నిశి వేళ

sani

చేమంతి: ఒక వేశ్య

పాండురంగ:ఒక విటుడు 

sani

పాండురంగ:    మన్మథుడు నన్ను చంపేస్తున్నాడు చామంతీ! నేనిక తట్టుకోలేను. వాడు చాలా క్రూరుడు.చామంతి:       వేశ్యని రాత్రికి మాట్లాడుకున్నావు, ఐదొందల నాణాలు చెల్లించావు, పక్క మీద చేరావు, తీరా ఇప్పుడు అటు తిరిగి పడుకొని మూలుగుతుంటే ఏమనుకోవాలి? ఇలాంటి చౌకబారు వేషాలు చూస్తే చిరాకొస్తుంది. డాన్సు హాల్లో వైను తాగి, ఊరికే కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్నావు. అంతమందిలో ఏమీ తినకుండా వచ్చింది నువ్వొక్కడివే!. నేను చూస్తూనే ఉన్నాను. ఇప్పుడేమో బెల్టుదెబ్బలు తిన్న పిల్లాడి లాగా వెక్కిళ్ళు పెడుతున్నావు. ఇదంతా ఏంటి రంగా? నా దగ్గర దాచడ మెందుకు?

చామంతి:       నువ్వు కోరుకుంటోంది నన్ను కాదు. అంతవరకూ అర్థమైంది. నేన్నీకు మూడంగుళాల దూరంలో ఉన్నాను. ఇద్దరం నగ్నంగా ఉన్నాము. అయినా నీలో చలనం లేదు. కౌగిట్లోకి రావట్లేదు. నా ఒళ్ళు తగిలితే ఎక్కడ కదలిక వస్తుందోనని విప్పిన బట్టల్ని మూటకట్టి ఇద్దరి మధ్యా అడ్డుగా పెట్టావు. చెప్పు, నీ మనసులో ఉన్న ఆడదెవరో చెప్పు. నీకు సాయం చేస్తాను. ఇలాంటి సేవలు అందించడం నాకు కొత్తేమీ కాదు.

పాండురంగ:    ఆమె నీకు తెలుసు. నీక్కూడా ఆమె తెలుసనే అనుకుంటున్నాను. ఆవిడేమీ అసూర్యంపశ్య కాదు.

చామంతి:       ఆమె పేరేంటి?

పాండురంగ:    రంగనాయకి.

చామంతి:       రంగనాయకిలు ఇద్దరున్నారు. ఒకామె ఈ మధ్యనే కన్నెరికమయ్యి ప్రస్తుతం అవధాని ఉంచుకున్నావిడ. మరొకటేమో ‘నెరజాణ’ అని పేరుబడ్డది.

పాండురంగ:    ఆ నెరజాణే నాకు కావాల్సింది.

చామంతి:       ఓరి దేవుడా! నన్ను పిలిపించింది ఆ ముసలి లంజ పొందు కోసమని తెలిసుంటే అసలొచ్చేదాన్నే కాదు. తెల్లారుతోంది. కోడి కూసింది. నేనిక పోతా!

పాండురంగ:    తొందర పడకు చామంతీ! పోదువులే ఉండు! ఐతే రంగనాయకి ముసలిదే నంటావా? నిజమే అయ్యుండచ్చు. లేకపోతే తలపైన విగ్గెందుకు పెట్టుకుంటుంది, అలా పాలిపోయి, చర్మం మీద మచ్చలతో ఎందుకుంటుంది? ఇప్పుడు గుర్తొస్తే కంపరం పుడుతోంది.

చామంతి:       దాని అందాన్ని గురించైతే మీ అమ్మగార్ని అడుగు. స్నానానికి ఏటికెళ్ళినప్పుడు చూస్తారు గదా! దాని వయసును గురించైతే మీ తాతగార్ని అడుగు. ఆయన సరిగ్గా చెప్తారు.

పాండురంగ:    అట్లా ఐతే మనమధ్య ఈ అడ్డుగోడ ఇంకా ఎందుకు? ఆగు. ఈ బట్టల మూటని మంచం మీదనుంచి తీసేస్తాను. ఇప్పుడు మనం అడ్డు లేకుండా ముద్దాడుకోవచ్చు, ఒకరి ఒళ్ళు ఒకరం నిమురుకోవచ్చు. మంచి పిల్లల్లాగా కలిసిపోవచ్చు. అబ్బ, నీ తొడలెంత మృదువుగా ఉన్నాయి చామంతీ, వాటి మధ్య ఎంత ఆనందం పాతేసుకొని ఉందో తవ్వి చూడనీ!

*

మీ మాటలు

  1. eppudu కుడా ఈసాహిత్యమా కుర్రకారును rechagotta taaniki

  2. నిర్మల కొండేపూడి says:

    ఇంట వికారమైన కధలు/ సీరియళ్ళు అవసరమా?

