వారిజ 

 వసంత లక్ష్మి. పి 

10841540_4894601898522_2018196557_nశివరావు అడుగులు నిరుత్సాహం గా పడుతున్నాయి  రూము కి వెళ్ళి చేసేది ఏం ఉంది ? ఈ రూమ్మేట్స్ ముగ్గురూ ఒక్కసారే ట్రైనింగ్ అని బెంగులూరు వెళ్ళడం ఏమిటి ? తను ఒక్కడూ ఒంటి కాయ శొంఠి కొమ్ము లా ఊరేగడమేమిటి ? ఇదంతా అన్యాయం.. తన విషయం లో యే ఒక్కటి న్యాయంగా జరుగుతున్నట్టు లేదు . ఉద్యోగంలో ప్రమోషనూ లేదు , కనీసం జీతం కూడా రెండేళ్ళ నుంచి పెరగ లేదు .. పేరుకి ఐ టి ఉద్యోగం. చ చ జీవితం ఎందుకింత దరిద్రంగా ఉంది ? అని మధనపడిపోతూ ఆ బస్ స్టాప్ కి వచ్చాడు .

శివరావు కి తెలియదు పాపం , అతని  జీవితం ఒక మలుపు తిరుగుతుంది అని  . ఎవరూ లేరు బస్ స్టాప్ లో అవును ఎందుకుంటారు ? అందరూ బైకుల మీద ఝాం అని పరుగులు పెడతారు నా లాగా కాదు  లక్షో సారో ఏమో , బట్టల కొట్టు లో గుమాస్తా తండ్రి ని తన ముందు పుట్టిన ఇద్దరి అక్కలని  తలుచుకుని ఉస్సురు మనడం ,తన పైనే ఆశలు పెట్టుకుని ఎవరు బ్రతక మన్నారు ? ఇదేం న్యాయం?మగవాడి నై ఎందుకు పుట్టానా ? అని ఎన్నిసార్లు ఏడ్చాడో , ఎవరికైనా తెలుసా ?

ఈ భాగ్య నగరంలో చలి కాలం ఎంత త్వరగా చీకట్లు కమ్ముకుంటాయి ?

ఏదో మెరుపు మెరిసినట్టు అనిపించింది  . తెల్లని చీరలో దేవ కన్య లా ఒకామె బస్ స్టాప్ లోకి నడిచి వచ్చి , ఏమండీ , ఫలానా నంబరు బస్సు అదే నండీ ఆరు గంటలకి ఉంది కూకుటపల్లి వెళ్ళేది , అది వెళ్ళిందా ? మీరు ఎప్పటినుంచి ఉన్నారు ? అంటూ మాటలు కలిపింది .

ఉలికి పడి , తన నేనా ? అడిగింది అని ఓ క్షణం సందేహించి  , ఏమో అని నత్తిగా వణికింది గొంతు , ఆడవాళ్ళ తో మాట్లాడ్డం అంటే శివరావు కి ముచ్చెమటలు పోస్తాయి , అంత చలి కాలంలోనూ , అర చేతులు తడిసి పోయాయి , ” నేనూ ఇప్పుడే వచ్చాను , ఇంకా యే బస్సూ రాలేదు ” అని అస్పష్టంగా పలికాడు .

సరే ఏం చేస్తాం? ఎదురు చూద్దాం? అని వెనక ఉన్న గట్టు మీదకూర్చుంది , చేతిలో పెద్ద హాండ్ బాగ్  , ఉద్యోగిని లాగే ఉంది , చాలా సామన్యంగా ఉంది కానీ ఆరోగ్యంగా ఉంది ఈవిడ అనుకున్నాడు శివరావు  స్వచ్చంగా మెరుస్తున్న ఆమె బుగ్గలు చూస్తూ  కళ్ళు చిన్నవే కానీ తీక్షణంగా ఉన్నాయి , బాబోయ్ నాకెందుకు ? ఈ వర్ణనలు అవీ మా నాన్న ఏదో సంబంధం కుదిర్చే వరకు ఆడ పిల్లల జోలికి వెళ్ళనని అమ్మకి ప్రమాణం చేసా కదా అని గుర్తు తెచ్చుకున్నాడు శివరావు .

మనం ఒకే బస్ షెల్టర్ లో ప్రయాణికులమే కానిండి “నా పేరు నిర్మల”అని చేయి చాపింది  శివరావు కి కళ్ళు తిరిగినంత పని అయింది , మళ్ళీ నత్తి  ,  శి శివరావు నా పేరు ..

ఏదో వాహనం వస్తున్న చప్పుడు అయింది  షేర్ ఆటో  ఆపుతాడా ?ఆపడో అనుకుంటే అగింది  ఒక్కరికే జాగా ఉంది అంటే నిర్మలఆలోచించకుండా  నాక్కొంచం పని ఉంది ఏం అనుకోకండీ ,  మీ బస్ త్వరగా రావాలని కోరుకుంటా , అంటూ ఆటో ఎక్కి మాయం అయిపోయింది .

బస్ స్టాప్ లో ఒక్కసారి చీకట్లు కమ్ముకున్నట్టు అనిపించింది  ఒకమనిషి ఇంత వెలుగు నిస్తుందా ? అని విస్తుపోయాడు శివరావు .

వారం అయింది . మళ్ళీ అదే రోజు  ఇవాళ కూడా కనిపిస్తుందా ? అని ఆలోచిస్తూ బస్ స్టాప్ కి ఉత్సాహంగా నడిచాడు .

పది నిముషాలు కూడా గడవక ముందే ఆమె  , గులాబీ రంగు చీరలో గులాబీ బాల లా వచ్చింది  ఈ సారి శివరావు కి వెలుతురు తో పాటూ ఏదో గులాబీ పరిమళం కూడా వీచినట్టు అనిపించింది  ఎంత మాయ ?

నిర్మల చిరునవ్వుతో పలకరించేసరికి  మీ బస్సు ఇంకా రాలేదు అండీ అనేసాడు శివరావు, ధైర్యం గా .

గుడ్  ఇవాళ నాకంత ముఖ్యమైన పనులేవీ లేవు లెండి ఆటో వస్తే ముందు మీరు వెళ్ళండి  అనేసరికి  అయ్యో ! నాకూ అంత ముఖ్యమైనపనులేం ఉంటాయి ? ఇంటికి వెళ్ళి భోజనం చేయడం పడుకోడమే కదా .

మాటల్లో నే ఖాళీ ఆటో వచ్చింది  ఆటో అని కేక వేసి నిర్మల ఆటో మాట్లాడింది  కూకుట్ పల్లి కి  ఈ బస్ రాక  ప్రాణం పోకడ అని మార్చాలి సామెత  మీరు అటే ఐతే ఎక్కండి అంది .

 

ఎంత ధైర్యం ఈమె కి ? ఒక పక్క అత్యాచారాలు అవీ అంటూ భయపెడుతున్నారు  ఎవరీ నిర్మల ? ఎందుకెక్కాను ఈ ఆటో ? నాకేమైనా ఆపద కలిగిస్తుందా ? కేసుల లో ఇరికించి , శివరావు లోలోపల వణికి పోతూ బయటకి మటుకు మేక పోతు గాంభీర్యం నటిస్తున్నాడు .

అందమైన అపార్ట్ మెంట్స్  ముందు  ఆపించింది ఆటో  ఇదే మా ఇల్లు ఇదిగో నా షేర్ అంటూ ఆటో వాడికిచ్చేసి   మీరు మీ షేర్ ఇచ్చేయండి అని చేయి ఊపి లోపలకి వెల్ళీపోయింది .

