దేశ భక్తులు పోలీసులు – ఎన్ కౌంటర్లే దేశ సేవ!

పి. విక్టర్ విజయ్ కుమార్ 

ఎన్ కౌంటర్ జరిగిన ప్రతి సారి – ‘ పోలీసులు తమ వృత్తి ధర్మానికి ప్రాణలొడ్డినప్పుడు రాని హక్కుల సమస్య ఒక నేరస్తున్ని ఎన్ కౌంటర్ చేసినప్పుడు రావడం ఏంటి ‘ అనో ‘ పోలీసులకు మనుష్యులు కాదా ?వాళ్ళకు హక్కులు లేవా ? ‘ అనో కొన్ని కామన్ ప్రశ్నలు మన మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటాయి.

ఒక మితృడు వాదించాడు ఇలా –

” కూలీలైతేనేం….ఏం కోట్లు విలువ చేసే ఎర్ర చందనం ఎత్తుకు పోతున్నప్పుడు వెధవలకు తెలీదా అందులో రిస్క్ ? కాల్చి పారేయాలి నాయాళ్ళను. చంద్ర బాబు అంటే మాటా ?! మజాకా ?! ”

నేను అడిగాను ” మొన్న నీవు తాగి డ్రైవ్ చేసినప్పుడు , నీకు చలాను వేసాడు కదా పోలీసు ?”

” అవును ?! ” అందులో ఏమంత వింత అన్నట్టు చూసాడు.

” చలాను ఇవ్వకుండ ‘ తాగి డ్రైవ్ చేస్తే ఎంత నష్టమో తెలుసా ‘ అని చాచి లెంప కాయ ఇస్తే ఎలా ఉండేది నీకు ” అన్నా.

“ఆ……మ్మ్.. .మ్మ్ మ్మ….రీ …తాగినందుకే లెంపలు వాయిస్తారా ? వాడి బామ్మర్దులనుకుంటారా ……. లేపొతే ……ఎవన్ని పడ్తే వాన్ని వాయించొచ్చనుకుంటారేంటి ”

* * * * *

ఇంకొక మితృడు –

” చేసేది దొంగ తనం. పోలీసులు కాల్చకుండా ఉంటారా ? ”

” అవును. కాల్చకుండా ఉంటారా ?…అసల నీ చేతిలో ఒక గన్ను ఉండి ….నీవు అక్కడ ఉండి…వాళ్ళను కాల్చేసి ఉన్నావనుకో …..పోలీసులు నీలానే ‘ చేసేది దొంగ తనం . మరి ఇలా చావరా ఏంటి ‘ అని వాళ్ళను చంపేసిన నిన్ను సత్కరిస్తారా ? లేదా అరెస్ట్ చేసి 302 సెక్షన్ బుక్ చేస్తారా ? ”

” ఆబ్వియస్లీ …కేస్ బుక్ చేస్తారు ”

” ఓహ్ ! ఈ దేశానికి నీవు మాత్రం అంటే ఎంత శీత కన్ను ? ‘
* * * * * *

ఇంకో మితృడు –

” పోలీసులు పాపం రాత్రనక, పగలనక పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ….దొంగ తనం చేస్తున్న వాళ్ళను కాల్చి చంపితే జనాలకు…చంపారనే విషయం గుర్తుంటుంది తప్ప….అయ్యో పోలీసులు ప్రాణాలను రిస్క్ చేసి …..వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు కదా …అని ఒక్క వెధవ కు అనిపించదు ‘ …..( ‘వెధవ ‘ అన్ని పలికినప్పుడు మాత్రం నా మొహాన్ని చూసి )

” మీ పక్కింట్లో కుక్క పిల్ల రాత్రులు అరిచి అరిచీ నీకు నిద్ర లేకుండా చేస్తుంది అన్నావు కదా మొన్న ? ”

” అవును ? ” ఇప్పుడు దీనికేం ఎదవ లింక్ అన్నట్టు మొహం చిట్లించాడు.

” ఆ కుక్కను చంపేస్తే ? ”

” చీ …సిగ్గు లేదూ ?! కుక్క ఓనర్ గాడికి బుద్ధి లేదు . పాపం కుక్కేం చేసిందంట మధ్యలో ? ”

” మీ వీధిలో గస్తీ తిరుగుతున్న పోలీసుకు కంప్లైన్ చేసావనుకో ‘ ఏవండీ , ఈ వెధవ కుక్క తెగ మొరుగుతుంది. దాని ఓనర్ గాడికి బానే ఉంది. మాకే నిద్ర పట్టటం లెదు ‘ అని. జస్ట్ అనుకో…పోలీసాయనుండి ‘ సార్…ఈ తల నొప్పి ఎందుకు ?’ అని గన్ తీసి కుక్కను ఒక్క సారి టపీమని కాల్చేసాడనుకో….అలా జరిగిందనుకో…..పర్లేదా ? ”

” అది పాపం కదా ? ”

” నీకు జరిగింది కూడా పాపమే కదా ? ”

” ఐతే పోలీసోళ్ళు చంపేస్తారా ? అందునా కుక్కను ? ”

” వాళ్ళు రాత్రంతా మేల్కుని మనల్ని పరిరక్షిస్తున్నారు కాబట్టి ఒక మంచి కోసం కుక్కను చంపేసినా ఒప్పేసుకోవచ్చులే !! ”

* * * * * * * *

మొదటి మితృడే మళ్ళీ ఇలా అడిగాడు –

” పోలీసులను లేండ్ మైను పెట్టి నక్సలైట్లు లేపేసినప్పుడు అప్పుడు గుర్తుకు రాని హక్కులు ఎవర్నో దొంగ నాయాళ్ళను చంపితే గుర్తుకొస్తుందా ఈ హక్కుల వాళ్ళకు ? ”

” నీవు తాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు పోలీసు చలాను ఇవ్వకుండా లాగి కొట్టి ఉంటే నీవేం చేసేవాడివి ? …జస్ట్ ఆస్కింగ్….”

