పుష్పించిన మనిషి

వారణాసి  భాను మూర్తి  రావు 
కొందరు మనుషులు  ఎడారుల్లో  పెరిగే
బ్రహ్మ  జెముడు  చెట్లల్లా  ఉంటారు
కొందరు  మనుషులు  రోడ్ల పక్కనే
పెరిగే  తుమ్మ  చెట్లల్లా  ఉంటారు
కొందరు  మనుషులు  ఉద్యానవనంలో
పెరిగే  మొగిలి  పూవుల్లా  ఉంటారు
కొందరు  మనుషులు   మన  ఇంట్లో పెరిగే
మల్లె పూవుల్లా  ఉంటారు
ఎందుకో మరి కొందరు
మనుషులను   దూరాలతో  కొలత బెడతారు
ఆ మనిషి  ముఖంలో
ఏ  ఋతువూ   విప్పారదు   సరి గదా
మోడు  వారినట్లు  జీవం  లేనట్లు  ఉంటుంది
కొందరు ఒక్క ఆలింగనం  తోనే
మమతలని  ఇచ్చి పుచ్చు కొంటారు
కొందరు  కోన  చూపు తోనే
ప్రేమ  వర్షాల్ని  కురిపిస్తారు
కొందరు  మాట్లాడుతుంటే
అనురాగ  చలమలు  ఊరుతుంటాయి
కొందరు   నవ్వుతుంటే
మమతల  సరోవరాలు   నిండి పోతాయి
మనసు నిండా పలకరిస్తే   పొయ్యే దేముంది
కొన్ని  మాటల  ఖర్చు తప్ప
గుండెను  గుండెతో పలకరిస్తే  పొయ్యే దేముంది
కొన్ని  క్షణాల  త్యాగం తప్ప
మనిషి మొగ్గ తొడగాలి
మనిషి పుష్పించాలి
మనిషి మనిషితో  మాట్లాడని వాడు
అసలు  మనిషేట్టా అవుతాడు ?
 *

మీ మాటలు

 1. నిశీధి says:

  మనసు నిండా పలకరిస్తే పొయ్యే దేముంది
  కొన్ని మాటల ఖర్చు తప్ప
  గుండెను గుండెతో పలకరిస్తే పొయ్యే దేముంది
  కొన్ని క్షణాల త్యాగం తప్ప !
  ఎన్ని రోజులయిందో ఇంత మంచి భావం చదువుకొని . కుడోస్

 2. అవును . మనుషుల మనస్తత్వాల్లో ఎన్ని వైరుధ్యాలో! ఏ జాతి మొక్కైనా, పువ్వైనా ఒకేలా ఉన్నట్టుగా మనుషులంతా ఒకలా ఎందుకుండరో! స్వార్థం చూసుకోకుండా ఒక చిన్న ప్రశంస కూడా వ్యర్థపరచని స్థాయికి దిగజారిపోయిన మానవ నైజాన్నిచక్కగా కవిత్వీకరించారు .

 3. Bhanu Murthy Rao says:

  సారంగ పత్రిక వారికి ధన్య వాదాలు .

 4. pusyami sagar says:

  కవిత చాల బాగుంది మూర్తి గారు …అబినందనలు

  • Bhanu Murthy Rao says:

   ధన్య వాదాలండి పుష్యమి సాగర్ గారు .

 5. విలాసాగరం రవీందర్ says:

  మనిషి మనిషి తో మాట్లాడని వాడు మనిషెట్లవుతడు. బాగుంది కవిత భానుమూర్తి గారు

 6. మనిషి కి మాటకి ఉన్న సంబంధం గురించి చాల బాగా రాసారు.

 7. narayana sharma says:

  కవితచాలా బాగుంది భానుమూర్తి రావు గారు.బహుశ: ప్రపంచీకరన వల్ల ఆర్ధిక,రాజకీయ స్వభావాల్లానే మానవీయస్వభావంకూడా మారిపోయింది

 8. Bhanu Murthy Rao says:

  మీ స్పందన కు ధన్య వాదాలండి నారాయణ శర్మ గారు.

 9. vani koratamaddi says:

  మనసు నిండా పలకరిస్తే పొయ్యే దేముంది
  కొన్ని మాటల ఖర్చు తప్ప
  గుండెను గుండెతో పలకరిస్తే పొయ్యే దేముంది
  కొన్ని క్షణాల త్యాగం తప్ప
  మనిషి మొగ్గ తొడగాలి
  మనిషి పుష్పించాలి,
  మనిషి మనిషితో మాట్లాడని వాడు
  అసలు మనిషేట్టా అవుతాడు ?కవిత చాలా బావుంది భానుమూర్తి గారు

 10. Bhanu Murthy Rao says:

  వాణి గారు , స్పందించి నందుకు ధన్య వాదాలు .

 11. RaghuBabu S V says:

  రక రకాల చెట్లతో మనిషి ని పోల్చి మానవ స౦బ౦ధాల అనుబ౦ధాన్ని అద్భుతంగా ఆవిష్కరణ చేశారు

మీ మాటలు

*