యూరిన్ పోలిటిక్స్

పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

vijaykumar viktar” యూరిన్ కాషాయం రంగులో ఉందిరా ఇప్పుడు “

 ఇండియా గేట్ ను ఎగా దిగా చూస్తూ నాలుక కొస నుండి సిగరెట్ పొగ వదుల్తూ అన్నాడు మా వాడు. వాడి పేరు రాబర్ట్ నాగేంద్ర. వాళ్ళ తాతకు బ్రిటీష్ టైం లో రాబర్ట్ అనే దొర హెల్ప్ చేసాడని వీడి పేరుకు ఆ తల అతికించాట్ట.  సన్నగా జొన్న మొక్క బెండులా ఉంటాడు. దానికి తోడు నాగజెముడు పొదల్లా గడ్డం. పైన బట్ట తల. కేప్ పేట్టి ఒసామా బిన్ లేడెన్ అంటే నమ్మేయొచ్చు.

” టెస్ట్ చేయించుకో…..అబ్బ….బాబూ ! ఆ సిగరెట్ ఆపరా… ఆ కంపు భరించలేను నేను ” అన్నా. ” పబ్లిక్ లో తాగుతూ చట్టాన్ని కూడా అతిక్రమిస్తున్నావు. పోలీసోడు చూస్తే ఫైన్ వేస్తాడు ”

వాడు ఫక్కున నవ్వాడు. ” అరేయ్ బాబాయ్ ! నీవు ఫ్రాంక్ గా ఒక మాట చెప్పరా. సిగరెట్ పబ్లిక్ గా తాగితే  Cigarette and Other Tobacco Products Act  కింద రెండొందలు లేదా ఐదొందలు జరిమానా వేస్తారేమో. ఇంట్లో మొక్కల చుట్టూ రోజూ యూరిన్ పోస్తే పక్కింటొడికి వచ్చే కంపుకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 268 కింద పబ్లిక్ న్యూసెన్స్….అదెంత పెద్ద అఫెన్స్ తెల్సా ? బొక్కలోకి తొయ్యొచ్చు ”

” వెళ్ళి గడ్కారికి చెప్పు ” నేను పార్కులో మొక్క కున్న పువ్వు తెంపి ముక్కు వద్ద పెట్టుకుని పీల్చాను.

నా మొహం మీద పొగ ఊదాడు. వాడికి నేనంటే చిన్నప్పటుండీ ఒక ఎగతాళి. కలిసే పెరిగాం కదా అందునా బాల్య స్నేహం …భరించాలి !

” గడ్కారి ఇంట్లో మొక్కలకు యూరిన్ పోస్తానంటే పక్కింటోళ్ళకు న్యూసెన్స్ . అది అఫెన్స్ అనే విషయం వదిలేసి యూరిన్ లో గొప్ప తనాలు వెతుకుతారేంద్ర భయి ?! ”

” యూరిన్ లో లీటర్ కు పది గ్రాముల దాకా యూరియా ఉంటుంది. నీవు నెల రోజులు ఒక మొక్క చుట్టూ పోస్తూ ఉంటే కనీసం పావు కేజీ యూరిన్ దానికందుతుంది. అదే క్వాంటిటీ యూరియా ఫర్టిలైజర్ కొనాలంటే కేజీ సుమారు ఐదు, ఆరు రుపాయలౌతది. సేవింగ్ ఏ కదమ్మా ఇదంతా ? ”

వాడు గడ్డం వాడే లాక్కుని అన్నాడు ” ఈ లెక్కన టాయిలెట్స్ రావడం వల్ల మన దేశ సంస్కృతి కూడా దెబ్బ తింటుంది అన్న మాట ” ఏదో అనలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.

” తెలుసు….పబ్లిక్ గా పిస్ కొట్టడమే కదా ?”

