w r i t e r ’s  b l o c k                        

ఊడుగుల  వేణు 

 

ఎండావాన కలసివస్తోంది

అక్కడ కుక్కకు నక్కకు పెళ్లి జరుగుతోంది

ఆ వేడుక చూడ్డానికి నేనూ వెళ్లొచ్చాను!

మర్నాడుదయం నిద్రలేచాక తెలిసొచ్చింది

నారెండు చేతుల్ని అక్కడే మరిచొచ్చిన సంగతి!

ఒక్కసారి వెళ్ళిచూడు…

ఆ చేతివేళ్ళ సందుల్లో నీ భావాశ్రిత ఆనవాలు కనిపిస్తాయి!

*

వైకుంఠపాళి నిచ్చెనమెట్ల నడుమ

కాటగలిసిన నా గుండెకాయ

విషసర్పం కడుపులో భానిసత్వం చేస్తోంది

దాని పదబంధశబ్ధాలను డీకోడ్ చేసిచూడు

పుట్టపగిలి చీమలొచ్చినట్టు

మార్మిక పదచిత్రాలన్నీ తిరిగిలేస్తాయి!

*

నేను ద్రవీభవించి సముద్రంలో కలిసిపోయాను

కెరటాలపై ఎగిరిపడే చేపలని చూస్తున్నాను!

dopamine,oxytocin,serotonin

మరియు endorphins…

మెదడులో టన్నులకొద్దీ కెమికల్స్ ఉత్పత్తి …

నా లోలోన ఒక కవిత పురుడుపోసుకుంటోంది

అక్కడిక్కడే somersaults  కొట్టాను

ఉరుముల మెరుపులతో ఆకాశం శివమూగింది

వాయువేగంతో నలువైపులనుండి  pirates…

నాగొంతులోని పసివాక్యాలన్నీ దొంగిలించబడ్డాయి !

నేను పరుగెత్తుకొచ్చి గుజ్జెనగూళ్లలో కూర్చుండిపోయాను

సముద్రం వర్షంలోతడుస్తూ అక్కడే ఉండిపోయింది

చినుకులు కొన్ని నా పాదాలపై రాలిపడగానే

మృతులైన నా అభిమాన కవులంతా

నాకేదో సందేశమివ్వటానికి ప్రయత్నిస్తున్నట్లనిపించింది !

సంతలో,రోడ్డు మీద,ఎక్కడపడితే అక్కడ

Writing pills అమ్మితే ఎంత బాగుండు !

Writing – Writing

Now I am living in one single word : Writing!

లేఖిన్,క్యా ఫైదా…

జహెన్ మే పూల్ నహీ ఖిల్ రే !

*

ఆధునిక వదశాలను నువ్వు చూసి ఉండకపోతే

నా శిరస్సులోపలికి తొంగిచూడు

ఊచకోతలో నెత్తురొడుతోన్న పదాలు కనిపిస్తాయి

పద్యాలలో ఒదగలేక పీనుగలైన అక్షరాలు

అర్ధరాత్రి ఆత్మలై నన్ను పీక్కుతింటాయి

నేనలా నిద్రపోతానో లేదో

నా కనుపాపలురెండు నిన్ను వెతకటానికై పరుగెడుతుంటాయి !

నీకు గుర్తుండే ఉంటుంది “కీట్స్” చెప్పిన మాట…

“only a poem can record the dream”

*

నా చెవిలో ఒకమాట చెప్పివెళ్ళు…

ఈ లోకానికి  నేను కావల్సిన వాడినైనప్పుడు

మరి నీకెందుకంత  కానివాడినయ్యాను !

నిన్ను గాజు సీసాలో బందించి

గ్రహాల అవతలికి విసిరేసిందెవరో చెప్పు

కాలుతోన్న చితి నుండి  – రాలుతోన్న బూడిదలో

నిన్ను కలిపేసిందెవరో చెప్పు

ఇన్నిమాటలెందుకు ,ఓసారిలా వచ్చిపో…

ఒక్క నెత్తుటి చుక్కతో నా గొంతు తడిపి

ఒక్క వేలితో నన్నుతాకి

నా ధర్మాగ్రహాన్ని ఆవాహనం చేసుకునిపో

నాకోసమిప్పుడేమీ లేదు – బతుకు శూన్యమైంది

ప్రపంచాన్ని నడిపే పవిత్రమర్మానివి కదా

నా గుండెకాయను తిరిగి నా దేహంలోకి ప్రవేశపెట్టి చూడు

132 వ గడిని దాటి…

స్వర్గధామం పై పాదం మోపుతాను!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. kcube varma says:

    డిఫరెంట్ పోయెమ్ విత్ న్యూ imagery

    • venu udugula says:

      సర్ కే క్యూబ్ వర్మ గారు కృతజ్ఞతలు .