మతి పోయింది శివరావుకి  ఎవరీమె ? తన ఇంటి ముందు ఆపింది ఆటో అందరూ పేరు చెప్పడానికే ఇష్టపడరు అలాంటిది ? చాలా గమ్మత్తు గా ఉందీ అనుభవం.. రూంమేట్స్ ఉండి ఉంటే ఎన్ని కథలు గా చెప్పేవాడో ఈమె గురించి , తప్పిపోయింది అవకాశం.

Kadha-Saranga-2-300x268నెల రోజుల లో కనీసం నాలుగు సార్లు ఇలా బస్ స్టాప్ లో కలుసుకోవడం ఎంత కాకతాళీయం? శివరావు మనసు కోతి గెంతులు వేయడం మొదలు పెట్టింది ,  నిర్మల తనంటే ఇష్ట పడుతోందా ? మరి తను ?

ఆ ఊహ కే ఒళ్ళు పులకరించింది  అమ్మ కిచ్చిన మాట ? అడుగునపడిపోయింది ఈ పులకరింత ల మాయ లో .

ఓ సాయంత్రం ఎప్పటిలాగే ఆటో లో ఇంటికి వెళుతూ ఉండగా నిర్మల

” ఇవాళ మా ఇంటికి రండి శివరావు .. కాఫీ నేను బాగా కలుపుతాను “అంటూ ఆహ్వానించేసరికి శివరావు ఉబ్బితబ్బిబై ,  సరే మీరు పిలుస్తే కాదనగలనా ? అని మొహమాటంగానే బదులు ఇచ్చాడు .

నిర్మల తాళం తీసి  , గది లోకి ప్రవేశించి  కిటికీ తలుపులు తెరిచి  రండి మా ఇంట్లో కి , గుమ్మంలో ఆగిఫొయిన శివరావు ని మరో సారి చిరు నవ్వుతో ఆహ్వానించి  కూర్చుని రెలాక్స్ అవండి నేను ఐదు నిముషాలలో మీకు మంచి కాఫీ తెస్తాను .

ఆమె వంటింట్లో కి వెళ్ళాక కొంచం ఊపిరి గట్టిగా పీల్చుకుని  ఎంతహాయిగా ఉందో ఈ ఇల్లు ? మా మగవాళ్ళ రూంస్ లో ఇలాంటి హాయి ఏదో కొరవడుతుంది , నీలి రంగు సోఫా సెట్టూ  నీలి గోడలు నీలి తెరలూ ఆకాశంలో విహరిస్తున్న అనుభూతి .

ఒక మూల టీవీ  పక్కనే  ఓ చిన్న బల్ల పైన కొంచం వాడి పోయి గాజు సీసాలో పూల గుత్తి ,  గది మధ్యలో బల్ల పై పాల రాయి బుద్ధ విగ్రహం  ఇల్లంతా ప్రశాంతం గా నిర్మలం గా ఉంది ఆమె లాగే శివరావు కి ఇదంతా కలా నిజమా ? అని చెయ్యి మీద గిల్లుకుని అబ్బా కాఫీ ఘుమఘుమలు తగిలాయి  తనెంత అదృష్టవంతుడు అని మురిసిపోయాడు .

మడిచి పెట్టిన వార్త పత్రిక  , పైన కథల పుస్తకం సోఫా పక్కనే చిన్న బల్ల పై   చేతికి అందిన పుస్తకం తెరిచి చూసాడు  వారిజ అని పేరు రాసి ఉంది  స్నేహితురాలు కాబోలు అనుకుని , నవలలు కథలు చదవడం అలవాటు లేదని మొదటిసారి చింతించాడు .

సారీ బోర్ కొడుతొందా అంటూ నిర్మల ఓ ప్లేట్ లో పకోడీ , ఇంకో చిన్న గిన్నె లో సేమ్యా పాయసం  తెచ్చి పెట్టింది, తను కూడా తెచ్చుకుని తింటూ , మీ గురించి చెప్పండి  అనేసరికి శివరావు ఆశ్చర్యం తో తల మునకలై పోయి  ఇంత ఆప్యాయం గా తన గురించి ఇలా పట్టించుకునే వారొకరు ఉన్నారు అని మహా ఆనందంతో తన కుటుంబం, చదువు  స్నేహితులు లేని ఒంటరితనం చెపుతూ  రాత్రి తొమ్మిది కి ఇంక తప్పదని బయలుదేరాడు .

నిర్మలా! అని పిలుస్తూ చనువుగా ఆమె ఇంటికి వచ్చే అతిథి గా స్నేహితుడు గా శివరావు కొత్త అవతారం ఎత్తాడు ..

మూడో నెల లో నిర్మల ఓ సాయంత్రం , శివరావు కి మరో గట్టి షాక్ ఇచ్చింది .

మా ఇంటికి మారిపోతారా ? అంటే లివింగ్ టుగెథెర్ అంటూ నానుస్తూ ఉంటే ,నాకభ్యంతరం లేదు ,మీ ఇష్టం అని చెపుతున్నాను .

శివరావు కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు , పెళ్ళీ కట్నం అమ్మా నాన్న అన్ని   గుర్తు వచ్చాయి చూద్దాం ఆడపిల్ల ఇంత ధైర్యం గా పిలుస్తే ఎగిరి గెంతేయకుండా ఇంకా ఇలా ఆలోచించే అమాయకుడు  కాదు .శివరావు మకాం నిర్మల ఇంటికి మారింది .

ఆమె అతని గది లో సద్దుకోమని చెప్పి  వంటిల్లు లో ఏవి ఎక్కడ ఉంటాయో అన్నీ వివరం గా చెప్పి  అతని కి ఒక తాళం చెవి ఇచ్చింది .

తన ఆఫీసు సమయాలు , భోజన సదుపాయాలు అన్నీ వివరంగా మాట్లాడి , తన బట్టలు వాషింగ్ మెషీన్‌  లో ఎలా వేసుకోవాలో కూడా వివరించి శివరావు ని ఓ ఇంటివాడిని చేసింది .

Sketch290215932బాధ్యతల బరువు పడినట్టు ఉక్కిరిబిక్కిరి అయినా శివరావు  నిర్మల సాహచర్యం లో కొద్ది కాలం లోనే అలవాటు పడిపోయాడు ఆ ఇంట్లో ఒక సభ్యుడు గా .

ఏనాడూ వివాహం , ప్రేమ లాంటి మాటలు ఏమీ అనలేదు నిర్మల  శివరావు కి ఐతే ఏదో దేవత ని చూస్తున్నంత అబ్బురం గా ఉంది ..

ఓ సాయంత్రం సరుకులు కొనుక్కుని వద్దాం అని షాప్ కి తీసుకువెళ్ళి , మన కి నెల కి కావలిసిన సరుకులు కొంటూ ఉంటారా ఇప్పుడే వస్తాను అంటూ బయటకి వెళ్ళీంది , ఇంటికి కావల్సిన సరుకులా ? నాకెలా తెలుస్తుంది ? అని కంగారు పడిన శివరావు చేతిలో ఓ లిస్ట్ పెట్టింది , కంచం లో వడ్డించింది తినడం తప్ప మరేమీ తెలియని తన అజ్ఞానం  మొట్ట మొదటిసారి శివరావు కి అవగతమయింది.