‘ ధభా ‘ అని వీపు చప్పరించి ఫక్కున నవ్వాడు ” వెరీ షార్ప్ ”

” సోచ్ హోతో శౌచాలయ్ హై…రాంగ్….సోచ్ హో తో శౌచాలయ్ నహీ కరెక్ట్. చాలా విచిత్రంగా మోదీ ఒకటి కష్టపడి చెప్తాడా ? ఆయన వెనకాలే వీళ్ళందరూ ఇంకోటి చెప్తారేంద్ర భయ్ ” వేసాడు ఇంకోటి వీపు మీద.

ఒక ఫేమిలీ దూరంగా పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారు. చిన్నపిల్లోడు చల్లటి సాయంత్రం లో పచ్చటి గడ్డి బయల్ల మీద బాల్ తో ఆడుకుంటున్నాడు. అక్కడ ఇంకా కొన్ని ఫేమిలీస్ కలిసి సమయం గడుపుతున్నారు.  సాయంకాలం ఇండియా గేట్ దిట్టంగా కనిపిస్తుంది.  మధ్యలో ద్వార ప్రవేశం ‘ కొండంత అండగా ఉంటాను నీవిటొచ్చేయ్ ‘ అన్నట్టు ఉంటుంది.

BottledUrine

” మన హైదరాబాద్ రింగ్ రోడ్డులో చెట్లు నాటుతున్నారు. ఒక్కో చెట్టుకు ఒక్కో కవర్ కట్టి ”  Please piss here. We shall be glad  ‘ అని పెట్టాలి ” అన్నాడు.

” యా….అసలు పెద్ద పనికే ఒక ప్రొవిజన్ పెడ్తే ఇంకా బాగుంటుంది.  you get lot of organic fertiliser   ”

” రోడ్డు మీద ట్రావెల్ చేసే వాళ్ళకు  ” Please carefully drive…organic fertilisation in process   ‘ అని పెట్టాలి ”

ఇంకో సిగరెట్టు తీసాడు. ” ఒరేయ్…ప్లీజ్…దూరంగా వెళ్ళి తాగురా…” అన్నా.

వాడో అనాథ. చిన్నప్పుడు బీడీలు తాగేవాడు. చదువు లో మాత్రం ఫస్ట్ ఎప్పుడూ. నేనే లాస్ట్. వాడికి ఉద్యోగం చేయడమంటేనే అలర్జీ . నే ఉద్యోగం చేస్తూ పది సంవత్సరాలు గడిపినా వాడు మాత్రం ఇంకా హైదరాబాదులో నిరుద్యోగిగా పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు.

” ఏదో రోజు ….ఇదే కంపును ఆనందంగా అహ్వానించే రోజు రాక మానదు లే నీకు. కంపుగున్నవి , కంటగింపుగా ఉన్నవి ఇంపుగా, ఇల సొంపుగా అవుతాయి.  వెయిట్ అండ్ సీ ….శివుడు హాలాహలం కంఠం లో దాచుకున్నందుకు ఆ వేడిని తట్టుకోడానికి ఏం తాగాడో తెలుసా ? ఇదే పొగనిచ్చే గంజాయిని…..ఈ పొగ కూడా డివినిటీ తీసుకుంటుంది త్వరలో….ఇదే పొగను రిఫైన్ చేసి ఆహా ఒహో అంటూ వాడుకునే  రోజులొస్తాయ్ ఇక……” అని ఆ చివరి సిగరెట్టును జాగర్తగా జెబులో కూర్చోబెట్టాడు.

