simple picture

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshpicture.
ఈ వారం ఈ పదం గురించి.

అవును.
pickup గురించి మీరు వినే ఉంటారు.
అది వేరనుకుంటారు.

pick అంటుంటారు.

పసిగట్టడం.
పిక్.
పిక్చర్.

చూడగానే దాన్ని పట్టుకోవాలనుకోవడం. ఒడిసి పట్టుకోవడం.
పసిగట్టడం.

పసిగట్టడంలోనూ ఒక బాల్యం ఉంటుంది.

ఒక్క పరి చూసి విభ్రమం చెందడం. అదే కావాలని మంకు పట్టు పట్టడం. పసితనపు చ్ఛాయ.

అట్లే పిక్చర్ లో ఒక కల్చర్ ఉంటుంది.
జీవన సంస్కృతి అంతా ప్రతి పిక్చర్ సెల్లో సంక్షిప్తం అయివుంటుంది.

నిజానికి పిక్చర్ అంటే ఏమిటో కాదు, దృశ్యాదృశ్యం.

అందరూ యధాలాపంగా చూసేదాన్నే పట్టుకోవడం.
అదృశ్యం కాకుండా దృష్టి పెట్టడం.

picking…
pick…

capture…
picture.

A visual representation…
A vivid or realistic description.

అనుక్షణికపు స్వప్నరాగాలీన కాదు.
క్షణికపు వాస్తవాలింగనం.

వడ్డెర చండీదాస్ కాదు.
మామూలు రచయిత పనే.

వాస్తవం.
జీవకళ.

ఎవరైనా ఏముందిలే అని తలవంచుకుని పోతుంటే, కాదు, ఇందులో ఒక సంస్కృతి ఉంది. నాగరికత ఉంది. వర్ణ సంచయమూ ఉంది. ఒక సంభ్రమం ఉంది. విభ్రాంతి ఉందీ అని అనకుండా చాలా మామూలుగా దోచుకోవడం, దాచుకోవడం, వెలుగు నీడల ఛాయలో వడగట్టడం…ఆనందించడం అంతే.

అప్పుడు తెలియదు.
అదే picture.

లేదంటే మీరలా వెళుతూ ఉంటారు.
మౌస్ తో గోడమీద నడుస్తూ ఉంటారు.
ఒక దగ్గరకు రాగానే లైక్ చేస్తారు.
అదీ ఒక రకంగా పిక్.
పిక్చర్.

నిజానికి లైక్ చేయడమే ఫొటోగ్రఫి.

a selection of a work which feasts your imagination or memory or tickles your experiences. ఇదంతా బూతు. మోటు.ఎక్కువ అన్నమాట.
సింపుల్ గా చెప్పాలంటే సునాయసంగా మీలోకి చోరబడే ప్రేమ. ఛాయ.పిక్.

+++

ఇది ఒక ఉదయరాగాన తీసింది.
మహాత్మాగాంధీ లేదా ఇమ్లీబన్ బస్టాండ్…అటువైపు వెలుతుంటే రోడ్డు వారగా ఒక లాంగ్ షాట్.
కానీ దాన్ని ఎంత పట్టుకోవాలో అంత. ఎవరూ అడ్డంగా లేనప్పుడు ఎలా పట్టుకోవాలో అలా…
కాస్త కష్టపడితే ఇలా..
ఇక పట్టుకుంటే లైకులు. వందలకు వందల లైకులు.

బహుశా ఈ చిత్రానికి వచ్చినన్ని లైకులు నాకెప్పుడూ ఇదివరకు రాలేదు.
ఎందుకని ఆలోచిస్తే, రోజూ చూసేదే. కానీ ‘తీస్తే ఇంత బాగుంటుందా?’ అనిపించడం ఒకటి.

సో మై డీయర్ ఫ్రెండ్స్…పికప్.
పిక్చర్ చేయండి.

సింపుల్.

థాంక్స్.

~

మీ మాటలు

  1. Doctor Nalini says:

    అద్భుతం! జీవన సంఘర్షణలోనూ అందం,కళ ఉంటాయని నిరూపించారు .

    • kandukuri ramesh babu says:

      నలిని గారు, చాల థాంక్స్. మేరు మామూలుగా రాయరు. సో హ్యాపీ.

  2. Satyanarayana Rapolu says:

    ‘కను విందు’ అంటె ఏమిటో ఇప్పుడు అర్థం అయ్యింది బాబూ!

  3. P Mohan says:

    రమేష్ గారూ మాటల్లో చెప్పలేనంత బావుంది. వేసిన వ్యాన్గో వేసిన స్టారీ నైట్ చిత్రంలా గొప్పగా ఉంది.

  4. ఎంత పట్టుకోవాలో అంత, ఎలా పట్టుకోవాలో అలా, ఎప్పుడు పట్టుకోవాలో అప్పుడు …. ఇన్ని కుదిరాయి కనుకే ఆ ఛాయా చిత్రం అద్భుతంగా ఉంది . ఆ చిత్రం లో జీవం ఉంది, జీవితాన్ని ప్రతిబింబిస్తోంది !

    • kandukuri ramesh babu says:

      చాల కుదిరాయి బ్రదర్. అభినంధనలతో సహా. ఐ అం హ్యాపీ.

మీ మాటలు

*