“ఓకే బంగారం” Casual Sex నే ప్రచారం చేస్తోందా?

వినోద్ అనంతోజు 

 

vinod  పోయిన వారం సారంగలో నేను రాసిన “ఇది బంగారం కాదు కాకి బంగారం” వ్యాసం వచ్చింది. ఓకే బంగారం సినిమా ప్రచారం చేసే హానికరమైన భావజాలాన్ని విమర్శిస్తూ రాసిన వ్యాసం అది. దానికి స్పందనగా పాఠకులు కొంతమంది సమర్థిస్తూ రాశారు. కొందరు విమర్శిస్తూ రాశారు. విమర్శలలో కొన్ని ముఖ్యమైన వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

 

వ్యక్తిగత అభిప్రాయాలు ఎక్కడిదాకా?

(Q1) “ఒకే బంగారం” సినిమా ద్వారా మణిరత్నం ఆయన అభిప్రాయాలని పంచుకున్నాడు. ఆయనేమి సమాజాన్ని ఉద్ధరించడానికి సినిమా తీయలేదు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని విమర్శించే హక్కు మీకు ఎక్కడ ఉంది?

(జ) ఏ మనిషికైనా తనకు పరిచయం ఉన్న ప్రతి విషయం మీద ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. తన వ్యక్తిగత జీవితం గురించీ, సామాజికమైన విషయాల గురించీ ఏవో అభిప్రాయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సుబ్బారావు కి బాగా డబ్బులున్నాయి అనుకుందాం. ఆయన లంచం ఇస్తే పనులు త్వరగా జరుగుతాయి. సుబ్బారావుకి లంచగొండితనం ఉండటం చాలా సుఖంగా, సౌకర్యవంతంగా అనిపించవచ్చు. అది అతని వ్యక్తిగత అభిప్రాయం. అలాగని అతను లంచగొండితనం మంచిదనీ, పెరగాలనీ సినిమాల ద్వారానూ, నాటకాల ద్వారానూ ప్రచారం చేస్తానంటే కుదురుతుందా? వ్యక్తిగత స్థాయిలో అభిప్రాయాలు ఎలా ఉన్నా పెద్ద పట్టింపు ఉండదు. సామాజికమైన విషయాల గురించి తప్పుడు అభిప్రాయాలు ప్రచారం చెయ్యాలనుకుంటే విమర్శలు తప్పకుండా ఎదురవుతాయి.

 

(Q2) ఇది మంచి ఇది చెడు అని ఎలా generalize చేస్తారు? ఒక్కొక్కరికీ ఒక్కో విషయం మంచిగా అనిపించవచ్చు. ఇంకొకళ్ళకి అదే విషయం చెడుగా అనిపించవచ్చు. మీకు సినిమా చెడుగా అనిపించినంత మాత్రాన అది చెడ్డదైపోతుందా? మీ అభిప్రాయాలు పక్కవారి మీద రుద్దకూడదు.

(జ) ఇది కూడా పై ప్రశ్నలాంటిదే. వ్యక్తులకి మంచి “అనిపించడం” – “అనిపించకపోవడం” మీద సామాజిక విషయాలు ఆధారపడవు. అప్పారావుకి ఈవ్ టీజింగ్ సరదాగా, ఆనందంగా, మంచిగా “అనిపించవచ్చు”. కానీ అది అవతలి అమ్మాయి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఆమె హక్కుల్ని ఒక రకంగా హరించివేస్తుంది. కాబట్టి ఈవ్ టీజింగ్ చెడు. మంచి “అనిపించడం” – “అనిపించకపోవడం” అనే లెక్క వ్యక్తిగత విషయాలలో పనికివస్తుందేమో గానీ సామాజిక విషయాలలో కాదు. సామాజిక విషయాలలో మంచి చెడులు నిర్ణయించడానికి వేరే సూత్రం కావాలి.

“ప్రతి మనిషికీ సమానమైన హక్కులు – సమానమైన బాధ్యతలు.” ఈ సూత్రం అందరు మనుషులకు అన్ని కోణాల్లోనూ సమానత్వాన్ని ఇస్తుంది. సమాజం ఆ “సమానత్వ” స్థితికి చేరినప్పుడు అందులో ఆర్ధిక అసమానతలు ఉండవు, స్త్రీ పురుష సంబంధాల్లో అసమానతలు ఉండవు, జాతి కుల మత వివక్షలు లాంటి ఏ ఇతర అసమానతలు ఉండవు. సమాజాన్ని అటువంటి స్థితి వైపుకి నడిపించే ఏ మార్పు అయినా, ఏ భావజాలం అయినా అది మంచే ! అసమానతలని పెంపొందించేది ఏదయినా అది చెడే ! ఈ సినిమా ప్రచారం చేసిన Casual Sex Relationships / Free Love concepts స్త్రీ పురుష సంబంధాల్లో అసమానతల్ని పెంచుతాయి. అందువల్ల అది చెడు.

“మానవులందరూ సమానంగా ఉండాలి” (సర్వ మానవ సమానత్వం) అనే దాన్ని మీరు ఒప్పుకోకపోతే ఈ వ్యాసం చదవడం ఇక్కడితో ఆపేయండి. ముందు ముందు చెప్పబోయేవి మీకు ఉపయోగపడవు.

bangar2

 

(Q) ఏ స్త్రీ పురుషులు సంబంధంలో ఉండాలో అది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛ. దానికి ఎవరూ పరిమితులు విధించడానికి వీలు లేదు.

(జ) ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి సంబంధంలో ఉంటారు అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ. నిజమే. ఇది స్త్రీ పురుషులకి మాత్రమే కాదు. Trans genders, Lesbians, Gays, Bisexuals (LGBT) అందరికీ ఉన్న స్వేచ్ఛ. కానీ ఆ స్వేచ్ఛకి కొన్ని పరిమితులు ఉంటాయి. స్త్రీ పురుష సంబంధాల్లో వారి స్వేచ్ఛ ఎక్కడి దాకా అంటే సామాజిక సమస్యలు సృష్టించనంత దాకా.

ఉదాహరణకి: స్త్రీ కి తన శరీరం మీద పూర్తి స్వేచ్ఛ ఉంది. తను గర్భం ధరించాలో లేదో నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఉంది. ఇష్టంలేకపోతే గర్భాన్ని అబార్షన్ చేయించుకునే హక్కు కూడా స్త్రీకి ఉంది. అలాగని కడుపులో ఉన్నది ఆడబిడ్డో, మగబిడ్డో తెలుసుకుని, ఆడబిడ్డ కాబట్టి అబార్షన్ చేయించుకునే హక్కు ఎవరికీ లేదు. చాలా సందర్భాలలో భ్రూణహత్యలు చేయించుకునే కుటుంబాలలో ఆడవాళ్లే భ్రూణహత్యలని సమర్థిస్తూ మాట్లాడుతుంటారు. ఇక్కడ కూడా ఇలాంటి వాదన చెయ్యవచ్చు “నాకు ఆడపిల్లని కనాలో మగపిల్లాడిని కనాలో నిర్ణయించుకునే హక్కు లేదా? నా శరీరం మీద వేరొకరు పరిమితులు విధించడం ఏమిటి?”

ఆ వాదన ఇక్కడ చెల్లదు. ఎందుకంటే ఆ హక్కు ఉంటే పోను పోను జనాభాలో ఆడపిల్లల సంఖ్య తక్కువ అయ్యి అదొక సామాజిక సమస్య అయ్యి కూచుంటుంది.

కాబట్టి వ్యక్తిగత స్వేచ్ఛలకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు కూడా పాత సామాజిక సమస్యలు పోవడానికి, కొత్తవీ పుట్టుకురాకుండా ఉండటానికి ఉంటాయి. స్త్రీ పురుష సంబంధాలలో పరిమితులు లేని స్వేచ్ఛ కలిగించే సామజిక సమస్యలేంటో తరవాత చూస్తాం.

స్త్రీ పురుష సంబంధాలు సామాజిక విషయాలా?

(ప్ర) స్త్రీ పురుష సంబంధాలు సామాజిక విషయాలు అంటారేంటి? నేను, నా భార్య. మా ఇద్దరి మధ్య సంబంధం మా వ్యక్తిగతం కాదా?

(జ) బయట “కుటుంబం అనేది వ్యక్తుల వ్యక్తిగత విషయం” అని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవానికి స్త్రీ పురుష సంబంధాల్లో జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఒక్కటి తప్ప మిగతావి అన్నీ సామాజికమైన విషయాలే. శారీరక సంబంధాన్ని మాత్రమే స్త్రీ పురుష సంబంధంగా అర్థం చేసుకోవడం వల్ల ఈ గందరగోళం వస్తుంది. స్త్రీ పురుష సంబంధాల్లో శారీరక సంబంధంతో పాటు ఇంకా అనేక ముఖ్యమైన విషయాలున్నాయి.

          మీ భార్య ఇంటిపట్టునే ఉంటూ మీకు, మీ పిల్లలకూ సపర్యలు చేస్తూ, మీరు బయట ఉద్యోగాలు చేసుకోవడానికి తోడ్పడుతున్నారు అనుకుంటే, ఆవిడ చేసే శ్రమ అంతా సామాజికమైనదే. ఒక వ్యక్తి తన భార్యని తిట్టినా, కొట్టినా, వరకట్నం పేరుతో హింసించినా అవన్నీ సామాజికమైన విషయాలే. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి చేసే పునరుత్పత్తి (Reproduction), పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ ఇవన్నీ సామాజిక విషయాలే.

 

(ప్ర) ప్రస్తుత పెళ్లి వ్యవస్థలో బోలెడు లోపాలున్నాయి. ఆస్తులు, భూములు, బంగారం పేరుతో జంటలకి బలవంతంగా పెళ్ళిళ్ళు చెయ్యట్లేదా? అక్కడ మాత్రం ముందు శోభనం జరిగి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదా?

(జ) ఈ లోపాలన్నిటి గురించి నేను నా వ్యాసంలో చాలా స్పష్టంగా రాసాను. “ప్రస్తుతం అమలు లో ఉన్న “పెళ్లి” వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. అది ఆడా మగల మధ్య అసమానతలు పెంచేదిగా ఉంది. పైగా వ్యక్తుల ఇష్టాయిష్టాల కంటే డబ్బు, ఆస్తి, కులం, మతాలే “పెళ్లి”లో ఎక్కువ పాత్ర పోషిస్తున్నాయి. నిజమే. ఈ కారణాల చేత పెళ్లిని వ్యతిరేకించవచ్చు.” అని రాసాను. దీని అర్థం ఏమిటి?

అంతే కాకుండా “ఒక ఆడ మగా ఎటువంటి ప్రలొభాలూ (ఆస్తి, కులం, మతం…) లేకుండా, పూర్తి వివేచనతో, ఇష్టపూర్వకంగా ఒకరినొకరు జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం, వారితోనే కలిసి ఉండటం సరైన సంబంధం అవుతుంది.” అని రాసాను. దాని అర్థం ప్రస్తుతం ఉన్న “పెళ్లి” సంబంధాలు సరైనవిగా లేవని చాలా స్పష్టంగా చెప్పినట్టు కాదా? పైగా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి పెళ్లి అనే కార్యక్రమం అవసరమే లేదన్నాను.

          ఇంత సూటిగా రాసిన తరవాత కూడా “పెళ్ళిలో లోపాలున్నాయి కదా?” అని నన్ను ప్రశ్నిస్తారు ఏమిటి? ఇప్పుడున్న పెళ్లి వ్యవస్థే సర్వ శ్రేష్టమైనది అని డబ్బా కొట్టేవాళ్ళని ఎవరినైనా అడగండి ఈ ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళని ఏమనాలి? వీళ్ళకి తెలుగు చదవడం రాదా? లేక కింద పేరా చదివేటప్పుడు పైన పేరా లో చదివింది మర్చిపోతారా??

ఒకే బంగారం Casual Sex నే ప్రచారం చేస్తోందా?

(ప్ర) ఎంతసేపూ సెక్స్.. సెక్స్.. అంటారేమిటి? మణిరత్నం చూపించింది Unconditional Love. మీకు అందులో ప్రేమ కనపడకపోవడం మీ తప్పు.

(జ) సినిమా కథని ఒకసారి క్లుప్తంగా చూడండి. ఆది తారాలు పరిచయమైన నాలుగు రోజులకో శారీరికంగా కలిసారు. “ఆరు నెలల తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. ఈ ఆరు నెలలు కలిసుందాం. ఆ తరవాత ఎవరి లైఫ్ వాళ్లది” అని ఒప్పందం చేసుకుని కలిసుండటం మొదలు పెట్టారు. [అంటే ఆ 6 నెలల వరకే ఒకరితో ఒకరికి సంబంధం. ఆ తరవాత ఆది ఇంకొక అమ్మాయితో ఇలాంటి relationship మొదలుపెట్టినా తారాకి ఏమీ సంబంధం ఉండదు. అలాగే తారా చేసినా ఆదికి సంబంధం ఉండదు. ఇది Casual Sex / Free Love స్వభావం. ఇందులో ప్రేమ ఉండదు. ఆకర్షణ మాత్రమే ఉంటుంది.] ఈ ఆరు నెలలలో ఒకరికొకరు మానసికంగా దగ్గరయ్యారు. గణపతి తన భార్య మీద చూపించే ప్రేమ చూసి పరివర్తన చెంది పెళ్లి చేసుకున్నారు. ఇది కథ.

