గాయం తో పాటు జయం కూడా వీరుడిదే !! 

పి. విక్టర్ విజయ్ కుమార్
వీరుడంటే ఎవరు ?
శతృవు తల్చుకుని తల్చుకుని కుళ్ళి కుళ్ళి
ఏడ్వడానికి ఒకే కారణంగా –
స్వయంప్రతిపత్తి రాజ్యంలో
ఒక ఝంఝ మారుతమై
నిరసన జెండాపై నిలిచిన వాడు
 
భీరువంటే ఎవడు ?
అనుక్షణం అభద్రతతో నూతి నీళ్ళ నుండి
ఆకాశం చూసి వీరుడొస్తాడేమోనని
వణుకు గర్భాన్ని నఖక్షతం చేసిన వాడు –
ఈత చాప చేతిలో చుట్టుకుని
పోటెత్తే సంద్రాన్ని ఇసుక దాటి రానీవ లేదనుకునేవాడు !
* *
 
గీత చదవడం రాజ్య వ్యతిరేకం కానప్పుడు
గీత దాటడం ఇంకెలా ఉంటుంది ?
అధ్యయనాలు అగ్రహారాలు దాటనప్పుడు
అభినివేశం ఇంక ఏ తీరుగుంటుంది ?!
గిరి గీసిన వలయం లో గొంతుకను
మంత్ర దండం వేసి బిగిస్తే
భీరువుల స్వయంపాలనకు
వీరులు ప్రేతాత్మలే ఔతారు…..
  * *
 
నీకు నాకూ
భూమిక ఒకటే !
నీలో ఉరుకులెత్తేది
నాలో ఉరుకులెత్త్తేది
మట్టుబెట్టాలనే ఆరాటం !!!
నీ ఛాతీ కి అడ్డంగా మంత్రించిన పత్తితో ఏకిన దారపు పోగు…
నా చేతి నిండా పిడి పై అనుశాసనంగా నిల్చున్న ఉక్కు కరవాలం …..
నీవు భీరువు వేపు !!
నేను వీరుడి వేపు !

 

ఒక ఆకాశ రామన్న ఉత్తరం ఆధారంగా ” అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్ ” అనే స్టూడెంట్ అసోసియేషన్ ను ‘ డీరికగ్నైజ్ ‘ చేయాలని ఐ ఐ టీ – మద్రాస్ డీన్ ఆఫ్ స్టూడెంట్స్ నిర్ణయం తీసుకుంది. ఈ విధాన నిర్ణయానికి ఒక పక్క ‘ స్వయం ప్రతిపత్తి ‘ కలిగిన సంస్థ అంటూనే , ఇంకో పక్క నారద జోక్యం తో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ విధాన నిర్ణయానికి అనుకూల  వాతావరణాన్ని కల్పించింది. ‘వివేకానంద స్టడీ సర్కిల్  పేరుతో గీతా ప్రభోధాలను బ్రాహ్మిణీక మత చాందస వాదాన్ని ఆయా మత శక్తులు విరివిగా వాడుకునే విషయం ఇంత వరకు సంస్థ పట్టించుకోక పోవడం గమనార్హం.

విద్యాసంస్థలు తార్కిక చర్చలకు ప్రధాన సంధాతలుగా ఉండడం సర్వ సాధారణ విషయం. అంబేద్కర్ , పెరియార్ వంటి ఆలోచనా విధాన పరుల భావాలు ఖచ్చితంగా ప్రస్తుత నమ్మకాలకు విభిన్నంగా ఉంటాయి. అయినంత మాత్రాన అంబేద్కర్ తో రాజ్యాంగం ముసాయిదా వ్రాయించుకోకుండా ఉండలేదు – ఈ స్వతంత్ర భారత దేశం. నిజానికి ఆకాశ రామన్న ఉత్తరాలపై రియాక్ట్ కాకూడదనే విధానం ను కూడా పట్టించుకోకుండా మంత్రిత్వ శాఖ విద్యా సంస్థను  ‘ ప్రాంప్ట్ ‘ చేయడం, ముందస్తుగా వివరణ కూడా అడక్క పోవడం ఒక కుట్ర గా విదితమౌతుంది. ఏది ఏమైనా వాక్స్వాతంత్ర్య హక్కును నియంత్రించడం అప్రజాస్వామికం. …

మీ మాటలు

  1. johnson choragudi says:

    హక్కులు భిన్న రూపాల్లో వుంటాయి.
    భయపడే వాళ్లకు వుండే స్వేఛ్చను ప్రశ్నించ వద్దు.