” మరేం   !…….కౌ యూరిన్ రిఫైనరీ రాజస్థాన్ లో పెట్టారు. డివినిటీ నో గాడిద గుడ్డో…ఐడియా జీవితాన్ని మార్చేసింది కదా ?! ”

” హలో….చెన్నై లో సిటీ మధ్యలో పొంగిపొర్లే  డ్రైనేజ్ గంగ పక్కనే 2000 సంవత్సరం లో ప్లాంట్ పెట్టి ఇప్పటి వరకు …అందులో డ్రైనేజి వాటర్ నుండి మినరల్ వాటర్ కన్నా మంచి నీళ్ళు తయారు చేస్తున్నారు. లీటర్ కు ఐదు పైసల కన్నా తక్కువ ఖర్చులో. నీటి బెడద ఉన్న  ప్రాంతాల్లో ఫేక్టరీకి కావాల్సిన నీళ్ళు అవే వాడుకుంటున్నారు.  ఇంతకన్నా మంచి ఆయిడియా ఉందా , యాక్చువలీ ?  ”

” ఓహో ! నీటి కొరత ఉండే చెన్నై లో ….అంత మంచి నీళ్ళు మరి జనాలకు సప్లై చేయొచ్చు కదా ? ”

” మన దేశ సంస్కృతి గో మూత్రం తాగడం పర్మిట్ చేస్తుంది. మనుష్యులది కాదు ”

నేను వాడి భుజం మీద ఆప్యాయంగా చేయేసాను. వీడికి మనుష్యులంటే మాత్రం ఎందుకంత మక్కువో ?!  చూడ్డానికి వాడు సమాజం లో చితికి పోయిన  నిరుద్యోగి లా ఉంటాడు కానీ , ఒక స్ట్రక్చర్ లో పని చేయాలంటే చిరాకు వాడికి. అందుకే మార్కెటింగ్, సాఫ్ట్ వేర్, పబ్లిక్ రిలేషన్స్ లలో వాడికో మూడు , నాలుగు ఉద్యోగాలొచ్చినా ఎక్స్ పెరిమెంట్ చేసి, పడక వచ్చేసాడు.

కలిసి నడుస్తున్నాము.

మబ్బులు కమ్ముకున్నాయి కదా…..ఇండియా గేట్ మీద మేఘాలు అందంగా అటూ ఇటూ తచ్చాడ్డం బాగుంది.

వాడు గడ్డం గోక్కుంటూ కంటిన్యూ చేసాడు.

” బయో డైజెషన్ ప్రాసెస్ తెల్సు కదా ? గో మూత్రమే కాదు …ఏ మూత్రమైనా….ప్రాసెస్ చేస్తే మీథేన్ వస్తుంది…అదే మన అంబాని అందరికీ టొపీ పెట్టిన సహజ వాయువు….వీళ్ళ బొంద…..గో మూత్రం కెమికల్ కంపోజిషన్ గమనిస్తే , గొర్రె మూత్రం చూసినా, ఒంటె మూత్రం చూసినా కొంత తేడా ఉంటుంది కాని ఆర్గానిక్ ప్రాపర్టీస్, మెటీరియల్ గా ఏవీ తేడా ఉండదు. ”

‘ వీడిప్పుడు టెక్నాలజీ మూడ్ లోకి వెళ్ళాడు ‘ అనుకున్నాను. ”  Urine is Urine. Its excreta of living beings containing several biological waste elements   ” అని పక్కనుండి పాస్ అయిన పటియాలా డ్రస్ పంజాబీ అమ్మాయిని సాలోచనగా చూస్తూ అన్నాడు.

వాడి గడ్డం లాగి నా వేపుకు తిప్పుకుని, వాడు వదిలేసిన పాయింటు దగ్గర కంటిన్యూ చేసాను.  ” మొరార్జీ దేశాయ్ గొప్పోడురా…అప్పట్లోనే …మూత్రం తాగేసాడు మొహమాటం లేకుండా. … జనాలే అపహాస్యం చేసారు. కానీ …ఇంట్రెస్టింగ్ ఏంటంటే…మొరార్జీ సిండ్రోం  కళ్ళ ముందు ఉండగా, జంకకుండా, గడ్కారీ ఇలా ఓపెన్ గా చెప్పుకోడానికి భలే తెగింపులే  ? ”

State of waters - boy and frog

” ఎంత ధైర్యమైనా వస్తుందిరా. ఇంతకు మునుపెప్పుడన్నా దేశ ప్రతిష్ట గంగలో కలిసి పోతుంది అనే కాన్సెప్ట్ తో చట్టం పని చేయడం చూసావా ? ”