          ఈ సినిమాలో అధిక భాగం ప్రేమ అనే ముసుగులో Casual Sex / Free Love ని ప్రమోట్ చెయ్యడం జరిగింది. అలా చెయ్యలేదు అని మీకు అనిపిస్తే, పోనీ Casual Sex ని సినిమాలో వ్యతిరేకించిన సన్నివేశాలు ఏమున్నాయి? చివరలో పెళ్లి తప్ప ఒక్క సన్నివేశం కూడా లేదు. ఆ పెళ్లి కూడా వ్యతిరేకించడం కాదు. ఎందుకంటే, వ్యతిరేకించాల్సిన భావాలు ఉన్న ఆది, తారాలను సినిమా అంతా హైలైట్ చేసుకుంటూ వచ్చి, చివరికి వాళ్ళిద్దరి కథకు పెళ్లి పేరుతో సుఖాంతం చెయ్యడం వ్యతిరేకించడం అవ్వదు సమర్థించడం అవుతుంది.

నేను ఇంతకు ముందు వ్యాసంలో రాసినట్టు ఈ సినిమా “ప్రేమకీ మోహానికి మధ్య తేడా లేకుండా చేస్తోంది. చూసేవాళ్ళ మెదళ్లని గందరగోళ పరుస్తోంది. ఇప్పటికీ మీకు సినిమాలో “Casual Sex” అసలు కనపడకుండా మొత్తం ప్రేమే కనపడుతూంటే మీరు కూడా ఆ గందరగోళంలో ఉన్నట్టే.

 

(ప్ర) మణిరత్నం యువతని బాగు చెయ్యడానికి సినిమా తీయలేదు. ప్రస్తుతం ఉన్న యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేసారు అని ఎందుకు అనుకోకూడదు?

(జ) ప్రతి దర్శకుడు తన సినిమా ద్వారా ఏవో కొన్ని అభిప్రాయాలు సమాజంతో పంచుకోవాలి అనుకుంటాడు. కొన్ని సార్లు పంచుకోవాలి అని ఉద్దేశం లేకపోయినా తనకి తెలియకుండానే ఏవో కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తాడు.

మొన్నామధ్య చూసిన ఒక తెలుగు సినిమాలో హీరో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసే మగవాళ్ళని అందరినీ వరసగా పెట్రోల్ పోసి తగలపెడుతూ ఉంటాడు. దర్శకుడు హీరో ద్వారా ఆడవాళ్ళని Sex Objects లాగా చూడటం తప్పు అని సందేశం కూడా ఇప్పించాడు. కానీ అదే సినిమాలో హీరోయిన్లతో విపరీతమైన exposing చేయించాడు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? కథ చెప్పడంలో దర్శకుడి ఉద్దేశం మంచిదే అయిఉండవచ్చు. కాని అతనికి తెలియకుండానే అతని అభిప్రాయాలు సినిమాలో కనపడిపోయాయి. లేదా తెలిసే సినిమా commercial benefits కోసం అలా చేసి ఉండొచ్చు.

మణిరత్నం ఉద్దేశం నిజంగా ప్రస్తుత యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో చూపించడం మాత్రమే అయి ఉండవచ్చు. కాని ఆయనకి తెలియకుండానే Casual Sex లాంటి దాన్ని సమర్థించాడు. లేదా తెలిసే అది పెద్ద వ్యతిరేకించాల్సిన విషయం కాదని అనుకుని వదిలేసి ఉండవచ్చు.

 

Casual Sex అంటే ఏమిటి?

(ప్ర) మీ ఫేస్బుక్ పోస్ట్ కింద కామెంట్స్ అన్నీ చదివాను. Casual Sex గురించి ఎక్కువ వాదన జరుగుతోంది. అసలు Casual Sex అంటే ఏమిటి?

(జ) పెద్దగా పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు ఎటువంటి కమిట్‌మెంట్లు లేకుండా, సెక్స్ కోరికలు తీర్చుకోవడాన్ని Casual Sex అంటారు. దీనికే Free Love అనీ, Open Relationships, Hookup culture అనీ రకరకాల పేర్లున్నాయి. చిట్టిపొట్టి తేడాలతో అన్నీ ఒకటే. దీంట్లో ప్రేమ లాంటిది ఏది ఉండదు. కలిసి ఉండాలి, బాధ్యతలు పంచుకోవాలి లాంటి కమిట్‌మెంట్లు ఉండవు. ఆకర్షణ, మోజు ఉన్నంత కాలం కలిసి ఉంటారు. మోజు తీరిపోగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ కలిసి ఉండటం ఒక రోజు కావొచ్చు, ఒక నెల కావొచ్చు, ఆరు నెలలు కావొచ్చు, ఒక్క రాత్రే కూడా కావొచ్చు. ఇలా ఎంత మందితో అయినా Casualగా Sex చేసుకోవచ్చు. ఈ రకం స్త్రీ పురుష సంబంధాలు అమెరికా లాంటి దేశాలలో 1960లలో బాగా ప్రచారంలోకి వచ్చి ఇప్పుడు అక్కడ బాగా స్థిరపడిపోయాయి. అక్కడి ఆడా మగా ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా, ఇష్టపూర్వకంగా దీన్ని అందిపుచ్చుకున్నారు. ఈ Free Love Culture ని సమర్థించే వారు ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానమైన స్వేచ్ఛ ఇస్తుందనీ, ఎవరి ఇష్టప్రకారం వారు ఉండవచ్చనీ, పెళ్లి పేరుతో ఒకరు ఇంకొకరికి దాస్యం చెయ్యాల్సిన అన్యాయం ఈ పద్ధతిలో ఉండదనీ చెప్తారు. మన దేశంలోకి ఇప్పుడిప్పుడే సినిమాల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, ప్రింట్ మీడియా ద్వార దిగుమతి అవుతోంది.

 

Casual Sex / Free Love Culture కి స్త్రీ పురుష అసమానతలకి సంబంధం ఏమిటి?

 

ఇంతకు ముందు చెప్పినట్టు స్త్రీ పురుష సంబంధాలు అనగానే శారీరక సంబంధం మాత్రమే కాదు. శారీరక సంబంధంతో పాటు ఇంట్లో శ్రమ విభజన, పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ ఇవన్నీ కూడా స్త్రీ పురుష సంబంధాలలో భాగాలే. కాకపొతే మిగతా విషయాలన్నీ ఒక రకం, శారీరక సంబంధం (పునరుత్పత్తి, Reproduction) ఒక రకం. పునరుత్పత్తి కార్యక్రమం వల్ల ఒక కొత్త ప్రాణి భూమి మీదకి వస్తుంది. పుట్టే ప్రతి బిడ్డకు కొన్ని హక్కులు ఉంటాయి. అది మనం ఎప్పుడూ మరవకూడని విషయం.

          పునరుత్పత్తి కార్యక్రమం వ్యక్తుల వ్యక్తిగత విషయంగా కనిపిస్తున్నప్పటికీ, మనుషుల పునరుత్పత్తి సంబంధాలు (Sexual Relationships) ఎలా ఉన్నాయి అనేది సామాజికమైన విషయం. దీని ప్రభావం అనేక ఇతర సామాజిక విషయాల మీద ప్రత్యక్షంగా పడుతుంది. జనాభా పెరుగుదల –తరుగుదల, Women Literacy, Women employment, లైంగిక వ్యాధులు (Sexually Transmitted Diseases), స్త్రీలు ఏ వయసులో గర్భవతులు అవుతున్నారు, పుట్టే పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం వంటి అంశాలన్నిటి మీదా ఇది ప్రభావం చూపిస్తుంది. సమాజంలోని పేదరికం, Crime Rate వంటి వాటి మీద పరోక్ష ప్రభావం ఉంటుంది.

          పిల్లల్ని కనే సామర్ధ్యం ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. అది ప్రకృతి సహజమైన లక్షణం. జంతువులలో పిల్లల్ని కన్న తరవాత తల్లే తన పిల్లలని సంరక్షించి పెంచుతుంది. జంతు సమాజాలలో Biological Father ఉంటాడేమో గానీ, పిల్లల వైపు నుంచి “తండ్రి” అనే సంబంధం ఉండదు. మానవ సమాజంలో అలా కాదు. పిల్లల్ని తల్లి తండ్రులు ఇద్దరూ కలిసి పెంచుతారు. “తండ్రి” అనే సంబంధం మానవ సమాజపు ప్రత్యేక లక్షణం. 

మానవ సమాజంలో తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పిల్లల్ని సంరక్షిస్తూ పెంచుతారు, ఆ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఆ తల్లిదండ్రులని వృద్ధాప్యంలో సంరక్షిస్తారు. “వృద్ధుల సంరక్షణ” కూడా మానవ సమాజపు ప్రత్యేక లక్షణం. జంతువులలో ఇది ఉండదు.

పైన చెప్పిన రెండు లక్షణాలని వదిలెయ్యడం అంటే దాని అర్థం మానవత్వం నుంచి తిరిగి జంతుత్వం వైపుకి ప్రయాణం చెయ్యడమే.

 

Casual Sex / Free Love లో ఏం జరుగుతుంది? ఆడ మగా ఇద్దరూ సెక్స్ వాంఛలు తీర్చుకోవడానికి తాత్కాలికంగా సంబంధాలు పెట్టుకుంటారు. ఒక స్త్రీ వైపు నుంచి చూస్తే, ఆవిడ ఇవ్వాళ ఒకడితో సంబంధంలో ఉంటే, రేపు ఇంకొకడితో, ఎల్లుండి ఇంకొకడితో సంబంధంలో ఉండవచ్చు. కొన్ని నెలల తరవాత ఆవిడ గర్భవతి అయితే, ఆ గర్భం ఎవరివల్ల వచ్చిందో తను అయినా గుర్తించే స్థితిలో ఉంటుందా? ఉండదు. ఒకవేళ గుర్తించినా ఆ ఫలానా మగవాడు ఆ పుట్టబోయే బిడ్డ తండ్రిగా ఉండటానికి ఒప్పుకుంటాడా? సాధారణంగా ఒప్పుకోడు.  “నేనే తండ్రిని అని గ్యారంటీ ఏంటి?” అని అడుగుతాడు. ఏ DNA పరీక్షలో చేయించి నిరూపించినా “హేయ్… అప్పుడేదో ఇద్దరికీ నచ్చి Casual గా సెక్స్ చేసుకున్నాం. Pills సరిగా వాడకపోవడం నీ తప్పు. Abortion చేయించుకోకపోవడం నీ తప్పు.” అని తప్పించుకునే ఆస్కారం మగవాడికి ఎప్పుడూ ఉంటుంది. అంతిమంగా ఆ బిడ్డ బాధ్యత అంతా ఆ బిడ్డ కన్న తల్లిది “మాత్రమే” అవుతుంది.

          ఈ Casual Sex / Free Love బాగా వ్యాప్తి చెందడం అంతే మగవాడికి భూమ్మీద “స్వర్గం” తయారయినట్టే. ఇప్పుడయితే ఆడవాళ్ళు కమిట్‌మెంట్ లేకుండా శారీరక సంబంధానికి ఒప్పుకోరు. సెక్స్ కోసం వాళ్లకి మాయమాటలు చెప్పి మోసగాడు అని చెడ్డపేరు మొయ్యాలి. లేదా వేశ్యల దగ్గరికి వెళ్లి తిరుగుబోతు అనిపించుకోవాలి. [ఇందులో వేశ్యల తప్పు ఏమీ లేదు. అది పూర్తిగా మగవాడి తప్పు]. Free Love culture మగవాడికి ఈ “ఇబ్బందులు” లేకుండా స్త్రీలే తమంతట తాముగా “ఇష్టపూర్వకంగా” మగవాళ్ళకి లొంగిపోయేలా చేస్తుంది. మగవాళ్ళు కావలసినంత మంది స్త్రీలతో సెక్స్ పొందవచ్చు. ఒక్క స్త్రీ కూడా పెళ్లి చేసుకోమని అడగదు. గర్భం వస్తే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా మగవాడికి ఉండదు. అవన్నీ స్త్రీల తలనొప్పులు! చివరికి ఇది ఎటు దారి తీస్తుంది అంటే సెక్స్ కోరికలు తీర్చుకునే “హక్కు” ఇద్దరిదీ. దాని వల్ల వచ్చే పిల్లల బాధ్యత మాత్రం స్త్రీలది. అంటే ఈ రకం సంబంధాలు స్త్రీల మీద ఇంతకు ముందు కంటే ఎక్కువ భారాన్ని పెంచి పురుషులకి ఇంతకు ముందుకన్నా స్వేచ్ఛని పెంచుతాయి.

          స్త్రీ పురుష సంబంధాలు సరైనవి అవ్వాలంటే ఆ సంబంధాలో ఉన్న ఆడ మగా ఇద్దరికీ “సమానమైన హక్కులు, సమానమైన బాధ్యతలు” ఉండాలి. అప్పుడే అది ఇరుపక్షాలకీ న్యాయమైన సంబంధం అవుతుంది. ఈ సూత్రం ప్రకారం లేని ఏ సంబంధం అయినా అది అసమానతలని (inequalities)ని సృష్టిస్తుంది. అసమానతలని సృష్టించేది ఏదయినా సమాజానికి హానికరమైనదే.

