ బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకుని కసిదీరా తిన్నారు. అదే తగిన సమాధానం అనుకున్నారు. ఆ వేడి ఓయూ క్యాంపస్‌లోని నలిగంటి శరత్‌ చమర్‌ వంటివారిని కుతకుతలాడించింది. ఏమైనా సరే ఓయూ ప్రాంగణంలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని కంకణం కట్టుకున్నారు. పట్టుదలతో ఆ సంబురాన్ని నిర్వహించారు. వండర్స్‌ క్రియేట్‌ చేశారు.

అదే స్ఫూర్తితో సెంట్రల్‌ యూనివర్సిటీలో పసునూరి రవీందర్‌ బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించ తలపెట్టినప్పుడు కొన్ని శక్తులు అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాయి. పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చాయి. దాంతో బీఫ్‌ని ఎందుకని తినకూడదు అన్న ప్రశ్న ఉద్యమకారుల్లో ఉదయించింది. రవీందర్‌ ప్రభృతులు కోర్టుని ఆశ్రయించారు. ఎద్దుకూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని ధృవీకరిస్తూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) వారు ఇచ్చిన సర్టిఫికెట్‌ను కోర్టుకు సమర్పించారు. అంతే! సీన్‌ రివర్స్‌ అయ్యింది. బీఫ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకోవాలనుకున్న వారి కుయుక్తులకు బ్రేక్‌ పడింది. బీఫ్‌ పండగని ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు. ఆ తర్వాత నుంచి ఏటా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో బీఫ్‌ ఫెస్టివల్‌ని జరుపుకుంటూనే ఉన్నారు. తాము చదువుకునే ప్రాంగణంలో తమకు కావాల్సిన ఆహారం కోసం అంత యుద్ధం చేయాల్సి వచ్చింది ఆనాడు. అవును…. దళిత బహుజన శ్రేణులకు ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. ఆనాటి తమ అనుభవాలను శరత్‌ చమర్‌, పసునూరి రవీందర్‌ ఈ సమావేశంలో పంచుకున్నారు.

బీఫ్‌ బచావో ఆందోళన్‌ కార్యక్రమంలో మరొక పదునైన ధిక్కారస్వరం కృపాకర్‌ మాదిగ. బీఫ్‌పై నిషేధం విధించే వారినే నిషేధించాలన్నంత కసిగా కృపాకర్‌ ప్రసంగం సాగింది. ఈ దేశంలో అగ్రవర్ణ, అగ్రవర్గ భూస్వాములు ట్రాక్టర్లను తెచ్చి పశుసంపదను నిర్వీర్యం చేశారనీ, ఎరువులు, పురుగుమందులు ఇష్టారాజ్యంగా వాడి భూసారాన్ని నాశనం చేశారనీ, పంటలను విషతుల్యం చేశారనీ, ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారనీ విమర్శించారు. అలాంటి వారు ఇప్పుడు గోవధ నిషేధం గురించి మాట్లాడటం కుట్రే అవుతుందన్నారు కృపాకర్‌. ఆయన ఆవేశపూరిత ప్రసంగం కొత్త ఆలోచనలకు పాదులువేసింది.

*

మీ మాటలు

  1. Adi Seshaiah says:

    గోవధ నిషేధం కుట్రే..

  2. Dr.Pasunoori Ravinder says:

    ఒమ్మి రమేషన్నకు మరీ మరీ ధన్యవాదాలు. బీఫ్‌ బచావో ఆందోళనను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఈ వ్యాసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని బేస్‌ చేసుకొని మీరు చేసిన ప్రశ్నలు ఎంతో విలువైనవి. ఆహార అప్రజాస్వామిక విలువల మీద మీ ఆలోచనలు చెంపపెట్టులా పనిచేస్తాయని విశ్వసిస్తున్నాము.
    సెంట్రల్‌ యూనివర్సిటీలో బీఫ్‌ ఫెస్టివల్‌ను సక్సెస్‌ చేసింది “దళిత్‌ స్టూడెంట్‌ యూనియన్‌”. అందులో సభ్యులుగా క్రియాశీలక పాత్ర పోషించిన వారిలో ఆరూరి సుధాకర్‌, రాజేష్‌, ప్రవీణ్‌ వెలివోలు, గురిజాల రవి, దిగుమర్తి సురేష్‌, సుంకన్న వంటి మిత్రులు ముఖ్యులు. మా అందరి పోరాటం వల్లే ఇవాళ సెంట్రల్‌ యూనివర్సిటీలో అధికారికంగా బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించగలుగుతున్నాము.
    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టల్లో ప్రజాస్వామిక వాదులంతా ముందుకొచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం.
    రమేషన్నకు మరోసారి జైభీంలు!
    -డా.పసునూరి రవీందర్‌