” లే ”

” దేశ జనాభా , కుటుంబ నియంత్రణ అని స్మరించే మనము – పందుల్లా పదేసి మందిని కనడం మన కర్తవ్యం, గురుతర బాధ్యత అని ధైర్యం చేసి ఎవడన్నా అంటాడు అని ఊహించావా ? ”

” లే ”

” ఇదీ అంతే ….. సౌదీలో ఇస్లామిక్ ఆర్థిక శాస్త్రం ఉంటుంది. ఇక్కడ కూడా అదే తరహాలో మత ఆర్థిక శాస్త్రం …. ”

నేను వెంటనే అన్నాను ” వెస్ట్రన్ ఎకానమిస్ట్స్ ఇస్లామిక్ ఆర్థిక శాస్త్రాన్ని ఆకాశానికెత్తినప్పుడు దీన్ని ఎందుకు తలకెత్తుకోరు ?! ”

” వెస్ట్రన్ నాయాళ్ళు. స్పైన్ లేని నాయాళ్ళు. వాళ్ళ మాట చెప్పక ”

వాడు – మేము కాలేజీలో ఉన్నప్పుడు నేను రంగ నాయకమ్మ పుస్తకాలు చదివితే ఇరిటేట్ అయ్యి లాక్కుని ” సెల్ఫ్ లవ్ ‘ స్టోరీలు చదవక ” అని విసిరికొట్టి చేతిలో ” చీకటి రోజులు ” ” చిత్ర హింసల కొలిమిలోంచి ” లాంటి నావల్స్ పెట్టేవోడు. ఏమిరా అంటే ” లోయలో పడే మనుష్యులను రక్షించాలనుకునే రచయితలు లోయలో పడే మనుష్యుల వ్యథను  వివరిస్తారు…వర్ణిస్తారు….కాని లోయల నైసర్గిక పరిణామాలను, జారి పడే మనుష్యుల అవలక్షణాలను  విశ్లేసిస్తూ తమ ఐ క్యూ ను, ఏప్టిట్యూడ్ ను చాటిచెప్పుకుంటూ ‘ సెల్ఫ్ లవ్ ‘ డిస్ప్లే చేయరు ” అనే వాడు.

వాడికి సిగరెట్ తాగాలనే అర్జ్ పెరిగినట్టుంది. అందునా ఒకటే సిగరెట్ మిగిలి ఉంది వాడి దగ్గర. ఊరికే చేతులు జేబు మీద పెట్టి తడుముతున్నాడు.

” లుక్…మన దేశ సంస్కృతిని మనం ఎత్తి పట్టాలి ”

” అందుకేగా టాయిలెట్స్ తీసేయాలి అనేది. అదే భారతీయ సంస్కృతి కూడా !”

పిల్లోడు ఆడుకుంటున్న బాలు ‘ టపీ ‘ మని రాబర్ట్ గాడి యెదపై వచ్చి కొట్టుకుంది. పిల్లోడు బాలు పట్టుకుని వెనక్కి చూడకుండా పరిగెత్తుకెళ్ళాడు…పొరపాట్న ఎక్కడ ఆపేస్తాడో అన్నట్టు.

రాబర్ట్, బంతి దెబ్బకు జేబులో నలిగి పోయిన సిగరెట్టును వేళ్ళ మధ్య అటూ ఇటూ తిప్పుతూ చూస్తూ ఉన్నాడు.

” మన సంస్కృతికి , రాజకీయాలు ముడేస్తే ఏమౌతుంది ? ”

” ఉ____   రాజకీయాలు పుడ్తాయ్ !! ”

వాడికి బాగా కాలినట్టుంది …………… …………..!!!!

మీ మాటలు

  1. P V Vijay Kumar says:

    Editor garu ! u made the article more palatable with apt photos…:) …Thanq

  2. Nisheedhi says:

    Intrestingly written cool satire .loved the frog image .