ప్రస్తుతం అమలులో ఉన్న పెళ్లి/కుటుంబ వ్యవస్థలో స్త్రీ కంటే పురుషుడికే ఎక్కువ స్వేచ్ఛ ఉన్నప్పటికీ, బాధ్యతల విషయంలో పురుషుడు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. డబ్బు సంపాదన, పిల్లల సంరక్షణ, పెంపకం లాంటివి. ఈ Free Love/ Casual Sex తండ్రికి ఉండాల్సిన బాధ్యతలని లాగేసి తల్లి మీద పడేస్తుంది. ఆ తల్లి ఇక పిల్లల ఆలనాపాలనా, పోషణ, చదివించడం లాంటివి చేస్తూనే ఇంకోవైపు ఉద్యోగాలు చేస్తూ అన్ని బాధ్యతలు ఒంటరిగా మొయ్యాలి. అదే టీనేజ్ లో తల్లులైన ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణం. తల్లి ఇలా కష్టపడుతుంటే ఆ “తండ్రి” ఏం చేస్తుంటాడు? ఇంకో అమ్మాయిలతో Casual Sex చేస్తుంటాడు!!

ఇవన్నీ ఊహాగానాలు కాదు. ఇది ఇండియాలో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది గానీ USAలో 1960లలోనే బాగా వ్యాపించింది. అక్కడ దీని ప్రభావం ఎలా ఉందో ఆ దేశం విడుదల చేసే పలు రిపోర్టులు చూస్తే మనకి తెలుస్తుంది.

2014లో U.S. Census Bureau విడుదల చేసిన సర్వే వివరాలు ప్రకారం

  • ప్రస్తుతం అమెరికాలో ఉన్న మొత్తం కుటుంబాలలో 25% పైగా కుటుంబాలు Single Mother Families. అంటే ఆ కుటుంబాలలో తల్లి పిల్లలు మాత్రమే ఉంటారు. [ఆ పిల్లల తండ్రులు అంతా ఏమయ్యారు? 25% కుటుంబాలు అంటే మొత్తం సమాజంలో నాలుగో వంతు కుటుంబాలు తండ్రి లేని కుటుంబాలే!]
  • ఈ సంఖ్య 1960 నుంచి 2014 నాటికి మూడింతలు (3 times) పెరిగింది. [Casual Sex బాగానే పెరిగిందన్నమాట.]
  • మొత్తం దేశంలోని పిల్లల్లో 1/3rd మంది తండ్రి లేకుండానే పెరుగుతున్నారు.
  • ఈ Single Mother Families లో 77% కుటుంబాలు పేదరికంలో బతుకుతున్నాయి. [కారణం? తల్లి ఒక్కదాని సంపాదన మీదే అందరూ బతకాలి కాబట్టి!]
  • ప్రపంచంలోనే Highest Crime Rate ఉన్న అమెరికాలో నమోదయ్యే జువెనైల్ కేసుల్లో 90. 5% మంది పిల్లలు Single Parent Families నుంచి వచ్చినవారే. [ తల్లులు పాపం రోజువారీ సంపాదన కోసం ఉద్యోగాల వెంట తిరుగుతూ పిల్లల మీద సరైన శ్రద్ధ పెట్టలేరు. పెరిగే వయసులో సరైన సంరక్షణ లేకుండా పెరిగే పిల్లలు ఎలా తయారవుతారు మరి? వీరిలో అత్యధిక శాతం మంది డ్రగ్స్ కి అలవాటు పడినవాళ్ళు ఉన్నారు.]

 

ఇవన్నీ వ్యక్తిగత విషయాలా? సామాజిక విషయాలా? Casual Sex వల్ల అందరికంటే ఎక్కువ నష్టపోయేది teenage ఆడపిల్లలు. సెక్స్ అనేది చాలా “Casual” విషయం అనీ, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందే హక్కు అందరికీ ఉందనీ, ఆడా మగా సెక్స్ చేసుకోవడం అంటే కలిసి క్యారం బోర్డు ఆడుకోవడం అంత సింపుల్ విషయమనీ TVలు, సినిమాలు, పాటలు తెగ ప్రచారం చేస్తుంటాయి. అప్పుడప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తూ, శరీరంలో వస్తున్న మార్పులనీ, కొత్త లైంగిక వాంఛలనీ అర్థం చేసుకునే వయసు రాకముందే వీటి ప్రభావానికి లోనవుతారు. ఫలితంగా గర్భం ధరించడానికి కావాల్సిన శారీరక పరిపక్వత పూర్తిగా రాకముందే గర్భవతులు అవుతున్నారు.

ఇది ఒకళ్ళిద్దరు అమ్మాయిల పరిస్థితి కాదు. ఆ దేశంలో ఈ విచ్చలవిడితనం ఎంత బలంగా నాటుకుపోయిందంటే ఆ దేశంలో తల్లులైన ఆడవాళ్ళలో 15% మంది 19 సం|| లోపు అమ్మాయిలే! వీరిలో అత్యధిక శాతం మంది 15 సం|| లోపు వాళ్ళు. అంటే పదో తరగతి చదివే వయసున్న చిన్నపిల్లలు తల్లులై ఇంకొంత మంది పిల్లల్ని కని పెంచుతారు అన్నమాట. వాళ్ళ పోషణ కోసం చదువులని మధ్యలోనే ఆపేసి చిట్టిపొట్టి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారన్నమాట.

అదే రిపోర్టు బయటపెట్టిన ఇంకొన్ని విషయాలు చూడండి.

  • టీనేజ్ తల్లుల్లో కేవలం 1/3rd మంది మాత్రమే తమ High School చదువు పూర్తి చెయ్యగలుగుతున్నారు. [ఇది Women Literacy మీద తీవ్రమైన దెబ్బ. సరిగా చదువు కూడా పూర్తి చెయ్యలేని ఆడవాళ్ళు స్త్రీ పురుష సమానత్వం ఎలా సాధిస్తారు?]
  • టీనేజ్ గర్భాలలో 82% గర్భాల Unplanned గా సంభవిస్తున్నాయి.
  • 10 లో 8 మంది టీనేజ్ తండ్రులు తమ పిల్లల తల్లితో కలిసి ఉండటం లేదు. [అవును మరి, వాళ్లకి ఆ అవసరం లేదు కదా.]

దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఈ Casual Sex సిద్ధాంతం అమ్మాయిల మీద అనంతమైన భారాన్ని మోపి, అబ్బాయిలని పూర్తి స్వేచ్ఛా జీవులని చేస్తుంది. దీన్ని ప్రచారం చేసేవారు “వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం” లాంటి పదాలు వాడి ప్రజలను తప్పు దోవ పట్టిస్తారు. నిజానికి ఇది స్త్రీలకి ద్రోహం చేస్తుంది.

ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. “అసలు పిల్లల్ని కంటే కదా ఈ సమస్యలన్నీ. ఎన్నో సురక్షితమైన Contraceptive పద్ధతులున్నాయి కదా? ఎన్నో అత్యాధునిక అబార్షన్ పద్ధతులున్నాయి కదా? అవన్నీ వాడుకుని Safe గా Casual Sex చేసుకోవచ్చు కదా?”

ఈ ప్రశ్నకి సమాధానం పాఠకులకే వదిలేస్తున్నాను. అమెరికాలో ఈ “Super Safe Contraceptives” సులభంగానే దొరుకుతున్నాయి కదా. అక్కడి జనాలకి Sexual awareness బాగానే ఉంది కదా. అయినా ఆ దేశంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి.? ఆలోచించండి. హేతుబద్ధంగా (Rational) ఆలోచిస్తే అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి.

ఈ సిద్ధాంతానికి ఇంకో వికృతమైన రూపం కూడా ఉంది. Sexually Transmitted Diseases (STDs) – సుఖరోగాలు! ఈ పద్ధతిలో సుఖరోగాలని అదుపు చెయ్యడం అత్యంత కష్టసాధ్యమవుతుంది. అమెరికా ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారు విడుదల చేసిన రిపోర్టులో దీనికి సంబంధించిన వివరాలున్నాయి.

  • S. లో నమోదయిన STD కేసులలో సగంపైన 15-24 సం|| లోపు వాళ్ళే.
  • HIV కేసులలో మగవారిలో 2/3rd మంది 13-19 సం|| వాళ్ళే. [అంత చిన్న వయసులో సుఖరోగాలు!!]

 

అమెరికన్ మీడియా Free Love/Casual Sex ని భుజాల మీదకి ఎత్తుకుని ప్రచారం చేసింది. అక్కడి సినిమాలలో నూటికి 90 శాతం సినిమాల దీన్ని ఎంతో ఆకర్షణీయంగా, సాధారణమైన విషయంగా చూపిస్తాయి. దీన్ని ప్రచారం చేసేవాళ్ళు దీని దుష్పరిణామాలలో ఒక్కదానిని కూడా ముట్టుకోరు. ఎంతసేపూ సమానత్వం, సమాన హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ లాంటి పదాలు వాడుతూ అదేదో గొప్ప విప్లవకరమైన విషయంగా ప్రచారం చేస్తారు. అసమానతలతో నిండిన కుటుంబ వ్యవస్థకి ఇదొక గొప్ప alternative గా చూపిస్తారు. పైపైన చూస్తే నిజమే కాబోలు అనిపించేలా ఉంటుంది వీరి వాదన.

ఇది సమానత్వాన్ని సాధించడానికి ఏ రకంగానూ పనికి రాదు. స్త్రీలు ఎంతో కష్టపడి సాధించుకున్న కాసిన్ని హక్కులని కూడా ఇది హరించి వేస్తుంది. స్త్రీల మెదళ్ళని తప్పుడు భావజాలంతో నింపి తమ నాశనాన్ని తామే తెచ్చుకునేలా చేస్తుంది. కుటుంబ వ్యవస్థలో ఉన్న లోపాలని తీసివేయ్యడం ఎలాగో ఆలోచించాలి గానీ, దానికి alternative పేరుతో మళ్ళీ అసమానతలు సృష్టించుకోవడం తెలివిమాలిన పని.

నేను సాంప్రదాయవాదినా?

           పాఠకులు కొంతమంది నేను పచ్చి సాంప్రదాయవాదాన్నే వినిపించాననీ, నేను సాంప్రదాయవాదిననీ అన్నారు. సరిగ్గా గమనిస్తే పోయిన వ్యాసంలోగానీ ఈ వ్యాసంలో గానీ నేను సాంప్రదాయాల గురించీ గానీ, భారతీయ సంస్కృతి గురించీ గానీ, ఆచారాల గురించీ గానీ ఎక్కడా మాట్లాడలేదు. కేవలం “హేతుబద్ధత” ని ఆధారంగా చేసుకుని ఈ వివరణలు చేసాను. మీకు ఇందులో లోపాలు ఏమైనా కనిపిస్తే సహేతుకంగా ఎత్తి చూపించండి. అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. నా మీద సాంప్రదాయ వాద ముద్ర వేసి Casual Sex లాంటిదాన్ని సమర్ధించుకోవడం కుదరదు.

 

 

మీ మాటలు

  1. Bharadwaj Godavarthi says:

    వినోద్ గారు అద్భుతమైన ఆర్టికల్, రాసిన ప్రతి అక్షరం అక్షర సత్యం…కాని మీరు ఎందుకో ఈ సినిమాని సినిమాగా చూడట్లేదు అనిపిస్తోంది..
    ఎంత సేపు దర్శకుడు “Casual Sex” ని సమర్ధించాడు, ప్రేక్షకులని గందరగోళానికి గురిచేశాడు అని అంటునారు కాని, మీరే గందరగోళానికి గురి అయినట్టు అనిపిస్తోంది..

    దర్శకుడు ఒక కధని మాత్రమె చూపించాడు,

    ముంబై సినిమాలో ఒక సన్నివేసంలో హీరో తండ్రి తన కొడుకు ప్రేమ విషయం తెలిసి “నేను చనిపోయాక పెళ్లి చేసుకో’ అంటాడు, అప్పుడు హీరో “అప్పటిదాకా వేచే ఓపిక నాకు లేదు అంటాడు”

    ఈ ఒక్క సన్నివేసం వలన ముంబై అనే సినిమా తండ్రిని కించపరిచే సినిమా అయిపోతుందా

    అలానే పెళ్లికి ముందు సెక్స్ చూపించడం వలన దర్శకుడు దాన్ని సమర్దిన్చినట్టు కాదు…అలా తవ్వుకుంటూ పోతే మీరు అభిమానించే దర్శకుడి ప్రతి సినిమాలో ఇలాంటి సన్నివేశాలు కోకొల్లలు

    ఇద్దరు సినిమాలో ఇద్దరు హీరోలు సహజీవనమ చేస్తారు …ఆ సినిమా గురించి వ్యాసం రాయలేదీ …
    సహజీవనం దృశ్యాలు వుండడం వలన “ఇద్దరు” క్లాసిక్ కాకుండాపోతుందా ?????

    మీరు మరొకసారి సినిమా ని చూడండి..ప్రతి బాక్గ్రౌండ్ స్కోర్ ని, ప్రతి డైలాగ్ ని క్షుణ్ణంగా వినండి ….దర్శకుడు సమర్ధించాడ లేదా అని మీకే అర్ధమవుతుంది ….

    వినోద్ గారు మీ సినిమాలు (షార్ట్ ఫిల్మ్స్) కి నేను విరభిమనిని….మీ సున్యం సినిమా నా జీవితాన్ని మార్చేసింది, నన్ను సినిమా వేపు ప్రయాణానికి గురి చేసింది …అలంటి దర్శకుడు ఇలాంటి సినిమా మిద వ్యాసం రాయడానికి కాలం వృధా చేస్తున్నారు అంటే బాధగా వుంది .

  2. Bharadwaj Godavarthi says:

    వినోద్ గారు అద్భుతమైన ఆర్టికల్, రాసిన ప్రతి అక్షరం అక్షర సత్యం…కాని మీరు ఎందుకో ఈ సినిమాని సినిమాగా చూడట్లేదు అనిపిస్తోంది..
    ఎంత సేపు దర్శకుడు “Casual Sex” ని సమర్ధించాడు, ప్రేక్షకులని గందరగోళానికి గురిచేశాడు అని అంటునారు కాని, మీరే గందరగోళానికి గురి అయినట్టు అనిపిస్తోంది..

