రాజ్యం మెసేజ్‌-ప్రజాస్వామిక వాదులకు ఎస్‌ఓఎస్‌!

జి ఎస్‌ రామ్మోహన్‌

 

వాళ్లు చొక్కా అవసరం లేనంత పేదవాళ్లు. ఏ కులమో ఏ మతమో మనకు తెలీదు. మనలాగా పేపర్‌ చదివి, మనలాగా రాజకీయాలు చర్చించే మనుషులు కారు. మనలాగా కేరేజీ తీసుకుని స్కూటర్‌మీదో కారులోనో ఆఫీసుకు వెళ్లే మనుషులు కాదు. మనలాంటి మధ్యతరగతి మర్యాదపురుషులు కాదు. మన భాష కాదు, మన రాష్ర్టమూ కాదు. వాళ్లు వేరే. వాళ్లు మనకు ఏలియన్స్‌. అందుకేనేమో మనకు పెద్దగా పట్టింపు ఉండదు. సివిల్‌ సొసైటీలో స్పందన కష్టం. ”భలే పని చేశారు గురూ, ఈ దెబ్బకు ఇక ఇటువైపు రారు” అనేమాట ఎక్కువగా వినిపిస్తోంది.

మనందరి ఆస్తిని ఎవరో కొట్టేసుకుపోతూ ఉంటే పోలీసులు వారికి గట్టి బుద్ధి చెప్పినట్టుగా ఉంది. చెట్లు కొట్టేయడం మనుషులను కాల్చిచంపదగిన నేరంగా ఎప్పుడు మారింది అని అడిగీ లాభం లేదు. రాళ్లు విసిరితే తుపాకులతో కాల్చేయడం ఏ విధమైన ఆత్మరక్షణ లాజిక్‌ అని అడిగి లాభం లేదు. ఆ శవాల పక్కనబెట్టిన దుంగలు ఎప్పటివో లాగున్నాయి, కొన్నింటిమీద పెయింట్‌ కూడా కనిపిస్తోంది అని ప్రశ్నించీ లాభం లేదు. ఇది ఎన్‌కౌంటరే అని నమ్మకం కలిగించాల్సిన అవసరం అంతగా లేదని, దానికోసం కష్టపడనక్కర్లేదని పోలీసులు భావించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ర్టాల్లో పోలీసులకు తమ సివిల్‌ సొసైటీ మీదా, నాయకుల మీదా, న్యాయవ్యవస్థమీదా నమ్మకం అంతగా పెరిగిపోయింది. ప్రజాస్వామ్య శక్తులు అంతగా బలాన్ని కోల్పోయాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడుతామని మనసావాచా కర్మణా ప్రమాణం చేసితిరి కదయ్యా అని పాలకులను ప్రశ్నించీ లాభం లేదు. అలాంటి ప్రశ్నలు వినపడే దూరంలో వారు లేరు. ముద్దు మాటలు వినలేదా! బొజ్జల వారి వివరణ చూడలేదా! అంతకుమించి అడవిలో కూలీలకేం పని అన్న వెంకయ్య నాయుడు ప్రశ్న చెవుల్లో రింగురుమనడం లేదా?
అడవిలో కూలీలకేం పని అనడంలో ఆధునిక ఆధిపత్య వ్యాపార శాస్ర్తముంది. నేటి ప్రభుత్వాలకు అడవి ఆస్తి. వనరుల గని. ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట ప్రభుత్వానికైతే ఎర్రచందనం మరీ కల్పతరువులాగా కనిపిస్తున్న ఆస్తి. ఒక్క ప్రభుత్వానికే కాదు. రాజకీయనాయకుల్లో చాలామందికి ఇవాళ అడవి వేలకోట్ల డబ్బుల మూట. సారాయి వేలంపాటలు, రియల్‌ ఎస్టేట్లు, ప్రాజెక్టుల్లో కమిషన్ల మీదుగా ఎదిగిన రాజకీయ నాయకత్వం చూపంతా అడవులమీదా గుట్టలమీదే ఉంది. ఇది ఆస్తి కోణం. మైదాన ప్రాంతపు ఆధునిక వృత్తులు, పనులు తెలీని ఆదివాసీల్లో చాలామందికి అడవి ఉపాధి. తునికాకో మరో ఆకో అలుమో కాయో పండో ఇచ్చే జీవన వనరు.

samvedana logo copy(1)

 

వాలులో నాలుగు గింజలు వేసుకుంటే నాలుగొందల గింజలిచ్చి పొట్టనింపే ఉపాధి. అడవి వారి జీవనాధారం. జీవనాధారం చేసుకోవడంలో ఇపుడు చనిపోయిన 20 మంది చట్టాలను పట్టించుకోకపోయి ఉండొచ్చు. వారి జీవనాధారంలో నేరకోణం ఉండొచ్చు. కానీ ఆస్తి కోణం ఉన్నవారు అందుకోసమే వేల ఎకరాల్లో ఆ చెట్లను పెంచి నరికి అమ్ముకుంటామని ఇంతకు ముందు ప్రకటించారని గుర్తుంచుకోవాలి. అదేదో వాతావరణం సహకరించదని తర్వాత ఇడియా ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఏమిటి? ఇక్కడ సమస్య చెట్లను కొట్టడం కాదు. ఎవరు కొట్టాలి? ఎవరి ఆస్తి? ఎవరు తరలించుకుపోతారు అనేదే సమస్య.

అక్రమ కొట్టివేతా-సక్రమ కొట్టివేతా తప్ప కొట్టివేత అనేది దానికది నేరమనే భావన ఇక్కడ లేదు. ఆ మాటకొస్తే నల్లమల కొండలకు ఆనుకుని ఉన్న కడప, ప్రకాశం జిల్లాల్లోని మైదానప్రాంతాల్లో చాలా ఇళ్లలో దూలాలు దంతెలు ఎర్రగాకనిపిస్తాయి. బండి గాండ్లు, ఇతరత్రా పరికరాలు ఎర్రచందనమే. ఎక్కువగా దొరికే నాణ్యమైన కర్రగా మాత్రమే వారికి తెలుసు. వారికి ఇపుడిపుడే దాని విలువ తెలుస్తున్నది. అది కర్రకాదు, బంగారం అని అర్థమవుతున్నది. తమ తాతలు తండ్రులు అన్నలు ఊ అంటే అడవిలోకి వెళ్లి నాలుగు కర్రలు నరుక్కొచ్చి ఇంటి పనికి ఉపయోగించేవారని వారు రాజ్యం చంపదగిన నేరాలు చేశారని వారికి ఇపుడిపుడే అర్థమవుతోంది. అది అంతపెద్ద నేరమెప్పుడైందో తెలిసే అవకాశం లేదు. వస్తువు ఖరీదు పెరిగితే అది నేరమవుతుంది, ఆస్తి విలువ కొద్దీ నేర స్వభావం పెరిగిపోతుంది అనే లాజిక్‌ ఇపుడిపుడే అందరికీ అర్థం చేయిస్తోంది ప్రభుత్వం. ఆ రకమైన మెసేజ్‌ని పంపించాలని భావించింది ప్రభుత్వం. మెసేజ్‌ని జనంలోకి పంపించాలనుకున్నపుడు డిమాన్‌స్ర్టేషన్‌ ఎఫెక్ట్‌ యాడ్‌ చేయగలిగితే అంతకు మించిన శక్తిమంతమైన సాధనం ఉండదు. 20 మంది శవాలతో డిమాన్‌స్ర్టేషన్‌ చేశాక ఇంకెవరైనా గొడ్డలి పట్టుకుని అడవిలోకి అడుగుపెడతారా!