    జాన్సన్ చోరగుడి

  2. nageswara rai says:

    సర్ ఏమిటా ఆకాశరామన్న ఉత్తరం?

    • Vijay Kumar says:

      Sir, has no provision to post picture files. Its all over there in net and TV channels. It is just an anonymous complaint on white paper with no signature and identity. Not sure if this letter is created by Ministry itself !!

  3. P Mohan says:

    విక్టర్ గారూ, కవిత బావుంది. విజయం ఎప్పుడైనా వీరుడిదే, దొంగదెబ్బ కొట్టేవాడిది కానే కాదు.
    ఈ వివాదానికి కారణం మోదీపై విమర్శలు. అంబేడ్కర్ పెరియార్ స్టడీ సర్కిల్ పై రైట్ వింగ్ చాలా కాలంగా కచ్చగట్టి ఆకాశరామన్న పేరుతో ఉత్తరం రాసింది. ద్రావిడ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ ఆర్. వివేకానంద గోపాల్.. contemporaray relevance of Ambedakr అనే అంశంపై చేసిన ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు ఇలా..
    ”The Modi government while carrying forward its Hindutva agenda, is simultaneously assisting the multinational corporates to loot mother India.. It is communally polarising the people by the ban on cow slaughtering, Ghar Wapsi programme and promoting Vedas.”
    ఇది ‘హిందువులను కించపరచేలా’ ఉందని సంఘ్ మూకలు ఫిర్యాదు చేశాయి. అధికారంలో ఉన్నదీ ఆ మూకలే కనుక స్టడీ సర్కిల్పై వేటు పడింది. మోదీని వివేకానంద గోపాల్ కంటే తీవ్రంగా విమర్శించి, రాజ్నాథ్, ఇరానీల ఇళ్లముందు ధర్నా చేసిన ఎన్ఎస్ యూఐ, వామపక్షాల విద్యార్థి సంఘాలపై కాషాయ సర్కారు ఎందుకు వేటువేయలేదు? ఎందుకంటే ఈ దేశ రాజకీయలకు కులమతాల పిచ్చి ఉంది కనుక. కాంగ్రెస్, వామపక్షాల పార్టీలన్నీ హిందూ అగ్రవర్ణాల నాయకత్వంలోనే ఉన్నాయి కనుక.

    • vijay kumar says:

      Mohan garu. Thanq. Valid addition to the theme of the poem.
      మీరు వీరుడి వేపు !
      (y)

    • Vijay Kumar says:

      Mohan garu,, very valid addition to the theme of the poem… మీరు వీరుడి వేపు !

  4. m.viswanadhareddy says:

    అధికారంలో వుండే వారికి హక్కులు ఎన్ని? అవి ఏవి ?? ప్రశ్న ఇచ్చి జవాబులు వంద సార్లు రాయమనాలి ..అందరి హక్కులు భాద్యతలు రాజ్యాంగములొ నిర్దేశించిన వాళ్ళ గురించి చర్చించుకోవడం కూడా నేరమని భావించే వాళ్ళే రేపు అంబేద్కర్ పేరుతొ దేశమంతా ఫ్లక్సిలు నింప బోవడం ఒక విషాదం

  5. వాటికన్ మాఫియా అలెర్ట్ !!!!!!!

  6. sreerama says:

    వాటికన్ మాఫియా చమ్చా గాళ్ళు 10 సంవత్సరాలు విజ్ర్నభించి దేశాన్ని సర్వ నాశనమ్ చేశారు . ఇప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ లో వున్నారు. ఓ పాపుల ప్రభువా క్షమినిచు ఈ దేశ ద్రోహులని తల్లి పాలు తాగి వాటికాన్ వాకిల్లో ఊడిగం చేసే వెధవల్ని.

    • ఆ ప్రభువు క్షమిస్తూనే ఉంటాడు..మనం ఇంకా క్షమిస్తూనే ఉన్నాం..
      అందుకే ద్రోహులు, ద్రోహాలు పెరుగుతూనే ఉన్నాయ్…

Leave a Reply to Vijay Kumar Cancel reply

*