నిర్మల తో జీవితం గమ్మత్తు గా సాగిపోతొంది , ప్రతి రోజూ లేవగానే కలా నిజమా ? అని చెయ్యి గిల్లుకోవడం శివరావు కి పరిపాటి అయింది ..

నాలుగు నెల లు గడిచాయి .

సాయంత్రం ఓ గంట ముందే వచ్చిన శివరావు కి షాక్ ఎదురయింది , వాచ్ మాన్‌ అమ్మాగారు ఊరు వెళ్ళారు అండీ అని ,ఇదేమిటి ?అని ఇంట్లో చూస్తే నిర్మల గది అంతా ఖాళీ గా ఉంది .

మిగిలిన సామాను అలాగే ఉంది , బుద్ధ విగ్రహం కింద ఓ కవర్ కనిపించింది ..

వణికే చేతులతో శివరావు ఉత్తరం చదివాడు .

క్షమించండి మీతో మాట మాత్రం చెప్పకుండా వెళ్ళి పోతున్నందుకు , నా ఉద్యోగం లో ఇలా ఊరులు మారుస్తూ ఉంటారు మీతో ఈ మూడు నెలలూ నాకూ చాలా సంతోషం గా గడిచింది . ఈ ఇంటికి నేను ఒక ఏడాది పాటు అద్దె చెల్లించానుఇంటి సామాను కి కూడా  నేను ఏదో మీ స్నేహానికి వెల కడుతున్నానని మీరు అన్యధా భావించక పోతే, మీ పేరు మీద బైకు కొన్నాను తాళం , పేపర్లు మీ గదిలో ఉన్నాయి మీరు ఇక్కడ ఉన్నా సరే మీ పాత రూం కి మారిపోయినా సరే మీ ఇష్టం .

మనం మరి ఎప్పుడూ కలుసుకోం , మీ పెళ్ళి కి నాకు కార్డు పంపకండి గుర్తు చేసుకోండి చాలు మీరు చాలా మంచివారు కట్నం మటుకు తీసుకోకండి ..అంటూ ఓ చిరునవ్వు గుర్తు వేసి నిర్మల అని సంతకం .

శివరావు నిశ్చేష్టుడై ,ఎంత సేపు ఉన్నాడో అలా …

 

పూనే లో చుట్టూ అందమైన పార్కులు  , స్విమ్మింగ్ పూల్ మధ్య ఒక మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ .

ఉదయం ఎనిమిది కి బెల్ మోగింది , తలుపు తీసిన అనసూయమ్మ ” అమ్మా ! వారిజా ! వచ్చావా అబ్బ ఇన్ని రోజులేమిటే ఈ టూర్లు ఏం ఉద్యోగాలో ”

“ఏమండీ అమ్మాయి వచ్చిందండీ , ఏమండీ లేచారా ? ఎంత సేపూ ఆ న్యూస్ పేపరు చదవడం కాదు , అమ్మాయి కి సంబంధాలు చూడాలి అని మీకు ఎన్ని సార్లు చెప్పాను  ఒక్కర్తే కూతురు అని నెత్తి కెక్కించున్నారు , అంతా దాని ఇష్టం అంటూ సిగ్గు లేకుండా బాధ్యత వదిలించేసుకుని  ” ఆవిడ ఎప్పుడూ వల్లించే పాటే

అమ్మా , ముందు కాఫీ ఇవ్వు నీ చేతి కాఫీ తాగి ఎన్ని రోజులయిందో .

అంటూ ఇప్పుడే స్నానం చేసి వస్తా గాని , నాన్న కి ఇంక ఆ పని లేదే  సంబంధాలు అవీ చూడాల్సిన పని లేదు .

అబ్బ ఎంత మంచి మాట చెప్పావే , అవును  “నువ్వు అమ్ముమ్మవు కాబోతున్నావు, మరో తొమ్మిది నెల లో నీకు వచ్చిన లాలి పాటలు అన్నీ నెమరు వేసుకో ”  అంటూ తన గది తలుపులు గడియ వేసుకుంది వారిజ .

మీ మాటలు

  1. Sai Padma says:

    వసంత గారూ ,

    కధ బాగుంది. కానీ ఎక్కువ విషయాలు చెప్పటం వల్ల కొంచం కన్ఫ్యూజింగ్ గా ఉంది. మీరు మామూలుగా కథ మొదలుపెట్టి , కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఎందుకు, కేవలం సహచర్యమే కావాలి అనుకుంది ..అన్నదానికి ఎక్కడా రీజన్ లేదు . సహచర్యం లో పుట్టిన పిల్లల గురించి ఆమె ఏమనుకుంటోంది.. ఇలాంటివి ..!
    వొక అవుట్ లైన్ లా రాసారు. అందుకే కొత్తగా అనిపించింది.

  2. ఒక బోరింగ్ సాఫ్ట్వేర్ employee ..ఇంటికి వెళ్లి చేసేది ఏముంది అనుకొంటూ నీరసంగా అడుగులు వేసుకొంటూ పోతుండటం, ఆ తరువాత గులాబీ పరిమళం వీయటం, సహజీవనం ( నో స్ట్రింగ్స్ attached ). అంతా సాఫీగా సాగిపోతున్న కథలో, క్లైమాక్స్త పెద్ద షాక్. బాలచందర్ గారు జీవించి ఉంటె, ఈ కథని సినిమా కి ఎంచుకొంటారేమో!!

  3. సాయి పద్మా !
    థాంక్యూ , కథ చదివి నీ స్పందన తెలియజేసినందుకు . వారిజ పాత్ర నాకూ కొత్తగానే ఉంది .నా చుట్టు ఉన్న పరిస్థితుల నుండి పుట్టింది ఈ పాత్ర , మాతృత్వం ఒక్కటే ఆమె ఎంచుకుంది , తన జీవనానికి తోడు గా , ఎందుకూ ,ఏమిటి ? అనేవి చర్చ లో లేవు .

    మరో సారి ధన్యవాదాలు పద్మా !

    వసంత లక్ష్మి .

  4. వెంకట సురేష్ !
    థాంక్యూ ..నీ స్పందన తెలియజేసినందుకు . బాలచందర్ గారి కి నచ్చే కథ కి ఈ కథ ని చేర్చినందుకు , నాకు చాలా సంతోషం , ఆడపిల్లలు తమ జీవితాలని తాము ఎలా ఇష్ట పూర్వకం గా మలుచుకుంటున్నారో , కమిట్మెంట్స్ ని కూడా తామే ఎన్నుకుంటున్నారు సమాజం తో పని లేకుండా , నా చుట్టూ చూస్తున్న పరిస్థితులే , ఈ పాత్ర పుట్టుక కి కారణం . కాలం తీర్పు చెప్పాలి కథ లో ఎంత వాస్తవికత ఉందో . మరో సారి ధన్యవాదాలు .

    వసంత లక్ష్మి .

  5. రమణ కెవి says:

    బాగుంది. కాని వారిజ, శివరావుల సహజీవనం ఎలాంటిదో చెప్పలేదు. వారిజ తల్లి కాబోయేది శివరావు వల్లా, ఇంకొకళ్ళ వల్లా అన్నది తెలియలేదు.

