వెల్వెట్ కాని వెల్వెట్ 

లాల‌స‌

 

లాలస

నేనొక రహస్యానికి అందమైన నవ్వు ముసుగు వేశాను ప్రియా, బహరూపియా…

 ఈ అందమైన పాట ఇద్దరు హింసా పీడితుల గుండె చప్పుడులా వినపడుతుంది బాంబె వెల్వెట్ లో. సినిమా కూడా అందమైన ముసుగు లాంటిదే. బహరూపియా లా ( మారు వేష కత్తె లేదా మారువేషగాడి)లానే ఉంటుంది.  పరికించి చూడకపోతే ఈ సినిమాలోని  అసలు రహస్య‌మైన  క్రాప్టింగ్, కథనంలో తొణికిసలాడే కవిత్వమే కనపడదు. 60 ల నాటి బొంబాయి నైట్ లైఫ్, నేర ప్రపంచానికి ఒక ఒపెరా లాంటి చిత్రరూపమది. అందుకే సినిమా మేకింగ్ చర్చల్లో, కళాత్మకతకు ప్రామాణికతలు నిర్దేశించుకునే పెంచుకునే క్రమంలో.. ఇవాళ కాదు రేపైనా noir తరహా సినిమాల ఒరవఢిలో ఒక కీలకమలుపుగా ఉండిపోతుంది. 

కథ ఏమీ లేదు అనిపించవచ్చు రెండు ముక్కల్లో చెబితే.

ఇందులో ఒక్కరంటే ఒక్క‌రు  కూడా మర్యాదస్తులు కారు.  కనీసం సగటు మానవులూ కారు. హింసతోనో,  ప్రతిహింసతోనో  తమ భౌతిక లక్ష్యం చేరడానికి  హత్య, మోసం, కుట్ర, ఛిద్రం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యే వారే. ఇక్కడ నైతిక‌తకు తావు లేదు. డబ్బు, హోదా, అధికారం నిచ్చెన ఎలాగైనా ఎక్కాల‌నే  అరాటమే వారి ఆత్మ‌. ఇక పాత్రలకు వస్తే  , నేర ప్రపంచం అంచుల్లోబాల్యం చితికిపోయిన వాడు  బాక్సర్ బలరాజ్ ( రణబీర్ కపూర్).  జీవితంలో బిగ్ షాట్ కావాలంటే గన్ షాట్లు త‌ప్ప‌వ‌నుకునే వాడు.   నేరస్తులు తన కుటుంబాన్ని మింగేస్తే పెద్ద పాటకత్తె కావాలనుకుని బొంబాయికి ఒంటరి గా వచ్చిన అందమైన గులాబీ లాంటి జాజ్ సింగర్ రోజీ (అనుష్క శ‌ర్మ‌)..  రోజీ కోసం ఎన్ని తూటాలన్నా పేల్చడానికి సిద్దమయ్యేంత వివశత్వం బలరాజ్కి.  తన వ్యాపార సామ్రాజ్యాన్ని నల్ల బజారులో, రియల్ ఎస్టేట్లో విస్తరించాలనుకునే క్రూరమైన అందమైన వ్యాపారి కంబట్టా ( కరణ్ జోహర్),  కంబట్టా పెట్టుబడి దారు ప్రతినిధి అయితే అతని ప్రత్యర్ధి కమ్యూనిస్టు ప్రతినిధి…. ఈ ఇద్దరు పెద్ద తలకాయల ఉచ్చులో  వేడినెత్తురు బలరాజ్, నిశ్బబ్దం ఖంగుమనిపించే రోజీ చిక్కుకుంటారు.

 చిన్న కథే. కానీ నేర ప్రపంచంలోనూ అంతరాలు ఉంటాయి.లక్ష్యం, కాంక్షా ఒకటే కావచ్చు కానీ  అక్క‌డ కూడా  కొందరు పాత్రధారులైతే మరి కొందరు సూత్రధారులౌతారు. పాత్రధారులు సూత్రధారులవ్వానుకుంటే నెత్తురు ఏరులై పారుతుంది. నీ నేర ప్రపండానికి నేను  కేవలం పాత్రధారును కాదు నాకు కూడా కాస్త వాటా ఇమ్మని బలరాజ్ కంబట్టాను అడుగుతాడు ఒకసారి. కంబట్టా  ఏమీ మాటాడడు.. గది నుంచి బయటకు వచ్చి విరగబడి నవ్వు కుంటాడు. ఈ నవ్వులో మర్మం మీకు అర్ధం అయితే ఈ సినిమా అర్ధమైనట్లే. 

