లెటర్స్

 

prajna“అమ్మా, నేనొచ్చేశా” అని అరుచుకుంటూ చైత్ర ఇంట్లోకి వచ్చి, బాగ్ కుర్చీలోకి విసిరేసింది.

“ఏంటి తొందరగా వచ్చేశావు? రాత్రి టాస్క్ లు ఉన్నాయా, మళ్ళీ పని చేయాలా ఏంటి?” మంచి నీళ్ళు తెచ్చి ఇస్తూ కౌసల్య అడిగింది.

“లేదు లే, మా సర్వర్ లు అన్నీ డౌన్ అయిపోయాయి, ఇంటికెళ్లిపోవచ్చు అన్నారు. మనం ఇలాంటి అవకాశాలని వదులుకోము కదా, వచ్చేశాను” చైత్ర చెప్పులు విప్పుతూ చెప్పింది. కానీ అది నిజం కాదు. నిన్న రాత్రి నుండి తన మనసు మనసులో లేదు. అమ్మ కి ఆ విషయం చెప్పటం ఇష్టం లేక ఆఫీస్ లో ప్రాబ్లం అని అబద్ధం చెప్పింది.

“మంచిది. ఇప్పుడే ‘ద రింగ్’ సినిమా చూద్దామని అనుకుంటున్నాను. హారర్ సినిమాట కదా. నువ్వు కూడా చూద్దువుగాని, కాళ్ళు చేతులు కడుక్కొని రా” అని కౌసల్య అంటూ ‘ఐపాడ్’ ని టీవీకి కనక్ట్ చేసింది.

“ఐపాడ్ లో ఏముంది? ఆన్లైన్ దొరికిందా ప్రింటు? అయినా ఈ హారర్ సినిమాలు ఇష్టం ఏంటమ్మా నీకు? నాకు చాలా భయం” చైత్ర చేతులు తుడుచుకుంటూ అడిగింది.

“నీకు మీ డాడీ పోలికలు వచ్చాయి లే గాని, మైక్రోవేవ్ లో మన ఇద్దరికీ టీ ఉంది. నాకు పొద్దున నుండి ఒంట్లో బాగోలేదు, ఓపిక లేదు. సొ నువ్వే, ఒక నిముషం చాలులే , టీ వేడి చేసుకొని తీసుకురా. సినిమా స్టార్ట్ చేస్తున్నాను”

“ఎంటో, నాకంటే ఎక్కువ టెక్నాలజీని ఫాలో అవుతున్నావుగా అమ్మా అసలు” చైత్ర ఆశ్చర్యంగా “అయినా ఏమైంది? జ్వరమా?” అని అడిగింది.

కౌసల్య టీచర్ గా పనిచేసేది. పెళ్లి చేసుకున్నాక తను చాలా మారిపోయింది. పెళ్లికి ముందు ఉండే ఉత్సాహం, జీవితంలో ఏదో సాధించాలనే ఆశ ఇలాంటివి ఏవీ పెళ్లి అయ్యాక తనలో కనిపించలేదు. కూతురు ఉద్యోగం చేసే వయసుకు వచ్చేసరికి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. కానీ టీవీ సీరియళ్లు చూస్తూ లేదా  వాళ్ళ మీదా వీళ్ళ మీదా నేరాలు చెప్పుకుంటూ, ఏదోలాగా కాలక్షేపం చేయటం ఇష్టం లేక చైత్ర చేత ఐపాడ్ తెప్పించుకొని తనకి అంటూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకుంది. చిన్నప్పుడు కుదరలేదు కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల్లో తనకి ఇష్టమైన కర్నాటిక్ సంగీతం నేర్చుకుంటోంది. అలాగే యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసే భర్త, కూతురికోసమని రకరకాల వంటలు చేసి పెడుతూ ఉంటుంది.