  6. mohan.ravipati says:

    వారిజ, సహజీవనం ఎందుకు కోరుకుంది ? దానికి శివరావు నే ఎందుకు ఎంచుకుంది కొంచెం గా అయినా చెప్తే ఇంకా బాగుండేది,

  7. ఆర్.దమయంతి. says:

    ఆమె చాయిస్..నచ్చింది
    **********************
    అసలేం చెప్పాలనుకున్నారమ్టే, కొందరు మగాళ్ళ లానే ఆడవాళ్ళూ తమ చాయిస్ కొద్దీ బ్రతకడంలో తప్పు లేదని కదూ?
    – నాకైతే కొన్ని నవలల్లోని మగ పాత్రలు గుర్తుకొచ్చాయి.
    చాలా చాలా యేళ్ళ కిందట ఒక కథ చదివాను. అది అనువాదం అనుకుంటా. ఆమె అతని చేతిలో మోసబోతుంది. గర్భవతి ఔతుంది. అదొక సిగ్గు పడాల్సిన స్థితి కాదని, స్త్రీ గా గర్విస్తున్నానంటో ఎండింగ్..
    అప్పట్లో ఆ కాన్సెప్ట్ ..డేరింగ్ గానే అనిపించింది.
    మళ్ళీ ఇన్నాళ్ళకి అలాటి ఇతివృత్తాన్ని చూసాను.
    కథ చదివించింది వసంత. ఎక్కడా ఆగలేదు నేనైతే. :-)
    ఇక ఆమే అలాటి నిర్ణయం తీసుకోడం వెనక గల బలమైన కారణాన్ని వివరిస్తే ఇంకా బావుండేది.
    ఏదేమైనా, ఈ మీ ప్రయత్నం ఎంతైనా అభినందనీయం.
    మరిన్ని కొత్త కొత్త కథల్ని మీ నించి ఆశిస్తూ
    శుభాకామ్క్షలతో..
    మీ ఫ్రెండ్ని.
    :-)

  8. రమణ కె వి గారూ !

    ధన్యవాదాలు మీ స్పందన కు .

    ఆమె స్వైరిణి కాదు . తను తల్లిని కాడానికి ఆమె ఎంచుకున్నది శివరావు ని . ఎందుకు ? ఎలా ? అని చర్చించ దలుచుకోలేదు .
    డీ ఎన్‌ ఏ పరీక్ష కోసం న్యాయ స్థానలని కూడా ముప్పతిప్పలు పెట్టించిన ఓ ప్రముఖ రాజకీయ వేత్త కథన మో , లేక కన్య గా తల్లి అయి కర్ణుడిని వదిలేసిన కుంతి పాత్ర ఓ ,ఇలాంటి ఎన్నో గాధల లో ఏదో మరి ఆమె ని తండ్రి పేరు తో ప్రమేయం లేని తల్లి గా జీవించాలని నిర్ణయించుకునేలా చేసింది . ఆమె తీసుకున్న నిర్ణయ మే , ఈ కథ ..

    వసంత లక్ష్మి .

  9. మోహన్‌ .రావిపాటి గారూ !

    ధన్యవాదాలు . ఆమె స్వైరిణి కాదు , సహజీవనం , తన మాతృత్వం వరకే ఎంచుకుంది . మౌన పోరాటాలు చేసే పెళ్ళి కాని తల్లుల నుంచి ఏం నేర్చుకుందో మరి .? ఆమె ది ధిక్కార స్వరం .ఇలా వినిపించింది .

    పై న నా స్పందన ఉంది ..దయచేసి చదవగలరు .

    వసంత లక్ష్మి .

  10. ఆర్ దమయంతీ !

    నా కథ లో విషయం ని చక్కగా గ్రహించినదుకు ముందుగా ధన్యవాదాలు .

    మై చాయిస్ ..అవును ..ఆమె తల్లి కావాలి అనుకుంది . తన జీవనానికి మగ తోడు వద్దు అనుకుంది . తన చుట్టూ ఉన్న పరిస్థితులో , వింటున్న కథలో ,తన తల్లి తండ్రులని తాను చూసుకోవాలి ,కడ వరకూ అన్న కోరకో ,ఏదో కారణం వల్ల , ఆమె అలా తల్లిని మటుకు కావాలి అని ఎంచుకుంది .
    ఇదీ కారణం అని రాయడానికి ఒకటి అంటూ లేదు , తన చాయిస్ అంటూ జీవించే కాలం ఒకటి ఆసన్నమయిందా ?
    ఈ వారిజ తన కథ తనే రాసుకుంది ,

    అవును ఫ్రెండ్ , మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ , ఒకేలా స్పందించే స్నేహితులం ..

    వసంత లక్ష్మి .

  11. Lakshmi raghava says:

    ఒక koththa ట్విస్ట్…ఆలోచింపచేసింది. ఇలా enduko కాకూడదు అని మనసును ప్రశ్నించింది. బాగుంది vasanta

  12. Dr. Rajendra prasad Chimata says:

    శివరావు లాంటి అసమర్దులైన బకరాలకు మంచి పాఠం.

  13. లక్ష్మీ రాఘవ గారూ !

    ధన్యవాదాలు మీకు . మీ స్పందన నాకు కొంచం ధైర్యం ఇచ్చింది నా ఆలోచన సరి అయినదే అన్న ధైర్యం

    వసంత లక్ష్మి .

  14. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చిమట గారూ !

    హా హా అవునండీ ..అమ్మాయిలు ఎంత స్మార్ట్ గా తయారు అవుతున్నారో , అబ్బాయిలు గ్రహించాల్సిన సమయం ఆసన్నమయింది మరి .

    ధన్యవాదాలు మీ స్పందన తెలియచేసినందుకు .

    వసంత లక్ష్మి .

  15. అమ్మాయిల ఆలోచనల్లో వస్తున్న మార్పు ని ఒడిసిపట్టారు.
    పెళ్లి భర్త తర్వాత పిల్లలు భాద్యతలు ఇవేమీ లేని స్త్రీ కూడా మాతృమూర్తిగా అర్హురాలే ! స్వేఛ్చా జీవనం తో తల్లిగా ఉండాలని కోరుకుంది. బావుంది వసంత గారు . నిజంగానే బాలచందర్ సినిమాకి కాదగిన కథ . అభినందనలు . .

  16. వనజ తాతినేని గారూ !

    ధన్యవాదాలు ..నా కథ లో ముఖ్య ఫీలింగ్ ని బాగా వివరించారు .
    బాల చందర్ గారు లేని లోటు ఇప్పుడు తెలుస్తోంది కదా ..హా హా ..నా కథ అని కాదు .ఆయన స్త్రీ పక్ష పాతం గా కొన్ని సిన్మాలు చాలా నూతన ఒరవొడి లో తీసారు .ముఖ్యంగా ఇది కథ కాదు సిన్మా లో , ఎవరి మగ సాయం అక్కరలేదు అంటూ అత్తగారూ ,కోడలూ పిల్లాడిని తీసుకుని వెళ్ళి పోవడం ..లాంటి ముగింపులు ఆయనే ఇవ్వగలరు .
    నా కథ ని ఆ కోవ లోకి చేర్చి నాకు పెద్ద సన్మానం చేస్తున్నారు ..ధన్యవాదాలు అండీ ..

    వసంత లక్ష్మి .