 సినిమాను నేరం, హింస, సంగీతం ఒకదాని తరువాత ఒకటి నిశ్శబ్దంగా ఆవిష్కరించుకుంటే పోతూ ఉంటాయి. కథ బొంబాయిలోని ప్రముఖ వాణిజ్య కేంద్రం నారిమన్ పాయింట్ ఎలా ఏర్పడింది, రియల్ ఎస్టేట్ కుంభకోణాలు, టాబ్లాయిడ్ యుద్ధాలు మధ్య నడుస్తుంది, కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఎటువంటి మెలోడ్రామా లేకుండా ( ఘనత వహించిన మన రాంగోపాల్ వర్మ గారి మార్కు మెలోడ్రామా అసలే లేదు)  ఇందులో మిమ్మల్ని ఉత్కంఠకు గురి చేసే వేగం ఉండదు, పగలబడే హాస్యమూ లేదు, వేడెక్కించే రొమాన్సూ లేదు. అసాధారణ స్థాయి అందుకోవడానికి నేరం నుంచి బయలు దేరిన అందరినీ చివరకు  నేరమే తరముకుంటూ ఎలా వస్తుందో చూడవచ్చు. ఒక కవితాత్మక న్యాయంతో సినిమా ముగుస్తుంది. 

Bombay-Velvet

కథనం లో నిదానం భరించే ఓపిక లేకపోతే మీకు నచ్చకపోవచ్చు ఒకసారి ధియేటర్ వెళ్ళాక కూడా సినిమా మిమ్మల్ని పట్టుకునే ఉంటుంది అని డైరెక్ట‌ర్ అనురాగ్ కాశ్య‌ప్ సినిమా ఫ్లాప్ త‌రువాత అన్న మాట   ముమ్మూటికీ నిజం. జ్ఞాన్  ప్రకాష్ రాసిన ముంబై ఫాబుల్స్ పుస్తకం ఆధారంగా తీసిన ఈ సినిమా గురించి ఇలా చెప్పుకోవచ్చు.కొన్ని నవలలకు గొప్ప విజువల్ అప్పీలు ఉంటుంది. వాటిని చదువుతుంటే ఒక మంచి సినిమాలోని దృశ్యాలు ఒక దాని తరువాత ఒకటి మన కళ్ళ ముందున్నట్లు ఉంటుంది. కానీ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఏదైనా సినిమాను  చూస్తే గొప్ప శిల్పంతో అత్యంత సూక్ష్మ వర్ణనతో రాసిన నవలలోని పుటల్లా అనిపిస్తుంది. బాంబే వెల్వెట్ అలాంటి అరుదైన పుస్తకం లాంటి సినిమా.

 ఇందులో  లోపాలు లేవ‌నీ కాదు. ఉన్నాయి. ఒక శిల్పం చెక్కుకుంటూ వెళ్ళిపోయినట్లు ఉంటుంది. ఏ పాత్ర‌నీ,  ఏ స‌న్నివేశాన్నిఇంక‌నివ్వ‌దు. ప్రేమ‌, నేరం స‌హా ఏ భావాభినేశం కూడా  మ‌న‌కి ఎక్కేలోపే ఇంకో స‌న్నివేశం వ‌చ్చేస్తుంది. బ‌హుశా చాలా మందికి న‌చ్చ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మూ అదే. కానీ అదో శిల్పంలా చూస్తే న‌చ్చ‌నూ వ‌చ్చు. అస‌లు విష‌యం ఏమిటంటే సినిమాను ఆర్ట్ ఫాంగా రాసే వాళ్ళు చేసిన స‌మీక్ష‌ల‌లో  ఎవ‌రూ ఈ సినిమాను చూడ‌ద్దు అన‌లేదు. సినిమా మీద కాకుండా  సినిమా మీద త‌మకున్న అంచ‌నాల‌ను ( సిద్దాంతమూ, రెగ్యుల‌ర్ గా సినిమాల్లో ఉండ‌వ‌ల‌సిన మ‌ర్యాదా మ‌ప్పిత‌మూ) రివ్యూ చేసే  చాద‌స్తం,అజ్క్షానం మంద ఇంట‌ర్నెట్  లో పోగై  అంతా పోగై డిజాస్టర్ అంటూ సమీక్షలు రాసి చంపేశారు. ప్రేమించిన వాళ్ళు ప్రేమించుకోక పెళ్ళెందుకు చేసుకుంటారు? ఏస్ త‌ప్పు ఇది విముక్తి సిద్దాంతానికి వ్య‌తిరేకం అనుకునే చాద‌స్తం మంద కూడా సినిమా రివ్యూలు రాసేసే ఇంట‌ర్నెట్ కాలం మ‌రి. అనురాగ్ కాశ్య‌ప్ భారీ మూల్యం చెల్లించాడు. 