    దర్శకుడు ఒక కధని మాత్రమె చూపించాడు,

    ముంబై సినిమాలో ఒక సన్నివేసంలో హీరో తండ్రి తన కొడుకు ప్రేమ విషయం తెలిసి “నేను చనిపోయాక పెళ్లి చేసుకో’ అంటాడు, అప్పుడు హీరో “అప్పటిదాకా వేచే ఓపిక నాకు లేదు అంటాడు”

    ఈ ఒక్క సన్నివేసం వలన ముంబై అనే సినిమా తండ్రిని కించపరిచే సినిమా అయిపోతుందా

    అలానే పెళ్లికి ముందు సెక్స్ చూపించడం వలన దర్శకుడు దాన్ని సమర్దిన్చినట్టు కాదు…అలా తవ్వుకుంటూ పోతే మీరు అభిమానించే దర్శకుడి ప్రతి సినిమాలో ఇలాంటి సన్నివేశాలు కోకొల్లలు

    ఇద్దరు సినిమాలో ఇద్దరు హీరోలు సహజీవనమ చేస్తారు …ఆ సినిమా గురించి వ్యాసం రాయలేదీ …
    సహజీవనం దృశ్యాలు వుండడం వలన “ఇద్దరు” క్లాసిక్ కాకుండాపోతుందా ?????

    మీరు మరొకసారి సినిమా ని చూడండి..ప్రతి బాక్గ్రౌండ్ స్కోర్ ని, ప్రతి డైలాగ్ ని క్షుణ్ణంగా వినండి ….దర్శకుడు సమర్ధించాడ లేదా అని మీకే అర్ధమవుతుంది ….

    వినోద్ గారు మీ సినిమాలు (షార్ట్ ఫిల్మ్స్) కి నేను విరభిమనిని….మీ సున్యం సినిమా నా జీవితాన్ని మార్చేసింది, నన్ను సినిమా వేపు ప్రయాణానికి గురి చేసింది …అలంటి దర్శకుడు ఇలాంటి సినిమా మిద వ్యాసం రాయడానికి కాలం వృధా చేస్తున్నారు అంటే బాధగా వుంది .

  3. ధన్యవాదాలు భరద్వాజ్ గారు. మీ కామెంట్ చూస్తుంటే, నేను పెళ్లి గురించీ, సహజీవనం గురించీ, Casual Sex గురించీ చెప్పినది ఏదీ మీకు అర్థమయినట్టు లేదు. మీరు నా వాదన ఏమిటో పూర్తిగా అర్థం చేసుకోకుండానే విమర్శిస్తున్నారు. వీలయితే రెండు వ్యాసాలూ మళ్ళి ఒకసారి చదివి చుడండి.

  4. Bharadwaj Godavarthi says:

    Thanks Vinod Garu, I guess I commented after reading each and every line, but Will get back to your post once again and will read back and will get back to you with my opinion.

    Thanks,
    Bharadwaj Godavarthi.

  5. buchi reddy gangula says:

    యీ సినిమా కు యింత surgery… అవసరమా —-
    pelli–సెక్స్ — personnel..issues…కావా ???
    నేటి వ్యవస్థ — యువత ఆలోచనలు — నడుస్తున్న తిరు ను — చాలా చక్కగా చూపించారు —
    just–for– example– friends— యిక్కడ పెరుతున్న మన తెలుగు అమ్మాయిల ను — india– అబ్బాయి చేసుకుంటే మంచిదే కదా అంటే —- వాళ్ళ జవాబు — ఇండియా లో పెరిగిన
    పిల్లలకు mannaers— maturity— ఉండదు —అని చెపుతారు — వాళ్ళ తల్లి తండ్రులు
    ఇండియా వాళ్ళు కాదా —-ప్లస్ కుల మత పట్టింపులు దేనికి —
    ముస్లిమ్స్ — ల కు దళితలు కు — మిగితా కులాల వాళ్ళకు ఉన్నట్టే అన్ని రకాల
    అవయవాలు — అదే ఎరుపు రక్తం ఉండదా —
    అమెరికా లో పెరుగుతున్న మన పిల్లల ఆలోచనల ను —-వాళ్ళు నడుస్తున్న తిరు ను
    చూడండి —-

    అసలు తెలుగు సిని ప్రపంచం లో —- వచ్చేవి — సినిమాలేనా — బాలయ్య — సింహం — లెజెండ్ — నాలుగు డై లాగులు — బెల్లి డాన్సు లు — డబల్ మీనింగ్ పాటలు —-
    యింకా నేటికి — 50 ఏళ్ళు దాటిన యువకులు మన హీరో లు —- కథ ఉండదు —
    వాటి గురించి రాయండి సర్
    ok– bangaaram— గుడ్ మోవి nithya…..menon…..acting……డబల్ ప్లస్

    ————————— బుచ్చి రెడ్డి గంగుల ——–

  6. Chandrika says:

    ఈ సినిమా చూడలేదు కానీ మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. మన దేశం లో వింత పోకడలు ఎక్కువవుతున్నాయి. మొన్నీ మధ్య ఎక్కడో తాళి తెంచే కార్యక్రమం నిర్వహించారని చదివాను. కేరళ నుంచి బహిరంగ ముద్దులు పెట్టడం మన హైద్రబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం దాక వచ్చింది. ఇంక ఇలాంటి సహజీవనం అంశం మీద పేరు మోసిన దర్శకుడి నుంచి సినిమా వస్తే యువత ఎలా తయారవుతుందో మనం చెప్పనే అక్కర్లేదు. ఆయన ఏ సందేశం ఇచ్చాడు అన్నది ఎవరు పట్టించుకోరు. సినిమా ని సినిమా లాగా చూస్తే పర్వాలేదు. కానీ మన దేశం లో అలా కాదే!! పొద్దున్న లేచినప్పట్నించీ టీవీ లో వాళ్ళ పాటలు, సినిమా వారి గురించే మొదటి పేజి వార్తలు, ఆ సినిమా వారే మనకి నాయకులు, అమెరికా లో తెలుగు సంఘాలకి ముఖ్య అతిథులు, వారి పిల్లలు, మనవళ్ళు తర్వాతి తరం నటులు, రాజకీయ నాయకులు. మరి ఇలాంటి సినిమాలు సమాజం మీద తప్పకుండా పెద్ద ముద్ర వేస్తాయి !!

  7. p.Sambasivarao says:

    Vinod garoo. Good analysis. I felt happy as if I am reading an article written by Ranganayakamma garu. I think u r a serious reader also. Thanq.

    • మంజరి లక్ష్మి says:

      అవును సాంబశివరావు గారు నాకు ఈయన వ్యాసం చదువుతుంటే అచ్చు రంగనాయకమ్మ గారి వ్యాసం చదువుతున్నట్లే అనిపించింది. `అసమానత్వం లోంచి అసమానత్వంలోకే’ పుస్తకం లో ఆమె దీని గురించి అద్భుతంగా ఒక హేతుబద్ధమైన వాదనతో రాశారు.

  8. Hi Vinod, Appreciate all your work. I took some time reading these articles. I just have one question which would be most basic one. How do you differentiate that something is right and something is wrong? On what basis?

    Hope this would help me and other readers understand your article more clearly.

    Thanks

    • I have answered this question in the article itself. Please refer to 2nd question in the article.

      “Equal rights and equal responsibilities to all humans”. This principle gives equality to all humans in every aspect. Anything that promotes equality is right. And anything that creates inequalities is wrong.

      • Thanks for the reply. I respect your view of “equal rights and responsibilities to all humans”. But I think your reasoning is flawed. You said, “Anything that brings equality is right”. Now again we go back to same question “How do you define equality, responsibility…etc?” Your definitions of equality…etc can contradict mine. What is ‘equal’ to you may not be ‘equal’ to me and vice versa. For example, some countries legalized prostitution, gambling…etc because they thought it was right and some countries opposed that idea saying its wrong. Now, how do you decide which is right/wrong?

        So,concluding what is right and what is wrong based on equality, responsibility… etc is not a correct way. Its leads to logical fallacy as said in the above example. Give it a thought.

        Thanks.

  9. వినోద్ గారూ ఇదే సంచికలో వచ్చిన వారిజ కథ చదవండి. క్యాజువల్ సెక్స్ కథ

  10. పెళ్ళి అనే బానిసత్వపు సంకెళ్ళను చేదించుకొని , మగవాడితో కొంతకాలం సహజీవనం చేసి , పిల్లల్ని కని , మాత్రుత్వం లోని మాధుర్యాన్ని చవిచూసి , పురుషాధిక్యతను ధిక్కరించి , మాత్రుస్వామ్య వ్యవస్థను పునరుధ్ధరించాలనుకునే వారికి మీ సమాధానం నచ్చకపోవచ్చనుకుంటా !

  11. Chandrika says:

    ఎలాటి ఎమోషనూ లేకుండా కేవలం మాతృత్వం అనే సాకుతో బస్టాప్ లో కనపడిన వాడితో సహజీవనానికి,అదీ దొంగ పేరుతో సిద్ధపడి దానికి చాయిస్ అనో విప్లవమనో పేరు పెట్టేసుకుని “ఓహో అధునిక స్త్రీలు ఇంత చీపా? ఇంత సులభమా?” అన్న భావన రీడర్స్ లో రేకెత్తించిన పరమ కాజువల్ సెక్స్ కథ వారిజ ను, ఇదిగో కాజువల్ సెక్స్ ని విమర్శిస్తూ రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించి బాలెన్స్ నిలిపిన సారంగ పత్రికకు అభినందనలు

  12. ari sitaramayya says:

    వినోద్ గారూ, చాలా బాగా రాశారు. అభినందనలు.

    స్త్రీపురుషుల సంబంధం వ్యక్తిగతమే కాకుండా సామాజికం కూడా. నిజమే. ఎక్కువ మంది బిడ్డలను పుట్టించమని వారి పౌరులను బ్రతిమాలుతున్నాయి జపాన్, రష్యా లాంటి దేశాలు. ఒక్క బిడ్డనే కనమని షరతులు పెట్టింది చైనా. అంటే పిల్లల బాధ్యత తల్లిదండ్రులమీదే కాకుండా కొంత బాధ్యత దేశాలకు కూడా ఉందనేది నిర్వివాదం. పిల్లల పెంపకం సులభంగా ఉండటానికి ఏంచెయ్యొచ్చు అని బాధ్యతాయుతమైన సమాజాలూ దేశాలు ఆలోచిస్తాయి. ఆచారాలు పద్ధతులు అమలు పరుస్తాయి. వాటికి చట్టబద్ధత జతపరుస్తాయి.

    ఏ సమాజంలో అయినా స్త్రీ పురుషుల సంబంధంలో ఇద్దరూ పూర్తి జ్ఞానంతో ప్రవర్తిస్తే ఇద్దరికీ ఇబ్బందీ కష్టం రాదు.
    మగవాడు బాధ్యత లేని వాడుగా, స్త్రీ అమాయకురాలిగా ఉంటే మీరు రాసిన ప్రతి మాటా యధాతధంగా నిజమే.
    ప్రస్తుత భారత సమాజంలో జ్ఞానంలేకుండా శారీరక సంబంధం ఏర్పరుచుకోవటం వల్ల ఎక్కువ బాధ్యతలకు గురయ్యేది స్త్రీనే. నిర్వివాదం. సమాధానం వ్యక్తిగత బాధ్యత పెంపొందించటం. దేశానికీ సమాజానికీ ఉన్న బాధ్యతను మర్చిపోకుండా ఉండటం.
    కానీ తెలివి ఉన్న వాళ్ళు కలిసుండటం వల్ల అది చూసి తెలివిలేని వాళ్ళు నష్టపోతారు అనేది సమర్థించదగిన వాదం కాదు.

    మీరు అమెరికా గురించి చాలా రాశారు. “కాజువల్ సెక్స్” 60 లలో అమెరికాలో మొదలయినట్లు రాశారు. కాని అది నిజం కాదు.
    స్త్రీపురుషుల అసమానతకు కారణం వారిమధ్య ఉన్న ఆర్థిక సంబంధం. చాలాకాలంగా ఈ సంబంధంలో పురుషులకు ఆధిక్యత ఉండేది. చాలా దేశాల్లో ఇప్పటికీ ఉంది. ఒకరిమీద ఒకరు ఆర్థికంగా ఆధారపడవలసిన అవసరం లేకపోతే మనుషులమధ్య సంబంధాలు ఎలావుంటాయో మొదటిసారిగా తీక్షణంగా ఆలోచించినవారు స్కాండినేవియన్లు. వివాహేతర సంబంధంలో (దాన్ని కాజువల్ సెక్స్ అనో కలిసి ఉండటం అనో ఏదో ఒక పేరు పెట్టి ఎవరికీ ఇష్టమైన విధంగా వారు పిలవొచ్చు) పుట్టిన బిడ్డలకు అన్ని రకాల రక్షణ కల్పించిన మొదటి దేశాలు ఉత్తర యూరప్ దేశాలే. అమెరికాలో మీరు చెప్పిన అనర్థాలు స్కాండినేవియన్ దేశాల్లో లేకపోవటం ఆ రెండు ప్రాంతాల్లో ఉన్న సాంస్కృతిక, రాజకీయ తేడాలవల్లనే. అంటే స్త్రీపురుష సంబంధాల వల్ల అనివార్యంగా స్త్రీలు కష్టాల పాలుగావాల్సిన అవసరం లేదు. ప్రతిదానికీ మోడల్ అమెరికా కాదు.