  17. Thirupalu says:

    ఈ కదా వస్తువు కొత్తదేమీ కాదు . నాకు కదా పేరు, రచయితా పేరు గుర్తు లేదు కానీ, పది హేనెల్ల క్రితం ఇలాంటి ఇతీ వృత్తం తో ఒక కధ వచ్చింది. అందు లోని కదా నాయకి ‘ తన చాయిస్ ‘ ఎన్ను కోవడం లో సెక్స్ ను రెండవ పక్షం చేసి, అన్నింటా అతి సమర్డు డైన ( శారీక నిర్మాణం లో, మేదో సంపదలో మేలిమి బంగార మైన ) పురుషున్ని ఎన్నుకొని, అతనితో సంసారం చేయకుమ్డానే ( స్పెర్ం డోనార్) మంచి సంతానాన్ని కనాలని ఆ లక్ష్యాన్ని సాదిస్తుంది. ఇవన్ని మగ వారి మీద ద్వేషం వాళ్ళ చేస్తున్నారనేది తేటతెల్లమే. అదే పెమినిజం అని వీరు తప్పుటడుగు వేస్తుంటారు. ఇవన్నీ వ్యక్తీ గత పాత్రలే, వ్యక్తి వాదాన్ని ప్రోత్సహిస్తున్నావే. సమాజానికి మార్గ ధర్శకమ్గా ఉమ్డ బోరు. సమాజంలో మనుషులన్న తరువాతా స్త్రీలైనా పురుషులైనా సహా జీవనమ్ చేస్తున్నదే సమాజం. ఈ వ్యవస్తలో ఉన్న అనేక లోపాలలో స్త్రీ పురుష సంభందాల లోపం ఒకటి. దాన్ని మాత్రం ప్రత్యేకించి చూడలేమ్. స్త్రీ పురుష సమ్భమ్దాలలో ఉన్న లోపాలని సంస్కరించు కోవటానికి కావలసిన పరిస్తితులను ఇద్దరూ జంటగా పోరాడి మాత్రమే ఏర్పరుచుకోగలరు. ఒకరు వేరొకరితో విడవడి పోయినపుడు అది ఎంత మాత్రం సాధ్య కాదు. ఇలాంటి కధలన్నీ పురు శుల్లో ఉన్న ఆహామకారాన్ని ఏ మాత్రం సంస్కరిమ్చగా పోగా వాళ్ళలో ఉన్న ఆత్మా న్యూనతా భావాన్ని ప్రోత్సాహించి మరింత పురుష ఆహామ్కారాన్ని ప్రోడి చేస్తుంది. స్త్రీ పురుషులను వర్గాలగా విభజించ లేము. ఆ పోరాటాలని పెమినిజానికి అన్వయించడం సరి కాదు. అందుకై స్త్రీల పోరాటాలను కొంచం చేయటం నా ఉద్దేశం కాదు.

    • తిరుపాలు గారికి
      నమస్కారం ..పురుషులని కించ పరచాలని కానీ , స్త్రీ పురుష సంబంధాల లో ఏదో విప్లవం తేవాలని నేను ఆశించి ఈ కథ రాయలేదు .
      కుంతీ దేవి దగ్గర నుంచి , వివాహం పూర్వం తల్లి కావటం సమాజం హర్షించని విషయం గా వింటూ ఉన్నాం ..మొన్నే ఒక కథ చదివాను అంటే నేనీ కథ రాసిన తరవాతే , డాక్టర్ శైలజా చందు గారు రాసిన కథ , అందులో వివాహిత స్త్రీ , భర్త వదిలేసిన స్త్రీ ,ఒక నాడు భర్త తో కూడి తల్లి కాబోతూ ఉంటుంది ..అంతకు ముందు కోడలు తల్లి కావడానికి ఎంత సంబరం గా పాల్గుందో ,ఈ అవాంచిత గర్భం కి అంత తల్లడిల్లి పోతుంది ..చచ్చిపోదాం అని కూడా ప్రయత్నిస్తుంది ..సమాజం ఎంత నిఘా పెట్టింది . ఒక స్త్రీ తల్లి కావాలని వాంచిస్తే ,అది వివాహం తో కూడిన ప్రక్రియ అని నిర్ధారించింది ..సమాజ హితవు కోరి , వివాహం తో సంబంధం లేని ఒక స్త్రీ తల్లి కావాలని ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది ? అమెరికా లో గే కపుల్స్ బిడ్డను పెంచుకున్న సీరియల్స్ టీ వీ లో చూసి ఆశ్చర్య పోయాను ..మగ వాడు తనకి నచ్చిన విధం గా బ్రతక డానికి ఎటువంటి అభ్యంతరాలు చెప్పనీ సమాజం ఒక స్త్రీ చేసే చర్య లకి ఎంత గా ప్రతిస్పందిస్తుందో అన్న ఆలోచనే .. ఈ కథకి ప్రేరణ ..
      మీ స్పందన తెలియ చేసినందుకు ధన్యవాదాలు
      వసంత లక్ష్మి .

  18. ఈ కథ చదివాక చాలా మంది పురుష పుంగవులు “వారిజ” కోసం వెదుకలాటలో వున్నారు.

    • కమల్ గారికి
      మీ స్పందన కి ధన్యవాదాలు అండీ ..
      ఐతే ‘ వారిజ ‘ లు అంత సులభం గా దొరకరు అండీ
      ఆమె కి నచ్చాలి కదా ముందు .

      వసంత లక్ష్మి

  19. కొత్త కోణం లో మీరు చెప్పిన కధ, శైలి బావుంది.
    కమల్ గారు చెప్పినట్టు చాలా మంది వారిజల కోసం కలలు కంటారు .

    • వీణా !
      ధన్యవాదాలు ముందు గా ..

      అవును ..ఒక కొత్త కోణం ఈ వారిజ , ఈ సమాజం తయారు చేసిన కొత్త మాతృ మూర్తి ఆమె

      వారిజ లు అందరికీ అంత సులభం గా దొరకరు మరి .

      వసంత లక్ష్మి

  20. హ్మ్… “మై చాయిస్” వీడియో ప్రభావమో..?? లేక మరొకటొ కానీ.. మీ కథలోని శివరావు లాంటి పురుషులు బహుకొద్ది మందే వుంటే వుండొచ్చేమో…? కానీ.. వారికి భిన్నంగా మూడు రెట్లు పురుషులు “వారిజ” లాంటి చాయిస్ స్త్ర్తీల కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తారేమో అనిపిస్తుంది నాకు.

    చాలా మంది వెలిబుచ్చినట్లు… పురుషుల్లో ఆత్మనూన్యతా భావమేమో గానీ.. వారిజ లాంటి స్త్రీల వలన ఇంకా ఆనందపడతారే గానీ బాద పడరు నాకు తెలిసి. ఎందుకంటే ఎటువంటి బరువు, భాద్యతలు లేని ఒక స్త్రీ సాంగత్యం దొరుకుతున్నప్పుడు మగాడికెందుకు నూన్యతా భావం వుంటుంది.? హాయిగా ఆ మూడు నెలలో లేక ఆరు నెలలో “సెక్స్”ని ఎంజాయ్ చేసి వారిజ లాంటి వారు “ఇట్స్ మై చాయిస్” అని వెళ్లిపోతే…మగాడు కూడ తన దారి తను చూసుకొంటాడు.

    పొద్దున్న లేచినప్పుటినుండి పుట్టిన పిల్లాడికి సపర్యలు చేయనవసరం లేదు. పాల డబ్బాల కోసం పరుగులుండవు. ఆస్పత్రి ఖర్చులు వుండవు, వాడికి బట్టలు కొనివ్వడాలు వుండవు..!! అలానే భార్యామణికి చీరలు, పట్టు చీరలు.. నగలు.. కొనే అవశ్యకతే వుండదు. ఎలానూ భార్య భర్తల మద్యన ఓ రెండేళ్లకు వచ్చే “మొనాటినీ” కూడ వుండదు. ఏ బరువు భాద్యతలు లేని ఒక కాంట్రాక్ట్ లాంటి కేవలం “చాయిస్” పేరుతో ఏర్పడే శారీరక సంబందం అన్నది మగాడికి అనుకూలమైనదే కానీ..అందులో మగాడు ఎక్కడా కూడ ఇబ్బంది పడేది వుండదు. బాద పెట్టేది వుండదు.