” ఏం చేసేవాన్ని ……పడేవాన్ని ”

” ఏం తిరగ బడొచ్చు కదా ? ”

” ఇంకో రెండు ఎక్కువ తగిలిస్తారు. లేదంటే లోపలేసి కుమ్మేస్తారు ”

“కుమ్మించుకోడానికి నీవు రెడి అయినా …అది ఒక లెక్క కాదు అని అనుకున్నా …నీవు కూడా వాళ్ళను కుమ్మేస్తావన్న మాట ??? ”

” ఏమో ?! ”

” అంటే నీవు తిరిగి కుమ్మే రిస్క్ ఉందని తెలిసినా …వాళ్ళు నిన్ను మేన్ హేండిల్ చేసారన్నట్టు…అంతేనా ? ”

” అంతే కదా ?”

” నీకు తాగడం తెలుసు కాని తన్నడం తెలీదు కాబట్టి బతికి పోయారు పోలీసులు. అందరూ నీలానే ఉంటే ఎంత బాగుణ్ణు ? ”

“_______”

* * * * * * * *
మొన్న తీవ్ర వాదులు విచ్చల విడిగా పోలీసులపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకుని ఎన్ కౌంటర్ లో చావడం నా భార్య ఫోన్ చేసి చెప్పింది ‘ ఇదుగో ఇది న్యూస్ ‘ అని. నేను అన్నా ‘ ఇంకొన్ని రోజుల్లో ఆంధ్ర తెలంగాణా లో ఎన్ కౌంటర్స్ జరుగుతాయి మళ్ళీ ‘ అని.

ఈ దేశం లో మధ్య తరగతి జనాభా 50 శాతానికి పైనే ఉంటుంది. ఈ మధ్య తరగతి కి ఉండే ఒక ధోరణి ” Excessive neutrality ‘ ని కోరుకోవడం . ఏ సమస్య అయినా ఏదీ , ఎవరికీ నష్టం జరక్కుండా జరగాలని ఆశించడం …అది కుదరకపోతే న్యాయాన్ని ‘ బ్రేక్’ చేసిన వాడిని కాక సామరస్యానికి తల ఒగ్గ్గని వాడిని ప్రశ్నించడం. ఐతే ఏదైనా – సమస్య తమ స్వంత తలలకు చుట్టుకోనంత కాలం మాత్రమే ఈ ‘obsession ‘ ఉంటుంది.

చరిత్రలో ఏ ఉద్యమం చూసినా, ఏ డెవలప్ మెంట్ చూసినా – మద్య తరగతి పాత్ర ఇదే !
మన అభివృద్ధి చెందే భారత దేశం లో ఈ ధోరణి తో మన రాజకీయాలు , రాజకీయ పార్టీలు కూడా సతమౌతూ ఉంటాయి. అదే పాశ్చాత్య దేశాల్లో చూస్తే – ఎన్ కౌంటర్ జరిగితే – అది నిజం ఎంకౌంటర్ జరిగిందా …ఫేక్ ఎంకౌంటర్ జరిగిందా అనే చర్చ దగ్గిర సాధారణంగా ఆగిపోతుంది తప్ప – అసలు ఫేక్ ఎన్ కౌంటరా కాదా అనె ప్రశ్న లేకుండా చచ్చిపోయినోడు – చావడానికి అర్హుడా కాదా అనే దగ్గర చర్చ ఆగుతుంది ఇక్కడ.

అందుకే – కొన్ని సంవత్సరాల క్రితం వై యెస్సార్ టైం లో వరంగల్ లో అమ్మాయిలపై యాసిడ్ దాడి చేసిన ముష్కరులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినప్పుడు అక్కడ ఎస్. పీ హీరో అయ్యాడు. అదేంటో మరి వాళ్ళను నక్సలైట్లు చంపి ఉంటే – నక్సలైట్లను ఎన్ కౌంటర్ లో లేపేసే వాళ్ళు ! అప్పుడు ఎవరూ అయ్యో అనరు ?! బాగా ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే – ప్రజలు పుష్ప గుచ్చాలు ఇస్తుంటే ఎస్ . పీ గారు నవ్వుతూ కెమెరాకు పోజు ఇవ్వడం. ( ఏం ! మీ కూతురికో…మీ భార్యకో..అమ్మకో ఇలా జరిగి ఉంటే …మీరూ చెయ్యరా…అని ఒక personalised question ఒకటి ఎదురు చూడాలి ఇక ) . ఆయన గారు అంతటితో ఆగలేదు – ఒక గంజాయి స్మగ్లర్ను, ఒక పెద్ద నక్సలైటు లీడర్ ను ఎన్ కౌంటర్ లొ అంతం చేసాడు.

