ఎవరు “ఉత్తమ్”? ఎవరు విలన్?

మోహన్ రావిపాటి
mohan
త్రేతా యుగం లో  ఉత్తముడు  ఒక లోకంలో , అధముడు (విలన్) మరో లోకం లో ఉండే వారట. ద్వాపరయుగంలో  ఉత్తముడు ,అధముడు (విలన్) పక్క పక్కనే అన్నదమ్ముల రూపంలో ఉండే వారట. ఇప్పుడు కలియుగంలో ఉత్తముడు,(విలన్) ఒకరిలోనే ఉన్నారు . అలాంటి కథ చెప్పే  ప్రయత్నమే ” ఉత్తమ విలన్” .  పరిస్థితులను బట్టి మనిషి లోఉన్న ఈ మంచి చెడు బయటకు  వస్తూ ఉంటాయి . ఇలాంటి ఒక కథ అది కమల్ హాసన్ లాంటి ఇమేజ్ ఉన్న ఒక నటుడు సినిమా ద్వారా చెప్పాలి అనుకోవటం సాహసమే .
కమల్ హాసన్ విభిన్నమైన పాత్రలు పోషించటానికి ఎప్పుడూ సిద్దం గానే ఉంటాడు . ఒక ఇమేజ్ చట్రం లో బందీ కాకుండా తనను తాను ఎప్పటి కప్పుడు కొత్తగా మలచుకోవటం ఆయనకు ఎప్పుడు అలవాటే. అందుకే కమల్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది .ఈ సినిమాకూడా  అలాంటి క్రేజ్ తోనే  విడుదల అయ్యింది .  కమల్ హాసన్ నుండి ప్రతి ప్రేక్షకుడు ఒక వైవిధ్యాన్నే కోరుకుంటాడు , కాకపొతే ఒక్కోసారి ఆ వైవిధ్యాన్ని సామాన్య ప్రేక్షకుడు కు అర్ధం అయ్యేలా చెప్పటంలో  విఫలమవుతూ ఉంటాడు . ఈ “ఉత్తమ విలన్ ” కూడా  సామాన్య ప్రేక్షకుడి కి కొంచెం దూరంగానే ఉండి పోతాడు.
భారతీయ ప్రేక్షకులకు సర్రియలిజం సినిమా చూపించటం , ఆ సినిమాను సామాన్యప్రేక్షకుదు అర్ధం చేసుకోవాలి అనుకోవటం కొంచెం సాహసమే.
“మనోరంజన్” (కమల్ హాసన్) ఒక సూపర్ స్టార్ , అయన కొత్త సినిమా రిలీజు సందర్భంగా మనోరంజన్ కొడుకు, మనోరంజన్ ఇంకా ఇప్పటికీ కుర్ర హీరోల పాత్రలు వెయ్యటం నచ్చదు. ఇలా ఉండగా మనోరంజన్ కి బ్రెయిన్ ట్యూ మర్ ఉందని తెలుస్తుంది . ఇక చివరి సినిమా గా మంచి సినిమా చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో  తన కు కెరీర్ మొదట్లో మంచి చిత్రాలు ఇచ్చిన తన గురువు మార్గదర్శి ( కె.బాల చందర్) ని తన చివరి సినిమా  దర్సకత్వం వహించమని అడుగుతాడు . ఈ నిర్ణయం నచ్చని మనోరంజన్ భార్య ( ఊర్వశి) మామ పూర్ణ చంద్ర రావు( కె.విశ్వనాధ్) తో గొడవ పడి ఇంటి నుండి బయటకు వస్తాడు . ఈలోపు జాకబ్ ( జయరాం) మనోరంజన్ ని కలుస్తాడు . మనోరంజన్ వరలక్ష్మి ని పెళ్లి చేసుకోకముందు అతనికి యామిని కి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తాడు . యామిని మనోరంజన్ ద్వారా గర్భవతి అయినట్లు మనోర్మణి అనే కూతురు  చెప్తాడు . యామిని ని నుండి ఎటువంటి పరిస్థితుల్లో విడిపోవాల్సి వచ్చింది , అందుకు కారణం ఎవరు ?అనేది ఓ వైపు సాగుతుండగా , మనోరంజన్ చివరి చిత్రం ద్వారా 12 వ శతాబ్దం లో జరిగిన ఒక కథ  ను పాయింట్ గా తీసుకోని  మనిషి ప్రవర్తనను మనకు తెలియ చెప్పే ప్రయత్నం చేస్తాడు .
నిజానికి ఇది సర్రియలిస్టిక్ కథ, 12 వ శతాబ్దంలో జరిగిన కథకు ఇప్పటి కథకు నేరుగా ఎలాంటి లింక్ ఉండదు . కాని దాని ద్వారా మానసిక సంఘర్షణ ,మనషి ప్రవర్తన చెప్పే ప్రయత్నం చేసాడు,కానీ ఇది సా మాన్య ప్రజలను చేరుకోలేకపోయింది. మధ్య మధ్యలో వఛ్చే  ఆ కథకు ఇప్పటి కథకు మధ్య సంబంధం అర్ధం కాక కన్ఫ్యూజ్ అవుతాడు
ఇక సాంకేతిక అంశాల కొస్తే కమల్ హాసన్ అధ్బుతంగా నటించాడు అని ఎప్పటిలాగే చెప్పాలి.  దీనికి కథ, స్క్ర్నీన్ ప్లే కూడా కమల్ హాసనే సమకూర్చాదు. స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది . రమేష్ అరవింద్ దర్సకత్వం లో పేరు పెట్టాల్సింది ఏమీలేదు శామ్ దత్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఎలివేట్ అయ్యింది జిబ్రాన్ సంగీతం సినిమా మూడ్ కు అనుగుణంగా పర్ఫెక్ట్ గా సరిపోయింది.
 