    ఎవరు ఎన్ని మాటలు చెప్పినా స్వతంత్రులైన స్త్రీపురుషుల మధ్య మొదట ఏర్పడేది ఆకర్షణే. మనుషులు ఉన్నంత కాలం దాన్ని చట్ట బద్ధంగానో, మరోవిధంగానో మార్చలేరు. ఈ ఆకర్షణ పర్యవసానం ఏంటి? దానివల్ల వ్యక్తులు కష్టనష్టాలకు గురికాకుండా చూడటం ఎలాగు అనే కదా ఈ చర్చంతా? ప్రస్తుత వివాహ వ్యవస్థ పురుషాధిపత్యం మీద ఆధారపడి ఉంది. దీనికి భవిష్యత్తు సున్నా. ఆకర్షణ వల్ల దగ్గరయ్యే వారికి బాధ్యత తెలిసేదెలా? వారికీ వారి సంతానానికి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చెయ్యటం ఎలాగా? ముందుముందు చర్చ వీటిమీద ఉంటుంది. సమాధానాలకు అమెరికా వైపు కాదు, స్కాండినేవియా వైపు చూడాల్సి ఉంటుంది.

    • స్కాండినేవియన్ దేశాలు కూడా ఆదర్శం కాదు కదండీ. అక్కడ ప్రతీదానికి సమాజం మీద ఆధారపడి బ్రతకడం మనం చూస్తాం. అక్కడి మగవారిని బానిసల్లా చూసే సంస్కృతిని ఎలా సమర్ధించగలం ??

  13. Casual Sex is not evil. ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా Casual Sex చేస్తే దానికి సమాజం చింతించాల్సిన పనిలేదు. (ఇద్దరు వ్యక్తులు, అమ్మాయి – అబ్బాయి మాత్రమే కాదు, ఎవరైనా కావచ్చు..!) దానికి సమాజము అంగీకారం అవసరం లేదు. ఇక బాధ్యతలంటారా? ఇక్కడ సెక్స్ గురించి మాట్లాడుతుంటే మీరు సామాజిక బాధ్యతలంటారేమిటి? అసలు కాజువల్ సెక్స్‌ను ప్రమోట్ చేయడములో తప్పేమిటి? ఇద్దరికున్న కోరికను ఇరువురూ తమకు ఇష్టమైన పద్దతిలో తీర్చుకుంటున్నారు అంతేగా??

    క్యాజువల్ సెక్స్ అనేది మగవాడికి స్వర్గమా? మరి ఆడవారికి నరకమా? కమిట్‌మెంట్ లేకపోతే ఎవరికి నష్టం? క్యాజువల్ సెక్సులో కమిట్‌మెంట్ ఇరువురికీ ఉండదు కదా? మగవాడికి కమిట్‌మెంటు లేకపోవడం మాత్రమే సమస్య ఎందుకయింది? అంటే.. ఆడవారు సెక్స్ అనే ఒక తాయిలాన్ని మగవాడికి ఎరగా చూపి మగవాడి దగ్గరనుండి సో-కాల్డు కమిట్‌మెంట్ పొందాలన్న మాట? ఏ తరహా కమిట్‌మెంట్ అది?

    ఇక వేశ్యల దగ్గరికొస్తే.. అందులో వేశ్యల తప్పు ఏమీ లేదు, కేవలం మగవారి తప్పే అంటున్నారు? అదెలా? కమిట్‌మెంటు లేని సెక్సు మగవారు చేసే మహా పాపం అనే భావజాలమునుండే వచ్చిందేనా ఇది? అందుకేనా వేశ్యా వృత్తిని వ్యతిరేకించేది?

    అసలు సెక్స్ కోసం మగవాడు కమిట్‌మెంట్లు ఇవ్వాలా? తప్పదా? తప్పనిసరి అయితే ఏఏ కమిట్‌మెంట్లు ఇవ్వాలి? సెక్స్ అవసరం “అ సుఖం” పొందడం వరకే కావాలి కానీ, కమిట్‌మెంట్ కోసం సెక్సును ఉపయోగించడం ఏమిటి? మగవాడికి ఉన్న ఒక్క బలహీనత మీద మొత్తం సమాజం, దాంట్లో సమానత్వం ఆధార పడి ఉన్నాయా?

    మగవాడు కమిట్‌మెంట్‌ను కలిసి బ్రతకడం, జీవితాంతం తోడుగా ఉండే (అట్ లీస్త్, అలా ఉంటుంది అన్న భావం) భాగస్వామి కోసం ఇవ్వాలి. దీనికి రొమాంటిక్ టచ్ ఇచ్చి చెప్పాలి అనుకుంటే.. ప్రేమ కోసం కమిట్‌మెంట్ ఇవ్వాలి అని చెప్పుకోవచ్చు. సెక్సు కోసం కాదు. సెక్సు కోసం కమిట్‌మెంట్ ఇవ్వడం కన్నా, వేశ్యల దగ్గరకి వెల్లడమే బెటర్ కదా? ఎందుకంటే ఒక సారి మోజు తీరగానే, మగవాడు ఆ కమిట్‌మెంట్ ఎలా బ్రేక్ చేయాలా అనే చూస్తాడు. అదే భాగస్వామి కావాలి అని కమిట్‌మెంట్ ఇచ్చేవాడు అలా కాదు కదా!!

    ఇక గర్భం వస్తే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం క్యాజువల్ సెక్సులో మగవాడికి ఉండదు అనేది..

    ఎందుకు ఉండాలి? ఆమె శరీరం ఆమె ఇష్టం కదా? సర్వ హక్కులు ఆమెవే. డీఫాల్టుగా బాధ్యతలూ ఆమెవే..! హక్కులు లేకుండా బాధ్యతలు మాత్రం మగవాడికి షేర్ చేయడం దేనికి? Her body her choice but man’s responsibility (be it monetary or social) is not his choice, how fair it is?. సమానత్వం అంటే ఇదేనా? అదే అయితే ముందుగా మీరు సమానత్వం అనే పదానికి డెఫినిషన్ మార్చాల్సి ఉంటుంది.

    ఇక USలోని సింగిల్ మదర్స్ గురించి మీ ఊహాగాణాలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. అమెరికాలో సింగిల్ మదర్స్ పెరగడానికి కారణం ఏమిటి? క్యాజువల్ సెక్సా? విడాకులా? అసలు అమెరికాలో మగవారికన్నా ఆడవారు చాలా ఎక్కువ సమానం చట్టపరంగా. అనేక మంది తండ్రులు తమ పిల్లలను కలుసుకోవడనికి కుదరక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసా? ఫ్యామిలీ కోర్టులు స్త్రీల పక్షపాతముతో పిల్లలకు తండ్రులను ఏవిధంగా దూరం చేస్తున్నాయో ఎంతో మంది చెప్పారు ఇప్పటి వరకూ ! మీరు చూస్తే మాత్రం క్యాజువల్ సెక్స్ దీనికి కారణం దీని వల్ల స్త్రీలు అన్యాయమైపోతున్నారు అని చెబుతున్నారు. ఇక్కడ అన్యాయమైంది స్త్రీలు కాదు మగవారు. సింగిల్స్ మదర్స్ పెరగడానికి కారణం క్యాజువల్ సెక్స్ కాదు. ఇంకో విషయం విడాకులు కోసం అప్ప్లై చేసే వారిలో సింహ భాగం ఆడవారిదే ! Majority of the divorces are initiated by women.

    మీరు ఏకరువు పెట్టారే .. తండ్రిలేని పిల్లలఓ నేర ప్రవృత్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది అనీ .. ఇవన్నీ తండ్రుల హక్కుల కోసం పోరాడుతున్న అనేక సంస్థలు ప్రతీ రోజూ చెబుతూ ఉంటాయి అమెరికాలో. UKలో అయితే రీసెంటుగా జరిగిన ఎన్నికలలో తండ్రుల హక్కుల కోసం పోరాడే వ్యక్తి పోటీ కూడా చేసినట్టు గుర్తు.

    మీరు సాంప్రదాయ వాదా?
    ముమ్మాటీకీ కాదు. మీరు పొలిటికల్ కరక్ట్‌నెస్ వాది. ఎవరో ఈ సినిమాపై మీ పొలిటికల్ కరక్ట్‌నెస్‌ను శంకించారు. దానితో మీరు మరింత పొలిటికల్ కరక్ట్‌నెస్‌ను వెదజల్లుతున్నారు. Good attempt, but wrong way.

    • శ్రీకాంత్ గారు, మీవాదన బాగుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే యు.జి. కృష్ణమూర్తి ని గుర్తుచేశారు. బ్రిటన్ వారి లెక్కలు చూడండి.

      A quarter of British children are being raised by a single parent, new figures reveal
      Of the 1.8million single parent households in Britain, 650,000 of them are not in any sort of work
      Average single parent household in UK claims twice as much in benefit support as the average two-parent household
      Only Latvia, Estonia and Ireland have more lone parent హొఉసెహొల్ద్స్

      http://www.dailymail.co.uk/news/article-2540974/Britain-fourth-highest-number-single-parents-EU.html
      http://timesofindia.indiatimes.com/world/uk/1-in-20-students-in-UK-worked-in-sex-trade-to-fund-living-cost/articleshow/46715888.cms

    • శ్రీకాంత్ గారు, మీరు చెప్పినట్టు అందరూ జంతువుల్లాగా కామాన్ని తీర్చుకోవాలనుకుంటే, ఇక కుటుంబ వ్యవస్త, సామాజిక కట్టుబాట్లు ఎందుకు? వినోద్ గారు చెప్పింది అక్షరాలా నిజం. ఇటువంటి వాదనల్లో నిజం ఉన్నా లేకపోయినా, అంతిమంగా నష్టపోయేది ఎప్పుడూ మహిళ మాత్రమే. మీరు చెప్పినట్లు ఎవరి ఇష్టం వారిది అనుకుంటే, వాళ్ళు సామాజిక, కుటుంబ వ్యవస్థల్లో ఉండడానికి అర్హులు కారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మానవ సమాజానికి దూరంగా, జంతువుల్లాగా ఒక ప్రత్యేకమయిన భూభాగంలో బ్రతుకుదామనుకుంటే ఎవరూ అభ్యతరం పెట్టరు. కాకపోతే కొన్నాళ్ళకి అటువంతి విలువలు లేని సమూహం రకరకాల వ్యాధులతో, ఎవరికీ చెపందని పిల్లలతో, వికృత మనస్తత్వం (perverted) కలిగిన వ్యక్తులతో నిండిపోతుంది. అతి త్వరలోనే అది నశించిపోతుంది కూడా. మానవ సమాజాన్ని జంతు సమాజం నుండి వేరు చేసి, ఉన్నత స్థితి వైపు తీసుకెళ్ళేది సామాజిక కట్టుబాట్లు, ధర్మ వర్తన మాత్రమే. జంతువుల ఆలోచనలు ఇక్కడ చెల్లుబాటు కావు.

      • సామాజిక కట్టుబాట్లు, వావ్ .. జగదీష్ గారూ, ఇవే సామాజిక కట్టుబాట్లు ఒకప్పుడు స్త్రీని భర్త చనిపోయిన తరువాత చితి మంటల్లో తోశాయి. అప్పుడు దాన్ని వ్యతిరేకించిన వారిని కూడా సామాజిక కట్టుబాట్లను రక్షించడానికి కంకణం కట్టుకున్న కూపస్థ మండూకాలు వ్యతిరేకించాయి. ఈ కూపస్థ మండూకాలకు, తర తరాలుగా వస్తున్న కట్టుబాట్లను గుడ్డిగా అనుసరించడం తప్ప, తమ సొంత ఙానాన్ని ఉపయోగించి ఆలోచించడ తెలీదు. క్యాజువల్ సెక్స్ మహాపాపమని భావించి, ఆతరహా కూపస్థ మండూకాల జాబితాలోకి నేను రాలేను. ఇద్దరికి ఇష్టమై జరుపుకునే శృంగారానికి అడ్డు చెప్పే హక్కు సమాజానికి లేదు. ఈ భావనకి, కురచ మనస్తత్వముతో జంతువులా బ్రతకడం అని ఎవరైనా పేరు పెడితే, వారి ఎదగని తనానికి నేను జాలిపడతానే తప్ప, క్యాజువల్ సెక్స్ తప్పు అని చెప్పను. ఒకటి గుర్తుంచుకోండి… గతించిన కాలములో విప్లవాత్మక మైనవిగానూ పరిగణించబడిన ఎన్నో ఆలోచనలు, భావాలు ప్రస్తుతం ఇంగిత ఙ్ఞానం కలవిగానూ పరిగణింపబడుతున్నాయి. ఇవి కూడా ఇంతే, వీటిని సాంప్రదాయ వాదులు ఆపలేరు.

