బాల్కనీ లోవూయల! 

 డా. కోగంటి విజయ బాబు

 

 

బాల్కనీ లోవూయల!

తన ఉనికి,అస్తిత్వం తెలుసుకోకుండానే,

వంటరిగా!

 

ఎదురుగా నిండుగా పూచిన వేప చెట్టుని,

రోడ్డుపై ఆడే పిల్లల్ని,

ఎదురింటి మనుషుల్ని,

చూస్తూ కూడా చూడనట్లుగా

ఖాళీగా,గాలిలో,

గాలినిచూస్తున్నట్లున్న ఊయల!

 

నాలానే, నా మనసు లానే

అన్నిటిని మోస్తూ, ఊగుతూ

కానీ వంటరిగా,

మనసులేని,మనసంటే తెలియని వూయల!

 

దానికి ఇంద్ర ధనువు,ఎండ వేడీ ఒకటే!

కొందరి మనుషుల్లా

చూరును పట్టి వ్రేలాడే గొలుసుకు తగిలింపబడి ఉండటమే దానికితెలుసు.

అపుడపుడూ నావైపుతిరిగి,

ఖాళీగా పిలుస్తున్నట్లుండే ఊయల!

 

కాలం గడుస్తుందని దానికి తెలుసో లేదో!

ఎవరినీ, ఏ భావాలనూ పట్టించుకోక

ఏభావమూ కాక, కాలేక

వంటరిగా!

 

అశరీరికి, మనసున్న వారికి

స్థిత ప్రజ్ఞత

కుదరదేమో!

ఆ అవసరమూ లేదేమో!

*

koganti

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. కొందరు మనుషులు కూడా ఇలాటి ఊయలలేమో! మనసున్న వారికి జీవితంలో స్పందించాల్సిన క్షణాలెన్నో !
  బాగుంది.

 2. రియల్లీ వేరి నైస్ సర్ ఉయలకు కూడా మనసు ఉంటే అది ఎలా అలోచిస్తుమ్దో
  చాల చక్కగా చెప్పారు చాల ప్లేసంట్ గ ఉంది

 3. v v l n s prasad says:

  ఒంటరిగా అనే దానికి పర్యాయ పదం ఉర్దూలో తనహ అనుకుంటా. చాల అద్భుతమైన స్థితి. సహజంగా మనసనేది ఉన్నట్లు అనుభూతించే వారు అప్రయత్నంగా ప్రవేశించి కొనసాగే దశ. ఊయల కేవలం ఒక సింబల్ మాత్రమేకద సోదర. అద్భుతః!

 4. v v l n s prasad says:

  వంటరిగా అనే దానికి ఉర్దూ పర్యాయ పధం తన్హా అనుకుంటా. అది కేవలం వైయక్తికంగా అనుభూతించే విషయం. ఊయల ఇమేజ్ తో ఆ అనుభూతి చక్కగా తెర మీదికి తెచావ్, సోదరా!అద్భుతః!

  • Dr. Vijaya Babu Koganti says:

   ప్రసాద్ భయ్యా కవిత్వం నీతో పంచుకోడం అందుకే సంతోషం.

 5. David Raju says:

  ప్రాణరహితాలు సైతం కవిత్వంతో ప్రాణం పోసికొని మాట్లాడతాయి మరియు జీవిస్తాయి …”విజయ” కవిత్వంతో…కంగ్రాట్స్ సర్ .

  • Dr. Vijaya Babu Koganti says:

   స్పందించే హృదయంలో కూడా ఆర్ద్రత ముఖ్యం. థాంక్ యు రాజు గారు!

 6. Dr. Kedari Narasimha Rao says:

  భావుకత తో మనసుల్ని ఊయల ఊపి, నిస్తేజితమైన వాటిలో సైతం భావాల ఊపిరులూదిన విజయ బాబు గారి కవితా సరళి అతి రమ్యం. కాలపు చక్రబంధం లో నిలువని వాటికి కూడా అస్తిత్వాన్ని కలుగచేసి, స్థిత ప్రజ్ఞత కు అసలు భాష్యాన్నిచ్చి, ఎమెర్సన్ “అమెరికన్ స్కాలర్” లో conformity and non-conformity కి జ్ఞప్తికి తెచ్చిన మీకు కృతఙ్ఞతలు.

  • Dr. Vijaya Babu Koganti says:

   మీకూ కృతఙ్ఞతలు ద. నరసింహరావ్ గారు.

 7. Dr. Kedari Narasimha Rao says:

  భావుకత తో మనసుల్ని ఊయల ఊపి, నిస్తేజితమైన వాటిలో సైతం భావాల ఊపిరులూదిన విజయ బాబు గారి కవితా సరళి అతి రమ్యం. కాలపు చక్రబంధం లో నిలువని వాటికి కూడా అస్తిత్వాన్ని కలుగచేసి, స్థిత ప్రజ్ఞత కు అసలు భాష్యాన్నిచ్చి, ఎమెర్సన్ “అమెరికన్ స్కాలర్” లో conformity and non-conformity ని జ్ఞప్తికి తెచ్చిన మీకు కృతఙ్ఞతలు.

 8. mercy margaret says:

  బాగుందండి కవిత

  • Dr. Vijaya Babu Koganti says:

   సంతోషమండి మీకు నచ్చినందుకు మెర్సీ గారు.

 9. vtvacharyulu says:

  జీవిత సత్యం తెలిపావు చా లా బాగుంది

మీ మాటలు

*