  3. ఒమ్మి రమేష్ అన్న జబర్దస్త్ వ్యాసం రాసిండు.. ఫుడ్‌ డెమొక్రసీని నినదిస్తూ జరిగిన సభను ఇలా రికార్డు చేయడం బాగుంది. బాధ్యతగా ఫీల్ అవడం మరీ బావుంది. మనమెందుకు ఆ రంగు వేసుకోడం అనుకునే సోకాల్డ్ intellectuals పెరుగుతున్న మన శరం లేని సమాజంలో రమేశన్న లాంటి వారికి సలామ్ !
    ఇక ఈ వ్యాసంలో గుడిపల్లి రవికుమార్ అనే మిత్రుడి గురించి మిస్ అయింది. హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటి కిచెన్ లో బీఫ్ వండిన ఘనత గుడిపల్లిది. మొన్నటి ఎలక్షన్ కి ముందు మోడికి వ్యతిరేకంగా జరిగిన ‘బహుజన్ సెక్యులర్ మూవ్మెంట్’లో భాగంగా అదే హాస్టల్లో వందలాది స్టూడెంట్స్ తో అతను జరిపిన సభలో మేమంతా పాల్గొన్నాం. అప్పుడు అతను ఏర్పాటు చేసిన బీఫ్ & పోర్క్ దావత్ పెద్ద ఎత్తున చర్చనీయాంశ మైంది. అతను ఈ సభలో చాల గొప్ప స్పీచ్ ఇచ్చాడు. చాల ఆర్తితో, ఆవేశంతో అతను వేసిన ప్రశ్నలు ప్రత్యర్ధుల గుండెల్లో దిగే బరిసెలు.. అతను ఈ సభకోసం ఒక పాట కూడా రాసి పాడాడు..
    అలాగే ఈ సభలో నలిగంటి శరత్ చమార్ తను రాసిన ఫేమస్ పాట పాడాడు..
    బీఫ్ – సీక్రెట్ అఫ్ అవర్ ఎనర్జీ
    బీఫ్ – సీక్రెట్ అఫ్ అవర్ నాలెడ్జి
    అనే ఆ పాట యూట్యూబ్ లో దొరుకుతుంది..
    ఇంకా ఈ సభలో పాల్గొన్న కొల్లూరి చిరంజీవి తను బీఫ్ రాజకీయాల మీద రాసిన బుక్లెట్ ఆవిష్కరించి అందరికీ పంచారు..

  4. sangishetty srinivas says:

    ప్రింట్ మీడియా లో తప్పుగా రిపోర్టు అయినా ఒమ్మిరమేష్ బాబు దాన్ని సరిదిద్ది సవరించిండు సంతోషం

  5. johnson choragudi says:

    1. ప్రధాన విషయాల ఫై నించి దృష్టి ఇటువంటి వాటి మీదికి మారడం కూడా గమనించ వలసి వుంది 2 కాంపస్ స్థాయి కే ఇప్పటి కీ ఇది పరిమిత మైన సమస్య 3. కొత్త గా మహారాష్ట్ర లో కొందరికి ఇది ఉపాధి సమస్య కావడం దీనికున్న మరో కోణం 4. మన గ్రామాల్లో బీఫ్ వాడకం తగ్గడం, దాని స్థానం లోకి చికెన్ రావడం వాస్తవం 5. కేరళలో బీఫ్ కు ‘కులం’ కోణం లేక పోవడం వల్ల అది ఓపెన్ గా అందరికి అంగీకృత మైంది. అక్కడ o c (నాన్ వెజ్) పెళ్ళిళ్ళ లో దాన్ని పాపులర్ డిష్ గా వడ్డించడం నాకు తెలుసు 7. మనకున్న సమస్యలు ఎక్కువ, మరి ఇప్పటికీ ఇక్కడే మనం ఆగి పోతే ఎలా? 8. ప్రస్తుత జీవన శైలిలో 40 ప్లస్ తరువాత రెడ్ మీట్ మానమని డాక్టర్స్ చెబుతున్నారు 9. పట్టించు కోవడం మానితే పలు సమస్యలు వుండవు, అప్పుడు అవసరమైన వాటి మీద దృష్టి పెట్ట వచ్చు 10. నార్త్ ఈస్ట్ స్టేట్స్ పిల్లలు ఇంటి వద్ద నుంచి కొరియర్ లో ఎండబెట్టిన మాంసం రప్పించుకుని మరీ కాంపస్ లో వండుకుని కలిసి ఎంజాయ్ చేస్తారు. 11. మన వూళ్ళో మన వాడల్లో మన ఇంటి వద్ద ఇప్పటికీ అటువంటి సాంస్కృతిక వాతావరణం లేదు, ఇంకా వుండాలని మనం కూడా అను కోవడం లేదు 12. కాంపస్ లో వుండే మాస్ మైండ్ వల్ల ధిక్కారాన్ని ప్రకటించడానికి ఇది ఒక కారణమైంది. 13. దాని స్కోప్ అంతవరకే, అంతకు మించి ఇంకా అటువైపు చూస్తే, సమస్యను కెలికిన వాణ్ని విజేతను చేయడమే అవుతుంది 14. ప్రాధాన్యతల ఎంపిక లో వైఫల్యాలను కాలం క్షమించదు 15. ఇంటర్ – డిగ్రీ ల మధ్య ఎప్పుడు బీఫ్ మానానో నాకే గుర్తు లేదు, నాకది వూరు వదిలిన కాలం 16. టోకెన్ ఇష్యూ గా చాలు అంతకు మించి ప్రాధాన్యత దీనికి అక్కరలేదు.