        క్యాజువల్ సెక్స్ వల్ల కేవలం మహిళలే బాధలు పడతారన్నది కేవలం అపోహ, భవిశ్యత్తులో అది మూఢనమ్మకముగా రూపాంతరం చెందుతుంది (టెక్నాలజీ వల్ల ). ప్రస్తుతం అభివృద్ది చెందిన సాంకేతిక పరిఙ్ఞానం పుణ్యమా అని, స్త్రీ పురుషులిరువురూ క్యాజువల్ సెక్సును ఎంజాయ్ చేయవచ్చును. ఇంకో విషయం, క్యాజూల్ సెక్స్ అనగానే ఏవో రోగాలు వస్తాయని పొరపడ్డారు. నేను క్యాజువల్ సెక్సును సమర్ధించానే కానీ, అన్-ప్రొటెక్టెద్ సెక్సును కాదు. కాబట్టి, కాస్త జాగ్రత్తలు తీసుకుంటే, మీరు చెప్పిన రోగాలున్న సమాజం దరిదాపులకు కూడా రాదు. పైగా, క్యాజువ సెక్సును మహాపాపముగా చూడడం వల్ల, సెక్సు కోరికలను తీర్చుకోవడానికి యువతీ యువకులు పడే తపన వల్ల, ఈ ప్రొటెక్టెడ్ సెక్స్ కష్టమవ్వవచ్చు. దానికి తోడు, ఆడ (మగ) వేశ్యల వద్దకు వెల్లి ఆ కోర్కెలు తీర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. దాని వల్ల బహుషా మీరు అన్న రోగాలున్న సమాజం వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం కనపడుతోంది.

        సెక్స్ అనగానే అదో పాపం అనో లేకపోతే అదో పవిత్రమైన కార్యం అనో ఏదో ఒక విపరీత భావాన్ని అంటగట్టడం మాని సెక్సును సహజ క్రియలాగా చూడడం నేర్చుకున్న రోజున సమాజములో ఉన్న చాలా రుగ్మతలు తగ్గుముఖం పడతాయి.

        క్యాజువల్ సెక్స్ కుటుంబ వ్యవస్తకు భంగ కరం కాదు ఒకవేల అయినా పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను రక్షించాల్సిన బాద్యత ఎవరి మీదా లేదు. ఎవరి మీదైనా రుద్దితే సహించేది లేదు. ఈ విలువలు, సామాజిక కట్టుబాట్లూ ఇవన్నీ కాలముతో బాటూ మారుతూ ఉంటాయి. మన పెద్దలు పాటించిన విలువలు, సామాజిక కట్టుబాట్లూ మనం పాటించడం లేదు. అంత మాత్రం చేత మనమంతా జంతువులమా? జంతువుల్లా బ్రతుకుతున్నట్లా? ఇటువంటి అపోహల నుండి బయటికి రండి.

      • *మానవ సమాజానికి దూరంగా, జంతువుల్లాగా ఒక ప్రత్యేకమయిన భూభాగంలో బ్రతుకుదామనుకుంటే ఎవరూ అభ్యతరం పెట్టరు*

        మీరాలా అనుకొంట్టున్నారు. ఆధునిక సమాజమైన అమెరికాలో సింగిల్ గా ఉండటం అల్టిమేట్ లగ్జరి అని స్రీలు అనుకొంట్టున్నారు. అవుట్ సైడ్ వెడ్ లాక్ లో పిల్లలను కనే వారు 1950 లో 4% ఉంటే, ఇప్పుడు అది 57% పెరిగింది. వాళ్ళు అలా స్వేచ్చ గా ఉంటామనుకొంట్టుంటే ,కష్టపడిపోతున్నారో అని బాధపడిపోవటమేమిటి? అంతిమంగా నష్టపోయేది ఎప్పుడూ మహిళ మాత్రమే సానుభూతిని చూపటమేమిటి? మాకు స్వేచ్చ ముఖ్యమో అని వాళ్లు దశాబ్దాలు పోరాటం చేసి పొందుతున్నా స్వేచ్చను,మీరు భవిషత్ ను దృష్టిలో ఉంచుకొని విలువలు లేని సమాజం ఏర్పడుతుందని బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ కొడుకు స్వేచ్చను హరించినట్లు, హరించేసేటట్లు ఉన్నారు.

        57% అవుట్సైడ్ వెడ్ లాక్ ద్వారపుట్టిన పిల్లల సంఖ్య ఒక దశాబ్దం తరువాత 75% అయ్యారనుకొండి. స్కుల్ లో 75%మంది పిల్లలు 25% పిల్లలను వీళ్ల అమ్మా నాన్నలు పెళ్లి చేసుకొన్నారో అని వెక్కిరిస్తారు. అప్పుడు పెళ్లిచేసుకొనే వారు కూడా పుట్టబోయే పిల్లలు సంఘంలో వెక్కిరింతకు గురికాకుడదని పెళ్లిలు మానుకొవచ్చు. మీరనుకొనే వివాహ వ్యవస్థ డైనోసార్ మాయమైనట్లు మాయమవ్వచ్చు.

        ప్రస్తుతం అక్కడ సమాజాలు అలా ఉన్నాదని ఇండియా నుంచి అమెరికాకి, యురోప్ కి వెళ్ళేవారి సంఖ్య తగ్గిందా? భవిషత్ లోతగ్గబోతుందా? రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాది కదా!

  14. వెల్ డన్ వినోద్. మీరు చాలా మంచి పని సరైన టైమ్ లో చేస్తున్నారు.

  15. కేవలం “హేతుబద్ధత” ని ఆధారంగా చేసుకుని ఈ వివరణలు చేసాను అని మీరన్నా ఈ వ్యాసం లో మీరు చాలా బయాస్డ్ గా స్రీలకు మద్దతుగా రాశారు. ఈ క్రింది లైన్లు చదివితే మగవాళ్ల మీద మీకెమిఒ సదభిప్రాయం ఉన్నట్లు లేదని అనిపిస్తుంది.

    1. ఫ్రీలవ్ బాగా వ్యాప్తి చెందడం అంతే మగవాడికి భూమ్మీద “స్వర్గం” తయారయినట్టే.
    2. తల్లి ఇలా కష్టపడుతుంటే ఆ “తండ్రి” ఏం చేస్తుంటాడు? ఇంకో అమ్మాయిలతో కేసువల్ సెక్స్ చేస్తుంటాడు!!
    3. కేసువల్ సెక్స్ అందరికంటే ఎక్కువ నష్టపోయేది టీనేజ్ ఆడపిల్లలు
    4. ఈ కేసువల్ సెక్స్ సిద్ధాంతం అమ్మాయిల మీద అనంతమైన భారాన్ని మోపి, అబ్బాయిలని పూర్తి స్వేచ్ఛా జీవులని చేస్తుంది.

    అమెరికాలో గత 50యేళ్లలో సహజీవనం చేసే వారి సంఖ్య 900% పెరిగింది. ప్రస్తుతం 57% మంది పిల్లలు అవుట్ సైడ్ వెడ్ లాక్ పుడుతూన్నారు. ఇంత మంది మహిళలలు మాస్ స్కేల్ లో పెళ్లి లేకుండా పిల్లలను కంట్టున్నారే, మరి వారేమి సమాజానికి బాధ్యత వహిస్తున్నట్లు? మరి అక్కడి ప్రభుత్వం,దానికి సలహాలిచ్చే ఆర్గనైజేడ్ ఫెమినిస్ట్ యన్.జి.ఒ. లు ఎమి చేస్తున్నట్లు?

    ఫెమినిస్ట్ ఉద్యమాల ప్రభావం వలన వచ్చిన కల్చర్ లో మార్పుల ఫలితాలను మగవారి ఖాతాలో వేసి, ఫ్రీ లవ్ వలన మగవాడికి భూమ్మీద “స్వర్గం” తయారయినట్టే. తల్లి ఇలా కష్టపడుతుంటే ఆ “తండ్రి” ఏం చేస్తుంటాడు? ఇంకో అమ్మాయిలతో కేసువల్ సెక్స్ చేస్తుంటాడు!! అని పురుషులను విలన్ గా చూపటం మరీ అన్యాయంగా ఉంది.

    This is the Modern American Family – The Business of Life

  16. Sivakumara Sarma says:

    “లొంగిపోవడం,” “నష్టపోవడం” – ఈ రెండు పదాలనీ ప్రకృతి నిర్దేశించిన సృష్టి కార్యంలో పాల్గొనే భాగస్వాముల్లో ఒకళ్ళకి మాత్రమే అన్వయించడం ఈ ఇంటర్నెట్ ఏజ్ లో, అది కూడా ఈ వ్యాసం చదివే వాళ్ళల్లో చర్చల్లో ఉపయోగించడం చాలా తమాషాగా ఉన్నది. దానితోబాటుగా మాట మాట్లాడితే అమెరికాని కూడా ఇలాంటివాటిల్లో చేర్చడం. ఇది ఒక సమాజానికి పథ నిర్దేశకత్వానికి కంకణం కట్టుకున్న కొందరి భావాలని ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్నది.

    1) “లొంగిపోవడం,” “నష్టపోవడం” – ఈ చర్చని ఏదో పల్లెటూర్లో సమాజంలోని పరిస్థితులవల్ల లేక పట్టణాల్లోకూడా ఆర్ధిక ఇబ్బందులవల్ల తలవంచ వలసివచ్చే బడుగు జీవితాలకి కాకుండా సినిమాలో చూపించినట్లుగా కనీసం కాలేజీ చదువు వున్నవాళ్లకే పరిమితం చేస్తున్నారనే అనుకుంటున్నాను. అప్పుడు, దర్శకుడు ఏం చెప్పదలచుకున్నాడో అన్న విషయాన్ని పక్కన పెడితే, వినోద్ గారూ, ఆ స్త్రీకి తనకి నచ్చినవాడితో ఆమెకి కావలసినట్టుగా ప్రవర్తించే హక్కు ఉన్నట్టా లేనట్టా?

    మీరు చెప్పినట్టుగా అది తరువాత ప్రెగ్నెన్సీకో లేక STD లకో దారి తీస్తే అది కూడా ఆమె ప్రవర్తన వల్లనే వచ్చినట్టు. ఈ రెండు పరిణామాల్లో దేనిని ఆమె ఎదుర్కోవలసివచ్చినా, ఆమెకి సరయిన ఎడ్యుకేషన్ లభించలేదని అర్థం. ఇక్కడ అమెరికా ప్రసక్తిని నేనే తీసుకు వస్తాను. అమెరికాలో పుట్టి పెరిగిన ఇద్దరు పిల్లల తండ్రిగా చెబుతున్నాను – ఈ రెండు విషయాలనీ అమెరికాలో ఎలిమెంటరీ స్కూల్నించీ మొదలుపెట్టి హైస్కూల్ దాకా బోధిస్తూనే వుంటారు. ఈ విధంగా ఇక్కడి టీచర్లకి సమాజం తల్లిదండ్రుల బాధ్యతని కూడా అంటకట్టింది. ఈ విషయంలో ఎంత తొందరగా ఇండియా అమెరికాని అనుసరిస్తే అంత మంచిది. ఇండియాలో పుట్టి పెరిగినవాణ్ణి కనుక చెబుతున్నాను – ఇండియాలో అవుట్ హౌసెస్ ని ఎటాచ్డ్ బాత్రూంల కింద ఇంట్లోకి తెచ్చుకున్నారు గానీ, పిల్లల సెక్స్ ఎడ్యుకేషన్ ని మాత్రం ఇంకా ఊరవతలే వుంచింది సమాజం. అక్కడ పెరిగే పిల్లలు ఇంకా దొంగతనంగానే సెక్స్ గూర్చి తెలుసుకుంటున్నారు. వాళ్లకేమీ తెలియదని తల్లిదండ్రులు తమని మభ్యపుచ్చుకుంటూనే వున్నారు.

    2) “నష్టపోవడం” – దీన్ని ప్రెగ్నెన్సీకి వర్తింపజేస్తున్నారు. దీనికి, అమెరికాలో ఎంతమంది అవుటాఫ్ వెడ్ లాక్ పిల్లలు పుడుతున్నారో గణాంకాలని జోడుచేశారు. పెళ్లిళ్లు తక్కువయిపోతున్న సమాజాలగూర్చి తెలుసుకోవాలంటే స్వీడన్, స్విట్జెర్లాండుల గూర్చి ముందు చదవాలి. ఆ దేశాల్లో ఈ శాతాలు చాలా ఎక్కువ. అమెరికాలోకూడా పెళ్లికాకుండానే పిల్లల్ని కన్న తల్లులూ, లేక విడాకులు తీసుకున్న తరువాత పిల్లల్ని తామే పెంచే తల్లులూ పిల్లలు పుట్టారని ఏడుస్తూ కూర్చోవడంలేదు. దానికి, దాన్ని సమాజం తప్పుగా భావించకపోవడం ముఖ్య కారణం. అందువల్లే, పిల్లలున్నాగానీ వేరే తోడు లభించే అవకాశాలు ఇక్కడ మృగ్యం కాదు. అందుకే, ఒక సారి Be a Roman in Rome అన్న నానుడిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అయితే, ఒకప్పుడు రోమ్ లో దోసెలు లభించేవి కాదు. ఇప్పుడా సమస్య లేదు. ఇప్పుడు ఇండియాలో పిజ్జాలు దొరుకుతున్నట్లుగానే.

    ఇంకొక విషయం – ఇండియాలో అబార్షన్ ని భ్రూణహత్యగా సమాజం భావిస్తున్నాగానీ కొంచెమయినా డబ్బున్నవాళ్లకి దాన్ని సంఘమూ, చట్టమూ కూడా పెద్దగా పట్టించుకోవడం మానేసింది. అమెరికాలో మాత్రం, దాన్ని అరికట్టడానికి – ముఖ్యంగా కాజువల్ సెక్స్ వాళ్ళ వచ్చే ఏక్సిడెంటల్ ప్రెగ్నెన్సీల టర్మినేషన్లకి వాడకుండా వుండేలా – రకరకాల చట్టాలని ఇంకా తేవడానికి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి.

    అందువల్ల, అమెరికా గణాంకాలని అమెరికాకే వదిలెయ్యడం మంచిది.