మొత్తం మీద ఇది ప్రేక్షకుడు కు అర్ధం కాని ఒక మంచి  సినిమా . టైటిల్ కి తగ్గట్టే ఇది ఉత్తమ చిత్రం కానీ ప్రేక్షకుడి కి అర్ధం కాక చెత్త చిత్రంగా ఉండి పోతుంది.

మీ మాటలు

 1. sunita gedela says:

  సినిమా సంగతి ఎలా వున్నా మీ ఓపెనింగ్ స్టేట్మెంట్ మాత్రం చాలా బాగుంది. సామాన్యుడికి నచ్చదు అని మీరు చెప్పినా కూడా కమలహాసన్ సినిమా కదా ఒకసారి చూసెస్తే పోయేదేముంది.

 2. mohan.ravipati says:

  నిరభ్యంతరంగా చూడండి, చూడమనే నా అభిప్రాయం కూడా !!

 3. విలాసాగరం రవీందర్ says:

  ఒకసారి చూడవచ్చు మరీ అంత చెత్త సినిమా ఏం కాదు

 4. vasavi pydi says:

  అరవయ్యేళ్ళ అమ్మ నాకు ఈసినిమా ఇంకోసారి చూడాలని ఉంది అని అన్నారు చెల్లి కూతురు ఈ సినిమా బలే బాగుంది అని అన్నది కొత్త తరహ సినిమాలు ముందు ప్రోత్సహించాలి

 5. సుమబాల says:

  గొప్ప నటుడో, దర్శకుడో అయినంత మాత్రాన వారి సినిమాలన్నీ బాగుండాలని లేదు కదా…ఒక స్థాయికి వచ్చాక…ఓ ఇమేజ్, ఫాలోయింగ్ ఏర్పడ్డాక ఏ నటుడైనా, దర్శకుడైనా మొదటి సినిమా కంటే ఇంకా జాగ్రత్తగా, మెళకువగా వ్యవహరించాలి…అంతేకానీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది కదా అనుకుంటే వారి గొప్పదనం అక్కడితో ఆగినట్టే…ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ అంటాడూ…కెరీర్ లో ఎన్ని హిట్లున్నాయి…ఎంత గొప్ప నటుడివి అనేది కాదు…లేటెస్ట్ సినిమా ఏంటి అని…అది మాత్రమే మనకు విజిటింగ్ కార్డుల పనిచేస్తుందీ అని…ఆ మాటలు అంత గొప్ప నటుడి నోటినుండి…అంత సామాన్యంగా విని చాలా సంతోషం వేసింది. అభిమానం మరికాస్త పెరిగింది…కానీ నిన్న ఉత్తమ విలన్ చూశాక..బాగా డిప్రెస్ అయ్యాం…కమల్ హాసన్ లాంటి నటుడికి ఇది అవసరమా అనిపించింది. ఇంత బతుకూ బతికి ఇంటివెనకాల చచ్చినట్టు అన్న సామెత గుర్తొచ్చింది. ఇంది కొంచెం హార్ష్ గా ఉండే క్షమించాలి. కానీ ఏం చెప్పాలనుకున్నాడో…ఏం చెప్పాడో…ఎందుకు చెప్పాడో అస్సలు క్లారిటీ లేదు….కనీసం ఓకే బంగారం లాంటి మాయా లేదు….సినిమాటోగ్రఫీ అద్భుతం లేదు..కొన్ని డైలాగ్స్ అస్సలు వినిపించలేదు…నిజంగా మీ వ్యాసం చదివితే కానీ త్రేతాయుగం..నాటి పరిస్థితి నేటి పరిస్థితీ అర్థం కాలేదు…కమల్ హాసన్ ఎప్పటిలాగే బాగా నటించాడు కానీ కేవలం నటన మాత్రమే చూడలేం కదా..కథకు తగ్గ నటనే చూస్తాం…అదే లోపించింది ఇందులో..ఇలా చెప్పడానికి చాలా బాధగా ఉంది కానీ తప్పట్లేదు….

