మస్తు పరేషాన్ చేసే కవిత్వం!

నిశీధి 

“రేప్ ఇస్ రేప్…” అది మనిషిపై అత్యాచారం అయినా భూభాగాలని బలవంతంగా ఆక్రమించుకున్నా అని ఎవరన్నా అంటే తాళి కట్టిన దొరతనంలో  అయ్యగారు ఎన్ని సార్లు పశువులా ప్రవర్తించి పాశవిక ఆనందాలు పొందినా , అభివృద్ధి మంత్రం పేరు చెప్పి అందరు కలిసి ఆదివాసిలని అడ్డంగా దోచుకున్నా తప్పే కాదు అని నొక్కివక్కానించే ప్రభుత్వాలు ఉలిక్కిపడతాయేమో ఒక క్షణం . అందులోనూ చెప్పింది Carolyn Kizer లాంటి పులిట్జర్ ప్రైజ్ విన్నర్ లాంటి వాళ్ళు అంటే  కవులు సాహిత్యకారులతో పైసా లాభం ఉండదు కాని వీళ్ళతో మై పరేషాన్ పరేషాన్ పరేషాన్ హువా అని డ్రీంల్యాండ్ సాంగ్ ఒకటి వేసుకొని నెక్స్ట్ క్షణం ఆ  కలల ప్రపంచాన్నికూడా అమ్మి పెట్టె బేహారుల వేటలో పడిపోతుందేమో , ఏమయినా జరగోచ్చు ఆఫ్టర్ ఆల్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ది గ్రేట్ గవర్నమెంట్ డియర్ , కను  రెప్పకి తెలియకుండా కంటి పాపని ( పేరులో పాప ఉందని లోల్ ) రేప్ చేసేవాళ్ళని ని కూడా కాపాడే గొప్ప ఘన చరిత్ర కలిగినవాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా  చివరికి మిగిలేది  చరిత్ర చెక్కిళ్ళ మీద రక్తపుటేరులే కదూ. 
 
పోయెట్రి గురించి చదువుదామని వస్తే పోరంబోకు స్తలాలు అమ్ముకొనే వాళ్ళ మీద మాకు తెలియని టిప్పణిలా అని రీడర్స్ విస్తుపోయి బుగ్గలు నొక్కుకొనే లోపు  ఫెమినిజం అన్న పదం పుట్టక ముందే ప్రాక్టికల్ గా జీవితంలో  అక్షరాల్లో అటు ఆకాశంలో సగంకి  ఇటు అడుగంటిపోతున్న అవని తాలూకు ఆశావాదానికి   జరుగుతున్నఇన్ జస్టిస్ మీద తన స్వరం వినిపించిన కారోలిన్ (December 10, 1925 – October 9, 2014 , Pulitzer Prize for Poetry (1985), for Yin)  గురించి చదువుకోవటం ఉత్తమం 
 caro1
మనమేసుకున్న ముసుగులు మేలిమి ముత్యాల్లా మెరుస్తూనే ఉంటాయి అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఎక్కడ పగిలి మనం బయట పడతామో అని బెదిరిస్తూనే ఉంటాయి , అందుకే పూసుకున్న పై పూతలకే అందరం దాసులం అని చెప్పినా happiness is a Chinese meal,. While sorrow is a nourishment forever అని సంతోషాల క్షణకాల జీవితపు  మేడిపండు విప్పినా అది కచ్చితంగా కారోలిన్ కి మాత్రమే సాధ్యం . తన  మాటల్లో తన కవిత్వం గురించి చెప్పాలంటే ” ఎవరన్నా ఎదురుగా వచ్చి మొన్న మీర్రాసిన పొలిటికల్ పోయెం బాగుంది అంటే నేను ఆనందంతో  ఆశ్చర్య పోతాను అయితే అసలు పొలిటికల్ కానిది ఏది అని , అలాగే మీ ఫెమినిస్ట్ కవిత భలే ఉంది అన్నా అలాగే ఫీల్ అవుతాను , ఎందుకంటే నాది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ , నేను తీసుకున్న స్టాండ్ అవతల వాళ్ళకి అర్ధం అయినందుకు గర్వంగా అనిపిస్తుంది అంటారు . ( స్టాండ్ తీసుకోవటం , ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండటం అంటే ఏమిటి జీవితాలు అలా కూడా ఉంటాయా అనుకుంటారేమో నేటి కాలం రచయితలు ముఖ్యంగా కవులు ) 
 
కారోలిం లైఫ్ టైమ్లో ” A Muse of Water ”  ఎన్విరాన్మెంట్ మీద రాసిన గొప్ప కవిత అయినా  తప్పించుకోవటానికి వీలే లేకుండా మైథాలజీ చుట్టల్లో చుట్టేయండి స్త్రీ ని విలువల భారం అంతా ఆమె భుజాల మీద మోపి భూమికి ఆరడుగుల లోతున పాతరేయ్యండి తన వ్యక్తిత్వాన్ని అని క్లియర్ గా పురాణాల మీద అక్కడ నుండి స్త్రీ ఎలా ఉండాలి మొదలయిన నిర్వచనాలని అడ్డుకోతలో చూపిన Fearful Women కవిత ఎప్పటికి  ఫెమినిజం యూనివర్సిటీలో ఒక పూర్తి గ్రంధమే . 
 