20 మంది ఎవరో, ఎవరు కన్నబిడ్డల్లో ఎవరు కట్టుకున్న భర్తలో, ఎవరైతే మనకేంటి? వాళ్లెవరో పరాయివాళ్లు. ఈ మనమూ వాళ్లు అనేదాన్ని ప్రాంతం, కులం, మతం, వస్ర్తధారణ వంటివి నిర్వచిస్తాయి అనే మాట నిజమే కానీ అంతకుమించి నిజంగా నిర్వచించగలిగేది ఆస్తి. వాళ్లు ఆస్తి లేని వాళ్లు. ఆస్తే ఉంటే ఆ పనికి ఎగబడరు, అంతమందిని రాజ్యం చంపే మాటా ఉండదు. ఇక్కడ మైదాన ప్రాంతంలో గొంతుండి పత్రికల్లోటీవీల్లో మాట్లాడగలిగే రాయగలిగే, వినగలిగే, చదవగలిగే మనబోటోళ్లం ఎంతో కొంత భద్రలోకులం. కాబట్టి వారు పరాయివారే. ఆడవి ఆస్తిగా మారాక అడవుల మీద రాజ్యానికి రాజ్యంలో రక్షణ బాధ్యతలు చూసేవారికి గతంలో ఎప్పటికంటే అడవి పూర్తిగా మాదే అన్న సొంత భావన పెరిగిపోయింది. రివర్స్‌ లాజిక్‌లో ఆదివాసీలకు అడవితో ఏం పని అనే రోజులొచ్చాయి.

sheshashalam
నిజమే. వాళ్లు రాజ్యానికి చెందిన ఆస్తి అయినటువంటి చెట్లను నరికేశారు. వాళ్లు బండవాళ్లు, మొరటు వాళ్లు. నిజమే. ఆయా ప్రాంతాల్లో తిరిగి వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వడానికి ప్రయత్నించిన వారితో కూడా మొరటుగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నమాట నిజమే. ఒకనాడు మన రాష్ర్టంలో స్టువర్ట్‌ పురంలా పేరుబడిన సోకాల్డ్‌ ‘నోటిఫైడ్‌’ ప్రాంతాల వారు అయిన మాట వాస్తవమే. అందరమూ అక్కడినుంచి వచ్చినవారమే. మనిషి పుట్టుకతోనే బ్రాండెడ్‌ షర్టుతోనూ బ్రాండెడ్‌ ఉద్యోగంతోనూ పుట్టలేదు. అందరమూ అడవులనుంచి ఆదిమ దశనుంచి వచ్చినవారమే. దాటి వచ్చిన దశ పట్ల అంత వ్యతిరేకత ప్రదర్శించడం మన సమాజంలోని అప్రజాస్వామిక లక్షణాల్లో ఒకటి. అడవుల అందం పట్ల అంతులేని గ్లామర్ అక్కడి ప్రజల పట్ల అంతులేని చిన్నచూపూ ప్రదర్శించుకునే వాళ్ సంఖ్య పెరిగిపోతున్నది. అడవి అనే ఆస్తి కావాలి. అడవి బిడ్డలు వద్దు. వాళ్లు ప్రజాధనాన్ని దోచుకోవాలనుకున్నారు కాబట్టి కాల్చేశామంటున్నారు కదా!

అంతకంటే దారుణంగా కమిషన్ల రూపంలో లంచాల రూపంలో ప్రజాధనాన్ని టేబుల్‌ కిందినుంచో పైనుంచో చేతులు చాచేవాళ్లను ఇలాగే కాల్చేస్తే సివిల్‌ సొసైటీ ఇలాగే మౌనం వహిస్తుందా, భలే పని చేశారు గురూ అనగలుగుతుందా అని వాదనకోసమైనా అనలేం. రకరకాల రూపాల్లో ప్రభుత్వానికి రావాల్సి పన్నులనునొక్కేసే తెల్లచొక్కాయి మనుషులను ఇలాగే పట్టుకుని కాల్చిచంపేయగలరా అని అడగలేం. వాళ్లంతా భద్రజీవితంలో ఉన్నవాళ్లు. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఆఫీసర్‌ ప్రత్యక్షంగా దోపిడీ చేస్తూ పట్టుబడినా నేరం రుజువు కాకముందే నేరస్తుడెట్లా అంటారు అని వైట్‌ కాలరెగరేసి మాట్లాడగలడు. నాకు భారత న్యాయవ్యవస్థమీద నమ్మకం ఉంది గంభీరంగా మైకుల ముందు చెప్పగలడు. ఇపుడు చనిపోయిన 20 మంది ఉన్నారే వాళ్లు అలా చెప్పలేరు. వాళ్లకు మన వ్యవస్థ మీద అంత నమ్మకము ఉండదు. నమ్మకం ఎలా ఉంటుంది?

పోలీసులు తప్ప మరో శాఖ ఆ తండాలను గ్రామాలను సందర్శించకుండా ఉన్నపుడు బూతులు బెదిరింపులు తప్ప మరో మంచి మాట చెవి సోకనపుడు వారికి ఏ వ్యవస్థమీదైనా నమ్మకం ఎలా కలుగుతుంది? ఆయా ప్రాంతాలు దోపిడీదొంగల ప్రాంతాలని, వీరప్పన్‌ ప్రభావిత ప్రాంతాలని గట్టిగట్టిగా ప్రచారం చేయడం వల్ల వాళ్లు వేరే వాళ్లు వేరే అనే పరాయిభావనను అదే పనిగా జనంలోకి పంపించడం ఎత్తుగడ. ఈ ఎత్తుగడ కేవలం రాజ్యానిది మాత్రమే కాదు. ఆస్తిపరులందరిదీ. రాజ్యం కేటలిస్ట్‌ మాత్రమే. కశ్మీర్‌ను ఎలాగైతే ఆస్తిగా చూసి అక్కడ తిరగబడే వారిని ఎంతమందిని కాల్చితే అంత సంతోషపడే స్వభావాన్ని పెంచుకున్నారో ఇపుడలాగే శేషాచలం అడవులను ఆస్తిగా చూపి ఆ ఆస్తిపై కన్నేసినా చేయేసినా చంపేయొచ్చనే భావనను మధ్యతరగతిలో పెంచగలుగుతున్నది.
మన దేశంలో ప్రజాస్వామ్యం చిత్రమైనది. ఇది అవసరమైనపుడు నాలుగు పడగలు, పది తలలు తొడుక్కోగలదు. అది ఒకవైపు అమెరికాను ఆదర్శంగా చూపుతూ అక్కడ చూడండి రూల్‌ అంటే రూలే అనగలదు. ఏం కోర్టులండీ, కాల్చేస్తే గానీ బుద్ధిరాదు అని అదే నోటితో తాలిబన్ల లాజిక్‌ కూడా వినిపించగలదు. అక్కడ ఆధునిక బూర్జువా రాజ్యం ఆదర్శం కాదు. ఎక్కడ ఏది అవసరమైతే అది అనే ప్రాతిపదికన ఈ రాజ్యం నడుస్తుంది. తమకు అవసరమైనపుడు చట్టం ఒకటుంది కదండీ అనగలదు. అవసరం లేదు అనుకుంటే అన్నింటికీ చట్టాలంటే కుదరదండీ, పది మందిని వేసేస్తే గానీ పదకొండో మనిషికి తెలివిరాదు అనగలదు. రాజ్యాంగం రాసేటప్పుడు సూత్రబద్ధవైఖరుల కోసం నాటి మేధావులు అనేకానేక రాజ్యాంగాల మీద ఆధారపడ్డారు. వివిధ దేశాల్లో కాలక్రమేణా ముందుకు వచ్చిన విలువలు, నాగరికత తీసుకునే ప్రయత్నం చేశారు. ఇవాల్టి నేతలు తమ అవసరాల కోసం తమ క్రూరత్వాన్ని సమర్థించుకోవడం కోసం ఎక్కడెక్కడి అనాగరిక పద్ధతులను ఆదర్శంగా తీసుకుంటున్నారు.

కానీ సమస్యలను తుపాకీతో పరిష్కరించాలనుకునే దేశాలు ఏమయ్యాయో ఈ దేశపు పాలకులు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది. తుపాకీ తాత్కాలికంగా గ్లామరస్‌గా కనిపించొచ్చు, తక్షణ పరిష్కారంగా కనిపించొచ్చుగానీ అది పాలకులకు ఈ వ్యవస్థకే ప్రమాదకరం అని గుర్తించాలి. ఆస్తి ప్రాతిపదికన మనుషులను శిక్షించదగినవారు- శిక్షించకూడని వారు, అందులోనూ చంపదగినవారు చంపకూడని వారు అని విభజించే ఈ విచిత్రన్యాయం ప్రమాదకరమైనది. ఈ దేశపు పేదలు ఇవాళ తెలుగువారు తమిళనాడు వారుగానో ఆదివాసీలు, మైదానప్రాంతం వారుగానో చీలిపోయి ఉండొచ్చును. ఆర్థిక అంతరాల వల్ల పేదలు కూడా తమకింద ఇంకా దరిద్రులున్నారనే భావనలో ఆధిక్యభావనలో ఉండొచ్చు. భద్రలోక భావజాలం అవసరమైన వారికంటే ఎక్కువమందిలో మాయలాగా కమ్మి ఉండొచ్చు. వారికి ఉమ్మడిగా గొంతునిచ్చే శక్తులు బలహీనంగా ఉండొచ్చును. కానీ ఏ బలహీనతా శాశ్వతం కాదు.
*

మీ మాటలు

  1. రమణమూర్తి says:

    జరిగింది చిన్న విషయంగా ఎలాగోలా సరిపెట్టుకోవచ్చు.