పోలీసులు మన వ్యవస్థలో చంపడానికి unconditional authorisation ఉన్న ఒకే ఒక Employee group గా ఈ దేశం లో ఉన్నట్టు అనిపిస్తుంది.

అమ్మాయి మీద యాసిడ్ పోసిన రాక్షసుడు, దేశ ధనాన్ని కొల్లగొట్టే ఎర్ర చందనం ‘కూలీ ‘ దొంగలు ….అందరూ దోషులే ! 5000 కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము, బేంకుల సొమ్ము ఎగ గొట్టిన రామలింగ రాజు కూడా ముష్కరుడే ! పోలీసులు ఆయన్ను ఎన్ కౌంటర్ చేయరు. ఒక ప్రజాస్వామిక వాదిగా ఆయన్ను ఎన్ కౌంటర్ చేసినా నేను సమర్థించలేను.

National Human Rights Commission రిలీజ్ చేసిన Manual on Human Rights for Police Officers ఎన్ కౌంటర్స్ గురిచి చెబ్తూ ఇలా అంది –

” False encounters are, at times, staged by police officers because there is pressure by the political masters to show quick results by means,fair or foul ” అని కారణం చెప్తూ ” The public, particularly the educated middle class, also donot mind if the police take the law in their own hands and become executioners, particularly with regard to the dreaded criminals ” అని ప్రస్తావిస్తుంది.

అసలు చట్ట ప్రకారం ఎవరు ఎవరినైనా ఏ కారణం చేతనైనా – పోలీసు అయినా సరే – మర్డర్ చేయడం నేరము అని చెప్తుంది. ఇలా ఎందుకు చెప్పడం ? పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం కరెక్ట్ అయినప్పుడు మనం చాట్టాన్నిల ఎందుకు రాసుకోవడం ? అలా కాక – ఫలాన నేరం చేస్తూ దొరికినప్పుడు – మొహమాటం లేకుండా పోలీసులు కాల్చేయొచ్చు అని చట్టం చేస్తే సరిపోతుంది కదా ? వాళ్ళు చంపడం – దాని మీద మనమంతా చర్చించడం ఎందుకు ? ఫలానా సెక్షన్ అండ్ సబ్ సెక్షన్ ప్రకారం పోలీసులు ఈ దిగువ చెప్పబడిన నేరాలు చేస్తే ఎవడినైనా సరే అడ్డంగా కాల్చేయొచ్చు అని చట్టం మార్చేస్తే పోలా ?

” న్యాయాన్యాయా లేంది సార్…కొడుకులను వర్సపెట్టి కాల్చేయకుండ…” అని నా కేబిన్ లోకి విసురుగా వచ్చాడు మా ఆఫీసు లొ పని చేసే క్లర్క్. ” ఏం బాబు….నీ కొడుకును ‘ ఐ పీ యెస్ చేయి నాయనా ‘ అని పోరు పెడుతంటావు కదా ….అఫీషియల్ గా మర్డర్ చేసే అవకాశం కూడా ఒకటి దొరుకుతుంది అని కూడా చెప్పి కష్టపడి చదవడానికి inspiration ఇస్తావా ఇక ? ” అన్నా.

నాతో వాదించలేకో , వాదించడం ఇష్టం లేకో వెళ్ళిపోయాడు.

ఈ దేశం లో నక్సలైట్లు రాజ్యాంగాన్ని నమ్మరు. ఈ దేశం లో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని నమ్మరు. చివరికి – ఈ దేశం లో – ప్రజలు కూడా రాజ్యాంగాన్ని నమ్మరు. ఏం దేశమయ్యా బాబు ఇది ?

అకస్మాత్తుగా మనం ఒక వ్యవస్థలో బతుకుతున్నాము అన్నది చాలా సౌకర్యదాయకంగా మన మధ్య తరగతి ప్రజలు మర్చిపోతారు. ఏదో ఇంకా ఏ గుప్త సామ్రాజ్యమో ఉన్నట్టు అకస్మాత్తు భావన వస్తుంది.

నేరాన్ని ఎలా రూపు మాపాలి ? నేరం మళ్ళీ బతక కుండా ఎలా భూస్థాపితం చేయాలి అనడానికి మన దగ్గర సమాధానాలు లేకపోతే నేరస్తులను చంపడం సమాధానంగా కనబడుతుంది. నేరస్తులను చంపడం సమాధానం ఐతే చంపే వాడు కూడా నేరస్తుడౌతాడు. ఎత్తుకు పోయి అడవిలో కణత మీద పిస్టల్ పెట్టి ట్రిగ్గర్ నొక్కే పోలీసులు మాత్రమే నేరస్తులు కారు ?!

మొన్న తెలంగాణ లో మధ్య ప్రదేశ్ నుండి పారిపోయిన టెర్రరిస్టుల ఎన్ కౌంటర్ లో సాధారణ పోలీసులు కూడా ప్రాణం కోల్పోవడం విచారకరం. ఐతే ఈ సంఘటన తో – రెండు రాష్ట్రాల పోలీసులకు ఒక నైతిక బలం చేకూరింది. తర్వాత జరిగిన రెండు ఎన్ కౌంటర్స్ కూడా Planned murers అని పెద్ద తెలివిలేనోళ్ళకైనా తెలిసిపోతుంది.