యూరప్ పేరు వెనకే దాగుంది పశుత్వపు అత్యాచారం అంతా 
 
ఆమె చేయమంది కాబట్టి అంటూ  నిందానేరం మోస్తూ ఆమె అతనికి ఎప్పటికి చిన్న పక్కటేముకే 
 
చదువుకున్న స్త్రీ నుండి అపాయం ఉంది అందుకే నీ సహచరిని తాళం వేసి లొంగదియ్యి 
 
ఇలా ఒకో వాక్యంలో ఒకో మైథాలజీ చెత్తని తనదయిన స్టైల్ లో చీల్చి చెండాడుతూ రాసిన  ఈ కవిత మనల్ని కాసేపు అయినా పుక్కిటి పురాణాల పాతివ్రత్య కథల నుండి రక్షిస్తుంది , మరి చదువుకుందామా ? 
caro3
 
Fearful Women – Poem by Carolyn Kizer
 
 
Arms and the girl I sing – O rare
arms that are braceleted and white and bare
 
arms that were lovely Helen’s, in whose name
Greek slaughtered Trojan. Helen was to blame.
 
Scape-nanny call her; wars for turf
and profit don’t sound glamorous enough.
 
Mythologize your women! None escape.
Europe was named from an act of bestial rape:
 
Eponymous girl on bull-back, he intent
on scattering sperm across a continent.
 
Old Zeus refused to take the rap.
It’s not his name in big print on the map.
 
But let’s go back to the beginning
when sinners didn’t know that they were sinning.
 
He, one rib short: she lived to rue it
when Adam said to God, “She made me do it.”
 
Eve learned that learning was a dangerous thing
for her: no end of trouble would it bring.
 
An educated woman is a danger.
Lock up your mate! Keep a submissive stranger
 
like Darby’s Joan, content with church and Kinder,
not like that sainted Joan, burnt to a cinder.
 
Whether we wield a scepter or a mop
It’s clear you fear that we may get on top.
 
And if we do -I say it without animus-
It’s not from you we learned to be magnaminous. 
 
ఇదంతా చదివాక మన సీతలు ద్రౌపతులు అహల్యలు సావిత్రుల మీద సెకను పాటు అయినా జాలేసి వాళ్ళలా బ్రతక్కపోతే ఎలా అని  కండిషన్ తత్వాలు వల్లించే మనలో దాగున్న దెయ్యపు హృదయాలు  ఉలిక్కిపడతాయా ? లేదా యదా రాజ తదా ప్రజ సూత్రం ఫాలో అయిపొతాయో ? లేదా న్యూ ఫాషన్ కింద మళ్ళీ మనోభావాలు విరుచుకుంటాయో ? మన జీవితపు మేడిపండు రహస్యాలు తెలియంది ఎవరికి కదూ !
*
 

మీ మాటలు

  1. Kcube Varma says:

    గ్రేట్ . ఓ గొప్ప కవయిత్రిని తన కవితను నేడున్న పర్తితులలో పరిచయం చేసినన్దుకి మీకు ధన్యవాదాలు నిశీజి

  2. Dr.Vijaya Babu,Koganti says:

    శక్తివంతమైన కవిత్వం వ్రాయగల కవయిత్రి.
    “…వాళ్ళలా బ్రతక్కపోతే ఎలా అని కండిషన్ తత్వాలు వల్లించే మనలో దాగున్న దెయ్యపు హృదయాలు ఉలిక్కిపడతాయా ?” :) ముగింపు బాగుంది. అభినందనలు.