    కానీ, న్యాయాన్యాయాల విచారణ తామే చేసేస్తూ, ధర్మాధర్మాల తీర్పులు కోర్ట్లతో పనిలేకుండా తామే ఇచ్చేస్తూ, పౌరహక్కులు అంటే అదేదో లాఫింగ్ స్టాక్ లాగా జమకట్టేస్తూ, చేతిలో కీబోర్డూ ఎదురుగా ఫేస్ బుక్ ఉంది కాబట్టి తోచింది రాసేస్తూ – తమ హక్కుల్ని రాజ్యానికి తమకి తెలీకుండానే సమర్పణ కావించుకుంటున్న ఈ ప్రజలని చూస్తే భయం వేస్తోంది. ప్రజాసమూహాల సహకారం ఇదే స్థాయిలో ఉంటే, రాబోయే రోజుల్లో రాబోయే మరిన్ని ‘తీర్పులు’ ఎలా ఉంటాయో అర్థం అవుతోంది.

    జరగబోయేవి చిన్న విషయాలుగా సరిపెట్టుకోలేము..

  2. Doctor Nalini says:

    కూలీలు ఐనందుకే వారికి తుపాకితో జవాబు చెప్పారు . అంతకు ముందు బంగారంతో టాయిలెట్ సీటు నిర్మించు కున్న వారికి , లారిలకి లారీలు కలప , ఇసుక దోచుకున్న వారికి , గనుల దొరలకి , మతం పేరుతో బంగారాన్ని పోగేసుకున్న వారికి , వ్యాపారం పేరుతో అడవి పుత్రులని దోచుకున్న వారికి, దొంగ పేర్లతో భూమి కబ్జా చేస్తున్న వారికీ ఈ న్యాయం ఎందుకో వర్తించ లేదు . అటవీ సంపదని కొల్లగొట్టి ,bauxite పేరుతో గుట్టలని తవ్వి పర్యావరణాన్ని , తరతరాల జీవితాలని ధ్వంసం చేస్తున్న బడా బాబులకి ఈ శిక్ష ఎందుకో అమలు కాలేదు . ఇది ఎవరి రాజ్యమో , ఎవరికి శ్రీ రామ రక్ష కల్పిస్తుందో చాలా వెగటుగా, చాలా క్రూరంగా తెలియ చెప్పిన వైనం . ప్రజాస్వామిక వాదులమని చెప్పుకునే వారందరం ముక్తకంటంతో ఈ చర్యని నిరసించాలి.

    • డాక్టర్ నలిని గారు, నిజమే. చాలా బాగా రాశారు. ఈ చర్యను నేను కూడా నిరసిస్తున్నాను.

  3. D.Subrahmanyam says:

    డాక్టర్ నలిని గారు చెప్పినట్టు మన ఖనిజ దోపిడీ దుర్మార్గులు బాగానే వుంటారు. ధార్వాడ్ పోర్ట్ లో కొన్ని లక్షల టన్నుల ఐరన్ ఒర్ మాయమయిపోతే ఇప్పటిదాకా ఏమి జరగలేదు, హషిమ్పూర్ లో 1987 పోలీసులు నిర్దాక్షన్యం గా ముస్లిం యువకులు చంపితే, మన ఘనత వహించిన న్యాయ వ్యవస్థ 28 సంవత్సరాల తర్వాత ఎవిడెన్స్ లేదని అందరు ముద్దయాలని వదిలేసింది.ఇప్పటి దాక అక్కడి ప్రభుత్వం రివ్యూ కోసం పి కోర్ట్ కి వెళ్ళలేదు, ఇలాంటివెన్నో అవుతూనే వున్నాయి. రేపు రాజధాని అమరావతి కోసం జరిగే భూసమికరణ కోసం ఇంకేతమంది పేద రైతులు చంపబడతోరో వూహించు కుంటేనే గాభర పెడుతుంది.మార్పులతో ఇప్పుడు భూమి సంస్కరషణ బిల్లు పార్లమెంటులో పాస్ అయినతర్వాత అభివ్రుది పేరిట జరిగే ఈఎ దోపిడలో ఇంకేతమంది వాళ్ళ జీవితం త్యాగం చేయవలసి వస్తుందో?!!

    • Amarnath Trivedi says:

      ఊర పిచ్చుక పై బ్రహ్మాస్త్రం వేసినట్టుగా సామాన్యుడి పై రాజ్యం ప్రతాపం అంతనూ. ఈనాటికీ ఒక్క పెద్ద తలకాయ శిక్ష అనుభవించిన దాఖలా లేదు.

  4. శ్రీనివాస్ వెన్ను says:

    ఆలోచింపజేసే విధంగా చెప్పారు….నిజమే రాజ్యం సొమ్ముపై చేతులు వేస్తే చంపేస్తాం…అది మా ఒక్కరి సొత్తేనంటూ నిరూపించారు…మరో వైపు ఆదివాసీల ఆస్తిని కూడా ఆధునిక ఆర్ధిక వ్యవస్థలో తమది చేసుకుంటున్నారు…ఒకటేమిటి…సెజ్ ల పేరిట, అభివృద్ధి పేరిట అడవులను నాశనం చేసినప్పుడు వీళ్లను ఎవరు కాల్చిచంపాలి….తాము చేస్తుంది కనీ స్మగ్లింగో కాదో కూడా తెలియని అమాయకులు వాళ్లని కాల్చిన వారి ఖచ్చితంగా తెలుసు. ఇది అన్యాయం అంటున్న వాళ్ల నోళ్లు మూయించేందుకు ఇప్పుడు చేయని ప్రయత్నం లేదు…

  5. Sai Padma says:

    నిజం ..నేర కోణానికీ , ఆస్థి కోణానికీ .. బేరీజు వేసి చూస్తే, గన్నుకి కాదు పడాల్సింది శిక్ష .. వాళ్ళ వాళ్ళ ఆస్తి ప్రొటెక్షన్ కోసం .. సిస్టమిక్ గా వీళ్ళతో , గన్ను పట్టించిన ఒక్కల్ని కాలిస్తే .. ఇరవై మరణాలు ఆగేవి .. వ్యాధి మూలం కాకుండా పై పై పూతల మందులే ..అన్ని మానవత్వ దహనాలూ..!

  6. ఉషా యస్ డానీ says:

    వ్యాసం చాలా బాగుంది. 50 కోట్ల రూపాయల ఎర్రచందనం రాష్ట్రం దాటిపోయిందంటూ ముద్దు కృష్ణమ నాయుడు కాల్పుల్ని సమర్దిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల నల్ల ధనం దేశ సరిహద్దులు దాటి పోయింది. వాళ్ళందర్నీ వరసగా నిలబెట్టి చంపేస్తారా? అంత దమ్ముందా? పేదవాళ్లను చంపడంలో ఆస్తి స్వాధీన భావనతోపాటూ, కిరాతక ఆనందమూ వుంది. అదీ అసలు విషయం.

    తుళ్ళూరులో భూమి పూజ కన్నా ముందే శేషాచలంలో నరబలి జరిగిపోయింది.

  7. ఏదైనా తనదాకా వస్తేనే కాని అది ప్రమాదం అని తెలుసుకోలేని ఒక భ్రమ పూరిత భద్ర లోకంలో ఉన్న వాళ్లకి కాల్చిన ఇనుప చువ్వతో పెట్టిన చురక ఈ వ్యాసం.. అది కూడ ఫీల్ కాకపోతే… ఇక వాళ్ళని మనుషులు అనడం కూడా వేస్ట్. రోజు రోజు కీ స్పృహ కోల్పోతున్న సమాజం…దేనికి ఎలా స్పందించాలో తెలియని దైన్య స్థితిలోకి కూరుకుపోతోంది… ఒక రకమైన అచేతనావస్థలోకి వెళ్ళిపోతోంది. … కానీ చివరకి అన్నట్టు… ఏ బలహీనత శాశ్వతం కాదు…. అది చరిత్ర చెప్పిన సత్యం….ఆధిపత్యమా …ఖబడ్దార్!!