    వారిజ లాంటి స్త్రీల కోసం ఎదురు చూసే “మగాళ్లు” బస్‌స్టాప్‍లలో కిలోమీటర్ల పొడవుల్లో లైన్లు వుంటాయేమో.. మరి.

    1996-97 లలొ అనుకొంటాను తెలుగు “ఇండియా టుడే” పక్ష పత్రికలో ముంబాయిలోని కొత్తగా అవిష్కరమవుతున్న ‘సింగిల్ పేరెంట్స్” అనే విషయం గురించి చాలా పెద్ద వ్యాసమే వచ్చింది. అవన్నీ అప్పట్లో వారు పరిశోదన చేసి రాసినవే..! జీవితాంతం “పురుషుడిని” భరించలేని స్త్రీలు కేవలం లివింగ్ టుగెదర్‌లొ పిల్లలను కని.., ఆ తర్వాతా సదరు ఆ పురుషుడితో విడిపోయి ఒంటరిగా జీవిస్తూ తమ పిల్లలను పెంచుతున్న స్ఱీల గురించి చాలా పెద్ద వ్యాసమే వచ్చింది. అలాంటి సంఘటనలు ఎక్కువ శాతంలొ ముంబాయిలో జరుగుతున్నాయి అని అప్పట్లో రాసారు. ఇప్పుడు వెళ్లి వారు పెంచుతున్న పిల్లల గురించి మరింత పరిశోధనాత్మకంగా వ్యాసం రాయగలిగితే అప్పుడేమైనా.. సరి కొత్త కోణాలు కనపడవొచ్చు.

    • కమల్ గారూ !

      ధన్యవాదాలు ..

      బస్ స్టాప్ ల లో ఎంత కాలం ఎదురు చూసినా ఇలాంటి వారిజ లు అందరికీ రారండీ ..
      తండ్రి ప్రమేయం లేకుండా బిడ్డని పెంచగలను అని సాహసం చేయగల స్త్రీలు కోటి మందిలో కూడా ఒక్కరు ఉండరు ..ఐతే మగ వారిని నమ్మి తల్లి అయి నడి వీధిలో నిలబడ్డ స్త్రీలు మటుకు కోటి మందిలో వందల సంఖ్య లో ఉంటారు, పెళ్ళీ చేసుకుంటానని నమ్మించి అంగడి లో అమ్మే మగ వాళ్ళూ కూడా కొన్ని వందల సంఖ్యలో ఉంటారు ..
      వీరందరి మధ్య ఒక్క వారిజ ..మాతృత్వం కోసం స్త్రీ పడే ఆతృత , పితృత్వం కోసం ఎదురు చూసే మగ వారిలో లేదంటరా ? ఉంది అయితే అతను నిర్ణయించిన పరిధులలో , ఒక్క రు ఆ గీత దాటారు ..వారిజ ఆమె పేరు .
      మీరు బాధ్యతలు నిర్వహించాల్సిన పని లేదు అంటే మగ వారిలో ఎంత శూన్యం ఆవహిస్తుందో ..ఊహిస్తున్నాను .
      మరొక సారి థాంక్యూ ,మీ స్పందన తెలియ చేసినందుకు
      వసంత లక్ష్మి

  21. Thirupalu says:

    /పురుషుల్లో ఆత్మనూన్యతా భావమేమో గానీ.. వారిజ లాంటి స్త్రీల వలన ఇంకా ఆనందపడతారే గానీ బాద పడరు నాకు తెలిసి./
    నిజమే అభావ గతులైన ( మానవ స్పందన లేని వారు) పురుషులు ఇలా ప్రవర్తిమ్కాడంలో విడ్డూరమ్ లేదు గాని, తనని కాదని వెళ్ళిన స్త్రీ మీద ద్వేషం పెంచుకొని, ఆ ద్వేషం కాస్త విషాదంగా మారే క్షణాలగురిమ్చి కూడా ఆలోచించాలి. ఇలా బీరాలు పలికే పురుష పుంగవులు కొందరు యూ టర్న్ తీసు కొని వాపోతారు. ఏమైనా రచయితా అన్న వారు మార్గ దర్శకమ్గా ఉండాలి. సమాజానికి ఉపయోగ కరమైన రచనలు చేస్తే మంచిది. లేక పోతే రచయితలవ్వాలని ఎవరూ ఏడవరు.

    • తిరుపాలు గారూ ,
      మార్గ దర్శకత్వం వహించే రామాయణం , పురాణ గ్రంధం మంకి ఉంది , రాముడు లాంటి ఆదర్శ వంతుడైన భర్తల కన్నా , స్తీ శరీరం మీద ఆధిపత్యమూ ,అత్యాచారాలూ చేసే రావణాసురులే ఎందుకో ఎక్కువ ఉన్నారు ,మన మధ్య ,
      ఒక్క వారిజ తో సమాజం లో విలువలన్ని కూలి నశించిపోతాయా ? అని ఆలోచిస్తూ

      వసంత లక్ష్మి

    • ari sitaramayya says:

      “ఏమైనా రచయితా అన్న వారు మార్గ దర్శకమ్గా ఉండాలి. సమాజానికి ఉపయోగ కరమైన రచనలు చేస్తే మంచిది. లేక పోతే రచయితలవ్వాలని ఎవరూ ఏడవరు.”

      సమాజానికి ఏది ఉపయోగకరమో ఎవరు నిర్ణయిస్తారండీ? మీకు ఉపయోగకరం అనిపించింది నాకు ఉపయోగకరం కాదనిపిస్తే అప్పుడేం చెయ్యాలండీ? మార్గదర్శకం అంటే ఏంటండీ? ఒకే మార్గం ఉందా? రక రకాల మార్గాలున్నాయా? మీకు నచ్చిన మార్గం రచయితకు నచ్చిన మార్గం వేరైతే అప్పుడేం చెయ్యాలండీ?

      “లేక పోతే రచయితలవ్వాలని ఎవరూ ఏడవరు.” మీ ఉవాచ నాకు అర్థం కాలేదు. అంటే మిగతావారు రచయితలవ్వాలని మీలాంటివారు ఏడవరు అని అర్థమా? లేక వసంత లక్ష్మి గారి లాంటి వారి కథలు చదివి మిగతావారు ఏడవటం మానేస్తారనా? ఏమో. ఇన్ని కొద్ది మాటల్లో ఇన్ని ఆలోచనలు బంధించి ఇంత అమోఘంగా రాయటం మీకే సాధ్యం. అభినందనలు.

      • అరి సీతారామయ్య గారికి
        ధన్యవాదాలు ..వేయి ఆలోచనలు వికసించనీ అన్న మాట నమ్ముతాను ..ఒక్క రచన తో మారిపోయే సమాజమా అండీ మన సమాజం , అందరూ వారిజ లై పోవాలని నేను ఎక్కడా నొక్కి చెప్పలేదు ..ఒక అమ్మాయి ఎంచుకున్న మార్గం ని కథ గా చెప్పాను ..
        మరొక సారి ధన్యవాదాలు మీకు ..

        వసంత లక్ష్మి .