    • నిశీధి says:

      థాంక్స్ అలాట్ సర్ , నిజమే చదివాక ఆ వాక్యాల నుండి బయటికి రాలేము త్వరగా

  3. మీ రాతల్లోని తీవ్రమైన వేగం , క్లిష్టత బాగున్నాయి

    • నిశీధి says:

      క్లిష్టత తగ్గించడానికే చూస్తున్నాను మేడం గారు :)

  4. paresh n doshi says:

    కను రెప్పకి తెలియకుండా కంటి పాపని ( పేరులో పాప ఉందని లోల్ ) రేప్ చేసేవాళ్ళని ని కూడా కాపాడే గొప్ప ఘన చరిత్ర కలిగినవాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా చివరికి మిగిలేది చరిత్ర చెక్కిళ్ళ మీద రక్తపుటేరులే కదూ. LOL

    • నిశీధి says:

      yup కొంచం లోల్ గానే ఉన్నా నిజం కదూ పరేష్ గారు

  5. హెచ్చార్కె says:

    చాల చాల బాగా రాశారు వ్యాసం. ఒక మంచి కవయిత్రిని పరిచయం చేశారు. మీరు బ్రాకెట్లలో వుంచిన ఒక వాక్యం అక్కడే నన్ను కాసేపు అక్కడే అపేసింది నిశీధి గారు!… ( స్టాండ్ తీసుకోవటం , ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండటం అంటే ఏమిటి జీవితాలు అలా కూడా ఉంటాయా అనుకుంటారేమో నేటి కాలం రచయితలు ముఖ్యంగా కవులు).

    • నిశీధి says:

      Thanks a million for taking time and reading the article sir i am truly obliged ఆ వాక్యం వెనక దాదాపు ఒక యియర్ గా చదువుతున్న ఫేస్బుక్ తెలుగు కవిత్వం ఉంది . విమెన్ ,నేచర్ ప్రేమ ఇవన్నీ హాట్ ఫేవరెట్స్ అయితే కాస్తో కూస్తో సోషల్ సబ్జెక్ట్ అంటుకుంటున్న వాళ్ళలో కూడా ఒక మెటీరియలిస్టిక్ ప్రవాహం అంతర్లీనంగా కనిపిస్తుంది .ప్రైవేట్ డ్రీంస్ పబ్లిక్ డ్రీంస్ అన్ని ఆఖర్లో ఒకే మూస పాచి పాటలు వినిపిస్తున్న ఫీలింగ్ నాకు . ఇది వ్యక్తిగతం అయి ఉండోచ్చు నేనొ పెద్ద నార్సిస్ట్ అయి ఉండోచ్చు కాని ఆ ఒక్క క్షణం మనలో భగ్గున మంట మడించే కవిత్వం చదువుకొని యెన్నాళ్ళు అయిందో . అంతేనా చూడగానే చదవగానే ఇంత గొప్ప అనుభూతి ఇచ్చిన కవిత చదివాను రేపొద్దున చచ్చిపోయిన పర్లే అనిపించే మితవాద ప్రేమ కవితలు కనిపొంచడంలే . ఎమోషన్స్ కి ఆ మోడెస్టీ ముసుగు తట్టుకోవడం కొంచం కష్టం వేసి అలా sir

  6. వాసుదేవ్ says:

    కవి తనకోసమో ఓ తత్వంకోసమో కాకుండా అది కవితైనా కాకపోయినా ఫర్వాలేదు, అవార్డులూ రివార్డులూ రాకపోయినా ఫర్వాలేదు నేను చెప్పదల్చుకున్నది మరణించే లోపు చెప్పేయాలి అన్నదృక్పథం ఉన్న కవులూ కవయిత్రులూ మనకి చాలా తక్కువే, అందులోనూ ఆధునిక కవిత్వంలో ఇంకా ప్రాసతో అలరించే కవిత్వం చాలా తక్కువ. ఈమె కవిత్వంతో యూరప్ అంతా ఉలిక్కిపడి తర్వాత ఆ ఉలికిపాటుని ప్రపంచానికి కూడా పంచివ్వాల్సి వచ్చింది.
    ఎప్పటిలా మీఅనునాదం మరోసారి పాఠకుల్ని కూడా ఉలిక్కిపడేలా చేసిందనటంలో అతిశయోక్తేమీ లేదులెండీ నిషీజీ! మరిముఖ్యంగా మీ నిర్భయమైన శైలి చివరి వాక్యం వరకూ చదివింపచేసి అయ్యో అప్పుడే అయిపోయిందా అని బాధపడేలా మరీ చేస్తుందనటంలోనూ అతి ఏమాత్రం లేదు. మరోసారి కుడోస్.
    మీ వాక్యం కోసం మరోనెల వరకూ వెయిట్ చేస్తుంటాం…..

  7. నిశీధి says:

    ఇంగ్లీష్ పోయెట్రి మీద ఇంత ప్రేమ పెరగటం వెనక మీ కృషి మర్చిపోలేనిది , మీర్రాసిన పరిచయం చేసిన పోయెట్స్ నుండే మొదలు సర్ ఈ ప్రస్తానం వాసుదేవ్ గారు , థాంక్స్ అలాట్ .

Leave a Reply to నిశీధి Cancel reply

*