    • భారత దేశంలో భ్రూణహత్యల ను ఎవ్వరు పట్టించుకొన్నట్లు కనపడదు. వాటి లెక్కలు తీస్తే ఆశ్చర్య పోతారేమో! ఒక్క ముంబాయ్ లో పరిస్థితి ఇలా ఉంది. నిన్న సాక్షిలో వచ్చిన వార్త.

      టీనేజి బాలికల్లో పెరుగుతున్న అబార్షన్లు

      ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో టీనేజి బాలికల అబార్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 2014-15 సంవత్సరంలో అంతకుముందు కంటే ఇది ఏకంగా 67 శాతం పెరిగిందట. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం సుమారు 31 వేల మంది మహిళలు అబార్షన్ చేయించుకోడానికి రాగా, వాళ్లలో 1600 మంది 19 ఏళ్ల లోపువారేనని తేలింది.

      http://www.sakshi.com/news/top-news/abortions-by-under-15-mumbai-girls-up-67-239472

  17. 6 కోట్ల జనాభాతో , అధిక శాతం ఒకే మతానికి చెందిన స్కాండినేవియన్ దేశాలలో సహజీవనం శాతం పెరిగిపోవడంతో స్త్రీలకూ , పిల్లలకూ రక్షణ కల్పించడంలో ఆ దేశాలు తలమునకలవుతున్నాయి.ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కొత్త చట్టాలను తెస్తున్నాయి.
    ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజల మధ్య సంబంధాలు ఎలా వుంటాయో చూడాలి ! ఏ కట్టుబాట్లు లేని ఆదిమసమాజాన్ని చూస్తామా ?

  18. ari sitaramayya says:

    Srikanth M గారు
    “స్కాండినేవియన్ దేశాలు కూడా ఆదర్శం కాదు కదండీ. అక్కడ ప్రతీదానికి సమాజం మీద ఆధారపడి బ్రతకడం మనం చూస్తాం.”

    ఈ మనం అంటే ఎవరో, వారి చూపులో ఈ లోపం ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఒకరిమీద ఆధారపడి బ్రతకటం స్కాండినేవియాలో లేదు. అది ఫ్రీగా ఇస్తాం ఇది ఫ్రీగా ఇస్తాం అని రాజకీయ నాయకులు అనరు. అందరికీ ఆరోగ్యం, చదువు, సోషల్ సర్వీసెస్ అందుబాటులో ఉండటానికి అవసరం అయిన చట్టాలు ప్రజలు ప్రజాస్వామిక నిర్ణయాలద్వారానే అమలు పరచారు.

    “అక్కడి మగవారిని బానిసల్లా చూసే సంస్కృతిని ఎలా సమర్ధించగలం ??”

    అందితే జుట్టూ, అందకపోతే కాళ్ళూ – ఇలా వుంది మీ ఉవాచ. పురుషాధిపత్యం పోయింది. కాని పురుషులు బానిసలు కాలేదు. ఆధిపత్యానికీ బానిసత్వానికీ మధ్య సమానత్వం అని ఒకటి ఉంది.

    P.Jayaprakasa Raju. గారు
    “6 కోట్ల జనాభాతో , అధిక శాతం ఒకే మతానికి చెందిన స్కాండినేవియన్ దేశాలలో సహజీవనం శాతం పెరిగిపోవడంతో స్త్రీలకూ , పిల్లలకూ రక్షణ కల్పించడంలో ఆ దేశాలు తలమునకలవుతున్నాయి.ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కొత్త చట్టాలను తెస్తున్నాయి.”

    అధిక శాతం ఒకే మతానికి చెందటానికీ తర్వాత చెప్పిన వాటికీ ఎలాంటి సంబంధం లేదు. మాతానికీ సహజీవనం పెరగటానికీ ఏంటీ సంబంధం? పరిస్థితులను సమీక్షిస్తూ అవసరాన్నిబట్టి కొత్త చట్టాలను అమలు పరచటం ఏదేశంలోనైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించే ప్రజాస్వామిక ప్రభుత్వాలు చెయ్యాల్సిన పని. అది సంతోషించదగిన విషయం.

    “ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజల మధ్య సంబంధాలు ఎలా వుంటాయో చూడాలి ! ఏ కట్టుబాట్లు లేని ఆదిమసమాజాన్ని చూస్తామా ?”

    ఒకవైపు పరిస్థితులకు తగిన చట్టాలు తీసుకొస్తున్నారు అంటున్నారు. తర్వాత వాక్యంలో ఆ దేశాలు ఏ కట్టుబాట్లు లేకుండా పోతున్నట్లు దర్శిస్తున్నారు. ఈ రెండు అభిప్రాయాలకూ పొంతనలేదు.

    ఇంతకీ ఆదిమ సమాజాల్లో కట్టుబాట్లు అస్సలు లేవా? సరే, లేవనుకుందాం. అది మంచిదా చెడ్డదా? ప్రస్తుతం ఇండియాలో ఉన్న వ్యాపార వివాహ వ్యవస్థకంటే మంచిదా చెడ్డదా?

    • ARI SITARAMAYYA గారూ,

      ఇక్కడ మనం అంటే దృష్టిలోపం లేని వారు అనండీ నా ఉద్దేశ్యం. దృష్టిలోపం ఉన్నవారికి స్కాండినేవియన్ కంట్రీలు “భూతల” స్వర్గములా కనిపిస్తే, అది లేనివారికి “భూతాల” స్వర్గములా కనిపిస్తుంది. ప్రజాస్వామ్య బద్దముగానే అందరికీ అన్నీ అమర్చిన దేశాలు స్కాండినేవియన్ కంట్రీస్ అంటున్నారు… మరి భారతదేశములో కూడా ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రజాస్వామ్య బద్దంగా ఎంచుకున్నవే కదండీ? వీటిని మాత్రం మంది విమర్శిస్తున్నారెందుకు? ఆ దృష్టిలోపమే కారణమా?

      స్కాండినేవియన్ కంట్రీలలో ట్యాక్సులు విపరీతంగా ఉంటాయి. మనిషిని పీల్చి పిప్పి చేసే ట్యాక్సులు. ఆ ట్యాక్సులు వల్ల వచ్చిన డబ్బుతోనే అర్హులకూ, అనర్హులకూ (పనిచేసే వారికీ, పనిచేయని సోమరులకూ) అందరికీ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తోడు ప్రస్తుతం స్కాందినేవియన్ కంట్రీస్ ధనిక దేశాలు కాబట్టి అంతో ఇంతో లాక్కొస్తున్నారు. ఆదాయం తగ్గే కొద్దీ సమాజములో “సోమరులను పోషించడం” అనే లెఫ్టిస్టు విధానానికి కాలం చెల్లుతుంది. గతముతో పోలిస్తే, స్కాండినేవియన్ కంట్రీలలో, ముఖ్యంగా స్వీడనులోనే, ఈ తేడాను గమనించవచ్చు. త్వరలో స్వీడన్ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని రిపోర్టు కూడా చదివినట్టు గుర్తు. దొరికితే లింకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇక ఈ స్కాండినేవియన్ దేశాలలో ఇతర దేశాలు మెల్లగా ఈ తరహా “పరిపాలనకు” దూరంగా జరుగుతున్నాయి. ఎందుకో మీరే ఆలోచించుకుంటే మంచిది. స్కాండినేవియన్ మేడిపండును వలిచిచూపించే ఆర్టికల్ ఒకసారి చూడండి..

      Dark lands: the grim truth behind the ‘Scandinavian miracle’
      http://www.theguardian.com/world/2014/jan/27/scandinavian-miracle-brutal-truth-denmark-norway-sweden

      ఇక స్త్రీ-పురుషుల సమానత్వానికి వద్దాం. స్కాండినేవియన్ దేశాలలో సమాంత్వం ఉంది అన్నట్లయితే..సమానత్వం అనే పదానికి అర్థం మార్చాల్సి ఉంటుంది. ఎవరో అన్నట్లు “అసమానత్వం నుండి అసమానత్వం వైపుకు” అడుగులు వేసిన దేశాలు స్కాండినేవియన్ దేశాలు. ఇప్పుడు అక్కడ పురుషులు సెకండ్ క్లాస్ సిటిజెన్లు మాత్రమే. వారికి మాత్రమే దక్కిన మరో దురదృష్టం ఏమిటంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్త్రీవాద, వామపక్ష ప్రజల కారణంగా వారి దురవస్థను కనీసం చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయింది వారికి. స్వీడనులో అయితే .. ఏకంగా స్త్రీవాదానికి వ్యతిరేకంగా మాట్లాడ కూడదని ఏకంగా చట్టమే ఉంది. కానీ అదే స్త్రీలు మాత్రం మగవారి గురించి ఎన్నైనా రాయొచ్చు. చట్టం ఆ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇదే చట్టాన్ని .. జెండర్స్ మార్చి ప్రయోగిస్తే దాన్ని సౌదీ అరేబియా, తాలిబాన్ నేషన్ అంటారు. అదే పని పాపం మగవారికి జరిగితే మాత్రం దాన్ని “యుటోపియా” అని మగవారి నెత్తిన టోపీ పెడతారు. కనీసం వాక్‌స్వాతంత్రం కూడా లేని జీవితాలను చూపించి.. సమానత్వం అని చెబితే .. ఎలా? ఇదే తరహా చట్టం ప్రస్తుతం యూరప్ అంతా విస్తరింప జేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విన్నా. అది ఇంకా పెండింగులో ఉందో లేక పాసయిపోయిందో చెక్ చేయలేదు. ఇక అక్కడున్న స్త్రీ పక్షపాత చట్టాల గురించి వాటి దురుపయోగం గురించి చెప్పాల్సిన పనిలేదు.

      అందుకే జులియన్ అసాంజే అన్నాడు.. “Sweden is The Saudi Arabia of Feminism”అని (link: http://www.whyileftsweden.com/?p=248). మిగిలిన స్కాండినేవియన్ కంట్రీసులో కూడా దాదాపుగా పరిస్థితి అలానే ఉంది.

      ఇదే కాదు స్వీడనులో మగవారు నిలబడి మూత్రవిసర్జన చేయరాదు, అది నేరం.
      Swedish Left Party Chapter Wants To Make Urinating While Standing Illegal For Men
      link: http://www.huffingtonpost.com/2012/06/13/sweden-left-party-toilet-stand_n_1590572.html?ir=IndiaadsSiteOverride=in

      చివరకి మగవారు మూత్ర విసర్జన చేయడం కూడా ఎలానో చెప్పే దేశాలలో సమానత్వం విలసిల్లుతోందని మీరు భావిస్తే అది దృష్టిలోపముగానే భావించాల్సి వస్తుంది. సింపులుగా చెప్పాలంటే, మగవారు స్కాండినేవియన్ తరహా సమాజం కోసం పోరాడడం అంటే.. మేక మటన్ షాపులు విలసిల్లాలని పోరాడడం లాంటిది.

      • ari sitaramayya says:

        “ఇదే కాదు స్వీడనులో మగవారు నిలబడి మూత్రవిసర్జన చేయరాదు, అది నేరం. Swedish Left Party Chapter Wants To Make Urinating While Standing Illegal For మెన్ link: http://www.huffingtonpost.com/2012/06/13/sweden-left-party-toilet-stand_n_1590572.html?ir=IndiaadsSiteOverride=ఇన్.
        చివరకి మగవారు మూత్ర విసర్జన చేయడం కూడా ఎలానో చెప్పే దేశాలలో సమానత్వం విలసిల్లుతోందని మీరు భావిస్తే అది దృష్టిలోపముగానే భావించాల్సి వస్తుంది.సింపులుగా చెప్పాలంటే, మగవారు స్కాండినేవియన్ తరహా సమాజం కోసం పోరాడడం అంటే.. మేక మటన్ షాపులు విలసిల్లాలని పోరాడడం లాంటిది.”

        శ్రీ కాంత్ గారూ, మగవాళ్ళు నుంచోని వుచ్చ పొయ్యగూడదు అనే నియమం నాకు బాగా ఇష్టమైన నియమాలలో ఒకటి. ఆడవాళ్ళు మాత్రమే బాత్ రూములు శుభ్రం చేసే ఇళ్ళలో ఈ నియమం మగవాళ్ళకు అర్థం కాదు. మీ ఇంట్లో ఏదైనా పార్టీ జరిగింతర్వాత టాయిలెట్ చుట్టూ మగవాళ్ళు పోసిన వుచ్చ తుడిచి శుభ్రం చేసి చూడండి. అప్పుడు మీకే అర్థం అవుతుంది ఈ రూల్ ఎందుకు పెట్టారో.

        ఏమైనా చర్చ వినోద్ గారి ఆర్టికల్ నుంచి చాలా దూరం వెళ్ళింది. ముగించే ముందు ఒక్క విషయం చెప్పాలి. మణి రత్నం కాజువల్ సెక్స్ ని ప్రోత్సహిస్తున్నాడా? నేను ఈ సినిమా చూడలేదు. వినోద్ గారు రాసినంతవరకు ఇందులో ప్రధాన పాత్రలు కొన్నాళ్ళు కలిసున్నారు. వాళ్ళ మధ్య ఉన్న understanding గురించి ప్రేక్షకులకు వివరించలేదు. వాళ్ళ మధ్య ఉన్న సంబంధం కాజువల్ సెక్స్ మాత్రమే అయితే కలిసుండాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసుండాలని ఎందుకు అనుకుంటారు? సెక్స్ కు మించిన భావైక్యతో, ఇష్టమో, మరేదో ఉండాలి కదా? అవి వివరంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నాడు లాగుంది మణి రత్నం. ప్రేక్షకులను కొంచెం overestimate చేసాడేమో.