      • సమాజానికి ఏది ఉపయోగకరమో ఎవరు నిర్ణయిస్తారండీ?

        ఇంతకు మునుపు మార్క్సిస్ట్ మేధావులు నిర్ణయించేవారు. అధికారంలో ఏ పార్టి వచ్చినా ప్రజాకర్షక విధానాలను సోషలిజం పేరుతో అమలుచేసేవారు. కమ్యునిస్ట్లు అధికారంలోకి రారని అర్థమైన తరువాత, ఫేమినిస్ట్ లు యన్.జి.ఒ. లను పెట్టుకొన్నారు. వీరు చట్టాల రూపకల్పన లో ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నాచట్టం చేసేముందు తీసుకొనే సలహాలు ఈ యన్.జి.ఒ ల నుంచే. వివాహం, స్రీ పురుష సంబంధాలు మొదలైన వాటి పై ఫెమినిస్ట్ లే ఏజెండాను సెట్ చేస్తారు. ప్రభుత్వాలు చిన్న చిన్న మార్పులతోవారి సూచనలనే అమలు చేస్తాయి.

  22. Thirupalu says:

    సమాజం అనేది ఒకటి ఉంది, సమాజంలోని విలువలు తమకు వర్తిస్తాయి అనుకుంటే ‘ మంచి’ అనేది ఎవరికీ వారు నిర్ణయించుకుంటారు. చర్యకు ప్రతి చర్య ఉంటుంది కనుక. తాము మాత్రమే ఉన్నాము సమాజం లేదు అనుకుంటే వారి ఆలోచన దోరణి వేరుగా ఉంటుంది. వారి సాహిత్యం వేరుగా ఉంటుంది. ఉదా:- ‘ వారిజ’ లాంటి ఒక్కరు అలాంటి నిర్ణయం చేస్తే సమాజం చెడి పోతుందా? అంటున్నారు రచయిత్రి గారు.అలా అనుకుంటే పది మంది పాఠకుల మధ్య ఒక కధ రాసి పెట్టాల్సిన అవసరం వుందా? ‘వారిజ’ తన చర్యకు ప్రతి చర్య సంతానం మాత్రమే కాదు, సమాజం నుండి, తానూ ప్రేమించిన యువకుడి నుండి ప్రతి చర్య ఎలా ఉంటుందో ఆలోచించాలి. సాహిత్య ప్రయోజనం ఎప్పుడూ సామాజిక ప్రయోజనమే. కాక పోతే పిడికెడు మంది పండితుల చర్చల వరకే పరిమితం అవుతుంది. అది ప్యూడల్ సమాజానికే పరిమితం. ఆధునిక ఆలోచనా దోరణి అది కాదు.

    • ari sitaramayya says:

      “సమాజం అనేది ఒకటి ఉంది, సమాజంలోని విలువలు తమకు వర్తిస్తాయి అనుకుంటే ‘ మంచి’ అనేది ఎవరికీ వారు నిర్ణయించుకుంటారు.”

      సమాజానికి విలువలు ఉండవు తిరుపాలు గారూ, ఆచారాలు ఉంటాయి. ఉదాహరణకు: ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో 99% పెళ్ళిళ్ళు ఇన్ని ఎకరాలు, ఇంత బంగారం, ఇన్ని లక్షలు అని బేరం జరిగింతర్వాతే జరుగుతున్నాయి. ఇందులో విలువలు ఏవో మీరే చెప్పగలరు. ఈ ఊబిలోంచి బయట పడటానికి ఆలోచించేవారు కొందరుంటారు. వారి ఆలోచనలు సహజంగానే సమాజ విరుద్ధంగా ఉంటాయి పెద్దలకు. ఒక వైపు నిర్ణయాలు ఎవరికి వారు తీసుకుంటారు అనే పెద్దలు వారిజ నిర్ణయం సమాజ విలువలను నాశనం చేస్తుంది అని ఉపన్యాసాలిస్తుంటారు. సమాజంలో విలువలు ఉండి చస్తేగదా నాశనం అయ్యేది!

      “సాహిత్య ప్రయోజనం ఎప్పుడూ సామాజిక ప్రయోజనమే. కాక పోతే పిడికెడు మంది పండితుల చర్చల వరకే పరిమితం అవుతుంది. అది ప్యూడల్ సమాజానికే పరిమితం.”

      పడికట్టు మాటలన్నీ వాడారు. బూర్జువా పదం మర్చిపోయారు లాగుంది. ప్రస్తుత కుళ్ళు పెళ్లి వ్యవస్థ నచ్చక తన మార్గం తను చూసుకుంది ఈ వారిజ. అది అందరికీ సాధ్యం కాదు. ఆమె చర్యకి ప్రతి చర్య ఏంటో మీరు సెలవియ్యండి. బూర్జువా స్త్రీ అంటారు, పండితురాలంటారేమో. ఫూడల్ అంటారేమో. సో వాట్.

      “ఆధునిక ఆలోచనా దోరణి అది కాదు.”

      ఇదొకటి. ఆధునిక అంటే ఏంటండీ? ఆధునిక ఆలోచనా ధోరణి అంటే తమరి ఆలోచనా ధోరణేనా, ఇంకేదైనా నిర్వచనం ఉందా? పండిత వ్యతిరేక, ఫూడల్ వ్యతిరేక, బూర్జువేతర ధోరణా? మీ ధోరణిలో వివాహ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తెస్తున్నారండీ? “సమాజంలో” ఎక్కడన్నా అవి అమలు పర్చారా అందరూ చూసి నేర్చుకోవటానికి?

      • Thirupalu says:

        ‘ సమాజం అని ఒకటుంది అంటే’ మీరు అనుకునే అర్ధం లో కాదు. నేను సంప్రదాయాలు, ఆచారాలు – వీటి గురించి కాదు సమాజం అంటున్నది. వీటి కి వ్యతిరేక మైనవన్నీ ప్రగతి శీలమైనవనవని కాదు. ప్రగతి శీలమ్ ఎప్పుడూ సామాజిక కట్టు బాట్లకు వ్యతి రేక మైనవే అనే దాంట్లో నాకు ఎటు వంటి సందేహం లేదు. ఏది ప్రగతి శీలమ్ అనే దాంట్లో విరుద్ద అభిప్రాయాలు ఉంటాయి.’అది వలవేసింది. వాడు ఊబిలోకిదింపేశాడు’. ఈ మాట స్త్రీలకు వర్తించ కూడదనే నా అభి ప్రాయం. ఫెమినిష్టులు పురుశాది పత్యాన్ని నిరసించే పక్షం లో, పురుషులు చేసే పనులు వారు చేయకూడదు. ప్రత్యామ్నాయంగా ఉండాలి. ఆ ప్రత్యమ్నాయం తనతో పాటు పురుషుడికి కూడా దారి చూపాలి. అపుడే సమానత్వానికి అర్ధం. ప్రత్యామ్నాయ రాజకీయాలు గురించి మాటాడుతూ సంప్రదాయం లోనే కూరుక పోతే అర్ధం ఏమిటి? ‘ వారిజ’ చర్య పురుశాది పత్యానికి ప్రత్యామ్నాయం ఎంత మాత్రం కాదు. పురుషుడు స్త్రీని నాలుగు రోజులు వాడు కొని వాడి లేస్తే ఏ మంటారు? ఆ మాట స్త్రీలను అనకూడదు.

