అతడు

సి.వి. శారద

 

అక్కడ నింగికి పొద్దులు తెలియవు
సూరీడు వంగి సలాం కొడుతుంటాడు
నెలవంక నిగ్గి సంగీతం వింటుంది
అతని భుజంమీంచి పేజీల్లోకి
చుక్కలూ తొంగి చూస్తుంటాయి

అక్కడ గోడలపైన చరిత్రకారులు
కొక్కేనికి ఊయలూగుతూ వాద్యాలూ
స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటాయి
అతని ఇంట్లో అనంతమైన ఙానం
హాయిగా తలదాచుకుంటుంది

ఆ మధుశాలా మత్తులు
సృజించిన చైతన్యంలో
సిగరెట్ చురక్కి బాటిల్లో చుక్కకి
నషా ఎక్కుతూనే ఉంటుంది
నషానే అతనికి లాలీ, ఆకలీ..!

దిక్కులకి చిక్కనిది కాలానికి తెలియనిది
రహస్యమేదో ఆ ఇంట్లో ఒకటుంది
చీకటిని కమ్ముకున్న ఎల్ఈడీ వెలుగులో
అతను తన ఉనికిని కోల్పోయి
అక్కడ కవితాపానం చేస్తుంటాడు.

*

sarada

మీ మాటలు

 1. mohan.ravipati says:

  నైస్ వన్ శారదా

 2. P V Vijay Kumar says:

  Very impressive one…thanq

 3. Nisheedi says:

  Good one

 4. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  చాలా బాగుంది శారద గారూ! ఐతే నెలవంక నిగ్గి అన్నారు. నిగ్గి అనే పదం నిక్కి కి బదులుగా వాడారా, లేక ఆ పదానికి ప్రత్యేకమైన అర్ధం ఉందా! మీరు వేసిన బొమ్మ కూడా చాలా బాగుంది.

మీ మాటలు

*