” మరి ఎందుకు అంతగా పట్టు పడుతున్నావు…పోలీసులు మర్డర్ చేసినా మన మంచికే కదా….చట్టం లో లోపాలు ఉన్నప్పుడు …మనకు అంకుశం రాజశేఖర్ లు కావాలి లే ! వదిలెయ్ ! ” ఒక మధ్య తరగతి ప్రబుద్ధుడి జడ్జ్మెంట్.

మనకెంత ఆత్మ వంచన కదా ? వేల మందిని చేతికి మట్టి అంటకుండా చంపినోడు మన దేశ సిం హాసనం మీద కూర్చున్నాడు. ఏ ‘అంకుశం’ పోలీసు ఆఫీసర్ వాడిని ఎన్ కౌంటర్ చేస్తాడు ?

SP సజ్జనార్ మర్డర్ యాసిడ్ అటాక్ ముష్కరులతో ఆగిపోలేదు. కుక్కను చంపే ముందు పిచ్చిదని చెప్తే చాలంటే – మనమందరం ఇల్లు దాటి బయట కెళ్ళకుండా కుక్కల్లా పడి ఉంటాం. ఎవడు ఎవడిని పిచ్చి కుక్క అంటాడో అని బిక్కు బిక్కు మనుకుంటూ.

ఐతే సమస్యేమీ లేదు అందులో – అందరం కుక్కల్లా బతకాలనుకున్నప్పుడు.
మనమెలా బతకాలనుకున్నామో మనకు క్లారిటీ వచ్చేంత వరకు ఈ విచిత్ర వాదనలు వినాల్సిందే !

PS : The objective of this rhetoric essay is not to demean any individual of the skewed thinking but to let reader understand, in simple terms, that the institutionalised crime is more dangerous than individualised crime and we need to address institutionalised crime on priority basis. It may look ‘ heroic’ on face of it to contain individual crime by illegal means by the Police . However, the same is nothing but ‘shortsightedness ‘ and it is the effort of ‘ State ‘ to play with middle class belief system in order to protect its systemic inability to address the core content of the problem. It is often misconstrued that the crime cannot be contained through law and law has its limitations which justifies action of police to take law into their hands at their ‘discretion’. It is actually a misnomer undermining human’s ability to develop better society and strengthen institutions for safety and security while there are set examples in other parts of the world. Pursuit for low crime rate in a society is a incessant endeavour of nation and does not confine itself only to ‘ law and order’ and hence finding solutions within the hands of police makes us feeble and desperate prompting us to romanticise the police system

మీ మాటలు

 1. ఈ నిమిషం వరకు కూడా జరిగిన encounters గురించి నేను ఇలాగె ఆలోచించాను. నాణెం కి రెండో వైపు ఉన్నట్టే ఆలోచన కి వుండాలి అని అర్ధం అయింది. నా ఆలోచన తీరుని మార్చినందుకు ధన్యవాదాలు

  • vijay kumar says:

   This essay has served its full purpose if it impacts conventional thinking of one single individual completely. And we dont need numbers to change a culture. One is enough as one step. And if u r that ‘one’ , shall be glad about that. Thanq for ur empathateic reading

 2. చట్ట ప్రకారం ఎవరు ఎవరినైనా ఏ కారణం చేతనైనా ….మర్డర్ చేయడం నేరము అని చెప్తుంది.

  చట్టం గురించి, దానిని పాటించాలనే ఆవశ్యకత సమాజానికి ఉండాలి అని నొక్కివక్కాణించి, విపులంగా వాదించిన మీరు ముగింపు కొచ్చేసరికి “వేల మందిని చేతికి మట్టి అంటకుండా చంపినోడు మన దేశ సింహాసనం మీద కూర్చున్నాడు” అని రాశారు. మోడిని సుప్రీం కోర్ట్ దోషిగా తీర్పుచెప్పలేదు. కాని మీరు మాత్రం మోడికి తప్పును అంటగడుతూ రాసేశారు. మీరేమి కోర్ట్ తీర్పులను గౌరవించారు. ఇది ద్వంద్వనీతి కాదా?

  • అదంతే సర్. మనకి నమ్మకం ఉన్న విషయాలు చెప్తే కోర్టుల మీద నమ్మకం ఉంటుంది. మనం నమ్మడానికి ఇష్టపడని, మన ప్రచారాలకు వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నప్పుడు మాత్రం ‘‘కోర్టులు అంత నిర్దుష్టంగా లేవని’’ తప్పించుకుంటారు. అదే వాదనలో మరోపక్క రాజ్యాంగం మీద, కోర్టుల మీదా నమ్మకాలు ఉండాలని చెప్తున్న ఎన్నో వాక్యాలను తమ పక్షాలను సమర్థించుకునేందుకు తామే తుంగలోకి తొక్కడం దురదృష్టకరం.