  19. సీతారామయ్య గారూ!
    ఒకే మతం అని ఎందుకన్నానంటే , భిన్న మతాలు , సంస్క్రుతులు గల దేశంలో జరుగుతున్న కులాంతర , మతాంతర వివాహాల విషయంలో జరుగుతున్న ఘర్షణలను చూస్తున్నాం , ఇక సహజీవనం పట్ల , ప్రభుత్వం చేసే చట్టాల పట్ల వారి ప్రవర్తన ఎలా వుంటుందో అని నా సందేహం !
    స్కాండినేవియన్ దేశాలలో సహజీవనం లోనే కుటుంబ వ్యవస్థ సాఫీగా జరగడానికి ఆ దేశాలలో చేస్తున్న చట్టాల గురించి Nordic Reach Magazine లో చదివాను. ఇంత చేసినా పిల్లల మధ్య సంబంధాలు ఎలా వుంటాయో అని నా సందేహం.
    ఆదిమ సమాజంలో బలవంతుడిదే రాజ్యం అనీ , వారు స్త్రీల పట్ల ఎలా వుంటారో చరిత్రలో చదివాను. అందుకే అలా వ్రాశాను.
    ప్రస్తుత వివాహ వ్యవస్థ గురించి చెప్పాలంటే , అందులో మంచి వుంది , చెడు వుంది. అది వారి ఆలోచన , ఆచరణలకు సంబంధించినది. కాదంటారా !

    • Thirupalu says:

      వినోద్ గారు, చాలా బాగా రాసారండి ఆర్టికలు. నేను ఆలస్యంగా చూశాను. మీరు పండు వలిచి చేతిలో పెట్టి నట్లుగా చెప్పినా అర్ధం కాని వారికి జీవితాలు ఏమర్ధ మవుతాయి. అమెరికాను ఫాల్లో అవుతున్న వారికి అమెరికా వారిని అనుకరించక తప్పదు కదా? మీరు చెపితే వప్పు కుంతారా?

      • తిరుపాలు గారు,

        మీకు అమెరికా అంటే పడదు కదా. అందువలన రష్యా గురించి చెపుతాను. రష్యాలో మగవారు కూడా పెళ్ళిళు చేసుకోవటం ఆసక్తిని కోల్పోయారు. దానికి చాలా కారణలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రభుత్వాలు మహిళలను ఆకటుకోవటనికి వారికి అనుకూలంగా చేసిన చట్టాలు. చట్టాల అండతో రష్యన్ మహిళలు దశాబ్దాలుగా దురుపయోగం చేసిన తరువాత, రషన్ మగవారికి పెళ్ళివలన లాభం లేదనే సత్యం భోధపడింది.

        రష్యాలొ కమ్యునిస్ట్ పాలనలొ జరిగిన యుద్దాలలో ఎక్కువగా మరణించినందువలన మగవారి సంఖ్య తక్కువ. ఉన్నవారిలో పెళ్ళి చేసుకొవాలన్న ఆసక్తి లేదు. రష్యన్ మహిళల పెళ్ళి సమస్య ఎంతవరకు వచ్చిందంటే, అక్కడి వారికి పెళ్ళి కొడుకులను సరఫరా చేయటానికి చైనా వాడు మేరేజ్ బ్యురోలను పెట్టి, మగవాళ్లను ఎగుమతి చేయటం మొదలుపెట్టాడు. చైనావాళ్లను పెళ్ళిచేసుకోవటం రష్యన్ ప్రభుత్వం వారికి నచ్చలేదు. రష్యన్ అమ్మాయిలకు చైనా వారి కన్నా ఇండియా మగవారే సరైన వారని, రష్యన్ అమ్మాయిలకు యోగ్యులైన భర్తలు. వాళ్ళను పెళ్ళి చేసుకొంటే బాగుంట్టుంది అని అభిప్రాయపడ్డారు.

        పరిస్థితి తీవ్రతని తెలుసుకోవటానికి, మరిన్ని వివరాలకు ఈ క్రింది వార్తలను చదవండి.

        1. Marry Indian, save Russia

        http://www.hindustantimes.com/books/marry-indian-save-russia/article1-247530.aspx

        2. Import Indian bridegrooms for Russian brides

        A Russian feminist has proposed a radical solution to the falling birth rate — importing Indian bridegrooms for Russian girls. Maria Arbatova, writer and TV moderator, who married an Indian businessman a few years ago “after 25 years of keeping marrying Russians”, thinks Indian men make ideal husbands.

        “They are crazy about their family and children,” she said presenting her new book, ‘Tasting India’, here. “What is more, Indians, like Russians, are Indo-Europeans, and many Sanskrit and Russian words have the same roots.” Indian bridegrooms can help ward off a Chinese demographic invasion in Russia, says the feminist.

        http://www.thehindu.com/todays-paper/import-indian-bridegrooms-for-russian-brides/article1909722.ece

        కమ్యునిస్ట్ ప్రభుత్వం ఇచ్చిన హక్కులతో రష్యన్ మహిళలలో వచ్చిన మార్పుల గురించి భండారు శ్రీనివాసరావు గారు రాసిన ఈ టపా చదవండి.

        “ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం- ఆడవారికి కొన్ని ప్రత్యెక హక్కులు కల్పించింది. అనేక రాయితీలు, సదుపాయాలూ వారికి సమకూర్చింది. చలి దేశం కాబట్టి చిన్నదో, పెద్దదో ప్రతివారికీ ఒక గూడు అవసరం. కొంపాగోడూ లేనివాళ్ళు మనవద్ద మాదిరిగా ప్లాటు ఫారాలపైనా, ఫుట్ పాతులపైనా రోజులు వెళ్లమార్చడానికి అక్కడ వీలుండదు. ఇళ్ళ కేటాయింపు కుటుంబంలో ఆడవారి పేరు మీద జరిపే పధ్ధతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి వ్యవహారాలలో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా చదువులు ఉద్యోగాలలో మగవారితో పోటీ పడి సంపాదించుకున్న ఆర్ధిక స్వావలంబన వారి స్వేచ్చా జీవితానికి ఆలంబనగా మారింది. ఇంటిమీద హక్కులు, ఆర్దికపరమయిన వెసులుబాటు లభించడంతో ఇళ్ళల్లో వారిదే పైచేయి అయింది. నిండా యిరవయి ఏళ్ళు నిండకుండానే ఇద్దరు ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా వారి సొంతం అయింది. మాస్కో రేడియోలో పనిచేసే నటాషా చెప్పినట్టు ‘పండగనాడుకూడా పాత మొగుడేనా ‘ అనే వారి సంఖ్య పెరిగింది.

        సోవియట్ రష్యాలో ఏటా పెరిగిపోతున్న విడాకుల పట్ల అక్కడో జోకు ప్రచారంలోకి వచ్చింది. విడాకులు ఎవరు ఇచ్చినా, కొత్త ఇల్లు కేటాయించేవరకు పాత పెళ్ళాంతోనూ, పాత పెళ్ళాం కొత్త మొగుడితోనూ కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో కొన్నాళ్ళపాటు నివసించాల్సిన పరిస్తితి మగవాళ్ళది. ఈ దుస్తితి పగవాళ్ళకి కూడా రాకూడదురా బాబూ! అని చెప్పుకునేవారు”

        (సశేషం)

      • http://bhandarusrinivasarao.blogspot.in/2010/01/blog-post_8240.html

        చైనా లో పరిస్థితి

        China tries to stop women marrying for money, rather than love

        With divorce rates soaring, and widespread worries about a new culture of hyper-materialism, the Chinese government is now trying to stop women marrying for money.

        “I would choose a luxury house over a boyfriend that always makes me happy without hesitation,” said one 24-year-old contestant on If You Are the One, one of China’s most popular television dating shows. “And my boyfriend has to have a monthly salary of 200,000 yuan (£18,900),” she demanded.

        http://www.telegraph.co.uk/news/worldnews/asia/china/8714097/China-tries-to-stop-women-marrying-for-money-rather-than-love.html

        కమ్యునిస్ట్ దేశాలలో సైతం పెను మార్పులు జరుగుతూంటే అమెరికాను ఫాలో అవుతున్న వారు అని అనటం సబబుగా లేదు.

        పెదరాయుడిలో సినేమాలో భూస్వామి మోహన్ బాబు, సౌందర్య సూట్ కేస్ ఎత్తుకొని ఇంటినుంచి వెళుతుంటే, తమ్ముడిని తిట్టి, కుటుంబ పెద్దగా ఆ ఆస్థుల పత్రాలను సౌందర్య చేతిలోపెడతాడు. ఆయన తీర్పు చెప్పేటప్పుడు తమ్ముడి నుంచి కనీస వివరణకోరడు.
        అలాగే ఈ వ్యాసరచయిత మగవారి కోణం నుంచి ఏమాత్రం ఆలోచించకుండా , సమాజంలో వచ్చే మార్పుల వలన నష్టాలను మగవారిని బాధ్యులుగా చేస్తూ, ఫ్రీ లవ్ వలన మగవాడికి భూమ్మీద “స్వర్గం” తయారయినట్టే అని పెదరాయుడిలా ఏకపక్ష తీర్పు ఇచ్చేశారు. దానిని మీవంటివారు ఆమోదించటం సరికాదేమో! ఒకసారి ఆలోచించండి.

  20. ARI SITARAMAYYA గారూ,

    నేను మీరు ఇచ్చిన లింకు పూర్తిగా చదివినట్టులేదు. అందులో మూత్ర విసర్జన సమయములో మూత్రం అలా పక్కన పడడానికి కారణం వివరంగానే రాశారు. కాబట్టి, కూర్చొని మూత్రవిసర్జన చేసినా అంత కన్నా గొప్పగా ఫలితం ఉండదు. అది కాక, ఇల్లలో జరిగే పార్టీల సమయములో ఆవిధంగా ఎవరైనా రిక్వెస్ట్ చేసినా అర్థం చేసుకోవచ్చు లేదా కన్సిడర్ చేయొచ్చు. కానీ, ఇక్కడ పబ్లిక్ యూరినల్స్ గురించి మట్లాడుకుంటున్నాం. పబ్లిక్ యూరినల్స్, నిలబడి మూత్ర విసర్జన చేయడానికి అనువుగా తగిన హైటులో ఉంటాయి. అక్కడ అలా మూత్రం పక్కకి వెదజల్లబడే అవకాశం తక్కువ. (Unisex Urianals కాకుండా మగవారికోసం ప్రత్యేకంగా యూరినల్స్ ఏర్పాటుచేస్తే సమస్యేలేదు. ఆడవారికి ఇబ్బంది ఉండదు, మగవారికీ ఇబ్బంది ఉండదు.)

    ఈ మూత్రవిసర్జన అంశం నీట్‌నెస్‌కు సంబందించినది కాదు. మగవారూ, ఆడవారూ ఒకేలా ఉండాలి అన్ని విధాలా..! అనే ఉన్మాదానికి సంబందించినది. ఈ తరహా ఉన్మాదం స్కాండినేవియన్ కంట్రీసులో చాలా ఎక్కువ. మగవారిని స్కర్టులు ధరించి పనిచేయించడం. నేషనల్ ఫ్లాగులో ఉన్న సింహం బొమ్మని Castrate చేయడం వంటి విపరీతమైన చాదస్తం వీరి సొంతం. వీరితో పోలిస్తే కరుడుగట్టిన మతవాదుల ఆలోచణా ధోరణి (మతం విషయములో) కాస్త నయం అనిపిస్తుంది. అందుకే అంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంకో విషయం, జర్మనీలో ఇలా నిల్చుని మూత్రవిసర్జన చేయడం మగవారి హక్కు అని కోర్టు తీర్పు ఇచ్చింది.

    German court rules that men can urinate while standing
    link: http://www.bbc.com/news/world-europe-30937492.

    నిజమే చర్చ, టాపిక్కును దాటి చాలా దూరం వచ్చింది. కానీ, కామెంట్ల మీద కామెంట్లు, చర్చ కొచెం పక్కదారి పట్టడం అనేది ఎక్కడైనా సహజమే. మణిరత్నం నిజంగా క్యాజువల్ సెక్స్ తప్పు కాదు అని చెప్పదలుచుకుంటే, ఆయన అలా చెప్పడం తప్పు కాదన్నది నా ఉద్దేశ్యం. ఇంతటితో ఈ చర్చను నేను నావైపు నుండి ముగిస్తున్నాను.

  21. G B Sastry says:

    వివాహ వ్యవస్థ కుటుంబవ్యవస్థ లోపాలతో నిండి ఉన్నాయి అనేవారు వాటికన్నా మంచి వ్య్వస్తలని చూపి ముందుతరాలను సమాజానికి అందించే తీరుగూర్చి చెపితే చాలాబాగుంటుంది.
    విచిన్న మౌతున్న వివాహ వ్యవస్థలో పిల్లలు పడుతున్న బాధలు చూస్తె పుట్టకుండా ఉంటె బాగుండునన్న భావం కలుగుతోంది
    తల్లి తండృలు వారి వారి మార్గాలలో లేచిపోవడాలు,చావడాలు,చంపడాలు చేస్తుంటే అన్ని ఉండి ఏమీ లేనివారి గా సమాజంపై అసహ్యాన్ని పెంచుకుని అసాంఘిక శక్తులుగా తయారవుతున్నారు ప్రేమాభిమానాలు లేకుండా పెరిగిన వారౌతున్నారు
    మేధావులు చాపకింద నీరులా ప్రబలుతున్న ఈ భయంకర కోణం వైపు ద్రష్టి సారిస్తే మంచిదేమో ?

Leave a Reply to Bharadwaj Godavarthi Cancel reply

*