తన భర్త విక్రమ్ కూడా పెళ్ళికి ముందు చలాకీగా, కలుపుకోలుగా ఉంటూ ఉండేవాడనీ, పెళ్లి అయ్యాక మరీ మెకానికల్ గా తయారయ్యాడు అని విక్రమ్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. కౌసల్యకి, విక్రమ్ కి పెళ్లి అయి పాతిక సంవత్సరాలు అయినా కూడా, వాళ్ళిద్దరి మధ్యా ఎక్కువ మౌనమే ఉండేది. పిల్లల ముందు తల్లిదండ్రులు స్నేహంగా ఉండాలి అని వాళ్ళ నమ్మకం. అందుకే చైత్ర ముందు మామూలుగా ఉంటారు కానీ నిజానికి ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోరు. చైత్ర కోసం చుట్టాల ఇంటికి, లేదా బయట హోటళ్ళకి, సినిమాలకి తీసుకువెళ్ళేవారు. కానీ వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటే వేరేలా ఉండేవారు. ఇది వినటానికి విడ్డూరంగా ఉన్నా చాలామంది ఇళ్ళలో ఉండే వ్యవహారమే. పిల్లలు పుట్టాక భార్యాభర్తలు కొంత దూరమవుతారు. దగ్గర అవటానికి ప్రయత్నించకపోతే ఇంక వాళ్ళిద్దరి మధ్య శూన్యమే మిగులుతుంది.

కానీ కౌసల్య, విక్రమ్ లది వేరే కేసు. పెళ్లి అయినప్పటినుండి వీళ్ళు స్త్రేంజెర్స్ లాగా బ్రతుకుతున్నారు. చైత్ర వీళ్ళ జీవితంలోకి రాక ముందు కేవలం రూమ్ మేట్స్ లాగా ఉండేవారు. కలిసి చేసిన పనులు చాలా తక్కువ. చైత్ర పుట్టాక బాధ్యతలు పంచుకోవడం మాత్రం కలిసి చేస్తున్నారు. వీళ్ళ ఇద్దరి మధ్య బంధం స్త్రేంజెర్స్ కి ఎక్కువ, స్నేహానికి తక్కువ అని అనటంలో అతిశయోక్తి లేదు. చైత్ర ఇంట్లో ఉన్నంత సేపు వాతావరణం చాలా లైవ్లీ గా ఉంచటానికి విక్రమ్, కౌసల్యలు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. చైత్రకి చిన్నతనంలో ఏమీ తెలిసేది కాదు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ ఇంట్లో పరిస్థితి అర్ధమవుతోంది. అమ్మ, డాడీ మధ్య ఉన్న బంధం అంతంతమాత్రంగానే ఉందని తనలో ఒక చిన్న కన్ఫ్యూజన్ మొదలయ్యింది.  అందులోనూ ఆలోచించగా ఆలోచించగా నిన్న రాత్రి తనుచేసిన పని తప్పుగా అనిపిస్తోంది.

చైత్ర ప్రశ్న కి జవాబు ఇవ్వకుండా“ఏంటి లేటు? తొందరగా రా” కౌసల్య అరుపుకి చైత్ర టీ లేకుండానే దగ్గరకొచ్చి “అమ్మా” అని నెమ్మదిగా పిలిచింది.

చైత్ర ఖాళీ చేతులనీ చూసి, “ఏంటి? టీ ఏది? పోనీ నీకు అంతగా భయమేస్తే వెళ్ళి పడుకో కాసేపు. నేను సినిమా అయిపోయాక లేపుతానులే”అని కౌసల్య చాలా కాజుయల్ గా అంది.

“కాదు అమ్మా. నీకో విషయం చెప్పాలి. నువ్వు ఏమి అనకూడదు, అనుకోకూడదు” చైత్ర ధైర్యంగా చెప్పింది.

“అబ్బో, సినిమా డైలాగ్ ఆ బాగుంది. చెప్పు ఏంటి సంగతి? సస్పెన్స్ వద్దు. అసలే ఇవాళ నాకు బి‌పి ఎక్కువగా ఉంది”

“నిన్న నేను ఆ పాత పెట్టెలో నా సర్టిఫికేట్ వెతుకుతున్నప్పుడు, ఒక బ్లాక్ బాగ్ కనిపిస్తే, తీసి..” ఇంకా తన మాటలు పూర్తి అవకుండానే, కౌసల్య అందుకొని “ఓపెన్ చేశావా?” సీరియస్ గా అడిగింది.

“సారీ అమ్మా, ఒక లెటర్ చదివి ఆపేద్దామనుకున్నాను. బట్..” అని చైత్ర మాట్లాడటం ఆపేసింది.