    -జాన్సన్ చోరగుడి

  6. చందు తులసి says:

    ఎవని తిండి వాడు తింటాడు. బీఫ్ కావచ్చు పోర్క్ కావచ్చు. నేను చెప్పిందే తినాలని ఆదేశించే అధికారం ఎవ్వనికి లేదు. చోరగుడి చెప్పినట్టు టోకెన్ ఇష్యూ కావచ్చు కానీ …ప్రశ్నించడమైతే తప్పదు. రమేశ్ సార్ మొన్న భీం డ్రమ్స్ గురించి…ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ గురించి …, అవసరమైన సమయంలో కలం కదిలించారు…..అన్నట్టు రమేశ్ గారు….మీ ఫోటో సూపర్

  7. గొడ్డు మాంసం తినడం నేరమన్న భావనని సామాన్యప్రజల్లోకి స్లో పాయిజన్‌లా ఎక్కిస్తున్నారు హిందుత్వవాదులు. చివరికి గొడ్డుమాంసం తినేవాళ్ళు హిందువులు కాదన్నట్లు, హిందువులకు గోవును తల్లిగా ప్రచారం చేస్తున్నారు.
    ఎవరేమయినా అనుకోనీ కానీ ఆ కొద్దిమంది భావనని అందరిమీదా చట్టంగా ఎలా రుద్దుతారో ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఎవడేం తినాలో, ఎవరేం బట్ట కట్టాలో వీళ్ళెవరు చెప్పడానికి!

    ఇలాంటి చైతన్యం ఇంకా ఇంకా తేవాల్సి వుంది, ఈ చైతన్యం లేకుంటే వాళ్ళనేది ప్రజల అభిమతం అనుకొని చట్టాలు చేస్తే తర్వాత బాధ పడాల్సి వస్తుంది.

    • హిందువులకు గోవును తల్లిగా ప్రచారం చేస్తున్నారు.
      హిందువులకు గోవు తల్లే, తెలియకపోతే తెలుసుకో! అవాస్తవాలను ప్రచారం చేయవలసిన అవసరం హిందువులకు లేదు.

  8. Y.V.Ramana says:

    ‘నీచు తినేవాడు నీచుడు!’

    ‘గొడ్డుమాంసం తింటాడు. అందుకే వాడి నాలుకా, బుర్రా కూడా మందం!’

    ‘అది సాయిబు హోటల్. యే గొడ్డుమాంసమో కలిపేస్తాడు. అక్కడికొద్దులే!’

    ‘ఆహారం కోసం జీవుల్ని చంపేవాడు మనిషి కాదు, రాక్షసుడు!’

    “ఒరే వెధవల్లారా! మీరు తక్కువ జాతి వాళ్ళు. మీ ఆహారపు అలవాట్లని గౌరవించం, హక్కుల్ని గౌరవించం, అసలు మీ ఉనికినే గుర్తించం. ఇక్కడంతా మా ఇష్టం. మీ తాటాకు చప్పుళ్ళకి భయపడేది లేదు. తేడాలొస్తే నల్లుల్లా నలిపేస్తాం. ఖబడ్దార్!”

    “తమ్ముడూ! పబ్లిగ్గా అలా మాట్లాడకూడదు. భాష మార్చు. ‘అయ్యా! అమ్మా! గోమాత మనకి పూజనీయం. కన్నతల్లినే కోసుకు తింటామా? మహా పాపం కదా? ఆలోచించండి!’ అన్జెప్పాలి, అర్ధమైందా?”