    • Raghavendra says:

      నిజజీవితంలో, కధల్లో,ఆఖరుకు సినిమాలోనైనాసరే ఏఇద్దరువ్యక్తులుఒక్కటైనా మనంతీర్పుఇవ్వాల్సిందే.మేడ్ ఫర్ ఈచ్ అదర్,కాకిముక్కుకు దొండపండు జడ్జిమెంట్లు రెడీ. అది వలవేసింది. వాడు ఊబిలోకిదింపేశాడు.ఏఇద్దరువిడిపోయినాకూడా వెంటనేఅడక్కుండానే అభిప్రాయాలు చెప్పేయాల్సిందే.వెధవను తన్నాలి.అది బాగా ఉపయోగించుకుంది.ఇంకొకరిజీవితం లో ఏఇబ్బందులూ,సంక్లిష్టతలూఉన్నాయో మనకేం తెలుసు?తీర్పులివ్వడానికి మనకేం హక్కుంది? సమాజం లోని ఈ”కులపెద్దల” సర్టిఫికెట్లు ఎందరు పిల్లలజీవితాలను నాశనం చేస్తున్నాయో?నాచావునన్ను చావనియ్యండి అని అందుకేఅన్నాడు కాబోలు రాం గోపాల్ వర్మగారు. బాబుల్లారా! ఇతరులజీవితాల్లోకి ఈ వయూరిస్టిక్ కుతూహలం వదలండి నాయనా.వారిదారికి వారిని వదిలేసి మనుషుల్ని సుఖపడనియ్యండి.

  23. ari sitaramayya says:

    తిరుపాలు గారూ,

    ఓపిగ్గా, ఈసారి నాక్కూడా అర్థమయ్యే భాషలో రాశారు. ధన్యవాదాలు. ఇది కొంచెం పొడుగాటి సమాధానం. క్షమించగలరు. ఇక్కడ నేను మూడు విషయాల గురించి రాయాలనుకున్నాను.

    మొదటిది – కథ రాయటం వెనుక వసంత లక్ష్మి గారి కారణాలు ఏవైనా, వారి అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవించలేను. ఉదాహరణకు, “రాముడు లాంటి ఆదర్శ వంతుడైన భర్త” … అని రాశారు రచయిత్రి. అలాంటి అభిప్రాయాలున్న రచయిత్రి వారిజ లాంటి కథ రాశారంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. రాముడు ఆదర్శవంతుడు అంటే నవ్వొస్తుంది నాకు. ఇది ఇక్కడ వదిలేద్దాం.

    రెండో విషయం – ” ’అది వలవేసింది. వాడు ఊబిలోకిదింపేశాడు’. ఈ మాట స్త్రీలకు వర్తించ కూడదనే నా అభి ప్రాయం.” మీతోనేను పూర్తిగా ఏకీభవిస్తాను. కాని ఇలాంటి మాటలు వారిజ కథకు వర్తించవు. ఈ కథలో శివరావూ వారిజా ఒక ఇంట్లో కలిసున్నారు. ఇద్దరూ తమ వయసులో ఉన్న వారికి ఉండవలసిన కనీస జ్ఞానం ఉన్న వారే అని నా అభిప్రాయం. ఇద్దరిలో ఎవ్వరూ తెలివిలేని వారని రచయిత్రి చెప్పలేదు. ఇద్దరిలో ఎవ్వరూ మోసపోలేదు. పూర్తిగా తెలిసే ఆ సంబంధంలో ఉన్నారు. అందువల్ల వలవెయ్యటం, ఊబిలో దింపటం లాంటివి వీరికి వర్తించవు. అలా అనేవారు ఎవ్వరైనా కథ జాగ్రత్తగా చదవలేదని అనిపిస్తుంది.

    ఇక చివరి విషయం – మీరు రాసిన కొన్ని అభిప్రాయాలు: ” ఫెమినిష్టులు పురుశాది పత్యాన్ని నిరసించే పక్షం లో, పురుషులు చేసే పనులు వారు చేయకూడదు. ప్రత్యామ్నాయంగా ఉండాలి.” ; “పది మంది పాఠకుల మధ్య ఒక కధ రాసి పెట్టాల్సిన అవసరం వుందా?” ; “రచయితా అన్న వారు మార్గ దర్శకమ్గా ఉండాలి.” –

    వారిజ ఒక కథ, user manual కాదు. సృజనాత్మక సాహిత్యాన్ని user manual గా వాడుకున్నంత కాలం తెలుగులో చెత్త తప్ప సృజనాత్మక సాహిత్యం రాదు. కథ చదివినప్పుడు కోపం రావటమో, సంతోషం కలగటమో, ఆశ్చర్యపోవటమో, విచారించటమో, మరో భావోద్రేకం కలగటమో జరగాలి, జ్ఞానోదయం కాదు. వారిజ చదివినప్పుడు ఆమె మీద కోపం రావచ్చు, మంచిపనిచేసింది అనిపించొచ్చు, అలాంటి పని నేనెప్పుడు చెయ్యను అనిపించొచ్చు. కథ చదివి వెళ్లి బస్ స్టాండ్ దగ్గర నిలబడే వాడిని మాత్రం ఇడియట్ అనాలి.

  24. Thirupalu says:

    //కథ చదివినప్పుడు కోపం రావటమో, సంతోషం కలగటమో, ఆశ్చర్యపోవటమో, విచారించటమో, మరో భావోద్రేకం కలగటమో జరగాలి, జ్ఞానోదయం కాదు. వారిజ చదివినప్పుడు ఆమె మీద కోపం రావచ్చు, మంచిపనిచేసింది అనిపించొచ్చు, అలాంటి పని నేనెప్పుడు చెయ్యను అనిపించొచ్చు. //
    సీతారామయ్య గారు, మీతో ఏకిభవిస్తున్నాను. దీన్ని ఇంకాస్త పొడిగిస్తే. . . . ఇలాంటి భావోద్రేకాలు కలిగిన తరువాత స్తితే జ్ఞానో దయం అనుకుంటాను.
    ధన్యవాదాలు.

    • manjari lakshmi says:

      తిరుపాలుగారు మీరు చెప్పిన తీరు బాగుంది. ఇది వరకు నాకీ విషయమ్మీద మీ అంత అవగాహన లేదు. బాగా చెప్పారు.

  25. ఏదో బజార్కెల్లి ఒక బొమ్మనో లేక పోతే పెంపుడు కుక్క పిల్లని ఎలాగో ఓ లగు తేచు కున్నట్లు వుంది………మానవ సంబందాలు ప్రేమలు ఇంకా ఇంకా మనకు తెలీకుండానే ఏర్పడే లింకులు ఏమైనట్లు ?????

  26. ఆడాళ్ళు ఇంత విప్లవాత్మకంగా ఆలోచిస్తే కొందరు మగాళ్ళకి రిస్కు ఉండదు.”చచ్చినట్టు పెళ్ళీ చేసుకోవాలి గావున్రా దేముడా?” అనే బెంగ ఉందదు.అంత సొతంత్రంగా ఆలోచించగలిగిన సంపాదన గల ఆడది కడుపొస్తే అబార్షన్ కూడా తనే చేయించుకుంటుంది,తనకి సౌభాగ్యవతీ అయిన అనకువ గల ఆడది దొరికేవరకు కమలినీలూ,వారిజలూ ఫ్రీగా దొరుకుతారు, ఫాంటసీలు ఉన్న రామగోపాల వర్మ లాంటి మగాళ్లకి పండగే!

Leave a Reply to కమల్ Cancel reply

*