“సరే. ఇంక ఆ విషయం వదిలేసేయ్”

“ఓకే”

కాసేపు అక్కడ మౌనం రాజ్యమేలింది. ఆ ఇంటికి విక్రమ్, కౌసల్య మధ్య మౌనం అనే ఆట అలవాటే, కానీ ఈ సారి విక్రమ్ బదులు చైత్ర ప్లేయర్.

“ఒకటి చెప్పు. బ్లాక్ బాగ్ లో ఇంకేమైనా చదివావా? అయినా దాని మీద పర్సనల్ అని నా పేరు ఉంది కదా? మ్యానర్స్ లేవా నీకు?” టెన్షన్ పడుతూ కౌసల్య అడిగింది.

“లేదమ్మా. లెటర్స్ తప్ప ఇంకేమీ చదవలేదు. సారీ అమ్మా” ఇంకేం మాట్లాడాలో అర్ధాంకాక చైత్ర వచ్చి కౌసల్య ని హగ్ చేసుకుంది.

“కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి ప్లీజ్” కౌసల్య అనేసి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంది.

అమ్మ ఎప్పుడూ ఇలా సీరియస్ అవ్వడం చూడని చైత్ర తను చాలా తప్పు చేసింది అని గ్రహించి ఎలాగయినా అమ్మని మచ్చిక చేసుకోవాలి అని రాత్రి వంట చేద్దామని నిశ్చయించుకుంది. గూగుల్ లో బిర్యానీ ఎలా చేయాలో చూసి, మూడు గంటలు కష్టపడి బిర్యానీ చేసింది.

“డాడీ వచ్చే టైమ్ కూడా అయింది. ఇంక అమ్మని కూడా తినటానికి రమ్మంటాను” అని రూమ్ తలుపు రెండు సార్లు తట్టింది. ఎంతకీ ఓపెన్ చేయకపోయేసరికి, తలుపుని కొంచం తోసి మంచం మీద నిర్జీవంగా ఉన్న కౌసల్య ని చూసింది. పల్స్ చెక్ చేసి వెంటనే ఆంబ్యులెన్స్ కి, విక్రమ్ కి కాల్స్ చేసింది. ఆంబ్యులెన్స్ తో పాటు టైమ్ కూడా పరిగెట్టింది. అప్పటికే చనిపోయిన కౌసల్య ని హాస్పిటల్ లో డాక్టర్ చెక్ చేసి ‘నేచురల్ డెత్’ అని కన్ఫర్మ్ చేశారు.

———————

కౌసల్య గుండెపోటుతో పోయి సరిగ్గా నెల అయింది. రోజూ అమ్మ గుర్తొస్తూ చైత్ర ఏడుస్తోంది. విక్రమ్ కి మాత్రం ఏడుపు రావట్లేదు. ‘ఇంత బండబారిపోయానా’ అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉన్నాడు. కానీ జీవితం సాగాలి కాబట్టి రొటీన్ లైఫ్ లో పడిపోయాడు. ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళకి కాఫీ, భోజనాలు చేసి పెట్టడమే తప్ప ఇంక పెద్దగా ఇంట్లో ఏమి జరగట్లేదు. అప్పటిదాకా కౌసల్య గురించి చైత్ర, విక్రమ్ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఆ రోజు మాత్రం ఎందుకో విక్రమ్ కి కౌసల్య బాగా గుర్తొచ్చింది.

కాలెండర్లో తేదీ చూశాడు. ఫిబ్రవరి 14. మదిలో ఏవేవో జ్ఞాపకాలు మెదిలాయి. ఎంతో బాధగా, దిగులుగా ఉంది. కూతురు అంటే అమితమైన ప్రేమ. చైత్ర మొహం చూస్తే తనకి ఏం కష్టమొచ్చినా  దానిని ఎదురుకునే ధైర్యం వస్తుంది అని అతని నమ్మకం.

“చైతూ” ప్రేమగా పిలిచాడు. డాడీ గొంతు ఏదో వేరేగా వినిపించటంతో పరిగెత్తుకుంటూ వచ్చి “ఏంటి డాడీ?” అని అడిగింది. “సినిమా కి వెళ్దామా?” విక్రమ్ బ్లాంక్ గా అడిగాడు. “సినిమాకా?” అని తటపటాయించి, “ఏం సినిమా?” అని అడిగింది.  పేపర్ తిరగేస్తూ, “ఔయిజా అంట” అని అన్నాడు.