  3. Nisheedhi says:

    Such a relief to read this in the age of platonic nonsense

  4. buchi reddy gangula says:

    సారంగ లో
    యీ చెత్త కథ అవసరమా —
    vanguri… ఆత్మ కథ దేనికి ???
    అయినా పత్రిక మీది — మా యిష్టం అనకండి — దయతో
    —————————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  5. paresh n doshi says:

    సారంగలో ఇట్లాంటి కథలు ఎందుకండి?

  6. chandh says:

    ఎందుకీ కథలు..? ఏ ప్రయోజనం ఆశించి ఈ కథలు వేస్తున్నారు.?
    -సాహిత్య ప్రయోజనమా అంటే…అదీ లేదు పోనీ సామాజిక కోణంలో వాళ్ళ జీవితం లోతులు చూపిస్తున్నారా…… ? అదీ లేదు. ఫక్తు బూతు కథలు.

  7. Achanta Hymavathi says:

    మీ పత్రికలో నేనూ పాల్గోవాలని ఉంది. మీకు రచనలు పంపటం ఎలా? ఏ….ఇ మెయిల్ …కి పంపాలి? నేను దీనిని ” ప్రముఖిమె” లో టైప్ చేశాను . దీట్లోనే టైప్ చేసి ‘రచనలు’ పంపవచ్చా? మీరు -నా ఈ ప్రశ్నకి జవాబు ఇస్తే నా ‘ఇ మెయిల్ ‘ కి వస్తుందా? అన్నీ ప్రశ్నలే అడిగాను….సోరీ…అన్యధా భావించకుండా నా సందేహాలు తీరుస్తారని ఆశిస్తున్నాను. నా ” ఇ మెయిల్ ” మీరు పైన అవకాశం ఇచ్చిన ప్రదేశంలో ఇస్తున్నాను……..

  8. Thirupalu says:

    ఇంటర్నెట్ ఉంది, టీవీలు ఉన్నాయి, సినిమాలు వున్నాయి, సరసమైన కధలు ఉన్నాయి . . . . ఇంకా ఇంకా ఇంకా వ్యాపారం వుంది – యువతను లేక పురుషులను రెచ్చ గొట్ట టానికి, ‘ సాని వాడల సంభాషణలు లేని దెక్కడ? – ఇంకా వెబ్ పత్రికలూ కూడా కావాల్సి వచ్చాయా?

  9. Thirupalu says:

    ‘ సాని వాడల సంభాషణలు లేని దెక్కడ?’ – అదీ ఈ కోణంలో!

  10. పిన్నమనేని మృత్యుంజయరావు says:

    లూషియన్ … క్రీస్తు శకం రెండో శతాబ్ది లో సుప్రసిద్ధుడైన గ్రీకు వ్యంగ్య రచయిత. గ్రీకు సామ్రాజ్యం లో చేరిన సిరియా లోని సమసోటా అతని నివాస స్థానం. ప్రపంచ సాహిత్యం లోని తొలిదశ సైన్సు ఫిక్షన్ రచయితలలో అతనొకడు. దేవతల సంభాషణలు, మృతుల సంభాషణలు, సముద్ర దేవతల సంభాషణలు వంటి అతని రచనలు సుప్రసిద్ధాలు. ప్రస్తుతం సారంగలో వారం వారం ప్రచురితమౌతున్న సానివాడల సంభాషణలు లూషియన్ రచనకు అనువాదం.
    మానవుల మనస్తత్వం లో సహజంగా కనిపించే ద్వంద్వ ప్రవృత్తుల్ని, అసహజ ధోరణుల్నీ సానివాడల సంభాషణల్లో లూషియన్ వ్యంగ్య ధోరణిలో ఎండకట్టినట్టు కన్పిస్తుంది. ఈ పని చేయడానికి అంతటి సమర్ధుడైన రచయిత సానివాడల నేపధ్యమే ఎందుకు తీసుకున్నాడా అనేది నన్ను చాలా కాలం వేధించిన ప్రశ్న. మనుషుల్లోని విటతత్వం, వికట తత్త్వం అలాంటి చోటే చక్కగా వ్యక్తమౌతుందని ఆయన భావించి ఉండవచ్చునని నాకు అనిపించింది. లూషియన్ తర్వాత రెండువేల సంవత్సరాలకు ఆయన రచనా ధోరణి కన్యాశుల్కం, చింతామణి, మధుసేవ వంటి నాటకాలలోనూ, మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గార్ల కథల్లోనూ కన్పిస్తుంది.
    ప్రస్తుతం ప్రచురితమౌతున్న సంభాషణల్లో కేవలం బూతే కనిపిస్తే అది అనువాదకుడి అసమర్ధత అవుతుందేమోకానీ, లూషియన్ బూతు సంభాషణలు రాయలేదని నేననుకుంటున్నాను.

Leave a Reply to Thirupalu Cancel reply

*