  8. Chimata Rajeandra Prasad says:

    ఆయా ప్రాంతాలు దోపిడీదొంగల ప్రాంతాలని, వీరప్పన్‌ ప్రభావిత ప్రాంతాలని గట్టిగట్టిగా ప్రచారం చేయడం వల్ల వాళ్లు వేరే వాళ్లు వేరే అనే పరాయిభావనను అదే పనిగా జనంలోకి పంపించడం ఎత్తుగడ. ఈ ఎత్తుగడ కేవలం రాజ్యానిది మాత్రమే కాదు. ఆస్తిపరులందరిదీ. రాజ్యం కేటలిస్ట్‌ మాత్రమే. కశ్మీర్‌ను ఎలాగైతే ఆస్తిగా చూసి అక్కడ తిరగబడే వారిని ఎంతమందిని కాల్చితే అంత సంతోషపడే స్వభావాన్ని పెంచుకున్నారో ఇపుడలాగే శేషాచలం అడవులను ఆస్తిగా చూపి ఆ ఆస్తిపై కన్నేసినా చేయేసినా చంపేయొచ్చనే భావనను మధ్యతరగతిలో పెంచగలుగుతున్నది.” కుక్క ను చంపే ముందు అది పిచ్చిదని ప్రచారం చెయ్యాలని ఇంగ్లీష్ వాడు ఎప్పుడో చెప్పాడు కదా!
    భారతీయ “ప్రజాస్వామ్య” బండారాన్ని నగ్నంగా చూపించారు మన దేశంలో ప్రజాస్వామ్యం చిత్రమైనది. ఇది అవసరమైనపుడు నాలుగు పడగలు, పది తలలు తొడుక్కోగలదు. అది ఒకవైపు అమెరికాను ఆదర్శంగా చూపుతూ అక్కడ చూడండి రూల్‌ అంటే రూలే అనగలదు. ఏం కోర్టులండీ, కాల్చేస్తే గానీ బుద్ధిరాదు అని అదే నోటితో తాలిబన్ల లాజిక్‌ కూడా వినిపించగలదు. అక్కడ ఆధునిక బూర్జువా రాజ్యం ఆదర్శం కాదు. ఎక్కడ ఏది అవసరమైతే అది అనే ప్రాతిపదికన ఈ రాజ్యం నడుస్తుంది. తమకు అవసరమైనపుడు చట్టం ఒకటుంది కదండీ అనగలదు. అవసరం లేదు అనుకుంటే అన్నింటికీ చట్టాలంటే కుదరదండీ, పది మందిని వేసేస్తే గానీ పదకొండో మనిషికి తెలివిరాదు అనగలదు. రాజ్యాంగం రాసేటప్పుడు సూత్రబద్ధవైఖరుల కోసం నాటి మేధావులు అనేకానేక రాజ్యాంగాల మీద ఆధారపడ్డారు. వివిధ దేశాల్లో కాలక్రమేణా ముందుకు వచ్చిన విలువలు, నాగరికత తీసుకునే ప్రయత్నం చేశారు. ఇవాల్టి నేతలు తమ అవసరాల కోసం తమ క్రూరత్వాన్ని సమర్థించుకోవడం కోసం ఎక్కడెక్కడి అనాగరిక పద్ధతులను ఆదర్శంగా తీసుకుంటున్నారు.

  9. ప్రసాదమూర్తి says:

    రామ్మోహన్ ఏం రాసినా బావుంటుంది. కళ్ళ ముందు ఇంత దుర్మార్గం జరిగినా తట్టుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు. రక్తం రగులుతోంది. రాతలతో లాభం లేదనే కొందరు అడవుల్లోకి వెళ్ళేది. హ్యాట్సాఫ్ రామ్మోహన్.

  10. దేశరాజు శ్రీనివాస్ says:

    శేషాచలం ఎన్ కౌంటర్ పై స్పందిస్తున్నమానవతామూర్తులకు వందనాలు. రెండు మూడు రోజులుగా ఈ మానవత్వం ఏరులై పారుతూ ఆన్ లైన్ లో పొంగి ప్రవహిస్తున్నందుకు నా మనసు ఉప్పొంగిపోయింది. ప్రపంచంలో ఇంకా ఇంత మానవత్వం వున్నదని మనసు నిండిపోయింది. గర్వంగా కూడా అనిపించింది.
    సరే. ఇది అనాగరికం. కౄరం. ఈ పదాలు సరిపోవు కూడా. నిఘంటువులు వెతకండి. కొత్త మాటలు విసరండి. రాజ్యం మీద, రాజ్యాధికారం మీద దుమ్మెత్తిపోయండి. ఇక్కడే నాకో చిన్న సందేహాన్ని కూడా తీర్చండి. అజ్ఞానంతో అడుగుతున్నందుకు పెద్దమనసు చేసుకుని క్షమించండి. ఓకే. ఇది అనాగరికమైతే పదేళ్లు యథేచ్ఛగా సాగించిన దోపిడీ నాగరికమా? కూలీ పేరుతో ఇక్కడికొచ్చి ఖూనీ చేయడం మానవత్వమా.? వీళ్లు ఎంతమంది అధికారులను పొట్టన పెట్టుకోలేదు? రుజువులు కావాలా? మనమంతా పత్రికలు చదివేవాళ్లమే కదా.
    యుద్ధంలో అటోఇటో మరణాలు నిశ్చయం. చేసేది ధర్మయుద్ధమా కాదా అన్నదే సంశయం. కాల్పులు ధర్మం కాదని తేల్చిన ధర్మమూర్తులు వేలకోట్ల రూపాయిల జాతిసంపదని చీకటిచాటున దోచుకోవడం ధర్మమేనని సమర్దిస్తున్నారా?
    ఊచకోత ఏనాటికీ ఉచ్ఛం కాదు, నిస్సంకోచంగా నీచమే. మరి తప్పు చేసిన వాడికి కోర్టు కూడా ఉరి వేస్తుందే. కోర్టుని కూడా తప్పుబడదామా? నిజమే. మనం మనుషులమే, అంతమాత్రాన మనమే చేసుకున్న శాసనాలకు, మనమే రూపొందించుకున్న చట్టాలకు అతీతులమని అనుకుందామా? అడవుల్లో తెగబడి దొరికిందంతా దోచుకుని వీరప్పన్ వారసులు విశృంఖలంగా చెలరేగిపోతూ వుంటే వారిని దళితులని, మైనారిటీ, మరొకటి అని సరిపెట్టుకుందామా?
    ఒక్క మాట చెప్పండి, ఒక అభాగ్యుణ్ణి మీ ఇళ్లకి పంపి దొరికింది దోచుకురమ్మని, అడ్డొస్తే రాళ్లేసి చంపమని చెప్పి పంపిస్తే అడ్డుకోరా? ఆకలితో వచ్చాడని అన్నం పెట్టి పంపిస్తారా?
    కులాలు, అంతరాలు బట్టి నేరం అంగీకరించే పరిస్థితి వుండదు. వేల కోట్లు దోచుకున్న జగత్ కిలాడీలైనా, వంద రూపాయిల కూలీకి వచ్చిన వాడైనా నేరం నేరమే. శిక్ష అర్హమే.

  11. అద్బుతమైన వ్యాసం

  12. బాగా రాసావు, రామ్మోహన్. మన సో కాల్డ్ ప్రజస్వామ్య్యపు డోల్లతనానన్ని బయట పెట్టావ్. అయినా, యీ రెండు ప్రభుత్వాలూ గత ప్రభుత్వపు పంధాను తు. చా. తప్పకుండా అనుసరించాయి.శ్రీశ్రీ ఎన్నడో చెప్పినట్టు” పోలిసుల రాజ్యంలో పోలింగ్ ఒక బూటకం/ఫాసిజం ఆడుతుంది ప్రజాస్వామ్య నాటకం.”