“డాడీ అది హారర్ సినిమా” అని ఒక క్షణం ఆగి, “డాడీ మీకో విషయం చెప్పాలి” అని అనేసి, లోపలకి గబగబా వెళ్ళి, ఒక నల్ల బాగ్ తీసుకొచ్చి విక్రమ్ కి ఇస్తూ, దగ్గరగా కూర్చుని అంది.

“ఏంటిది?” విక్రమ్ నల్ల బాగ్ ఓపెన్ చేస్తూ అడిగాడు.

“అమ్మకి హార్ట్ అట్టాక్ రావటానికి నేనే కారణం. పాపం అమ్మ ఎవరినో ఇష్టపడింది డాడీ. నేనేమో సిగ్గులేకుండా మొత్తం పర్సనల్ లెటర్స్ అన్నీ చదివేశాను. అమ్మ ఆ పాత విషయాలు అన్నీ మర్చిపోయి, మీతోనే ఇంక జీవితం అని ఫిక్స్ అయి, హాపీ గా ఉంటున్న సమయంలో నేనే పిచ్చి దానిలాగా ఈ లెటర్స్ విషయం గుర్తుచేశాను. నేనే అమ్మ మెమరీస్ ని ట్రిగ్గర్ చేశాను అనవసరంగా…” చైత్ర ఏదో చెప్తునే ఉంది, విక్రమ్ మాత్రం వినట్లేదు. ఒకే ఒక్క లెటర్ చూశాడు. చిన్నపిల్లాడిలాగా ఏడవటం మొదలుపెట్టాడు.

“డాడీ ఏమైంది డాడీ?” అంటూ చైత్ర ఖంగారు పడింది.

ఏడుస్తూనే తన చూపుడు వేలితో విక్రమ్  లెటర్ ని, తనని మార్చి మార్చి చూపిస్తున్నాడు. ముందు చైత్ర కి అర్ధంకాలేదు. సడన్ గా ఏదో అర్ధమయినట్లు “ ఏంటి ? ఈ ఉత్తరాలు రాసింది మీరా? అంటే మిమ్మల్నే అమ్మ ఇష్టపడిందా?” అయోమయంగా అడిగింది.

విక్రమ్ ఏడుపు ఆపలేదు. చైత్ర తీసుకొచ్చిన నీళ్ళు తాగి, కొంచం కంట్రోల్ చేసుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు

“నేను ‘విహారి’ అనే కలం పేరుతో నా ఫ్రెండ్స్ కి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడిని. ఎందరో పెన్ పాల్స్ ఉండేవారు నాకు. అందులో నాకు బాగా ఇష్టమయిన పెన్ ఫ్రెండ్ ‘శివరంజని’. ఆమెకి సంగీతం ఎంతో ఇష్టం. హిచ్ కాక్ సినిమాలు ఇష్టం. మేము ఇద్దరం రెండే రెండు నెలలలో వందలకి పైగా ఉత్తరాలు రాసుకున్నాము. ఈ వంద లెటర్స్ ద్వారానే మేము బాగా క్లోజ్ అయ్యాము.  మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్దాము అనుకున్నాను నేను. ఆమె మాత్రం తన ఫీలింగ్స్ ఎప్పుడూ చెప్పలేదు. కానీ నువ్వు చూశావుగా ఆ లెటర్స్ లో తను రాసిన భావాలు బట్టి నేను కూడా తనకి ఇష్టమే అని నాకు అనిపించింది. ఒక రోజు సడన్ గా“ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి కుదిర్చారు. ఇదే నా ఆఖరి లెటర్” అని లాస్ట్ ఉత్తరం వచ్చింది. నాకు చాలా కోపం వచ్చింది. నాక్కూడా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఆ కోపంలో వచ్చిన మొదటి సంబంధం కి ఓకే చెప్పేశాను. మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయిన రోజునే నేను మీ అమ్మకి చెప్పాను, నాకు ఇంటరెస్ట్ లేకుండా పెళ్లి చేసుకున్నానాని. తను మాత్రం ఏం అనలేదు. పైగా ఇంట్లో వాళ్ళ ముందు మాత్రం హాపీ గా కనిపించాలి అని చెప్పి నాతో కోపెరేట్ చేసింది. నాతో చాలా స్నేహపూర్వంగా ఉండేది. నేనే సరిగ్గా రెస్పోండ్ అయ్యేవాడిని కాదు. పెళ్ళయి ఏడాది అయ్యిందో లేదో ఇంట్లో వాళ్ళు ఒక మనవడినో, మనవరాలినో కనివ్వండి అని మొదలెట్టారు. ఒక రోజు కౌసల్య వచ్చి ‘మనలో ఒకరికి ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని, అందుకే పిల్లలు పుట్టడం కష్టం అని ఇంట్లోవాళ్లకి చెప్పి మనం ఒక అమ్మాయిని దత్తతు చేసుకుందాము’ అనొక ఐడియా ఇచ్చింది. అలా మేనేజ్ చేయటమే మంచిది అని నాక్కూడా అనిపించింది.  అప్పుడు కౌసల్య నా మనస్థితిని అర్ధంచేసుకుంది, ఎంత మంచిదో అని అనుకున్నాను. కానీ ఇలా…”