  2. Nisheedhi says:

    Good effort . kudos

  3. Vijaya Bhanu Kote says:

    చాలా బావుంది వేణు…..ప్రతి రచయితా ఏదో ఒక సమయంలో అనుభవించే ఈ వ్యధను చాలా వైవిధ్యంగా, భావాత్మకంగా చెప్పావు….చాలా రోజుల తర్వాత మంచి కవిత చదివిన అనుభూతి…కీప్ గోయింగ్…

    • venu udugula says:

      భాను గారు మీ ప్రోత్సాహం ఎన్నటికి మరిచిపోలేను.కృతజ్ఞతలు

  4. srikanth says:

    “only a poem can record the dream”
    హత్తుకుంది వేణు భయ్యా.. అక్షరానికి పురుడుపోసే కవి అంతర్ వేదనకు అద్భుతమైన పదబంధాలు, భావావేశంతో అక్షరబద్ధం చేసిన తీరు చాలా నచ్చింది <3 <3

  5. కవి అంతర్ సంఘర్షణకు అక్షర రూపం..
    వేణూ..!
    పోయెమ్ సూపర్బ్..!
    అప్పుడప్పుడు నీ మార్క్ పోయెమ్స్
    ఇలా అందిస్తుండు భయ్..!

    • venu udugula says:

      స్కై యువర్ మై ఫస్ట్ రీడర్ . యువర్ మై మెంటర్. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

  6. anantha says:

    Nuvvu matrame rayagalav venu. You are one of the best writers in the world up to my knowledge. Samudranni kuda varsham lo thadapagala shakthi ne kalanike undi.

  7. samanya says:

    చాలా బాగుంది వేణు గారు . మీరు ఇక వారానికో పోయెమ్ రాయడం మొదలు పెడితే మేము కవిత్వ వారోత్సవాలు మొదలెట్టి సంబరాలు జరుపుకుంటాం మీ కవిత్వం అంత బాగుంటుంది .

    • venu udugula says:

      సామాన్య గారు … బ్లెస్సెడ్ విత్ యువర్ కామెంట్.నో వర్డ్స్ టు సే . ఓన్లీ, ఓన్లీ థాంక్స్ ఎలోట్ .

  8. Thirupalu says:

    /వైకుంఠపాళి నిచ్చెనమెట్ల నడుమ
    కాటగలిసిన నా గుండెకాయ
    విషసర్పం కడుపులో భానిసత్వం చేస్తోంది
    దాని పదబంధశబ్ధాలను డీకోడ్ చేసిచూడు
    పుట్టపగిలి చీమలొచ్చినట్టు
    మార్మిక పదచిత్రాలన్నీ తిరిగిలేస్తాయి!/
    కవి తపన స్పష్టంగా కనిపిస్తుంది. బాగుంది.

  9. buchi reddy gangula says:

    వేణు జి

    excellent..one..sir…
    ————————————
    బుచ్చి రెడ్డి గంగుల

  10. Different poem….different thoughts……finally its super…

  11. అన్వీక్ష says:

    ఆధునిక వదశాలను నువ్వు చూసి ఉండకపోతే

    నా శిరస్సులోపలికి తొంగిచూడు

    ఊచకోతలో నెత్తురొడుతోన్న పదాలు కనిపిస్తాయి

    పద్యాలలో ఒదగలేక పీనుగలైన అక్షరాలు

    అర్ధరాత్రి ఆత్మలై నన్ను పీక్కుతింటాయి

    నేనలా నిద్రపోతానో లేదో

    నా కనుపాపలురెండు నిన్ను వెతకటానికై పరుగెడుతుంటాయి !

    నీకు గుర్తుండే ఉంటుంది “కీట్స్” చెప్పిన మాట…

    “only a poem can record the dream”

    *Wow సూపర్ గా ఉందండి మీ కవిత … వేణు గారు

  12. mercy margaret says:

    మళ్ళీ మళ్ళీ చదివించింది మీ కవిత వేణు గారు

  13. subhashini says:

    వావ్.. వేణు గారు… ఇంత సంఘర్షణ లో నుండి అయినా మాకు పోయమ్స్ అందిస్తూ ఉండండి… చాలా బాగా చెప్పారు.. ఒక గ్యాప్ తరువాత లోలోపల జరుగుతున్న గొడవని ..

  14. వేణు గారు.. చాలా బాగుంది . ఎక్స్ప్రెషన్ వైవిద్యంగా ..