    • Phoenix says:

      నిజం!

      కొంతమంది మనోభావాలకే విలువుంటుంది. ఆ వుండే విలువ తక్కినవారి ప్రాణాలకన్నా ఎక్కువ ఉంటుంది. అభివృధ్ధైనా, ప్రభుత్వమైనా, మీడియా ఐనా వారికోసమే. వారి అభిప్రాయాలనే నెత్తినపెట్టుకొని, వారి అభివృధ్ధినే కాంక్షిస్తుంటాయి. మిగిలిన వాళ్ళు ఎలా చచ్చినా ఫర్లేదు. ఎవరులోపిస్తే జాతియావత్తూ, సంస్కృతియావత్తూ దుంపనాశనమైపోతుందో వారి మనోభావాలు గాయపడకుంటే చాలు.

      మళ్ళీ వీళ్ళందరూ ఫలానా దేశంలో మనవాళ్ళకు ఫలానా హక్కులులేవని తెగబాధపడుతుంటారు. మనదేశంలో వీళ్ళు ఇతరుల హక్కులనుమాత్రం హరించవచ్చు.

  9. JOHNSON CHORAGUDI గారితో నేను పూర్తిగా విభేదిస్తున్నా..
    ఆయన అలా మాట్లాడ్డం అన్యాయం..
    మిగతా కామెంట్స్ చూసి అయినా వారు వాస్తవాలు గ్రహిస్తే బాగుంటుంది.
    40 ఏళ్ల తరువాత రెడ్ మీట్ తినోద్దంటారు సరే !
    మరి మన పేద పిల్లలకు తక్కువ డబ్బుతో పోషకాహారం దొరకడం గురించి ఆలోచించని
    ఆయన తీరు విస్మయం కలిగించింది..

  10. https://www.facebook.com/events/697043350422345/
    ఇక్కడ మీకు మరికొన్ని విషయాలు, పోయెమ్స్ దొరుకుతాయి.. చూడండి దోస్తులారా!

    ”నేన్‌ తినె చియ్యమీద ఎవడి బ్యాన్‌ ఏందంటా
    నేనేసే అడుగు మీద ఎవడి నిఘా ఏందంట || నేన్‌ తినె ||
    యజ్ఞయాగాదుల్లో మేసింది మరిషిండా
    పాడి పశువుల్‌ పెంచి ఎవుసాయం జేసిండా || యజ్ఞ ||
    హమ్‌ మూల్‌వాసీ – వో పరదేశీ || 2 ||
    ఢోల్‌ బజాకే బోల్‌ బోల్‌ బోల్‌ || భీమ్‌ ||

  11. dr cheema srinivasrao says:

    ఇష్టపడి తినే వాడిని వద్దు అనే హక్కు ఇష్టం లేని వాడికి తిను అని చెప్పే హక్కు ఎవరికీ లేదు బీఫ్ న్యూట్రిషన్ పరంగా కాలరీస్ ఎక్కువుంటై నిజమే కానీ చదువుకునే స్టూడెంట్స్ కి అన్ని కాలరీస్ అవసరం లేదు గ్రామాల్లో కస్టపడి పని చేసే వాళ్ళకి కాలరీస్ కావాలి బీఫ్ పేరుతొ సమాజం లో ఏమి మార్పు సదిస్తము ఇష్టం లేని వాడు తినేది లేదు ఇస్తామున్నోడు ఏదైనా తినోచు ద్ర అంబేద్కర్ గారు దీని పై ఏమైనా పోరాటం చేసింద బీఫ్ తినమని మహాత్మా జ్యోతిబా పులే గారు ఏమైనా చెప్పిండ విద్యార్తులు బాగా చదువుకోవాలి విద్య కి మొదటి ప్రాముక్యత ఇవ్వాలి తరవాత రాజకీయాలు చేయండి గ్రామాల్లో మన అయ్యలు అమ్మలు కస్టపడి చెమటోడ్చి మనల్ని చదివిస్తుంటే మనం పోరాటాలు అంటూ కార్రేర్ ని నాశనం చేసుకుంటున్నాము వొక విద్యర్తికి పదవి రావటం కోసం వందల విద్యార్తుల జీవితాలు నాశనం అవుతున్నాయి పదవి వోచినోడు విద్యర్తులను బాగుచేసేది కుద లేదు ఇప్పటికైనా అంబేద్కర్ గారు చెప్పినట్లు బాగా చదువుకుందాం మన తల్లి తండ్రుల ఆశయాలను నేరవేర్చుడం