 6. m.viswanadhareddy says:

  మార్గ దర్శి లాంటి దర్శకుడి ని పెట్టుకొని జానపదంలో కామెడి సినిమా తీయాలను కోవడంలో అర్థం లేదు .
  మంచి నటుడు మంచి మనిషి గా వుండాలని ఉంటాడని ఎక్కడా లేదు . కామేడిలో ఎర్రర్స్ పద్దతిలో చాప్లిన్ కి మించి తీయగలిగిన వారు వుండరను కుంటాను . నేను మనిషినే అని చాలా సార్లు చెప్పుకోవాలని ప్రయత్నిస్తాడు ఇందులో కమల్ హాసన్ . మనిషి మనిషిగా ఉండలేక పోలేని తనంతో ఎలా ఓడి పోతున్నాడో చెప్పగలిగే ఇతివృత్తాని మార్గదర్శికి అప్పగించి వుంటే ఈ సినిమాకు కథకు బాలచందర్కి ఎంతో
  మేలు చేసివుండేవారు కమల్ హాసన్ . మనిషిగా తను పడే ఘర్షణ కన్నా మందు బాటల్ డామినేట్ చేసింది ఇందులో .. కళా కారుడి గా తన నటనను ఎలివేట్ చెయ్యాల్సిన కథలో ఒక తయ్యుం కళా కారుడి ముసుగులోకి వెళ్ళిపోతే తన నుంచి నటనను మనం ఏమి ఆశించగలం . పైగా ప్రతి భంగిమకు నువ్వు సూపర్ రా అని జగమెరిగిన మహానటుడిని గురువు కొత్తగా పొగుడుతుంటే ఎబ్బెట్టుగా వుంది
  ఏది ఏమైనా ఒక గొప్ప ప్రయత్నంలో తానొక్కడే మేకర్ అనుకోకుండా కొందరి రచయతల సహకారం
  తీసుకోగలిగి వుంటే బాగుండేది .. కోట్లు గుమ్మరించిన తెలుగు సినిమాల హెడేక్ ను భరించడం కన్నా …
  ఈ ప్రయత్నాన్ని సినిమా అభిమాని తృప్తిగా చూసి సినిమా థియేటర్ నుంచి బయటకు రావచ్చు …కమల్ కష్టాన్ని అభినందించ వచ్చు

 7. buchi reddy gangula says:

  సుమ బాల గారు చక్కగా చెప్పారు

  నేటి సినిమాలు —- కథ లేనివి
  ఎగురుడు
  దు 0 కుడు
  ముద్దు లాట
  గుద్దులాట
  కింద మూరెడు — మిధ జానెడు పేలికల తో —-????
  చిరంజీవి 150 వ సినిమా గురించి — రోజు పేజి త్రీ న్యూస్ పత్రికల్లో —ఎందుకో ???
  సిద్దా 0 తా లను మరిచి వ్యక్తి పూజలు చేస్తున్న రోజులివి ????

  ————————-బుచ్చి రెడ్డి గంగుల

మీ మాటలు

*