 3. vijay kumar says:

  నాగ్ గారు , వ్యాసాన్నిఓపిగ్గా చదివినందుకు ధన్య వాదాలు. కోర్టులో నిర్దోషి గా పేకటించబడ్డ ప్రతి వాదు నిర్దోషి కాదు. దోషి గా ప్రకటించబడ్డ ప్రతి వాడు దోషి కాడు. మన వ్యవస్థ అంత ఫుల్ ప్రూఫ్ గా లేదు. ఈ వ్యాసం యొక్క పరిమిత దృక్పథం దోషి ఐనా నిర్దోషి ఐనా ఎన్ కౌంటర్ చేసి పారేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించడం. మీరు మరోసారి తీరిక చేసుకుని వ్యాస దృక్పథం గురించి ఆలోచిస్తే వ్యాసం లో చివరి ముగింపు వాక్యం ” మనమెలా బతకాలనుకున్నామో మనకు క్లారిటీ వచ్చేంత వరకు ఈ విచిత్ర వాదనలు వినాల్సిందే ! ” సవివరంగా అర్థం చేసుకోగలరు అనుకుంటున్నా. ఠేంక్యు !!

 4. “ఈ దేశం లో నక్సలైట్లు రాజ్యాంగాన్ని నమ్మరు. ఈ దేశం లో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని నమ్మరు. చివరికి – ఈ దేశం లో – ప్రజలు కూడా రాజ్యాంగాన్ని నమ్మరు. ఏం దేశమయ్యా బాబు ఇది ?”
  మూడు ముక్కల్లో రెండో మాటకు తావులేకుండా తేల్చేశారు. ఇది నయా నాజీలు, నయా నిజాములు, నయా నరభక్షకులు, నయా ద్రుతరాష్టులు, నయా విభీశనులు.. ఇంకా సకల దుర్మార్గులు ఏలుతున్న దేశం. అందుకే దేనికీ పొంతన ఉండదు. పొంతన ఉన్నట్టు నిత్యం ఫోర్ పిల్లర్స్ ఊదర గొడుతుంటాయి. వెర్రి జనం నమ్మేస్తుంటారు. నమ్మకాలు పేలిపోతే గిన్జుకుంటారు. ఉదాహరణలు బోలెడు. క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, సకల కుంభకోణాలు, కారంచేడు, హాసీమ్పూర్ కేసులు..
  సైకిల్ దొంగతనం చేసిన వాడిని క్షణాలలో దోషిగా తేల్చి లాకప్ డెత్ తో శిక్షంచే దేశం.. పేవ్మెంట్ పై నిద్రపోతున్న మనిషిని మందు మైకంలో స్పోర్ట్ కారుతో గుద్ది చంపిన వాడిని శిక్షించడానికి మాత్రం వెనుకంజ వేస్తుంది. వాడితో దేశ నాయకుడు షేక్ హ్యాండ్ చేస్తాడు, వాడు దేశానికి ఆదర్శమంటాడు.
  కసబ్ జైల్లో బిర్యానీ కావాలని డిమాండ్ చేశాడని వార్తలు వచ్చినప్పుడు, జనం తిట్టారు. అంతమందిని చంపి రుచులు కోరుతున్నాడని. అయితే సర్కారీ న్యాయవాది ఇటీవల అసలు విషయం బయటపెట్టాడు.కసబ్ బిర్యాని అడగలేదని, అతనికి సానుభూతి రాకుండా అడ్డుకోవడానికే బియాని కట్టుకథ అల్లానని, తనది పచ్చి అబద్ధమని చెప్పాడు. కసబ్ చేసింది దుర్మార్గమే. మరి జనం మెదళ్ళను కలుషితం చేసిన ఆ కట్టుకథకుడు చేసింది?

 5. Sk Razaq says:

  మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలే, నేను కూడా ఏన్ కౌంటర్లను సమర్ధించను… కాని నేను ఒక సగటు వ్యక్తిగా మీకు ఎవరన్న ఈ క్రింది ప్రశ్న వేస్తే మీరు ఏం చెబుతారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను …

  చిత్తూర్ ఏన్కౌంటర్లలో 20 మంది కూలీలతో పోరాడుతూ, పది మంది పోలీస్ ఆఫీసర్లు, పది మంది చందనం దొంగల గ్యాంగ్ సభ్యులు చనిపోతే మీరు ఎవరిని సమర్ధిస్తారు ..? సగటు వ్యాక్తిగా ఇరువర్గాలు చేసింది తప్పంటారా ? లేక పోలీసులు చేసింది తప్పంటారా ? లేక చందనం దొంగలు చేసింది తప్పంటారా ?

 6. Vijay Kumar says:

  పోరాడుతూ చంపినా, చనిపోయినా విధి నిర్వహణ అవుతుంది. ఇందులో కంఫ్యూజన్ ఏముంది ?

  చనిపోయాక, చంపేసాక ఎన్ కౌంటర్ ఎందుకు తప్పలేదో, భయపెట్టడానికో , అరెస్ట్ చేయడనికో, ఆత్మ రక్షణ కోసమో …కారణం ఏదైనా అది చట్ట సమ్మతంగా చేయాల్సి వచ్చిందని నిరూపించుకోవాల్సి ఉంటుంది. బొంబాయి రైల్వే స్టషన్ లో ఎడా పెడ సాధారణ ప్రజలను, పోలీసులను ఎవడో చంపేస్తుంటే – చట్టం కూడా పోలీసులకు అధికారం ఇస్తుంది చంపడానికి. ఐతే అది అంత కన్నా మునుపు, అరెస్ట్ చేయకుండా చంపాల్సి ఎందుకు వచ్చిందో నిరూపించాలి. అలా కాక – అరెస్ట్ చేయకుండా లేదా చేసాక ‘ ఎన్ కౌంటర్ ‘ చేస్తానని పోలీసులు అలిగినా, ముంకు పట్టు పట్టినా మాత్రం సమస్యే ! ( ఇలా ఐతే నేరస్తుల ఆట కట్టినట్టే …….అనబోతారా ? )