  12. dr cheema srinivasrao says:

    కేవలం బీఫ్ పేరుతొ సమాజం నుండి దళితులూ వీరుకావడం దళిత సమాజానికి ఏమి ఉపయోగం కాల పరిస్తితులను బట్టి మార్పు సహజం దళితులూ కూడా మారటం సమంజసం కదా/ ఆహారవిశాయలు వ్యక్తిగతమైనవి నాకు తెలిసిన అగ్రవర్ణ వలూ కూడా చాలామంది బీఫ్ తిన్తుర్రు ఒకప్పుడు బీఫ్ చౌకగా దొరికేది పేదప్రజ ఫుడ్ గ ఉన్నది కాని ఇప్పుడు చికెన్ కంటే ఎక్కువ రాటు బీఫ్ కున్నాడు అది ఇప్పుడు ఒఎదప్రజల ఫుడ్ గ లేదు

  13. dr cheema srinivasrao says:

    ముస్లిమ్స్ బీఫ్ తింటారు దళితులూ బీఫ్ తింటారు కాని దళితులే అంటరాని వారెయ్యరెందుకు ముస్లిమ్స్ కూడా దళితులను అంటరాని వారిగానే చూస్తారు ఎందుకు?

  14. Y.V.Ramana says:

    ఒకరి ఆహారపు అలవాట్లని ఇంకొకరు కంట్రోల్ చేయవచ్చునా / లేదా అన్నది మాత్రమే ఇక్కడ చర్చనీయాంశం అని నా భావన.

    అంతేగానీ – ఆహార పదార్ధాల మంచిచెడ్డలు, డాక్టర్ల సలహాలు ఈ వ్యాస పరిధిలోకి రావు. అది వేరే సబ్జక్ట్.

    ఆరోగ్యరీత్యా ఆవకాయ పచ్చడి, నెయ్యీ కూడా మంచివి కావు. మరప్పుడు వాటిని కూడా నిషేధిస్తారా!?

  15. Thirupalu says:

    /మాంసం తింటాడు. అందుకే వాడి నాలుకా, బుర్రా కూడా మందం!’/
    ఈ మాట అంటున్నది ఎవరో కాదు మన మంతెన సత్యనారాయణ రాజు గారు. ఆహారపు అలవాట్ల వల్లనే మానసిక ప్రవర్తన్ ఉమ్టుందట!?

    • Phoenix says:

      You are what you eat అన్నదాన్ని నమ్మడం ప్రపంచమంతా కనిపిస్తుంది. తననుతాను second in life to Mohammadగా భావించుకొనే జాకిర్ నాయక్ “పందులను తింటారుకాబట్టే వాళ్ళు పందుల్లా ప్రవర్తిస్తారు” అని అమెరికన్లగురించి నోరుపారేసుకుంటాడు.

  16. ఈ స్పందన ఈ మధ్యన స్పాంటేనియస్ గా నాకు కలిగింది.ఇటీవలే ఆంధ్రజ్యోతి దిన పత్రికలో,నైజీరియాలోని ఒక హోటల్లో మనిషి మాంసం సర్వ్ చేయటం,అ పై ప్రభుత్వ చర్యతో సదరు హోటలును మూసివేయడం,ఈ కవితావిర్భావానికి ప్రేరణ కావచ్చు.దీని ఉద్దేశ్యం ఎవరి ఆహారపు అలవాట్లను తక్కువ,ఎక్కువ చెయ్యడం కోసం కూడా కాదు.