  15. పసునూరి రవీందర్‌ says:

    వేణు గారి కవిత ఒక అంతర్‌, బహిర్‌ సంఘర్షణల సమిష్టిరూపం. ఈ పోయెంకు జస్ట్‌ బాగుందనే మాట సరిపోదు. ఎక్కడ మొదలు పెట్టాడు, ఎక్కడ ముగించాడు. అచ్చంగా ఆకాశంలోకి టేకాఫ్‌ తీసుకునే విమానంలా. సర్రున దూసుకెళ్లే పక్షిలా. నిజానికి ఈ పొయెం వెనక ఒక ఫిలాసాఫికల్‌ డెప్త్‌ కనిపిస్తోంది. మన ఆలోచనలు, సంఘర్షనలే, స్థితగతులే కలలరూపంలో వస్తుంటాయంటరు కదా. అదిగో అలా ఈ పోయెం కూడా ఓ మనిషి మానసిక సంఘర్షణని సరిగ్గా ప్రతిఫలించింది. మ్యాజికల్‌ రియాలిజం శిల్పంలో కొనసాగిన ఈ కవితా వేగం, సర్రియలిజం పంథాతో పతాకస్థాయికి చేరింది. అలాగే సాధారణ సంఘటన ఉటంకింపుతో మొదలై విశ్వజనీనమైన ప్రేమ భావనతో ముగించడం మరో ప్రత్యేకత. ముగింపు వాక్యానికి వచ్చేసరికి, ఎంత నెమ్మదిగా మొదలుపెట్టాడో, అంతే జాగ్రత్తగా పాఠకున్ని ఒక రకమైన ఫీలింగ్‌లోకి దించి నెమ్మదిగా వదిలేశాడు. ప్రతీవాక్యమూ గుండెను తాకేలా రాయడం మామూలు విషయం కాదు. అందుకు నిదర్శనంగా ఈ పోయెంలో హత్తుకునే ఎన్నో వాక్యాలున్నాయి. “ఇన్నిమాటలెందుకు ,ఓసారిలా వచ్చిపో…”అన్న వాక్యం ఎవ్వరినైనా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. చూడ్డానికి ఇదొక సాధరణవాక్యంలా కనిపిస్తున్నప్పటికీ గాఢమైన భావాన్ని పొదువుకొని ఉంది. మంచికవిత్వానికి ఇంతకు మించిన లక్షణం ఏముంటుంది.. ఇంతమంచి పోయెం రాసిన ఈ కవికి నా అభినందనలు, ప్రచురించిన సంపాదకవర్గానికి ధన్యవాదాలు..
    -పసునూరి రవీందర్‌

  16. Raja B K says:

    Venu excellent ra keep it up
    I really proud of you ర
    I wish you all the best

  17. vani koratamaddi says:

    వేణు గారు.. చాలా బాగుంది

  18. venu udugula says:

    తిరుపాలు గారు ,బుచ్చిరెడ్డి గారు ,అన్వీక్ష గారు,మెర్సిమార్గరెట్ గారు ,సుభాషిని గారు,శాంతి ప్రబోధ గారు,వెంకట్ గారు,రాజ్ గారు,వాణి గారు,మరియు పసునూరి గారు…అందరికీ పేరు పేరున కృతఙ్ఞతలు .

    • venu udugula says:

      తిరుపాలు గారు ,బుచ్చిరెడ్డి గారు ,అన్వీక్ష గారు,మెర్సిమార్గరెట్ గారు ,సుభాషిని గారు,శాంతి ప్రబోధ గారు,వెంకట్ గారు,రాజ్ గారు,వాణి గారు,మరియు పసునూరి గారు…అందరికీ పేరు పేరున కృతఙ్ఞతలు .

  19. A Poet ‘S heart wrenching struggle…చాల చక్కగా depict చేసావ్.trendy text . loved alot venu !

  20. sudheer kumar says:

    ‘Writing pills అమ్మితే ఎంత బాగుండు !

    Writing – Writing

    Now I am living in one single word : Writing!
    ‘ చాల చాలా ఫ్రెష్ గా ఉంది ఎక్ష్ప్రెశన్ . విరివిగా రాస్తూ ఉండండి.

  21. గుడ్ పోయెమ్ అన్న, నువ్వు కంటిన్యు గా రాయాలి….

  22. Gopi prasad says:

    వేణు sir, మీ కవిత్వాన్ని పొగడలన్న కొంచెం qualification ఉండాలి అనుకుంట!!!
    ఇం honoured myself by reading your poem sir

  23. Chandrasekhar Dandem says:

    వేరి నైస్ సర్ ఇది ఒక scientific కవిత అని అనచేమో
    Nice word ( only poem can record the dream ) నిజమే కల కనిపించేది కవిత్వంలోనే

Leave a Reply to shanti prabodha Cancel reply

*