విక్రమ్ కి దుఃఖం పొంగుకొచ్చింది.

ఎంతో ధీర్గంగా వింటున్న చైత్ర“అంటే, నేను…” అని, బ్లాక్ బాగ్ లో ఒక ఎన్వెలోప్ తీసి ఓపెన్ చేసి చూసింది. సొ అమ్మ ‘ఇంకేమైనా చదివావా, చూశావా’ అని అడిగింది దీని గురించే అన్నమాట.  తన ‘అడాప్షన్ సర్టిఫికేట్’ చూసి, చైత్ర కూడా ఏడవటం మొదలుపెట్టింది.

పాతికేళ్లు దాచి ఉంచిన లెటర్స్ . ఒకరికి తన పుట్టుక గురించిన నిజం తెలియజేప్తే, మరొకరికి తను మిస్ అయిన జీవితం గురించిన నిజం బయటపెట్టాయి. రెండు గంటలు విక్రమ్, చైత్ర ఏడుస్తూనే ఉన్నారు. చైత్ర ముందుగా తేరుకొని “డాడీ” అంది. చైత్ర వైపు చూశాడు విక్రమ్. తనకే కాకుండా చైత్ర కి కూడా లెటర్స్ బాధ కలిగించాయి అని రియలైజ్ అయి  “చెప్పమ్మా” అన్నాడు.

“అమ్మకి విహారి అంటే ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ నువ్వంటే మాత్రం బాగా ఇష్టం. ‘ఏంటమ్మా డాడీ అస్సలు నిన్ను, నీ హెల్త్ ని పట్టించుకోరు’ అని నేను ఎన్ని సార్లు అడిగానో తెలుసా? అప్పుడు నాకు చెప్పేది-‘మీ డాడీ కి మనం ఇద్దరం బాగా ఇష్టం, అందుకే అంత కష్టపడి సంపాదిస్తున్నారు’ అని. అమ్మ ఆ రోజు చాలా బాధ పడినట్లు ఉంది, కానీ నేను ఆ లెటర్స్ చదివినందుకు కాదు డాడీ.. నేను మీ కన్న కూతుర్ని కాదు అన్న నిజం నాకు తెలిసిపోయినందుకు. లేదా ఇన్నాళ్ళు అమ్మ మీ మీద పెంచుకున్న ప్రేమ కంటే తన లెటర్స్లో ఉన్న మనిషి మీద ఇష్టమే ఎక్కువ అని నేను ఎక్కడ అనుకుంటానో అని.   అమ్మ గతం మర్చిపోయి నీతో ఎంత సంతోషంగా ఉండాలి అనుకుందో పాపం, నేను అర్ధం చేసుకోగలను. అయినా అమ్మకి హారర్ సినిమాలు, సంగీతం ఇష్టం అని తెలియదా నీకు? అవి తెలిసుంటే శివరంజని యే అమ్మ అని తెలిసి ఉండేది కదా? మరి అమ్మకి మాత్రం నీ ఇష్టాలు అన్నీ ఎలా తెలుసు డాడీ? అంటే నిజంగానే అమ్మ గురించి నీకు ఏమీ తెలియదన్నమాట. ఎంత పని చేశావు డాడీ, అమ్మని అర్ధం చేసుకోలేదు నువ్వు. తప్పు చేశావు డాడీ, 25 ఏళ్ల నుండి… నీకు ఒక్కసారి కూడా అమ్మ ని అర్ధం చేసుకోవాలని అనిపించలేదా డాడీ?”అని కోపంగా అడిగింది.