  13. పోలీసులు చేసినదాంట్లో నాకు ఏ తప్పూ కనిపించడం లేదు. ఇంతకు ముందు స్మగ్లర్ల చేతుల్లో ప్రభుత్వ ఆఫీసర్లు ఇంతకన్నా దారుణంగా చంపబడినప్పుడు ఈ మానవతాస్వరాలు, ఈ ప్రజాస్వామిక కంఠాలు ఎక్కడ దాక్కున్నాయో తెలీదు. ఆ ఆఫీసర్లు కూడా ఒకమ్మ కన్నబిడ్డలే. .కూలీలు అనే గుర్తింపు పొందిన వృత్తి వెనక కొంతమంది స్మగ్లింగ్ అనే గుర్తింపు పొందని వృత్తి సాగిస్తున్నారు. అది వాళ్ళకీ తెలుసు. చాలా బాగా తెలుసు వాళ్ళ వెనకున్నవాళ్ళకీ తెలుసు. పక్కరాష్ట్రానికి జీవగఱ్ఱ అయిన ఒక వనరుని పైసా కట్టకుండా తమ రాష్ట్రానికి తరలించడం నేరం కాకపోతే, అది దోపిడీ కాకపోతే ప్రపంచంలో ఇంకేది దోపిడీ అవుతుందో చెప్పండి. లేదా- ఆ దోపిడీని ఇలాంటి దండనాత్మక చర్యల ద్వారా కాకుండా ఇంక ఏ మార్గంలో అరికట్టొచ్చునో చెప్పండి.

  14. ‘భద్రలోక భావజాలం అవసరమైన వారికంటే ఎక్కువమందిలో మాయలాగా కమ్మి ఉండొచ్చు. వారికి ఉమ్మడిగా గొంతునిచ్చే శక్తులు బలహీనంగా ఉండొచ్చును. కానీ ఏ బలహీనతా శాశ్వతం కాదు.’ రామ్మోహన్, చాల బాగా చెప్పారు. చాల మంచి వ్యాసం.

  15. దేశరాజు శ్రీనివాస్ says:

    • అనేక సంవత్సరాలుగా ఎర్రచందనం దొంగలు శేషాచలం అడవుల్లో జాతి సంపదను యథేచ్ఛగా దోచుకుంటూ అడ్డొచ్చిన అధికారులను చంపివేస్తూ అకృత్యాలు సాగిస్తున్నారు.
    • గత పది సంవత్సరాల కాలంలో వీరు మరీ విశృంఖలంగా తయారయ్యారు. వేల కోట్ల రూపాయిల విలువైన జాతి సంపదను చైనా, జపాన్, మయన్మార్, ఇతర తూర్పు ఆసియా దేశాలకు, దుబాయ్ వంటి గల్ఫ్ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. అడ్డువచ్చిన అటవీ సిబ్బందిని, పోలీస్ అధికారులను హతమారుస్తున్నారు.
    • తూర్పు ఆసియా దేశాలలో ఎర్రచందనానికి వున్న అపారమైన విలువను ఆసరాగా తీసుకుని ఆయా దేశాలకు ఇక్కడినుంచి పెద్దఎత్తున సరుకును అక్రమంగా తరలించడానికి దుండగులు దుస్సాహసం చేస్తున్నారు.
    • శేషాచలం అడవులు మంచి క్వాలిటీ గల ఎర్రచందనం చెట్లకు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ఇక్కడ నెంబర్ వన్ రకం ఎర్రచందనం ఖరీదు టన్నుకు 1 కోటీ 90 లక్షల రూపాయిల పైమాటే. తక్కువలో తక్కువ నాణ్యత గల ఎర్రచందనం దుంగలు టన్నుకు కనీసం 30 లక్షల రూపాయిల విలువ చేస్తాయి.
    • ఆమధ్య జరిపిన వేలం పాటలో టన్ను ఎర్రచందనం కోటీ 90 లక్షలకు పలికిందంటే దాని విలువను అవగతం చేసుకోవచ్చు.
    • ఆంక్షలు, నిషేధాజ్ఞలు వారిని అడ్డుకోలేవు. పోలీసులు, జైళ్లు, కేసులు అసలే లెక్కలేవు. తమకు కావాల్సిన సరకు కోసం వారు ఎంతటి దారుణానికైనా తెగబడతారు. ఇందుకు గతంలో జరిగిన దారుణాలే ఉదాహరణ.
    • 2013 డిసెంబరులో ఇద్దరు అటవీ శాఖ అధికారులు డేవిడ్ కరుణాకర్, శ్రీధర్‌లను ఎర్రచందనం స్మగ్లర్లు అత్యంత పాశవికంగా దాడి చేసి చంపేశారు. మరో ముగ్గురు అటవీ శాఖ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు.
    • చామల రేంజ్‌లోని భాకరాపేట కనుమలో 2012లో అటవీశాఖ సిబ్బంది చొక్కలింగం, జయరామన్‌లను బంధించి వారిపై దాడిచేశారు.
    • శ్రీకాళహస్తిలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్‌ను లారీతో ఢీకొట్టి అత్యంత కిరాతకంగా చంపేశారు.
    • టాస్క్ ఫోర్సుకు చెందిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మల్లికార్జునను కూడా ఇలాగే, ఇదే రీతిన పొట్టనపెట్టుకున్నారు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆయనను భారీ వాహనంతో ఢీకొట్టి దారుణంగా చంపేశారు.
    • ఎర్ర స్మగ్లర్లను వెంబడిస్తోన్న టాస్క్ ఫోర్సు వాహనాన్ని కుప్పంబాదూరు సమీపంలో భారీ వాహనంతో ఢీకొట్టగా అది నుజ్జునుజ్జయ్యింది. అధికారులు, సిబ్బంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎస్సై అశోక్, నలుగురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. ఇవన్నీ కొన్ని సంఘటనలు. నిజానికి వీరు నిత్యం చేసే ఆగడాలు, అకృత్యాలకు అంతే లేదు.
    • గత ఏడాదే వీరి అకృత్యాలను అడ్డుకోవడం మొదలయ్యింది. 2014లో మొత్తం 3411 మంది స్మగ్లర్లు, కూలీలు అరెస్టయినట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. 473 కేసులు నమోదయ్యాయి.
    • ఇవిగాక, పోలీసులు ప్రత్యేకంగా జరిపిన ఆపరేషన్లలో 35 మంది పేరొందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్లు కూడా అరెస్టయ్యారు. అంతేకాదు, 41 మంది నొటోరియస్ స్మగ్లర్లు పీడీ యాక్టు కింద అరెస్టయ్యారు.
    • పూర్తి వివరాల్లోకి వెళితే : మొత్తం 696 కేసులు నమోదయ్యాయి. 4641 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఏపీ నుంచి 1895, కర్నాటక, తమిళనాడు నుంచి 2746 మంది వున్నారు. 13,783 దుంగలను, 607 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

