మమత “సుస్వరం” వచ్చే వారం నుంచి…!

కవి Walter De La Mare ఇలా పాడుకుంటున్నాడు సంగీతం గురించి:

When music sounds, gone is the earth I know,
And all her lovely things even lovelier grow;
Her flowers in vision flame, her forest trees
Lift burdened branches, stilled with ecstasies.

Mamata Vegunta

Mamata Vegunta

ఒక సుస్వరం మన చెవిలోకి ప్రవహిస్తున్నప్పుడు ఇంత కంటే ఎక్కువే ఏమన్నా జరగచ్చు.

చెవి చుట్టూ ఒక పూల ప్రహరీ కట్టుకున్నట్టు వుంటుంది.

లేదూ, ఎక్కడో జారిపోతున్న జలపాతపు నీటి గలగల అందంగా చుట్టుకున్నట్టు వుంటుంది.

చల్లని వెన్నెలని చిదిమి బొట్టు పెట్టుకున్నట్టూ వుంటుంది.

మండే ఎండ నుదుటి మీద ఎట్నించో ఒక్కటంటే ఒక్కటే వాన చినుకు రాలినట్టూ వుంటుంది.

కాని,  ఆ సుస్వరానికి రంగుల భాష అద్దితే … అది నిస్సందేహంగా మమత పెయింటింగ్ లా వుంటుంది,

వచ్చే వారం నించి-

మమత “సుస్వరం” వినిపిస్తుంది ఏడు రంగులై!

మీ మాటలు

  1. ఆర్.దమయంతి. says:

    వీరిని ఎక్కడొ చూసినట్టు గుర్తు.
    :-)
    అల్ ద బెస్ట్ మమత గారు.
    రైటప్ చాలా బావుంది.
    బహుశా అఫ్సర్ లేదా కల్పన గారో అనుకుంటున్నా.

  2. కరెక్ట్ గా చెప్పారు దమయంతి గారు. Honoured to have such a beautiful write up by Dr Afsar for Suswaram announcement..

  3. మమతగారూ, వెయిట్ చేస్తున్నాను…. మంచి రైటప్ అఫ్సర్ గారూ!

  4. vasavi pydi says:

    స్వరాలు సారంగ ముంగిట్లో రంగుల హరివిల్లు ఆమనికోయిలకిది పుట్టిల్లు స్వరాల రంగవల్లి కి స్వాగతం

  5. నిశీధి says:

    Waiting for those beautiful art works . cool words

  6. రాధ గారు, వాసవి గారు, నిశిధి గారు.. thank you .. see you very soon with my color palette..

  7. sujatha.c says:

    మమత చాల కాలం తరువాత నీ గురించి చూస్తున్న .బావున్నావా .నీ రచన చూసాక మాట్లాడు కుందాము .

  8. kandukuri ramesh babu says:

    వెల్కమ్ అగైన్…

Leave a Reply to kandukuri ramesh babu Cancel reply

*