దుఃఖాన్ని మింగుతూ “చెప్తున్నాను కదా. పెళ్లి అయిన తరువాత ఇంట్లో నాకు ఒక భార్య ఉంది అని నేనెప్పుడూ ఫీల్ అవ్వలేదు. నేను శివరంజనినే ఇష్టపడ్డాను. తనతోనే జీవితం అనుకున్నాను. నన్ను మోసం చేసింది అని ఇంక నాకు జీవితం మీద విరక్తి వచ్చింది. అలాగ అని చచ్చిపోయే అంత పిరికివాడిని కాను. లైఫ్ షుడ్ మూవ్ ఆన్. అలాగే అనుకోని ఇన్నేళ్లు బ్రతికేసాను. పెళ్లి అయ్యాక నా అభిరుచులు అన్నీ మారిపోయాయి. అందుకే మీ అమ్మకి నేను విహారిగా ఎప్పుడూ అనిపించి ఉండను. నా తలరాత.  నా శివరంజని తోనే ఒకే ఇంట్లో పాతికేళ్లు ఉండి కూడా గుర్తుపట్టలేకపోయాను. నా అంత దురదృష్టవంతుడు ఎవడైనా ఉంటాడా ఈ లోకంలో? నన్ను క్షమించు. నిన్ను ఎప్పుడూ సంతోషపెట్టలేదు. నిన్ను మర్చిపోలేను నేను. నువ్వు లేకపోతే ఏం చేయాలి కౌసల్యా? ఐ యాం సొ సారి కౌసల్యా !  ” అని పైకి చూస్తూ శోకంతో కన్నీరు కార్చాడు.

“ఒకటి మాత్రం నిజం చైతూ. నిన్ను ఎప్పుడూ మేము కన్న తల్లిదండ్రులలాగే యే లోటూ రాకుండా చూసుకున్నాము, ప్రేమగా  పెంచాము. నన్ను అసహ్యించుకోకు ప్లీజ్.  ఐ ఆల్వేస్ లవ్ యు” అని చైత్రని దగ్గరకి తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు.

“ఐ నో డాడీ. అమ్మ కి ఛాన్స్ వచ్చినా నన్ను తిట్టలేదు. ఎప్పుడూ కొట్టలేదు. ఇంత ప్రేమగా యే పేరెంట్స్ ఉండరు కూడా. ఐ లవ్ యు డాడీ” అని కళ్ళు మూసుకొని “ అండ్ ఐ మిస్ యు అమ్మా” అని మనసులో అనుకుంది.

ఒక గంట తరువాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు విక్రమ్ కళ్ళు తుడుచుకుని చైత్రతో “పదా” అన్నాడు.

హఠాత్తుగా  అలా అడిగేసరికి “ఎక్కడికి డాడీ?” ఆశ్చర్యంగా అడిగింది చైత్ర.

“కౌసల్యకి ఇష్టమైన హారర్ సినిమాకి…”

“Letting go means to come to the realization that some people are a part of your history, but not a part of your destiny.”  Steve Maraboli

***

మీ మాటలు

  1. మణి వడ్లమాని says:

    కధ,కధనం చాలా బావుంది. విషాదాన్ని మాత్రం కొంచెం భరించలేకపోయాను. అయినా బావుంది. అభినందనలు

  2. కథాంశంలో నాటకీయత ఎక్కువగా ఉన్నా కథనంలో ఆపకుండా చదివించే గుణం ఉంది . వెరసి కథ బాగుంది . అభినందనలు

  3. విజయ్ గజం says:

    చాలా బాగుంది..అధునిక యుగంలో పెళ్లీల ముసుగులో జరిగే అత్మవంచన చాలా బాగా వ్యక్తం చెశారు..

  4. Karra Nagalakshmi says:

    చాలా బాగుంది కధ కీప్ ఇట్అప్

  5. mohan.ravipati says:

    కథ చాలా బాగుంది , చాలా పెళ్ళిళ్ళు లో ఉండే మోనటనీ ని ప్రతిఫలిస్తుంది .

  6. Yamininagaprashanthi says:

    హార్ట్ touching స్టొరీ. ఈ రోజుల్లో చాల వరకు అందరు వేరేవాళ్ళ కోసం జీవీస్తునారు.