    ఎర్ర చందనం గురించి మరికొంత:
    • ఎర్ర చందనం అత్యంత విలువైన కలప. దీన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు.
    • ఎర్ర చందనం చెట్టు వృక్ష శాస్త్రీయ నామం Pterocarpus santalinus.
    • ఇది ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా పెరగదు.
    • ఆంధ్రప్రదేశ్ లో కూడా కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమే పెరుగుతుంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో విస్తరించి వున్న నల్లమల అడవులలో మాత్రమే ఈ ఎర్ర చందనం చెట్లు పెరుగుతాయి.
    • ఈ చెట్టు కలపతో చేసే వాయిద్యాన్ని జపాన్ లో సంగీత సాధనంగా ఉపయోగిస్తారు. ఆ సంగీత సాధనం ప్రతి ఇంటిలో ఉండటం వాళ్ళ ఆచారం.
    • దీని కలప పొట్టుని కలర్ ఏజెంట్ గా వాడతారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కలప ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. అయినా దీనికి చాలా విలువ ఉండటంతో కొంతమంది దొంగతనంగా ఎగుమతి (స్మగ్లింగ్) చేస్తుంటారు.
    • దీనికి విదేశాలలో అత్యధిక విలువ వున్నందున ప్రాణాలకు తెగించి ఈ కలపను దొంగ రవాణా చేసి ఇతర దేశాలకు తరలించి కోటాను కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు స్మగ్లర్లు. ఈ విధంగా లక్షల కోట్ల విలువైన ఎర్ర చందనం విదేశాలకు తరలిపోతున్నది.
    • ఇదివరకు జపాన్ ఎర్రచందనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునేది. ఈ కలపతో వారు బొమ్మలు, సంగీత పరికరాలు తయారు చేసుకునేవారు. ఇప్పుడు చైనాదేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది. వీరు ఈ కలపను బొమ్మలు, సంగీత పరికరాలు, వాస్తు సంబంధ పరికరాలు వంటి వాటికి ఉపయోగిస్తున్నారు.
    • ఈ కలపతో చేసిన వస్తువు తమఇంటిలో వుంటే అంతా కలిసి వస్తుందని వీరి నమ్మకం. దీని నుండి వయాగ్రా కూడా తయారుచేస్తారు.
    • అంతే గాక దీని నుండి సుగంధ ద్రవ్యాలు, మందులు, ఇలా అనేక రకాల ఉత్పత్తులు చేస్తున్నారు.
    • ఈ కలప దొంగ రవాణాదారులు తమ ప్రాణాలు పోయినా అటవీ శాఖ సిబ్బందిని చంపైనా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ నాలుగు జిల్లాలలో ఈ దొంగ రవాణ విషయంలో కొన్ని వేల వాహనాలు పట్టుబడ్డాయి.
    • అలాగే కొన్ని వేలమందిని కూడా నిర్భంధించారు. అయినా దొంగరవాణాను అరికట్టలేకపోతున్నారు. అటవీశాఖ సిబ్బందిపై దాడులకు సైతం తెగబడుతున్నారు.
    • ఒక ఎర్రచందనం దుంగను కొట్టి తమ స్థావరానికి చేర్చడానికి ఒక్క కూలికి ఒక్కరాత్రి సమయం పడుతుంది. అంత మాత్రానికే ఆ కూలీకి కొన్ని వేలరూపాయలు ముట్ట జెప్పుతారు స్మగ్లర్లు. దాని వలన వారు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.
    • అత్యధిక ఆదాయం వున్నందునే కూలీలు ఎంతటి ధారుణానికైనా తెగ బడుతున్నారు. పట్టుబడి అటవీశాఖ వారి గోదాముల్లో నిల్వ వున్న ఎర్రచందనం విలువ కొన్ని లక్షలకోట్ల విలువ వుంటుంది.
    • ఇక కనుగప్పి విదేశాలకు తరలి పోయిన ఎర్ర చందనం విలువ ఎంత వుంటుందో ఊహాతీతమే.

  16. గమనిక : ఇది కేవలం రామ్మోహన్ గారికి కాశ్మీర్ మీద వున్నా అభిప్రాయం గురించి మాత్రమే. పైన వ్యాసం గురించి కాదు.
    రామ్మోహన్ గారు,

    కాశ్మీర్ గురించి మీరు పడే పడే చెప్తున్న విషయం బాగాలేదు.
    మీ ఆలోచన సరి కాదు. కాశ్మీర్ లో ఎవ్వరికి ఆస్తులు లేవు వుండవు కూడా. ఆ మాటకొస్తే, ఏ దేశం ఐన డబ్బు, పవర్ వున్నా వాడికి అన్ని దొరుకుతాయి. ఇవ్వాళా మీ దగ్గర ఒక 10 కోట్లవుంటే , చాలా దేశాలు మీకు Residency ఇవ్వడానికి రెడీ.

    కాశ్మీర్ గురించి ఆలోచించే దేశ ప్రజలందరి అక్కడ ఆస్తులు కొనాలనో , ఆక్రమించు కోవలనో లేదు. వున్న20% హిందూ మైనారిటీస్ ని massacre చేసి తరిమి కొట్టి ఇప్పుడు మాకు ప్రత్యెక దేశం కావాలంటే ఎవరు వప్పుకుంటారు. GeoPolitics లో Idealism కి చోటు లేదు. కాశ్మీర్ ఇస్తే పాకిస్తాన్, చైనా occupy చేసుకోవని మీరు హామీ ఇస్తారా ? POK ని చాల మటుకు చైనా కీ దార దత్తం చేసింది పాకిస్తాన్. కాశ్మీర్ వాళ్ళ చేతికి వెళ్తే, మన అయుదు నదులకు నీళ్ళు రానిస్తారా ? అవి లేక పోతే ఎంత మంది ఆకలితో చావాలి ? ( ఇది జరగదు అనొద్దు. చైనా బ్రహ్మపుత్ర తో అదే చేస్తోంది). డిఫెన్సు గురిచి చెప్పకర్లేదు.

    1) Syed Ghulam Nabi ఫై అనే ఒక మహానుబావుడు ఇలాగె కాశ్మీర్ గురించి మొసలి కన్నీళ్ళు కార్చే వాడు. చివరకు అతను ISI పాలు పోసి పెంచిన పాము అని తేలింది. అది తెలియక, మీ లాంటి చాల మంది అతని కాన్ఫరెన్స్ లో చొక్కాలు చించుకొని వాదించే వారు కాశ్మీర్ కి ఫ్రీడమ్ కావాలని. ఇలాంటివి ఫండ్ చేసే పాకిస్తాన్ Baluchsitan కి ఫ్రీడమ్ ఎందుకు ఇవ్వదు.మన సో కాల్డ్ లిబెరల్స్ కి ఇలాంటివి ఎన్ని జరిగిన సిగ్గు లేదు. ఇప్పటి కైనా శత్రువు కి Useful ఇడియట్ గ మారడం మానేద్దాం

    2) కాశ్మీర్ ఫ్రీ కంట్రీ అయితే కచ్చితంగా ఇస్లమిస్ స్టేట్ అవుతింది. హురియత్, గిలానీ, మీకు తెలిసిన యాసిన్ మాలిక్ అంత ఒక తాను ముక్కలే. ఇస్లామిక్ స్టేట్ లో హిందూ మైనారిటీస్ పరిస్తితి ఎలా వుంటుందో పాకిస్తాన్ ని చూసి అద్బుతం గ తెలుసు కోవచ్చు. పాకిస్తాన్ లో హిందువుల బాధల గురించి ఒక్క లైన్ ఐన రాయండి( కాశ్మీర్ మీద పుస్తకాలు ఎట్లాగు రాస్తున్నారు కదా) . వాళ్ళు మనుషులే .

    3) కాశ్మీర్ లో మనవ హక్కులు గురించి enthina అడగండి. అంత మిమ్మల్నే సమర్ధిస్తారు. Maoist ప్రాబ్లం లో గిరిజనులు పడుతున్న బాధలు అంటే అందరికి సానుబూతి వుంది. దాన్ని అడ్డం పెట్టుకొని, కాశ్మీర్ కి Freestate చెయ్యాలి ఇంకా హిమాలయాలని ఫ్లాట్ చెయ్యాలి అంటే ఏమి చెప్పలేము. (పోలిక అసంబద్డగా అనిపించినా, రెండు జరగవని మీకు తెలుసు)
    4) ఇంకా పైత్యం ఎక్కువైనా కొంత మంది మహానుబావులు, కాశ్మీర్ ని పాలస్తీనా తో పోలుస్తారు. వారి మీద కోపం కన్నా జాలి వేస్తుంది.
    5) టర్కీ PKK ఇష్యూ కానీ, పాకిస్తాన్ బలూచిస్తాన్ , ఇండోనేషియా ఈస్ట్ టిమోర్, సుడాన్ సమస్య, టిబెట్ . వీటన్నితో చూసినా , ఇండియా రెస్పాన్స్ బెటర్ అనే చెప్పొచ్చు.

    • సోషల్ మీడీయాలో కొందరు మార్క్సిస్ట్ లు కాష్మీర్ కి సమస్యకు మద్దతు పలుకుతూంటారు, వాదిస్తూంటారు. కాష్మీర్లకి ప్రత్యేకదేశం ఎందుకు కావాలంటే, వాళ్లది ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక జాతి అట, జాతుల పోరాటాలను గుర్తించి వారికి స్వాతంత్రం ఇవ్వాలని వాదిస్తూంటారు. ఇదొక పసలేని వాదన. దేశ విభజన సమయంలో జరిగే చర్చలలో కాష్మీరీలు మాది ప్రత్యేక జాతి మాకు మాదేశం కావలని బ్రిటిష్ వారిని కోరారా? పోని దేశస్వాతంత్రపోరాట సమయంలో మాకు వేరే దేశం కావాలని కోరారా? ప్రత్యేక అస్తిత్వం కల వారు అప్పుడేందుకు గమ్ముగా ఉన్నారు. స్వాతంత్రం వచ్చాక దేశంలో హిందూ ముస్లిం గొడవలు జరగని ప్రాంతం కాష్మీర్ అని బాలగోపాల్ రాశాడు.