 7. Thirpalu says:

  / చిత్తూర్ ఏన్కౌంటర్లలో 20 మంది కూలీలతో పోరాడుతూ, పది మంది పోలీస్ ఆఫీసర్లు, పది మంది చందనం దొంగల గ్యాంగ్ సభ్యులు చనిపోతే మీరు ఎవరిని సమర్ధిస్తారు ..? /
  ఈ సంఘటనలకు దారి తీసిన కార్య కారణ సంభందాలు తెలియకుండా ఉత్తి నే ఎవరు ఎవర్ని చంపనా తప్పేననని గదా రచయితా ఉద్దేశం? మనుషులై నప్పుడు అందరు బాగా ఉండాలనే గదా మానవత్వం? చమ్పుడాట తో సంబందం లేకుండా ఆ వెనుక ఆడమ్చే టై తక్క డి గాల్లగురిమ్చే గదా ఇప్పుడు చర్చ?

 8. Sk Razaq says:

  విజయ్ గారు.. సమాధానమిచ్చినందుకు ధన్యవాదాలు …

  “పోరాడుతూ చంపినా, చనిపోయినా విధి నిర్వహణ అవుతుంది హత్య కాదు అని, పోలీస్ ల ఎన్కౌంటర్లను ఎటువంటి కంఫ్యూజన్ లేకుండా సమర్ధించారు మీరు కుడా, ఒక సగటు మనిషిగా ఆలోచిస్తూ ..? ప్రతి సగటు మనిషి ధోరిని కూడా ఇలానే ఉంటుంది సార్ …

  ముంబై దాడుల్లో పోలీస్ కానిస్టేబుల్ వద్ద ఎటువంటి మారణాయుధాలు లేకున్నా, లాటిలతో తీవ్రవాదులను ప్రాణాలను తెగించి ఎదుర్కుంటూ, వీలైనంతవరకు తీవ్రవాదులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ, అజ్మల్ కసాబ్ లాంటి ముస్కర తీవ్రవాదిని కాల్చకుండా, హత్య చేయకుండా, పట్టుకునేంత నిబద్దత, నిజాయితి పోలీస్ లకు ఉండనవసరం లేదు, కాల్చి పారేయ్యల్సిందే అన్నట్లుగా మీ మాటలు స్పురిస్తున్నాయి… కొంపదీసి మీరు U టర్న్ తీసుకోలేదుగా …?

 9. Nisheedhi says:

  At last a slap on so called deshbkaths face . kudos .

 10. Sriniketh Vydya says:

  చాలా రోజుల తర్వాత తెలుగులో థాట్ ప్రొవొకింగ్, పక్షపాతం లేని magazine దొర్కినట్టనిపిస్తుంది, Thanks

 11. Dr. Rajendra prasad Chimata says:

  ఎన్ కౌంటర్ పదానికి 2 అర్థాలు ఉన్నాయి. మొదటిది సాయుధులైన వ్యక్తులను సాయుధులైన పోలీసులు ఎదుర్కోవడం ఒకటి. అది విధినిర్వహణలో భాగమైనప్పుడు చర్చ ఏమీ అవసరం ఉండదు. రెండవది నిరాయుధులైన వ్యక్తుల్ని పట్టుకొచ్చి “ఎన్కౌంటర్ ” చెయ్యడం (కాల్చేయడం) . చర్చ 2వ రకం గురించే.సాయుధులై అమాయకులని పిట్టల్లాగా కాలుస్తున్న కసబ్ లాంటి కరుడుగట్టిన తీవ్రవాదిని కాల్చడమా పట్టుకోవడమా అనేది అక్కడి పరిస్థితులను బట్టి ఉంటుంది. అందులో U టర్న్ ఏముంది?
  విజయ కుమార్ గారూ మీరు PS లో రాసిన ఐడియల్ సొసైటీ భారత దేశంలో ఎన్నటికీ రాదు. ఇది “ఫేక్” ప్రజాస్వామ్యం. ఈ రొచ్చు కాలం గడిచే కొద్దీ ఇంకా ఛండాలమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

 12. Vijay Kumar says:

  ఒక వ్యాసం చదివేటప్పుడు …పాఠకులు వాళ్ళకు కావాల్సింది మాత్రమే చదుకుంటారా లేదా చదివింది వదిలేసి తమకు కావాల్సిందేదో తీసుకుంటారా అర్థమవ్వదు ఒక్కో సారి. I am sorry , if this essay is not digressed from the topic. In the reply, అక్కడ ఎన్ కౌంటర్ చేయాల్సిన పరిస్థితుల గురించి , ఏ పరిస్థితుల్లో ” చట్ట బద్ధంగా ” broadly permissible/ inevitable చెప్పడం అయ్యింది. అంతే కాక దేశం లో ప్రతి సమస్యlaw and order తోనే పోదు అని కూడా చెప్పడమైనది.

