నాలోని ఇంకో రూపానికి..

పుష్యమి సాగర్

 

నాలోకి నేను
ప్రవహించే నదిని అయిపోవాలని
గల గలా పరవళ్ళు తొక్కుతూ, ఒడుపు గా
ఒక్కో చినుకై అంబరాన్ని తాకాలి
చేప లా ఈదుతున్న ఆలోచనలని
గాలం వేసి పట్టాలి
ఒక్కో ఎర ని జాగ్రత్త గా చూపి
కలం లో కవితలా, కుంచెలో రంగు లా
నా మనః పలకంపై చిత్రించాలి
పాదాలను ముద్దాడుతున్న
మట్టి పెళ్ళల అల్లర్లు ఇంకా
స్మృతి పధం నుంచి తొలగలేదు
నది ఒడ్డున కట్టిన పిచ్చికగూళ్ళు
తలుపులు తెరిచి రమ్మంటాయి
అక్షరమై కాగితం లో నిద్రపోవాలన్న
ఆరాటాన్ని గుండెకు హత్తుకోమంటాయి
ప్రకృతే వికృతి గా విరుచుకుపడిన
శకలాల రహదారుల్లో వెన్ను చూపక
ప్రాణం కంటే మరేది విలువ లేదని
గొంతు విప్పి, దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తాను
నన్ను నేను తరచి చూసుకోవాలి
మానవత ని వదిలేసిన క్రూరత్వాన్ని
నిప్పు లో కాల్చి , పునీతుడనై
లోకం లో నిలబడగలగాలి
ఒక్కో ఘటన సంకెళ్ళు తెంచుకొని
నా పై యుద్ధం ప్రకటించినపుడు
ధీరుడి లా పోరాడి
కన్నీటికి వెరువక
విషాదాల వాకిట రెపరెప లాడుతాను
నాలోని ఇంకో రూపానికి
నేను జవాబుదారి
నిన్న అన్నది కుబుసం విడిచిన పాములాంటిది అని
వర్తమానాన్ని తాగుతూ
కబళించే నిజాన్ని గొంతులోనే నోక్కేసినపుడు
ఓ ముద్దాయి లా ప్రశ్న ముందు నిల్చుంటాను
 పశ్చాతాపం నన్ను దహించివేస్తుంది
ఎందుకంటే ఇప్పుడు నేను నిలువెత్తు అబద్దాన్ని …!!!
sagar
*

మీ మాటలు

 1. jagaddhatri says:

  కవిత చాల బాగుంది సాగర్ ….అభినందనలు ప్రేమతో జగతి

 2. సాగర్ కవిత బాగుంది

 3. Lokesh says:

  వెరీనైస్

 4. Perugu.ramakrishna says:

  గుడ్ పోయెమ్ ..

 5. kalyan krishna kumar.k says:

  అధ్భుత:.. అద్దం లా ఉంది

 6. pusyami sagar says:

  జగదాత్రి గారికి, కొండ్రెడ్డి గారికి, లోకేష్ గారికి, పెరుగు రామకృష్ణ గారికి, కళ్యాన్ గారికి అందరికి ధన్యవాదాలు

 7. knvmvarma says:

  ఓ ముద్దాయిలా ప్రశ్న ముందు నుమ్చుంటాను …చాలా బాగుంది కవిత

 8. కవిత చాల బాగుంది పుష్యమి సాగర్ గారు

 9. vijay kumar says:

  very gud one

మీ మాటలు

*