 అయితే కొన్ని సినిమాలకు ప్రేక్షకుల మెప్పు కోసం కాదు కానీ సినిమా మేకింగ్ స్థాయిని పెంచడానికి తరువాత కాలంలో ఉపకరిస్తాయి. వక్త్ సినిమా ( గురుదత్) విడుదలై యాభై సంవత్సరాల పై మాటే. అది కూడా ఆ  రోజు ప్రేక్షకులకు నచ్చలేదు.కానీ సినిమా మీద ఇష్టం ఉన్న సినిమా వాళ్ళని అడగండి వక్త్ సినిమా మాకు ప్రాణం అని చెప్పకుండా ఉండరు. ( దేశమంతా అభిమానించే మణిరత్నంకు వక్త్ సినిమా అంటే చాలా అభిమానం, దాన్నుంచి చాలా  నేర్చుకున్నా అని  చాలా సార్లు చెప్పాడు).

 కాశ్య‌ప్ గురువు వ‌ర్మ అయితే కాసింత అసూయ ప‌డ్డ‌ట్లు ఉన్నాడు. నా సినిమా ప్రేక్ష‌కుల‌కు  న‌చ్చ‌క‌పోయినా ప‌ర్లేదు కానీ అది నా ఫేవ‌రెట్ సినిమా అన్న శిష్యుడిని ట్విట్ట‌ర్ లో మంద‌లించాడు. అహంకారానికి, ఆత్మ విశ్వాసానికీ తేడా ఉంటుంది అని ట్వీటాడు. అంతకు ముందు చాలా సార్లు వ‌ర్మే నా సినిమాలు ఎవ‌రైనా న‌చ్చితే చూడండి లేకుంటే లేదు అన్న‌ట్లు గుర్తు. ఇపుడు హ‌టాత్తుగా ఆయ‌న‌కు విన‌యం గుర్తుకు వ‌చ్చిందంటే అది కితాబే అనే అనుకోవాలి. 

ఇంకా సరిగ్గా చెప్పాలంటే చాలా సార్లు గొప్ప ప్రేమకథలు విషాదాంతాలౌతాయి. బాంబే వెల్వెట్ కూడా అంతే. సినిమా కళతో దర్శకుడి కున్న ప్రేమే ఈ సినిమా అయితే   అది బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. విఫల ప్రేమకథలు కూడా అజరామరాలు, ఈ సినిమా కూడా అంతే..

*

 

మీ మాటలు

 1. చక్కటి రివ్యూ – చదివాక ఇవాళే చూడాలని డిసైడు అయ్యాను.

 2. vasavi pydi says:

  కొన్ని సినిమాలు మాత్రమే పూర్తిగా దర్శకుడి సినిమాలు హిట్, ఫ్లాప్ అని కాకుండా చూడాలి ఈ సినిమా ఆ కోవకు చెందుతుంది

 3. చాలా బాగుందండి మీ రివ్యూ. అంత మంచి సినిమా గురించి ఒక్కటంటే ఒక్క మంచి రివ్యూ చదవలేదు. మీ రివ్యూ చదివాక కొంచం సంతోషం అనిపించింది. నాకు ఈ మద్య కాలంలో బాగా నచ్చిన సినిమాలలో ఇదొకటి.