      పాకిస్థాన్ నుంచి వచ్చిన అటవిక తెగలు వచ్చి కాష్మీర్ లో గొడవలు చేస్తూంటే, వారిని పట్టుకొని మొదట పోలీసులకు అప్పగించింది కూడా కాష్మీరీలే. వారికి ప్రత్యేక దేశం అవసరమైతే, భారత వ్యతిరేకత ఉంటే గొడవచేస్తున్న పాకిస్థాన్ వారిని పట్టి భారత ప్రభుత్వానికి కాష్మీరిలే ఎందుకు అప్పగిస్తారు? మతాన్ని ఆధారం చేసుకొని పాకిస్తాన్ ప్రేరేపించటం వలన వాళ్లు విభజన పల్లవి అందుకొన్నారు. ఒకవేళ జిన్నాగారు ద్విజాతి సిద్దాంతం ప్రతిపాదించకుండా ఉండిఉంటే, పాకిస్థాన్ దేశం ఏర్పడకుండా ఉంటే, కాష్మీరిలు వేరుపడతామని కోరేవారా?

      65ఏళ్లుగా తేలని ఈ కాష్మీర్ సమస్య, ఇంకొక 65ఏళ్లు అయినా తేలుతుందనే నమ్మకం ఎవ్వరికి లేదు. మేధావులు పాలకుల లోపాలను దెప్పుతూ ఆ అంశాన్ని ప్రస్థావించుకోవాలసిందంతే.

  17. Venkateshwarlu says:

    రామ్మోహన్ గారు చాలా బాగా రాశారు. జరిగింది ఎన్ కౌంటర్ కాదు అని పోలీసులు చెప్పిన విషయాలు మరియు ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. మీరు అన్నట్లు పోలీసులు ఎర్ర చందనం కూలీలను పట్టుకొని వచ్చి కాల్చారు అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. పోలీసులు మరియు రాజకీయ నాయకులు పథకం ప్రకారం కూలీలను కాల్చి చంపారు. వీరు ఆ కూలీలతో పని చేయించుకొని కోట్ల రూపాయలను సంపాదిస్తున్న స్మగ్లర్లను గాని వారిచ్చే ముడుపులను తీసుకొంటు వారి వ్యాపారాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న అధికారులను మరియు రాజకీయ నాయకులను ఏమి చేయలేదు. కాల్చి చంపడమే పరిష్కారం అనుకుంటే ఈ చట్టాలు, న్యాయవ్యవస్థ , జైళ్ళు ఎందుకు? అన్నింటిని రద్దు చేయొచ్చు. కొందరు మద్య తరగతి ప్రజలు అన్నట్లు వారు కట్టె టాక్స్ మిగులుతుంది. హత్యలు చేసి నాటకాలు ఆడటం ఎందుకు. అవును కొంత మంది కూలీలను చంపడం ద్వారానే మేము ఎర్ర చందనం కాపాడుకోవాలనుకున్నాము. ఇంతకు మించి మాకు వేరే నాగరిక మార్గం సాధ్యం కాదు అని పాలకులు ప్రకటించ వచ్చు. కాని వీరికి అంత నిజాయితీ లేదు. పైగా మాది ప్రజాస్వామిక పాలన అని గొప్పలు చెప్పుకోవాలి కదా. పాలకులకు ఆధునిక విలువల పట్ల నమ్మకం లేదు. పేదల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం పాలకులకు పరిపాటే. భాదాకరమైన విషయం ఏమంటే ప్రధాన స్రవంతి మీడియా ఈ విషయం లో దాదాపుగా పోలీసుల వాదననే సమర్థించడం.

  18. ఒక రాత్రి చేసిన (నేరపూరిత) పనికి 50,000 వసూల్ చేసేవాడు పేదవాడా? వాడి వెనకున్నవాళ్ళు పేదవాళ్ళా?

  19. Dr. Rajendra prasad Chimata says:

    ఎర్ర చందనం స్మగ్లర్స్ అడవిలో ఉండరు. అడవిలో నుంచి వచ్చిన దుంగలు రోడ్ల ద్వారానే తరలింప బడతాయి.మరి ఈనాటి అత్యాధునిక టెక్నాలజీతో అవి ఎక్కడెక్కడికి వెళ్తాయొ కనుక్కో లేరా ? దుంగలకు వేలరూపాయలు ఇచ్చే వ్యక్తులు మన మధ్యే ఉండి వాటిని కోట్లకు అమ్ముకుంటుంటే వాళ్ళను, జాతి సంపదను దోచుకొంటున్న వాళ్ళుగా పరిగణించమా. కొనే వాడు లేకుంటే ప్రాణాలకు తెగించి అడవిలోకి ఎవరైనా ఎందుకు వెళ్తారు? 20 మందిని కాల్చి చంపితే స్మగ్లింగ్ ఆగి పోతుందా? ఈ ప్రశ్నలకు జవాబులు ఉన్నాయా?

  20. vamseekrishna says:

    ఈ దేశం లో పేదవాడికి ఒక న్యాయం ధనవంతుడికి ఒక న్యాయం వుండటం చాలా కాలం నుండి వున్నది .అలా వుండటం సహజం కూడా( ఇవి రా.వి.శాస్త్రి గారి మాటలు )
    రామ్మోహన్ లాంటి ఆలోచనా పరులు అది తప్పు అందరికి ఒకే న్యాయం వుండాలని తాపత్రయ పడతారు.కానీ రామ్మోహన్ లాంటి వారి సంఖ్య తక్కువకదా ప్రభుత్వాలు పట్టించు కోవు.అందరికి సమాన న్యాయం చేయాలని మనం ప్రభుత్వాలని అడగొద్దు. ఎందుకంటే అవి ఎలాగు చేయలేవు. కనుక అన్యాయమైనా సమానం గా చేయాలని అడుగుదామా అనుకుంటే ప్రభుత్వాలు అన్యాయం కూడా సమానం గా చేయలేము అంటాయి. ఎందుకంటే అన్యాయమైన సమానంగా చేస్తే న్యాయం అవుతుందని వాటికి భయం

  21. Thirupalu says:

    .చాలా మంచి వ్యాసం! నిద్ర పోతున్న సివిల్ సమాజాని కి అలారం బెల్లు మోగినట్టు. అయినా అది నిద్ర మత్తులో తూలుతూనే ఉంది. మేలు కొంటుంద ?.

  22. Jagadeesh says:

    రాజ్యం మెసేజ్‌-ప్రజాస్వామిక వాదులకు ఎస్‌ఓఎస్‌

    EE article rasina GS Ram mohan garini naku konni prashnalu adagalani undi,

    1)chetlanu kottatam kaalchi champenta neramga eppudu marindi ani adagatam kante…. police vallani ral1)lato kottatam oppuga eppudu maarindi ani adigalsindi

    2)Adavi vaari jeevanadharam ani annaru… akkadiki vallu vellind pallono, poolano leka teneno techukovataniki kadu ani telisina kooda vadiste inkem adagagalam

    3)mana taatalu adaviki velli erra chendham modhulu techukuni illu kattaru adhi epudu tappu ga marindo telisey avakasame ledhu annaru, adhe mana tata muttatalu adavilo vetaki velli
    jantuvulni champi vati charmanni intlo alankarinche varu, ala cheyyatam ipudu neram ani telisina vallaki erra chandam kottam neram ani teliyaka pote tappu evaridi ???

    4)Pedha pedha tappulu chese varini vadilesi chinna chinna tappulu chesevarini champatam tappu ani meru ante, mana desham lo dawood ibrahim ni arrest chesi vuri teesedaka
    inkevari meeda elanti case lu pettakoodadu, endukante mana desham lo andaru atani kante takkuva tappule chesaru.