    • vijay kumar says:

      i hope i havnt bored u this time. :)…..i too like the pic..and we r like the same frog in the picture….:) :)

  3. విలాసాగరం రవీందర్ says:

    బాగా రాసారు విజయ్ కుమార్ గారు

  4. P Mohan says:

    పంచ్ బావుంది. మహారాష్ట్ర లోనే అనుకుంట ఒక మంత్రి .. సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్ళు లేవని రైతులు ఘోషపెడితే గడ్కారి మాదిరే కంపు మాట మాట్లాడినాడు.. వాటిని మూత్రం పోసి నింపండి అని. మొత్తానికి నాగపూర్ పేషీకి కంపు అంటే యమ ఇష్టంగా ఉంది. గడ్కారికి కంపు(మీథేన్), బయో ఫ్యూయల్ వంటి ఫ్యాక్టరీ లు ఉన్నయ్యి. అందుకే, ఎక్క్దికెల్లినా ఒకటే సోది..పెట్రోల్, డీజిల్ వద్దు అని.
    గడ్కారిపై ఉన్న కేసులపై సజావుగా విచారణ జరిగితే అతడు ఈపాటికి జైల్లో ఉండేవాడని అంటారు. బీజేపి నేతల చీకటి జాతకాలు అతగాడికి తెలుసు కనకే అతనిపై ఈగ వాలడం లేదట.

    • Giri Prasad says:

      పదేళ్ళుగా కేంద్రం లో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టినే కదా అధికారంలో ఉన్నది. గడ్కరి మీద అన్ని ఆరోపణలు ఉంటే గత ప్రభుత్వం ఎందుకు మూసుకొని కూచుంది? టివి లో స్కాం జరిగిందంటూ పది రోజులు ప్రచారంచేసిన వాళ్లు, పోలిస్ స్టేషన్ లో కనీసం యఫ్.ఐ.ఆర్. ను కూడా ఫైల్ చేయలేదు. ఇటువంటి ఒట్టి సొల్లు మాటలకు ఈ రోజుల్లో పూచిక పుల్లంత విలువలేదని గ్రహించండి.

    • vijay kumar says:

      whatever the manuvadi sanghis do, they generally do it with no brains

      • Giri Prasad says:

        whatever the manuvadi sanghis do, they generally do it with no brains

        మీలాగా గత 30యేళ్లుగా సంఘ్ ను విమర్శించే వారిని చూస్తూనే ఉన్నాను. సంఘ్ దిన దిన ప్రవర్ధమానమై సంఘ్ అభ్యర్ధి దేశ ప్రధాని పదవిని చేపడితే, అప్పట్లో దానిని వ్యతిరేకించే వాళ్ళు, ఇప్పుడు ఎక్కడున్నారో ఆచుకిలో కూడా లేరు. సుమారు 50 ఏళ్లు గా ఎన్నో ఎత్తు పల్లాలు, ప్రతి కూలతలు చవిచూసి అనేక రాష్ట్రాలలో అధికారం, కేంద్రంలో అధికారం చేపట్టిన సంఘ్ వారి తెలివితేటలు చెప్పకనే చెబుతున్నాయి. మీరు నమ్మిన సిద్దాంతం ప్రచారం చేసి, 20 యం.యల్.ఏ. సీట్లు గెలిచి సర్టిఫికేట్ ఇస్తే ప్రజలు మీమాటలను విశ్వసిస్తారు. సంఘీలకు బ్రైన్ లేదు అని ఉబుసుపోకు కథలు రాసుకొనే వారిచ్చే సర్టిఫికేట్ నాలిక గీక్కోవటానికి కూడా పనికి రాదు. ఆ సర్టిఫికేట్ ఫ్రెం చేయించి మీదగ్గరే పెట్టుకొండి.

  5. గడ్కారి కొంపదీసి తులసి మొక్కలకు మూత్రం పోయలేదు కదా.. శివశివ..!