 4. Nisheedhi says:

  ప్రేమించిన వాళ్ళు ప్రేమించుకోక పెళ్ళెందుకు చేసుకుంటారు? ఏస్ త‌ప్పు ఇది విముక్తి సిద్దాంతానికి వ్య‌తిరేకం అనుకునే చాద‌స్తం మంద కూడా సినిమా రివ్యూలు రాసేసే ఇంట‌ర్నెట్ కాలం మ‌రి. Ha ha you nailed both readers and writers single handedly . kudos

 5. vageesan says:

  సినిమా చూసేటట్టు చేస్తున్నది మీ రివ్యూ.గొప్ప కవితాత్మక అభివ్యక్తి కనిపించింది.

 6. మీ రివ్యూ చాలాబాగుంది – ఈ మాట నాకే చప్పగా అనిపిస్తోంది, ఇంకా గొప్పగా చెప్పాలని ఉంది కానీ ఎలా చెప్పాలో నాకున్న పరిజ్ఞానం సరిపోవట్లేదు.

  “సినిమా కళతో దర్శకుడి కున్న ప్రేమే ఈ సినిమా అయితే అది బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. విఫల ప్రేమకథలు కూడా అజరామరాలు, ఈ సినిమా కూడా అంతే..”
  అర్జంటుగా చూసేయ్యాలి ఈ సినిమా !

 7. ఒక చిక్కటి కవితను ఇంకించుకున్నట్టు ఉంది. వెంటనే చూసేయ్యాలి.
  “చాదస్తం మంద”…. ఒక్క ముక్కలో చెప్పేశారు :)

 8. M.A.Khadeer says:

  వక్త్ సినిమా(గురుడుత్ట్)?. నీద్స్ ఎక్ష్ప్లనతిఒన్.

 9. వ‌క్త్ సినిమా విష‌యంలో యధాలాప‌మైన త‌ప్పు దొర్లింది. వెబ్ సైట్ నిర్వాహ‌కుల‌కు కూడా ఆ విష‌యం తెలుసు. దాని వ‌ల్ల ఎవ‌రి మ‌నో భావాలేమ‌న్నా తీవ్రంగా దెబ్బ‌తిని ఉంటే క్ష‌మించ‌గ‌ల‌రు.

 10. M.A.Khadeer says:

  first accept my apology for not framing the question properly.were you referring to pyasa of gurudutt?

 11. నా ఉద్దేశం అయితే ప్యాసా సినిమానే

 12. అలానే కాగజ్ కె ఫూల్ కూడా

 13. మీ రివ్యు సినేమాకు తగ్గట్టుగా గొప్పగా ఉంది. మీరు రివ్యు చదివి నిన్న సినేమాకి వెళ్ళాను. సినేమా చాలా బాగుంది

 14. if that is so, then i am honored. certain films need to be respected beyond viewers expectations. And i tried to do some justice for the film and the director. Watching the film is giving respect

  • ఈ సినేమా లోని ప్రతి సీన్ పేపర్లో రోజు మనం చదివే వార్తలలో ఉంట్టుంది. రాజకీయ నాయకులంటే స్కాములు చేయటం,భూములు ఆక్రమించుకోవటం, పోలిసులు దౌర్జన్యాలు చేయటం,లాయర్లు అవినీతి పరులను రక్షించటం, మాఫియా వాళ్ళు యన్ కౌంటర్లో చనిపోవటం,వీళ్లంతా కలసి మెలసి పనిచేసి అతితక్కువ కాలంలో సంపన్నులుగా కావటం ఇవ్వన్ని నేడు సర్వ సాధారణ అంశాలు అయిపోయాయి.

   హింసాత్మకమైన ఈవార్తలను ప్రజలు రోజు పేపర్,టివి ద్వారా మందుల డోసు తీసుకొన్నట్లు తీసుకోవటం అలవాటైపోయింది. ఆ వార్తలపేజిలను తిప్పుతాం. అక్రమసంపాదనను ఎవరు ఎలా ఉపయొగించుకొంట్టున్నారు అని విశ్లేషణ చేయటానికి ఈనాటి ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పించి ఎమోష్నల్ గా ఫీలు కావటంలేదు. నేటి ప్రజలు మీడీయా ద్వార హింసను ఎంతగా ఆస్వాదిస్తున్నారంటే, హింసను హింసగా గుర్తించటం కూడా మరచిపోయేదశకొచ్చేశాం.