  వ్యక్తిగత హక్కుల విషయం దొంగ ఎదురుకాల్పులు సృష్టించినప్పుడు వస్తాయి. రియల్ ఎన్ కౌంటర్ అనేది – It is a war between two oppositely interested groups – ఇందులో హక్కుల సమస్య ఏది ? Police group represent the strongest force , that is, State, while the other is not, most of the times, it would be a much weaker group ; and perspective of examining such issue would be different

  చనిపోయే పోలీసు కాని స్టేబుల్స్ ఏంటి – కోట్ల ఆస్తులు వెనక పెట్టుకుని దేశం కోసం వచ్చి పని చేస్తారా ? లేపోతే ఆగర్భ శ్రీమంతులా వాళ్ళు ?

  ఎన్ కౌంటర్ , లేండ్ మైన్స్ లో – హోం మినిస్టర్స్ , డీ జీపి, డీ ఐజీ లు చావరు. సాధారణ దళిత వెనుక బడిన వర్గాలకు చెందిన పోలీసులులే.

  ప్రజల హక్కులు, పోలీసుల హక్కులు, రాజకీయ నాయకుల హక్కులు, సైనికుల హక్కులు మొ|| …..ఇన్ని విషయాల్లో ప్రస్తుతానికి జఠిలమైనదీ, ముఖ్యమైనదీ – ప్రజల హక్కులు (మిగతా వాళ్ళ హక్కుల గురించి మాట్లాడ్డానికి ప్రభుత్వముంది ). మనం ప్రస్తుతానికి దీని గురించే మాట్లాడుకుందామా ప్లీజ్ ?

 13. Vijay Kumar says:

  డాక్టర్ గారూ, కృతఙతలు.

  అమెరికా లాంటి దేశాల్లో కూడా రోజుకు సగటున ముగ్గురు ఎన్ కౌంటర్ చేయబడుతున్నారు.
  మనం పర్ఫెక్ట్ society సృష్టించలేము కాని better society ని సాధించగలము కదా ? జీ డీ పీ మన అభివృద్ధిని తెలుపుతుంది అనుకోవడమే కాక – ఎన్ని ఎన్ కౌంటర్లు జరుగుతాయో అంత వెనుకబడ్డట్టు అని గుర్తించే రోజు ఒకటి వస్తుంది.

  ఎన్ కౌంటర్ పదం విన్నది తప్ప దైనందిన జీవితం లో చూడని దేశాలు ఎన్ని లేవు ఈ ప్రపంచం లో ?
  రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ ను చూస్తేనే – మన ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగేత్తేంత గొప్ప సమాజం మనది.

  ఇప్పటికీ ‘ కనిపించని ఆ నాలుగో సిం హమేరా పోలీసు ‘ అంటే చప్పట్లు కొట్టే వెనుకబాటు తనం మన ప్రజలది. ఆ నాలుగో సిం హం పంజ విసిరితే – వాడు చంద్ర బాబా , సాయి బాబా, మీరా, నేనా చూడదు. ఒక్క సారి రక్తం రుచి చూస్తే మరి వదలదు.

  సూర్య పేట నిందుతుల ఎన్ కౌంటర్ తర్వాత – విచ్చల విడిగా – పోలీసుల త్యాగ నిరతి గురించి మీడియాలో , సోషల్ మీడియా లో తెగ హోరెత్తాక , ఇన్నాళ్ళ స్తబ్ధత తర్వాత , రెండు ఫేక్ ఎన్ కౌంటర్లు జరగడం కాకతాళీయం కాదు.

 14. Sk Razaq says:

  విజయ్ గారు మీ రైటింగ్ స్కిల్ల్స్ చూసి అద్భుతంగా ఫీలైయ్యను… నేను కేవలం కుతూహలం తో సమస్యను, మీరు ఇంకో కోణంలో ఆలోచించి ఎలాంటి పరిష్కారం చూపుతారో అని కొంచెం సబ్జెక్ట్ ను దివియేట్ చేస్తూ విసిగించాను తప్ప మీ పోస్ట్ పై నెగిటివ్ గా కామెంట్ చెయ్యడం నా ఉద్దేశం కాదు … Really I feel wonder about your writing skills and thought provoking post. All the best sir….

 15. నిజంగా మంచి వ్యాసం. కొన్నితిరగమోత ప్రశ్నలకు తిరుగులేని సమాధానాలు.

 16. You do not seem to realize that in the war between Police and Naxals, it is the Police that are the have nots and the Naxals are Haves. Since 2007, Naxal movement in India spent $250 million to procure weapons and supplies, most of it funded by China, some by the Lutheran Church. The cops on the other hand have to face them with their .303 bores most of the time.

  • vijay kumar says:

   You mean to say every real encounter is a fake encounter by Naxalites…and…every fake encounter is a real encounter by police ?

   • I mean as long as there will be foreign sponsored naxalites, there will be extra judicial deaths.

 17. vijay kumar says:

  @ Razaq ji – సర్ , ఈ టెస్టింగ్ ఏంటి మాకు ? ప్రత్యక్షంగా అడగండి…మీకు సమాధానం దొరక్కుండ ఉండే సమస్య లేదు. by the way , hope u must hav got ur answer. Else , pls feel free to leave one

 18. vijay kumar says:

  Mohan garu, well said. Cant agree more.

 19. Pavithran says:

  అన్న,మంచి వ్యాసం….

