కాగితం

శివుడు 

పిచ్చి గీతలు గీసాను, కొట్టేసాను, నలిపిపడేసాను, చించి విసిరేసాను

ఎమీ మాట్లాడవు, మౌనంగా ఉంటావు,

ధ్యానానికి తయరాయ్యే యోగి మనస్సంత నిర్మలంగా కనిపిస్తావు.. మళ్ళీ ఉపక్రమించమని !

 

మళ్ళీ ఎదో రాయడం మొదలవుతుంది, ఏ ఆలోచనో ఎక్కడికో తీసుకెళ్తుంది

బాగుంటే ముచ్చటపడి, మురిసి మొగ్గలేస్తాను

నచ్చకపోతే ముక్కలు చేసి పడేస్తాను

నిజానికి బాగోనిది నా భావన, ముక్కలైనవి నా అక్షరాలు

కానీ శిక్ష నీకు, మాట్లాడలేవు కదా!

మాట్లాడలేవన్న మాటే కానీ మదిలో కలిగే భావాలకి ప్రతిబింబానివి !!

 

వెల్లవేసిన తెల్లగోడలా మళ్ళీ ‘నేను తయారు’ అని కనిపిస్తావు

ఇంపైన రంగులతో నింపుతావో లేక ఇష్టానికి చల్లుతావో నీ ఇష్టం అన్నట్టు !

ఆరంభ శూరత్వంతో ప్రాంభమవుతుంది మళ్ళీ  ఏదో రాత,

కాస్త ఆలోచనకి పదును పెట్టి మళ్ళీ ప్రయత్నించు అని అన్నావని నిన్ను చెత్తబుట్టలో పడేసాను

అదినీ స్థాయి కాదు, నా భావుకత స్థాయి!

 

వర్షం వెలిసిన ఆకాశంలా మళ్ళీ నిర్మలంగా కనిపిస్తావు,

విహంగా శ్రేణినే ఊహిస్తావో, ఇంద్రధనుస్సునే చిత్రిస్తావో లేక కారు మబ్బులతో నింపేస్తావో నీ ఇష్టం అన్నట్టు !

మళ్ళీ మొదలైంది అక్షరాల పేర్పు

చూస్తే, శబ్దం తప్ప అర్ధం లేని రాతల మోత,

ఈసారి కూడా నీకు అదే మర్యాద!

 

నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది,శబ్దార్ధాలు సంగమించే వరకూ నీతోనే అని ప్రోత్సహిస్తున్నట్టు

ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా కనిపిస్తావు

ఒకటి మాత్రం చెప్పగలను, నిన్ను అందలం ఎక్కించే వరకూ ప్రయత్నిస్తునే ఉంటాను

మరో జనగణమన కాకపోవచ్చు కానీ రణగొణధ్వనం మాత్రం కాకూడదు అనిపిస్తుంది నిన్ను చూస్తే!

 

శబ్దమనే శరీరానికి అర్ధం ఆత్మ ఐతే, ఆ శబ్దార్ధాల సంగమమే నీకు ఆత్మ!

ఆత్మ దేహాన్ని విడిచి మరో దేహం లోకి ప్రవేశించినట్టు నువ్వు జీర్ణమైపోతే ఆ భావాత్మ మరో శరీరం లో కనిపిస్తుంది,

తాళపత్రం అని కాగితం అని, e-paper అని కాలాన్ని బట్టి నీ ఆకారం మారచ్చేమో గానీ,

మొత్తంగా చూస్తే ఒకటే, భావాత్మ వసించే శరీరానివి!

sivudu

*

మీ మాటలు

  1. Kcube Varma says:

    బాగుంది శివుడు గారు

  2. Srinivasa Rao G says:

    చాల బాగుంది మాస్టారు మీ ఈ కవిత . నిజం గ అద్భుతం …

  3. RamaKrishna Mangipudi says:

    శర్మ చాలా బాగుంది . ఊహ ప్రపంచానికి హద్దులు లేవని భావ ప్రకటన ద్వారా కాగితం మీద కనపడని నీ కవిత నచ్చింది .

  4. Nisheedhi says:

    Good one

  5. వినసొంపైన శబ్దాల్ని మోసుకుంటూ తిరిగిన మీ అర్థవంతమైన రాతలు బాగున్నాయి . మంచి కవిత

  6. ధన్యవాదాలు KCUBE వర్మ గారు, శ్రీనివాస్ గారు, రామకృష్ణ, నిశీధి గారు, భవాని గారు.

  7. వాసుదేవ్ says:

    చాలా హత్తుకునేలా మళ్ళి చదివేలా చెక్కారు. బావుందండీ

  8. Murthy says:

    తన పిల్లలు ఎంత అల్లరి చేసినా ఎంత బాధ పెట్టినా, తల్లి మౌనంగా భరిస్తూ..మురిపెంగా సర్ది చెబుతూ ప్రయోజకుల్ని చేస్తుంది. ఈ మీ కాగితం అమ్మ ఒడిలో…బడిలో వడి వడి గా అడుగులు వేస్తూ ఇంతితై వటుడింతై అన్నట్టుగా ఎదగాలి అని ఆశిస్తూ…దీవిస్తూ ..

  9. sivudu says:

    ధన్యవాదాలు వాసు దేవ్ గారు, మూర్తి గారు.

  10. శివుడు గారు, చాల బాగా రాసారు . మల్లి మల్లి చదవాలనిపించేలా, ఇంకా ఇలాంటి కవితలు మీ నుండి ఆశిస్తున్నాము, …అల్ ది బెస్ట్.

  11. vasavipydi says:

    చేరిక అయ్యేంత వరకు, వ్రాయడంవచ్చేంత వరకు అలుపు లేని పోరాటం ఆతరువాత అంతులేని ఆరాటం చాల బాగుంది

  12. Rehana గారు , Vasavipydi గారు ధన్యవాదాలు

  13. Madhubabu K says:

    శర్మ… ఒక్క మాట.. అద్భుతః

  14. phani kishore says:

    ఇంతకీ ఇది రాయడానికి ఎన్ని కాగితాలు చింపావేంటి?
    ఒక కాగితాన్ని అందలం ఎక్కించడ కోసం వేరే కాగితాన్ని ఆసరాగ చేస్కొన్నావా?

    • అందలం ఎక్కించే స్థాయికి వేల ఆమడల దూరం లో ఉన్నాను,
      అందుకే కాగితాలని మరీ ఎక్కువ వృధా చెయ్యకుండా పలక కొనుక్కున్నాను :-)

  15. vijaya Rama Sarma says:

    చాల బాగుంది శివుడు గారు
    ఇంకా ఇలాంటివి ఎన్నో రాయాలని ఆశిస్తున్నాము
    కష్టే ఫలే

  16. svnarao says:

    ఊహ దేనికోసం నాకు అర్ధం కాలేదు,

  17. svnarao says:

    కవిత bagundi

  18. చాలా బాగుంది. కాగితం మీద కవిత్వం ఒక కొత్త ఆలోచన. పద ప్రయోగం కూడా బాగుంది.

Leave a Reply to Rehana Cancel reply

*