లే!

వర్చస్వి

 

 

ఎందుకా దిగులు?

సంద్రపు వాలుగాలి నీకోసం మంద్రంగా

వీస్తూ వచ్చి నీ భుజం తడుతుంటే!

 

ఎందుకా క్షోభ?

నీ వెతల్ని కరిగిస్తూ వెన్నెల శీతల

శీకరాలు నీ తల నిమురుతుంటే!

 

బేల చూపులిక దులుపు మరి-

పచ్చిక నిన్ను మచ్చిక చేసుకుంటూ

తన పచ్చని వొళ్ళో జోల పాడుతోందిగా!

 

కంట ఆ వెచ్చని తడి తుడిచేయ్-

పచ్చని  పంట చేను తన పమిటతో

అద్ది ఓదారుస్తానంటోందిగా!

 

లేచి నిలబడి అడుగేయ్-

అడుగడుగూ దుమ్మురేగేలా

జయమ్ము తథ్యమ్ము అంటోందిగా అమ్మ ధాత్రి!

 

అయిదు వేళ్లూ బిగించు-

రెప్పవాల్చకుండా చూస్తోందిగా

ఆ కొండ నీ పిడికిట్లో పిండి పిండి కావాలని!

 

శుభాన్ని నిబ్బరంగా శ్వాసించు మరి-

ఆ వెర్రిగాలి నీ ఊపిరిలో

లయగా ఊగాలని తబ్బిబ్బవుతోందిగా!

*

varchasvi

 

మీ మాటలు

  1. “ఆ కొండ నీ పిడికిట్లో పిండి పిండి కావాలని!”
    కవిత బావుంది వర్చస్వి గారు.

    • varchaswi says:

      కవిత నచ్చినందుకు ధన్యవాదాలు ఎమెస్కే గారూ!

  2. vasavi pydi says:

    గుప్పెడు అక్షరాలు పిడికెడు గుండెకి గంపెడు విశ్వాసం అందిచ్చిందిచాల బాగుంది

    • varchaswi says:

      ధన్యవాదాలు వాసవి గారు! మీ చిటికెడు అక్షరాలు కూడా నాకు గంపెడు బలాన్నిచ్చింది సుమా!

Leave a Reply to varchaswi Cancel reply

*