  6. Giri Prasad says:

    గడ్కరి అన్న రెండుమాటలు పట్టుకొని,సెటైర్ కోసం పలు పలు విధాలుగా ఆలోచించి ఇన్ని లైన్లు, పోటోలు పెట్టి రాయవలసిన అవసరం ఉందా? సమయం వృథ.

  7. bhaskar says:

    బాగుంది. రెండు రోజుల నుంచి బజారులో ఎక్కడ పువ్వులు చుసిన నాకు ఒకటే వాసనా వస్తుంది. మల్లి నేను నార్మల్ ఎప్పుడు అవుతానో? :( :( ఇది చదవడం సమయం వృధా అనుకునేవాళ్లు మరి ప్రతీ కామెంట్ ని ఎందుకు ఫాలో అవుతున్నారో? సమయం వృధా కాదు?

    • vijay kumar says:

      Even if u pour poison around them, plants absorb organic matter unlike we Indian absorb whatever we come across under the pretext of ” waste of time “

  8. Giri Prasad says:

    బజారులో పూలవాసన చూసి నార్మల్ గా లేని వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానాలు ఎవరైనా ఇస్తారా?

  9. mercy margaret says:

    మాంచి సెట్టైర్ .. !! :) :)

  10. Lalitha P says:

    కాషాయంవాళ్ళు ఓ పక్క సిగరెట్లకీ కేన్సర్ కీ సంబంధం లేదంటారు. మరోపక్క ఈ యూరిన్ యూరియాలు మాట్లాడతారు. భారతీయ సంస్కృతి ఓ వైపూ మార్కెట్ మరోవైపూ లాగుతుంటుంది వాళ్ళని. అందుకే వాళ్ళని వేళాకోళం చెయ్యటం సులభం. మిగతా పార్టీలు ఆధునికం కాబట్టి సంస్కృతి గొడవేం ఉండదు. అంతా మార్కెటే. ఉచ్చని రొచ్చు అనుకుంటే దానికంటే సిగరెట్టు మరీ ప్రమాదం అనే ఆలోచన సరైనది కాదా విజయ్ కుమార్ గారూ. మీరే చెప్పినట్టు యూరిన్ లో పనిలోచ్చే యూరియా అయినా ఉంటోంది. తల్లకిందుల రాజ్యం కాబట్టి ఉచ్చ పబ్లిక్ న్యూసెన్సు అయి జైల్లో కూర్చునేంత నేరం అయిపోతే, సిగరెట్టు జరిమానాతో సరిపోయే నేరం. సిగరెట్టును ఫాషన్ స్టేట్మెంట్ చేస్తే అది మాంచి మార్కెట్ అని కనిపెట్టి, 19 వ శతాబ్దంలో చేసిన పాలిటిక్స్ సామాన్యమైనవి కాదు. ఆడవాళ్ళని కూడా అందులోకి లాగారు. నిజానికి స్త్రీలు సిగరెట్ తాగితే మరీ ప్రమాదం. పుట్టబోయే బిడ్డలకు కూడా. మరి మన గొప్ప రచయితల నుంచీ రొమాంటిక్ సినిమా హీరోల నుంచీ నవలా నాయకుల వరకూ, ఇంకా మీ మేధావి ఫ్రెండ్ వరకూ అది ఎంత స్టైల్ స్టేట్మెంట్ అయిందో చూస్తున్నాం.