   అనురాగ్ కశ్యప్ 1960-1970 ల కథ అయినా, నేటి ప్రజల మానసిక కోణం నుంచి ఆలోచించి తీశాడనిపించింది.
   గులాల్ సినేమాలో కొన్ని ఎమోషనల్ దృశ్యాలు ఉన్నాయేమోగాని, ఈసినేమా దానిని అతిక్రమించి పోయింది. నాటకం, సినేమా నవరసాల పై ఆధారపడిన ఆర్ట్. ఉన్నది ఉన్నట్లు గా పేపర్లో వార్తలా సినేమాను తీయటం ఎంతో కష్టం. అనురాగ్ కశ్యప్ దానిని సాధించాడు. రాంగోపాల్ వర్మ ను సునాయసంగా దాటి పోయాడు. రాంగోపాల్ వర్మ అనురాగ్ కశ్యప్ వంటి వ్యక్తిని తొలినాళ్లలో ప్రోత్సహించినందుకు గర్వించవచ్చు.

   ఈ సినేమా అన్ని ప్రముఖ మాల్స్ లో తీసేశారు. ఒకే ఒక్క చోట ఆఖరు షో ఉంటే వెళ్లి చూశాం.

  • ఈ సినేమా సారం అనురాగ్ కశ్యప్ కంబట్టా పాత్ర ద్వారా ఒక చోట చెప్పిస్తాడు. రణ్ వీర్, అతని స్నేహితడు ఇద్దరు పాకిస్థాన్ నుంచి బాంబే కి వచ్చామని చెప్తారు. అక్కడినుంచి మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు? అని వివరిస్తూ, కంబట్టా ముస్లింలు కావాలని కోరుకొంటే, అవసరమైతే పాకిస్థాన్ దేశం ఏర్పడలేదు. జిన్నా ప్రధాని కావాలనుకొన్నాడు కనుక పాకిస్థాన్ ఏర్పడిందంటాడు.

   అదే భావాన్ని మాటలతో కాకుండా ఇంకొకసారి దృశ్య రూపంలో చెపుతాడు. దానిని చాలా మంది గమనించరు. ఎంతో పరిశీలనతో చూస్తే తప్ప. దానిని గుర్తించి మీ రివ్యులో మాటలలో పెట్టారు “నవ్వులో మర్మం మీకు అర్ధం అయితే ఈ సినిమా అర్ధమైనట్లే”

   అందువల్ల మీరివ్యును సినేమాకు తగ్గట్టుగా గొప్పగా ఉందని రాశాను.

 15. Regupandu says:

  RGV cheppindhi thappugaa ardham chesukunnaaru. Audience reject chesinaa.. ‘naa cinema superb’ ani cheppukovadam nonsensical annaadu. RGV inthavaraku eppudu koodaa ‘naa cinema fantastic’ ani statements ivvaledhu. alaa icchukunevaade aithe, thana range pogaru ki ‘AAG cinema oka aaNimuthyam’ ani swayamdappu kottukokundaa.. ‘endhuku flop ayyindhi?’ ani thane sweeya viSleshaNa cheskunnaadu thana blog lo. vishayam meeku koodaa thelise vuntundhi. nijaaniki hits ni koodaa thana account lo vesukokundaa ‘avi just by chance’ ani cheppukuntaadu.

  ‘isthamunte choodandi, lekapothe ledhu’ ani cheppadaaniki, audience icchina decision ki sambandham lekundaa ‘naa cinema goppa kaLaakhandam’ ani cheppukodaaniki vunna thedaa theluskuntaarane aaSa!

 16. Thirupalu says:

  అవును, అవసరం సృజనకు తల్లి వంటిది. తనకు కావాలిసినపుడు లావల్సినది సృష్టించు కో గలదు.
  బాగుంది.

 17. Thirupalu says:

  సారీ! కామెంట్ పెట్టాల్సిన చోటు మారి పోయింది.

మీ మాటలు

*