బుక్‌మార్క్

 వాసుదేవ్

 

ఇవన్నీ ఇంతే

అందమైన బుక్‌మార్క్ గా సిధ్ధమే

కన్నీళ్ళకథలు పర్చుకున్న పొడుగాటి పగలూ

అలసిపోయిన ముగ్ధ రాత్రీ

సోక్రటీస్ పెదవుల దగ్గరి హెమ్‌‌లాక్ విషపు గిన్నె

జీవిత గాయాల కథల తిన్నె

సిధ్ధమె!

బుక్మార్క్ గా రూపాంతరానికి సిధ్ధమే

 

ఆరొందలేళ్ళ ఫినిక్స్ పాటలూ

పదిరోజుల పసి ప్రాయపు పలకరింతలూ

హఠాత్తుగా, ఏదో జ్ఞానోదయమైనట్టు

ఎగురుకుంటూ పోయే పక్షులూ

నిక్కచ్చిగా పొడుచుకొచ్చిన గడ్డిమొలకలూ

కాలపు సన్నికాళ్లలో నలిగిపోయి, బతుకుపుస్తకంలో ఇమిడిపోయిన

ఆ అందమైన పువ్వులూ, రావాకులూ,

అపురూపమైన బుక్‌మార్క్ గా సిధ్ధమే!

 

చూరునుంచి బధ్ధకంగా వేళ్లాడుతున్న వర్షపు చుక్కల్లోంచొ

జలతారు పరికిణీ వెన్నెల పరదాల్లోంచో

పాతపుస్తకం లోంచి జారిపడ్డ చాక్లెట్ రేపర్లోంచో

ఖాళీజీవితంనుంచి క్రిందపడ్డ  అపురూప క్షణాల్లోంచో

ఓ బుక్‌మార్క్ సిధ్ధమే!

****

 

అప్పుడెప్పుడో  బతుకు పుస్తకంలో  దాచుకున్న ఆ పాతపువ్వులేమన్నాయి?

 

vasu

 

 

 

 

మీ మాటలు

 1. కెక్యూబ్ వర్మ says:

  మీ కవిత మాకు బుక్ మార్క్ సార్. ఇన్ని అందమైన బుక్ మార్క్ లను గుర్తు చేసినందుకు థాంక్యూ సర్

  • వాసుదేవ్ says:

   మీ అభిమానానికి ధన్యవాదాలు వర్మా…నాకంటే ముందుగానే నా బుక్ మార్క్ ని ఫాలో అయి స్పందించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు మిత్రమా

 2. Nisheedhi says:

  Simply beautiful , I must add its very touchy too . thanks for presenting us such a lovely poem sir .

  • వాసుదేవ్ says:

   నిశీధిజీ,
   మీ స్పందన అక్షరాలవరకూ మాత్రమే పరిమితం కాకుండా ఆలోచనలవరకూ వెళ్తుంది. ఆలోచింపచేస్తుంది కూడా! కృతజ్ఞతలు నిషీ జీ

 3. Vijay Koganti says:

  చాల బాగుంది. చూడగలిగే మనసుంటే జీవితంలోని ప్రతి సంఘటనా, సన్నివేశమూ , వర్ణము, వస్తువు ఓ అద్భుతమైన బుక్మార్క్. అందమైన ఇమేజెస్ తో ఈ వారం బుక్మార్క్ మీ కవిత.

  • వాసుదేవ్ says:

   విజయ్ గారూ
   ధన్యవాదాలు. You have made not only my Day but also my week Thanks friend

 4. చాల బాగుంది వాసుదేవ్! ఊహలు చిట్టి పిచికలై ఎగిరాయి, ‘హఠాత్తుగా’ దొరికిన ‘జ్ఞాన’ తృణమేదో నోట కరిచి.

  • వాసుదేవ్ says:

   ధన్యవాదాలు సర్.. మీ ఎటెన్షన్ని తీసుకోగలిగిన వాక్యం రాసినందుకు ఆనందంగా ఉంది సర్

 5. Sai Padma says:

  కాలపు సన్నికాళ్లలో నలిగిపోయి, బతుకుపుస్తకంలో ఇమిడిపోయిన

  ఆ అందమైన పువ్వులూ, రావాకులూ,

  అపురూపమైన బుక్‌మార్క్ గా సిధ్ధమే!

  రియల్లీ గుడ్ వన్ .. చాలా బాగుంది

 6. వాసుదేవ్ says:

  చాన్నాళ్ళ తర్వాత మీరిక్కడ..ఓహ్! You made my Day సాయి పద్మ గారు

 7. చాలా చాలా బావున్నాయి సర్ ‘ అందమైన బుక్ మార్క్స్ ‘ , ‘ పాత పుస్తకం లో నుంచి జారిపడ్డ చాక్లేట్ రేపర్ లాంటి … ‘ పోయం బావుంది సర్.

  • వాసుదేవ్ says:

   రేఖాజ్యోతిగారూ,
   ధన్యోస్మి…మీ అభిప్రాయం మరిన్ని రాసేలా ఉంది.

 8. vasavipydi says:

  చదువు తున్న పుస్తకం పూర్తీకాకుండా మధ్యలో ఆపాలంటే ఎంత బాధ అది బుక్ మార్క్ కె తెలుసు అందుకే ఈకవిత అంత బాగుంది

  • వాసుదేవ్ says:

   వావ్…చాలా కొన్ని సార్లే ఇలా అందమైన బుక్ మార్క్స్ లా స్పందనలొస్తుంటాయి…ధన్యోస్మి వాసవీ!!

మీ మాటలు

*