  7. కథనం చాలా బాగుందండీ. వేగంగా చదివించారు. విషాదవంతమైన కథలజోలికి వెళ్ళను నేను. అలాంటిది ఆపకుండా చదివాను. కథనంలో ఆ నేర్పు ఉంటే ఎలాంటివాళ్ళ చేత అయినా చదివిస్తుంది కదా. అభినందనలు.

  8. P.padmavathi says:

    పెగ్గి
    కద చాల బాగుంది కధనం Inka బాగుంది. కీప్ ఇట్ అప్

  9. చాల బాగుంది పెగ్గి :) a touching story!
    Good luck and waiting for more :)

  10. nandoori sundari nagamani says:

    ప్రజ్ఞా, చక్కని శైలి నీది… ఎంతో బాగా వ్రాశావు… కథలో మమేకమై ఉండిపోయాను… కౌసల్య మరణం వాళ్ళిద్దరి లాగే నేనూ తట్టుకోలేకపోయాను… నీవు మంచి రచయిత్రివి అవుతావు తల్లీ… నీకు నా ఆశీస్సులు!

  11. సుజల says:

    ప్రజ్ఞా కధ చాల బాగు౦ది. కొ౦తమ౦ది జీవితాన్ని యా౦త్రిక౦గా జీవిస్తారన్నది నిజ౦ మనసు విప్పి మాట్లాడుకోక పోతే జరిగే పరిణామాల్ని బాగా చెప్పావు. చిన్న సూచన ఆ౦గ్ల పదాల వాడుక తగ్గి౦చు అ౦తకన్నా ఇ౦కేమీ లేదు
    సుజల

  12. దేవరకొండ says:

    ఆంగ్ల పదాల వాడకం తగ్గించమని సుజల గారు చెప్తే, రచయిత్రి thanks అని ఆంగ్లం లోనే చెప్పడం తమాషా గా ఉంది.

    • హ హ హ…నేను కూడా అదే అనుకున్నాను. ఈ మధ్యనే తెలుగులో రాయటం మొదలుపెట్టాను. సాధ్యమైనంత వరకు తెలుగు పదాలు వాడటానికే ప్రయత్నిస్తున్నాను. practice will make me perfect !!

  13. Chimata Rajendra Prasad says:

    మీ కథనంబాగుంది. రాస్తూనే ఉండండి. రాసే కొద్దీ కలం పదునెక్కుతుంది. ఇంకా స్పష్టంగా మీరు చెప్పదలచుకున్నది చెప్ప గలుగుతారు.

    • చాలా థాంక్స్ అండీ. ఇలాంటి కమెంట్స్ ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి :) thank you for a positive comment .

  14. Sai Padma says:

    ప్రజ్ఞా గారూ.. కథ ఇతివృత్తం బాగుంది .. కానీ , చదువుకున్న వాళ్ళు అయి ఉండీ,, వాళ్ళిద్దరూ అలా నిశ్శబ్దం లో ఎలా బ్రతికేసారో, దానికి మీరు ఇంకాస్త రాసి ఉండాల్సింది ఏమో అనిపించింది .. ఇంచుమించు పాతికేళ్ళు .. ఈసారి రాసే కథల్లో ఆ మానసిక మధనం కూడా కొంచం రాస్తే బాగుంటుంది

    కథ కాన్టేంపరరీ గా ఉంది .. బాగా రాయండి

    • పద్మగారు
      ధన్యవాదాలు. ఈ కాలంలో అలాంటివాళ్ళు (మెకానికల్ గా బ్రతికే వాళ్ళు ) కూడా ఉన్నారు అని చెప్పటమే కథ :) కాని మీరు చెప్పిన పాయింట్ నాకు అర్ధమయింది, తప్పకుండా కన్సిడర్ చేస్తాను :)

  15. vani koraTamaddi says:

    కధ చాలా బావుంది మొత్తం చెదివేదాకా ఉత్కంఠం సాగింది

  16. Very good story. People would be happy to read your works more. Take up a big project. God bless!

  17. Thanks Karthik !

  18. R.nagireddy says:

    Good స్టొరీ akka

  19. R.nagireddy says:

    అక్క
    గుడ్
    స్టొరీ

Leave a Reply to Yamininagaprashanthi Cancel reply

*