    ఉచ్చ రొచ్చులూ, డియోడరెంట్ కంపులూ, మల్లె వాసనలూ అన్నిరకాల రొమాంటిసిజాలనూ పూర్తిగా చర్చించాలి. ఆధునికమైన ప్రతీదీ గొప్పది కాదు. అలాగే ప్రతి పాతదీ పవిత్రమూ కాదు. మన సంస్కృతికే కాదు. ప్రపంచంలో ఏ సంస్కృతికైనా మార్కెట్, మతం ముడేస్తే రాజకీయాలే పుడతాయి. సెప్టిక్ టాంక్ ల్లోంచి మలాన్ని తీస్కెళ్ళి సేంద్రీయ ఎరువులో కలుపుతారు. అది తెలిస్తే జనం అసహ్యించుకుంటారని ఆ విషయం చెప్పరు. కానీ అది మంచి డిస్పోసల్ టెక్నిక్. దాన్ని జనం అంగీకరించే పరిస్థితికి తేవాలి. దేనికైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ సరిగ్గా దొరికితే దాన్ని సంస్కృతి కూడా అంగీకరించేలా చెయ్యాలి. మూత్రం లో విలువ ఉంటె తులసికి పోస్తే మాత్రం తప్పేంటి ? ఇప్పటి అవసరాలివి.

  11. Vijay Kumar says:

    మేడం ! Thanq for the comment. There are too many things which are parallel and some are contradictory , in the remark put by you, I need to address. I will try to be as successful as possible to address. మొదటగా సంఘ్ పరివార్ ను వేళాకోళం చేయడం మాత్రమే కాదిది. మొత్తంగా ఫాసిజం ఫంక్షనింగ్ ను అర్థం చేసుకోవడం – how they create baseless sentiments .

    What fascism internationally does is, it kills basic reasoning. This looks simple to me and to you , but it is dangerous. ఒక సారి హిట్లర్ స్త్రీ పురుష సంభోగం గురించి రాస్తూ ఇలా అంటాడు – The society formed by the male with the female, where it goes beyond the mere conditions of mating, calls for the extension of the instinct of self-preservation, since the readiness to fight for one’s own ego has to be extended also to the mate……. If Nature does not wish that weaker individuals should mate with the stronger, she wishes even less that a superior race should intermingle with an inferior one; because in such a case all her efforts, throughout hundreds of thousands of years, to establish an evolutionary higher stage of being, may thus be rendered futile.

    హిట్లర్ జర్మనీ ఆటో పరిశ్రమ రంగాన్ని వృద్ధి చేసిన వాళ్ళల్లో ఒక ప్రధాన పాత్ర పోషించాడు. అదే గొప్ప హిట్లర్ ఇలాంటి ఫూలిష్ సెంటిమెంట్స్ రెచ్చ గొడతాడు. రాజ్యాధికారం కోసం ప్రయత్నించే ఫాసిస్ట్ బలాల behaviour ఇది. మన ఖర్మ కాలి , మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చి చూస్తే, మన దేశం లో బ్రాహ్మణీయ మనువాది శక్తుల బలం వల్ల ఇక్కడ ఫాసిజం తిరగ తోడబడుతుంది.

    ఇందులో ఆధునికతకు సంబంధించిన విషయం ఏమీ లేదు. సాటిలైటు ప్రయోగించే ముందు కొబ్బరి చిప్ప పగల కొట్టే ఆధునికత , మన దేశ బ్రాహ్మణీయ మనువాదం ఇచ్చిన బహుమతి. బీ జే పీ లాంటి ఫాసిస్ట్ పార్టీలు నిస్సిగ్గుగా చేస్తాయి. మిగతా పార్టీలు చేయవు . అదే తేడా.

    ఇక మార్కెట్ శక్తుల విషయానికొస్తే – మోదీ ప్రభుత్వానికి మార్కెట్ లో ఉండే ఆదరణ ఇంత వరకు ఏ ప్రభుత్వానికి రాలేదు అనేది బహిరంగం. మోదీ ని సపోర్ట్ చేసిన ప్రతి కార్పోరేట్ కు తెలుసు – He has steered a well-designed murder అని. ఇక్కడ మార్కెట్ శక్తులకు మరియు బ్రాహ్మణియ మనువాది శక్తులకు contradiction లేదు. రెండూ మమేకమై దేశాన్ని దోచుకోడానికి బయలు దేరాయి.

    ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల కన్నా ప్రధాన మైనది…ప్రమాదకరమైనది ….. బ్రాహ్మణియ మత ఛాందస వాదం. ఎన్నడూ లేనంత గా దళితులు, మైనారిటీలు, స్త్రీలు – అభద్రతకు లోనవుతున్న పరిస్థితి ఉంది. దీన్ని vehement గా వ్యతిరేకించిన చరిత్ర ఒక్క అంబేద్కర్ కే ఉంది ఈ దేశం లో. అందుకే అంబేద్కర్ ను తీవ్ర స్థాయిలో saffronise చేయడం జరుగుతుంది.

    ఒకే కాలం లో ఇన్ని ముఖాలు చూపించే కుట్ర పూరిత రాజకీయాలు ఒక్క ఫాసిస్ట్ పార్టీలకు మాత్రమే సాధ్యం అవుతుంది.

  12. vijay kumar says:

    is there any comment deleted by chance ?

  13. Nageswara Rao says:

    ఆర్యా.. మీకు హిందువుల మీద ద్వేషం తప్ప మరేమీ తెలియదా? గడచిన కొద్ది వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ సోదరుల పైన దాడులు చేస్తున్న టెర్రరిస్టుల గురించి ఒక్క మాట కానీ ఒక కబురు కానీ లేదే మీ పత్రికలో? వారి పైన అంతటి ప్రేమకి కారణమేమిటి? హిందువులు చేసిన పాపమేమిటి? లిబరల్ సేకులర్ అంటే హిందూ వ్యతిరేకమనే అర్థం తీసుకోమన్నారా?

  14. Nageswara Rao says:

    మీ పత్రికలో బాలేన్సేడ్ గా ఉండే విలువలు క్రమంగా పోతున్నాయి..చాలా నిరాశగా ఉంది..

  15. vijay kumar says:

    నాగేశ్వర రావు గారు , ధన్యవాదాలు. మన భారత దేశం లో ఉండే ఎన్నో సాంఘిక సమస్యల్లో మెజారిటీ మత ఛాందస వాదం ఒకటి. ఒక సారి సాంస్కృతికంగా, రాజకీయంగా ” మెజారిటీ ” అనే కాన్సెప్ట్ ను అర్థం చేసుకుంటే అది ఇక్కడ బ్రాహ్మిణీక హిందూత్వంగా ఉంటుంది….పాకిస్తాన్ లొ ఇస్లాం ఉన్మాదం లాగా ఉంటుంది. ఇక్కడ జరిగిన బాబ్రి మజీదు సమస్యకు , పాకిస్తానులో ఎంతో మంది హిందువులు అమాయకులు బలయ్యారు. ఫ్రాన్స్ లో నో లేదా ఇటలీలోనో ఉన్న వాళ్ళు ఉక్రైన్ లో ఉండే విలువల గురించి మాట్లాడిటే ఎంత సిల్లీగా ఉంటుందో మనం పాకిస్తాన్ అరబ్ దేశాల సమస్యల గురించి మాట్లాడ్డం కూడా అంతే సిల్లీగా ఉంటుంది. అందుకే మనకు కావాల్సింది మత చైతన్యం కాదు. రాజకీయ చైతన్యం . మీకు హిందువుల పట్ల గురించి మీకున్న మనస్తాపం నిజమైతే , హిందువులలో ఉన్న కుల లింగ వివక్ష గురించి ఆలోచినంచండి. మీకు హిందుత్వం గురించి మాత్రమే మనస్తాపం చెందితే దానికి సమ్యమన సమాధానం లేదు. ఒక వేళ మీకు బ్రాహ్మణీయ హిందూత్వం వలన మన దేశానికి జరిగిన మేలు గురించి conviction ఉంటే తప్పక ఆర్టికల్ రాయండి. సారంగ పత్రిక ఎడిటర్స్ అందులో logical argument ఉందనుకుంటే మాత్రం తప్పక ప్రచురిస్తారనే నమ్మకం నాకుంది.

Leave a Reply to vijay kumar Cancel reply

*