 20. అతి తెలివి ఎక్కువ ప్రదర్శించారు అటు ఇటు కలిపి వ్రాసేసి రాజకీయ నాయకుల మాట్లాడే రెండు నాల్కల ధోరణి అవలంభించారు!
  ఇది చదివాకా తప్పు ఎవరు చేసారు అంటే రక్షక భటులు అని అర్ధం అయ్యింది!
  కానీ నా ఈ ప్రశ్నలకు కొంచం సంధానం సుదీర్ఘంగా కాకుండా అవును అని లేదా కాదు అని చెప్పండి చాలు!

  పొలంలో పనులు ఉన్నా అక్కడకు వెళ్ళడం మానేసి డబ్బుకు కక్క్రుతి పది ప్రక్రుతి హరించడం సరైనదా?
  తరువాత ప్రశ్న మందు తాగిన వాడిని రక్షక భటులు జరిమానా వేస్తె తప్ప లేదా కొట్టడం తప్పా?
  మీ సంధానం జరిమానా సరైనది అయితే అసలు జరిమానా విధిస్తే వాళ్ళు తప్పు చెయ్యడం మానేస్తారా?
  మీ సంధానం కొట్టడం సరినది అయితే అసలు కొడితే తప్పు చేసిన వాడు తప్పు చెయ్యడం మానేస్తారా?
  తరువాత ప్రశ్న
  ఒకడు చెడ్డ పని చేస్తే వెనకేసుకు వచ్చే వాళ్ళది తప్ప?
  తప్పు అంటే చెట్లు నారికే వాళ్ళది తప్పు! తప్పు చేసిన వాడిది కాదు అనను మరి వాడు ఆ తప్పు చెయ్యడానికి కారణం ఇంకా చేస్తూ ఉండటానికి కారణం మద్దతు ఇచ్చే వాళ్ళు అనేది జగమెరిగిన సత్యం. వెనక ఉన్న వాళ్ళను కొడితే ముందున్న వాడు తప్పు చెయ్యడానికి జంకుతాడు లేదా వెనక ఉన్న వాళ్ళు ఎవడు చేయిస్తున్నాడో అని చెబుతారు అని రక్షక భటులు ఆలోచన కాకూడదా!
  పట్టించిన వాళ్ళు చెప్పట్లేదు.
  ఇంకా నాకు ఉన్న ప్రశ్నలు

  • vijay kumar says:

   Prasad garu , thank u for patiently reading the essay.
   మీ ముందు నేను అతి తెలివి ప్రదర్శించడం లో పోటీ పడ్డమా ?…..ఊఒ..

   గుండెల్లో దిగ బడే బాణాల్లాంటి మీ ప్రశ్నలకు సమాధానం చెప్పి….మరో మారు నేను అతి తెలివి ప్రదర్శించడం అవసరమా నాకు ?

   ప్రస్తుతానికి మీరు ఎలా సౌకర్యంగా ఉంటే అలా సర్దుకుపోండి….నేనిలా…

 21. buchi reddy gangula says:

  వ్యక్తి ని చంపడం సమస్యకు పరిష్కారం kaadhu– కాబోదు
  encounter… it. is.a. meaningless..action…
  ఒక వ్యక్తి ని చంపే అధికారం యింకో వ్యక్తి కి ఎవరు యిచ్చారు ??? ఏ ism..లో అలా రాసి ఉంది ????ఏ బుక్ లో ?? ఏ గ్రంధం లో ???
  విజయ కుమార్ గారు — బాగా రాశారు సర్

  ——————- బుచ్చి రెడ్డి గంగుల ——————–

 22. Dr. Rajendra prasad Chimata says:

  వార్తకు అటూ ఇటూ అని మురళి గారు రాసిన వ్యాసంలోని కొన్ని భాగాలు ఈ వ్యాసం చదివిన వారిని అర్థం చేసుకోడానికి
  “ఇది స్పష్టమైన క్లాస్ బయాస్. పేపర్లు చదివేది, అభిప్రాయాలు వ్యక్తీకరించేదీ మధ్యతరగతి మేధావులు. వీళ్ళు జేబులు కొట్టేసే వాణ్ని కరెంటు స్తంభానికి కట్టేసి చావగొడితేనే గానీ దొంగలకి బుద్ధి రాదనీ వాదిస్తారు. వంద కోట్లు అవినీతి చేసిన వైట్ కాలర్ నిందితుణ్ని మాత్రం ‘చట్టబద్దంగా విచారించాలి’ అంటారు.” అన్నాడు సుబ్బు.

 23. దేవరకొండ says:

  బలవంతుడి కోసం చట్టాలు తమను తామే వంచుకుని సాయ పడతాయి. బలహీనుని కోసం చట్టాలు తమను తామే పెంచుకుని ‘న్యాయం’ చేస్తాయి. మానవ చరిత్రలో చట్టానికి లొంగిన దోపిడీ దారుడు లేడు. దానికి బలి కాని బలహీనుడు లేడు. ఎన్నో నేర్చుకోవలసిన మధ్య తరగతి వాళ్ళు అన్నీ తమకే తెలుసునన్నట్లు, తమ ఇష్టానుసారం జరుగుతున్దనుకోడం, అందుకు తగ్గట్లు వాదించడం…..ఇల్లాంటి ఎన్నో వాదాల వారధులు దాటితేనే జీవన వేదం అర్ధమయే అవకాశం ఉంది.

మీ మాటలు

*