    హాహాకారం శివ్
    నిన్న సాయంత్రం నేను
    పేవ్మెంట్ మీద నడుస్తున్నప్పుడు
    ప్రక్కన ఉన్న మటన్ షాపులో
    తెగి పడి ఉన్న తలలోంచి
    దీనంగా చూస్తున్న మేక కళ్ళు
    మరోదారిలో ద్విచక్రవాహనంపై
    హడావిడిగా వెళుతుంటే
    రోడ్డుకడ్డంగా కాపరి ముందు
    నడుస్తున్న శవాల్లా గొర్రెల మంద
    ఇంకో మలుపులో కబేళాకు
    కర్కశంగా తరలించబడుతున్న
    అపర దయా జీవులు-గోవులు
    దశాబ్దాలుగా ఈ దృశ్యాలు
    నాలో అలజడి రేపుతూ కలవరపెడుతుంటే
    నా రూపంలో నడుస్తున్న శూన్యం
    ప్రపంచ వ్యాప్తంగా మనుష్యుల
    పొట్టలనే శ్మశానాల్లో
    సమాధి కావడానికి సమాయత్తంగా
    వండి వార్చుతున్న
    పలు రకాల పక్షుల,జీవాల
    ఎముకలు,మాంస ఖండాలు
    రాత్రి స్వప్నంలో……..
    నరమాంస భక్షకులు
    నా దేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి
    ‘మనిషి బిర్యానీ’ గా మార్చేసి
    లొట్టలేసుకుంటూ,విందునారగిస్తూ………..
    నా ఆత్మ ఇదంతా చూస్తూ
    అనంతంగా ఆక్రోసిస్తూ………………
    కల చెదిరింది
    మరోసారి తెల్లవారింది
    అన్నిరకాల మాంసాలను మస్తుగా
    విక్రయించే దుకాణాలు,పలావులు పెట్టే
    పలు రెస్టరెంట్లూ యధావిధిగా తెరుచుకున్నాయ్
    లెక్కకు మిక్కిలిగా పలు రకాల ప్రాణులు
    విశ్వమంతా నిర్విరామంగా నరకబడుతూనే ఉన్నాయ్
    వాటి అనంత కోట్ల ఆత్మలు
    అసహాయంగా,ఎవరూ వినిపించుకోని
    హాహాకారాలు చేస్తూనే ఉన్నాయ్
    మనుషులు మరణిస్తే ‘సోల్ మే రెస్ట్ ఇన్ పీస్’
    మరి మెర్సిలెస్ గా మర్డర్ చేయబడుతున్న మూగ జీవాల ఆత్మల సంగతి???
    *

    • Dr.Pasunoori Ravinder says:

      శివ్ గారూ…
      పేవ్‌మెంట్ మీద మేక‌ల‌ను,
      ద్విచ‌క్ర‌వాహ‌నం మీద వెళ్లేట‌పుడు ఆవుల‌ను చూసి స్పందించ‌డం బాగుంది.
      కాని, ఇదే దేశంలో
      ర‌క్త‌మాంసాలున్న ద‌ళితుల‌ను కూడా నిత్యం ఏదో ఒక మూల ఊచ‌కోత కోస్తున్నారు. వారికోసం కూడా కొంచెం స్పందించండి.
      చాలా మంది జంతువుల గురించి మాట్లాడినంత‌గా,
      అంట‌రానిత‌నానికి, అవ‌మానాల‌కు గుర‌య్యే మ‌నుషుల గురించ మాట్ల‌డ‌రు.
      ఇది క్ష‌మించ‌రాని నేరం.

      • డియర్ రవీందర్ గారు
        నేను పలు రకాల అంశాలపై స్పందిస్తూనే ఉన్నాను.మీ సూచన తప్పకుండా పాటిస్తాను.మీరన్నది ముమ్మాటికీ నిజం.అట్టడుగు వర్గాలు,దళితుల మీద అత్యాచారాలు ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉన్నాయి.వాటిపై మనిషి స్పందించలేనప్పుడు వాడు మనిషే కాడు.మూగ జీవాల గురించి సహానుభూతి చెందుతున్న వాణ్ణి (నా ఉద్దేశ్యంలో),సాటి మనుష్యుల సమస్యలపై స్పందించకుండా ఉండగలనా? మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు.

        శివ్

  17. శివ గారూ ! “ దే టేక్ రిస్ట్ ఇన్ స్టమక్ ”

    • డియర్ జయప్రకాశ రాజు గారు

      మీరు చెప్పింది నా కర్ధం కాలేదు.దయచేసి వివరించగలరా?

      ధన్యవాదాలతో

      శివ్

      • శివ గారూ ! జంతువులను , పక్షులను ప్రేమించేవారు , పూజించేవారు సాటి మనుషులపట్ల ఎందుకు ద్వేషభావంతో వుంటారో అర్థం కాదు. అందుకే అవి మన కడుపులో క్షేమంగా వుంటాయని అలా వ్రాశాను. అంతేగాని మిమ్ములను కించపరచడానికి కాదు.

  18. విన్నకోట నరసింహారావు says:

    శివ గారూ, మీరు వ్రాసినది చాలా haunting కవిత.

