పొద్దు

కొండముది సాయికిరణ్

కొత్తగా కనిపించే
పాత సందర్భాలలో
ఇంద్రధనుసు
కొత్తరంగులు పూసినట్లు
కనిపిస్తుంది.
తడారుతున్న ఆకుల మధ్య
ప్రపంచం
పరవశిస్తున్నట్లు వినిపిస్తుంది

సుదూర తీరాల నుంచి
నేలపై వాలిన చినుకులో
పుష్పాన్నై
నిశ్శబ్దంగా రెక్కలు తొడిగిన
పరిమళపు ప్రవాహాన్నై
రెప్పలు మూసుకున్న
ప్రపంచానికి
అసలు రంగులు అద్దాలనుకునేలోపే
తెరలు కట్టుకుంటున్న చీకటి
ఉన్మాద గీతమై నిలువరిస్తుంది.

~

saikiran

మీ మాటలు

  1. ఈ ఆహ్లాదకరమైన ఉదయాన మీ చక్కటి కవిత. చాలా బావుంది కిరణ్ జీ.

  2. కవికి ప్రతి పాత సందర్భమూ సరి కొత్త కవితా వస్తువే. అవే పాత ఇంద్రధనుసుల్లోంచీ , ఆకుల్లోంచీ, పువ్వుల్లోంచీ, పరిమళాల్లోంచీ తాత్వికతని దర్శింపజేశారు . చాలా బాగుంది .

Leave a Reply to Prasuna Ravindran Cancel reply

*