    • నరసిమ్హారావు గారూ

      ధన్యవాదాలండి

      శివ్

  19. johnson choragudi says:

    మరో సారి మాట్లాడ వలసి వచ్చింది. విశాఖ లో వున్నప్పుడు (2006-2009) ఓ ఉదయం ఫస్ట్ ఫ్లోర్ మెట్ల వద్ద వున్న న్యూస్ పేపర్స్ తీసుకోవడానికి బయటకు వచ్చాను. పక్కింటి కొబ్బరి చెట్టు తల, మా మెట్ల పక్కన వుండేది. ఓ ఉదయం, ఇంకా పూర్తిగా తెల్ల వారలేదు. కొబ్బరి చెట్టు మీద ఓ కాకి – పసి గుడ్డు గా వున్న పిచ్చుక పిల్లను తెచ్చుకుని తింటున్నది. పిచ్చుక పిల్ల – దానికి ఇంకా వెంట్రుకలు మొలవలేదు, దాని రంగు ఒకలాటి ఎరుపు. అది కనుక బతికుండి వుంటే, పెద్దయ్యాక ఎర్రటి పురుగుల్ని – అది కూడా అలాగే తింటుంది. మరుపు రాని దృశ్యం. – జాన్సన్ చోరగుడి

    • డియర్ జాన్సన్ గారూ
      ఏ గూటి పక్షి ఆ పాటే పాడుతుంది కదా.కానీ మనిషి మాత్రమే తన విచక్షణతో సొంత,మంచి పాట పాడ గలడు.ఈ విషయం అందరికీ తెలిసిందే.మీ స్పందనకు ధన్యవాదాలు.
      శివ్

  20. Thirupalu says:

    చివరకు పర్యావరణ పిరమిడ్ గతి అన్నమాటా!? మనుషులు మనుషుల్ని తిన్నట్లు! :)

  21. buchi reddy gangula says:

    బీఫ్ —it. is. a..international.food.item…..తప్పు ఏమిటి??
    కొన్ని కొన్ని దేశాల్లో
    కుక్కలు— గుర్రాలు —కప్పలు —-పిల్లులు — తినే వాళ్ళు ఉన్నారు — అది వాళ్ళ యిష్టం
    దానికోసం మీటింగ్ ఎందుకు — పాటలు ఎందుకు —యింత్ రాజకీయం అవసరమా
    dr. రవీందర్ గారు చక్కగా చెప్పారు
    ——————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  22. దేవరకొండ says:

    I heard that Hindus do not have the mandate to observe non-violence, even in respect of their food, but due to the Budhist influence in India, many Hindus adopted non-violence and started vegetarianism. When the issue of non-violence is of Budhists, why these Hindu forces bother to ban beef? (I plead for pardon, the transliteration facility is not co-operating, so English in place of Telugu!)

  23. దేవరకొండ says:

    అహింస పాటించ వలసిన అగత్యం హిందువులకు బౌద్ధం ప్రభావం వల్లనే కలిగిందని, అందువల్లనే వాళ్ళలో చాలా మంది శాకాహారం అవలంబించారని విన్నాను. మరి, అహింస బౌద్ధుల విధానమైతే పశు మాంసాన్ని నిషేధించాలన్న ఎజెండా హిందూ శక్తులు ఎందుకు బుజాన వేసుకున్నట్లు? ఇంతకీ బౌద్ధుల అహింస మనుషులకే పరిమితమా లేక పశు పక్ష్యాదులకూ వర్తిస్తుందా?

  24. చాప కింద నీరులా బ్రాహ్మణీయ – హిందుత్వ భావజాలం ఎంతగా బహుజనులను ఆవరించిందో ఇక్కడి కొన్ని కామెంట్స్ ను చూస్తే సమజవుతుంది..

  25. నేనది తింటా నేనది తినను అని వీళ్ళంతా కొట్టుకుంటున్నారు. ఇంతకీ పశుఫులకు హక్కులు లేవు కాబోలు. వొమ్మి రమేష్ గారు పెద్దపులి పచ్చిగడ్డి మేయును అని ఎలెక్ట్రాన్ మీడియా నేర్పిన మేరమేచ్చులు పోతున్నారు.

  26. Y.V.Ramana says:

    ఎద్దు, పంది, మేక, పక్షి.. అన్నింటికీ ప్రాణం వుంటుంది. మన ఆహారం కోసం ప్రాణుల్ని చంపడంలోని ‘కర్కశత్వం’ గూర్చి తప్పకుండా ఆలోచిద్దాం, చర్చిద్దాం. ఆహారంలోని మంచిచెడ్డలు చర్చించడానికి ఎవరికి మాత్రం అభ్యంతరం వుంటుంది!?

    కానీ – హడావుడిగా ఒక్క బీఫ్ మాత్రమే ఎందుకు నిషేధానికి గురయ్యింది? దీని వెనుక రాజకీయ కారణాలున్నాయి. ఆ కారణాల్ని వదిలేసి ‘బీఫ్ మంచిదా? కాదా?’ అనే చర్చ జరగడం ఆశ్చర్యంగా వుంది.

    కొందరు వ్యక్తులు ఎన్నో యేళ్ళుగా ఇష్టంగా తింటున్న ఒక ఆహార పదార్ధాన్ని ఏకపక్షంగా నిషేధించడం అన్యాయం. వారికి మద్దతు తెలపడం, వారి వెనక నిలబడ్డం ప్రజాస్వామ్యవాదుల ధర్మం అని నమ్ముతున్నాను.

    • “మన ఆహారం కోసం ప్రాణుల్ని చంపడంలోని ‘కర్కశత్వం’ గూర్చి తప్పకుండా ఆలోచిద్దాం, చర్చిద్దాం”.

      వేరి వేరి థాట్ ప్రవోకింగ్ రమణగారు.
      థాంక్ యు
      శివ

  27. చందు తులసి says:

    ఒక్క ఆహారం నిషేధించడమే కాదు , ఆచారాల్ని, అలవాట్లను, వేసుకునే వస్త్రాలను….చదివే పుస్తకాలను…..దేన్ని నిషేధించడమైనా అన్యాయమే. ఒకరి భావజాలాన్ని మరొకరిపై రుద్దడమే…..ప్రశ్నించడం బుద్ధి జీవులు చేయాల్సిన పని.

  28. Srinivas says:

    రమణ గారు, రాజకీయ కారణాలు మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడ వ్యాఖ్యలు రాసిన వారి కి ఆ విషయం పై పెద్ద గా అవగాహన ఉన్నట్లు లేదు.

    • చందుతులసి says:

      శ్రీనివాస్ గారు…..రాజకీయ కారణాలేమిటో తెలియని అమాయకులు ఎవరున్నారు….అందరికీ తెలిసిందే కదా. మళ్లీ డాక్టర్ గారి చేత చెప్పించడం ఎందుకు…..?

      • Srinivas says:

        రాజకీయ కారణాలంపై చర్చ జరగాలని కోరుకొంది వారే గనుక, వారి భావాలను మొదట రాసి చర్చ మొదలుపెట్టవచ్చు కదా! అజెండా ను సెట్ చేయొచ్చు కదా !

  29. Thirupalu says:

    మానవ పరిణామ క్రమం లో భూమిమీద రెండు కాళ్ళతో నిలబడగాలిగినది మొదలు తనకు హాని చేయని ఆహరాన్ని వెదుకుమ్మ్టునే ఉన్నాడు. అందులో జంతువులను వేటాడి తినటం ఒకటి అన్ మనం మర్చి పోగూడదు. అది ఏ జంతు వన్నది ముఖ్యం కాదు.ప్రాంతాన్ని పట్టి , అవకాశాన్ని పట్టీ, సమయాని పట్టీ,సులభ తరమైన వేట నుండి ఘనమైన పది మంది గుంపు జేరితే గాని అలవి కాని జంతువుల్ని కూడా వేటాడి తిన్నట్టు మానవ శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. మరి భూమి మీద వున్నా ప్రతి వాడి పూర్వులు వేటాడి తిన్న మాంసభక్షకులే. శాకాహారం తో పాటు మాంస హారం మానవ జీవన వికాసానికి దోహదం చేసింది. దాన్ని కాదనటకి అవుననటానికి మనమెవరం. మాంసం తినాలా వద్దా అన్న విషయం ఆహార డిమాండ్ దాని అభివృద్ది నిర్ణయిస్తుంది కాని మనుషులు మాత్రం కాదు.

  30. Phoenix says:

    ఒక విషయం గుర్తుకొచ్చింది.

    గుజరాత్‌లోననుకుంటాను. అక్కడి జైనులు, తమకు నిషిధ్ధమైన ఉల్లిపాయల్లాంటి “మాంసాహారాల్ని” (నేలలో పెరిగేవి జైనులకు మాంసాహారంకిందే లెఖ్ఖ) తమ ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఒకానొక ప్రాంతంలో నిషేధించమని కొన్నాళ్ళుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారట. ఇది సమర్ధనీయమే ఐతే, బీఫ్‌పై నిషేధంకూడా సమర్ధనీయమే!

  31. buchi reddy gangula says:

    మతం — కులం — దేవుడు — యింకా ఎంతకాలం ???
    బి .జె . p.. పాలనలో —బాబాలు — స్వాములు — లేని పోనీ కూతలు కూస్తున్నారు —
    రోజు అదే భాగోతం ???
    sex— శ్వాస —స్నానం —-రేపు వీటి మిధ కూడా —చర్చలు — మీటింగ్ లు —
    జరుపుతారానుకుంటా
    తులిసి గారు — చక్కగా చెప్పారు – madam……….
    ——————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

మీ మాటలు

*