    5)vaarini amayaka coolielu antaniki idhi varu chesina modati tappu kadu, duradrustavashattu chivaridhi matrame. Police lu vastunnarani ilanti vallu enni sarlu adavalu tagalabettaru

    6)Sutradarulanu vadilesi paatradarulani champaru ani akroshinche variki, police lu kooda alanti paatradarule ani teliyada ???? coolielak mamoolu chettu kottatam kante
    erra chandanam chettu koditey dabbulu ekkuava istarni vacharu. Mari police vallaki alanti prayojanalu evi unnayani varini champali???

    Ram Mohan garu tarkhanni vitarkhani kalipi ee article rasinatuu anipistondi. Tappu ga matladi unte kshaminchandi.

  23. rachakondasrinivasu says:

    పేపరోల్లు చాల అతిగా పోలిసులకంటే ఎక్కువుగా మద్దతిస్తున్నారు
    .కారణం ఏంటి..వ్యాసం తట్టిలేపింది

  24. buchi reddy gangula says:

    ఎక్ష్చెల్లెన్త్ — ఆర్టికల్ — రామ్మోహన్ జి
    మిత్రుల కామెంట్స్ కూడా చక్కగా చెప్పారు
    చంపడం — నేరం
    చంపడం — పరిష్కారం కాదు
    చంపడం — అన్యాయం
    చంపడం — ఒక కుట్ర

    యిది మన ప్రజా సామ్యం ???????
    ————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  25. శాంతి ప్రబోధ says:

    జి. ఎస్ . రామ్మోహన్ గారూ మీ హృదయ సంవేదన గుండె గదుల్ని తట్టి లేపింది. రాజ్యానికి కావాల్సింది అసలు నేరస్తుడు కానే కాదు. తామూ పనిచేస్తున్నాం అని చెప్పుకోడానికి అప్పుడప్పుడూ ఇలా సామాన్య జనాన్ని, బుక్కెడు బువ్వకోసం అహోరాత్రులు శ్రమించే ఈ జనమే వాళ్లకి తెరగా దొరికేది. వాళ్ళ కోసం ఎవరు వస్తారు. ఎవరు ప్రశ్నిస్తారు అనే కదా …. వీళ్ళ శ్రమతో పెద్దోడైన అసలు నేరస్తుడు మాత్రం రాజ్యం పక్కనే ఉన్నా కళ్ళు , ముక్కు , చెవులూ ఏవీ పని చెయ్యవు . రాజ్యం వద్ద ఉన్న అధునాతన టెక్నాలజీ పక్కనే ఉన్న వారిని ఎరెయ్యడానికి ఉపయోగపడదు. కారణం .. తెల్సిందేగా ………………

  26. తమిళనాడు నుంచి వచ్చిన కూలీలు శేషాచలంలో ఆదివాసులు ఎందుకయ్యారో నాకు అర్థం కాలేదు.
    వాళ్ళని ఎన్‌కౌంటర్ చెయ్యడం తప్పు అంటే ఒప్పుకోవచ్చు. కాని వాళ్ళు అమాయకులు అన్నట్టు చెప్పడం కరక్టు కాదు. పర్యవసానం బాగా తెలిసే, వాళ్ళు నేరం చెయ్యడానికి వచ్చారు. ఎక్కువ డబ్బుకి ఆశపడి ప్రాణాలు కోల్పోయారు.
    తమిళనాడులో బియ్యం నుండి టివిల వరకు బోలెడన్ని తాయిలాలు ఉచితంగా, చౌకగా ఇస్తున్నారు. వీళ్ళు కూడ మిగతావాళ్ళలా బతకలేరా?

  27. రామ్మోహన్ …నీవు రాసింది నిజాల నిప్పుల తప్పెట. “సారంగ”లో రావడం సంతోషమే కానీ ఏదయినా దినపత్రికలో వచ్చి ఉంటే “కూలీలకు మంచి శాస్తి జరిగింది ” అంటున్న మట్టి బుర్రల్లో కనీస ఆలోచన రేకెత్తించేది – గొరుసు

  28. హలో సర్ ఉగ్రవాదులు కూడా చాల పేదవాళ్ళు. అంటే వాళ్ళని కూడా వదిలేయాల .తప్పు ఎవడు చేసిన తప్పే కానీ వాడు ఎ కులమోడు ఆ మతమోదని లింక్ పెట్టకూడదు . మీరు ఒక విషయం ఆలోచించాలి గవర్నమెంట్ ఆఫీసర్స్ ని చంపినపుడు ఎక్కడున్నారు సర్ . ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు ఫేక్ ఎన్కౌంటర్ చేయల్సిని అవసరం అటు పోలిసుస్లకు కానీ గవర్నమెంట్ కానీ ఒరిగేది ఏమి లేదు చెడ్డపేరు తప్ప .వారిని చంపినంతమత్రాన గవర్నమెంట్ కు 20 మంది mla లు పెరగరు .
    అంత ఎందుకు ఉదాహరణకు మీ ప్రణాలమీదికి వస్తే మీరు మాత్రం ఊరుకుంటారా చెప్పండి

  29. ఈది చాల దారుణం, ఇంకొం టాక్స్ కట్టకుండా కోట్లు కోది నల్ల సొమ్ము ని ఈతర దేశాలలో దాచిన వారికీ రెడ్ కరప్ట్ పరిచి టాక్స్ పి చేస్తే మీరు చేసిన తప్పు ని rigth చేస్తాము అంటునారు. కోట్లు కోది సొమ్ముని పొలిటికల్ లీడర్స్ తిన్నతులు నిరూపణ అయిన వారిని మల్లి సమాజం లో లెదర్ గ అవకాశం ఈచినరు విత్ సెక్యూరిటీ తో. కానీ పేదవారు ఎవరో చెపితే వచ్చి పని చేస్తున్నారు పొట్ట కుతి కోసం, పంపిన వారిని వదిలి ఆమయకులిని చంపటం ఈ దేశం గొప్పతనం. నిజాము గ తప్పు చేసిన వారినందరిని చంపాలి అంటే రాజకీయ నాయకులలో ఎవరు బతకరు అందుకే ఆమయకులి ని చంపుతునారు, అడవి సిద్ధాంతం ఎవరు బలవతులు అయితే వాళ్ళు బలహేనులని చంపవాచు… మనం దేశం లో బ్రతకటం లేదు ……

  30. రామ్మోహన్ గారు,
    ఎర్రచందనం పొలిటికల్ ఎకానమీని బాగా చెప్పారు. భద్రలోకులు, కంపు మీడియా ఏం వాగినా నిజం అందరికీ తెలుసు. విషాదం ఏమిటంటే.. కాస్తో కూస్తో విశ్వసనీయత ఉన్న పత్రికలు కూడా తుపాకీ భాష మాట్లాడడం. ఈ ఎన్కౌంటర్ ను సమర్థించే వాళ్ళు అమాయకులైనా కావాలి, లేకపోతే దొంగాముఖాలైనా కావాలి. నేరం చేసిన వాడిని శిక్షించే అధికారం పోలీసులకు లేదన్న ఇంగిత జ్ఞానం లేని మనుషులున్న సమాజం ప్రమాదకరం. ప్రతీకార హత్యలు.. అదీ నిరాయుధులను చంపడం ఆటవిక సమాజ లక్షణం. జంతువులు కూడా ప్రతీకారాన్ని ఎదురుబొదురుగా కలబడి తీర్చుకుంటాయి కాని ‘ encounter ‘ చేయవు. బ్రిటిష్ వాడు కూడా భగత్ సింగ్ ను కోర్టుకు పెట్టి శిక్ష వేశాకే ఉరి తీశాడు. మన పాలకులు బ్రిటిష్ వాళ్ళకంటే, జంతువులకంటే నీచంగా తయారయ్యారు.

    • దేశరాజు శ్రీనివాస్ says:

      కంపు మీడియా, ఏం వాగినా, ఇంగిత జ్ఞానం లేని మనుషులు… ఎట్సెట్రా పద ప్రయోగాలు ఎన్ కౌంటర్ కంటే నీచమైన ప్రయోగాలు. ఇది ఏ రకపు సమాజపు సభ్యత? ఏ నాగరికుల లక్షణం? ఇక్కడ చర్చ చనిపోయిన వాళ్లు కూలీలో, ఖూనీకోరులో తెలుసుకోవాలన్నదే చర్చ. నిరాయుధాల్ని చేసి లాంటి మాటలు వాడారు. ఒకసారి టీవీల్లో వస్తున్న విజువల్స్, పత్రికలు రాస్తున్న వార్తలు, బాధితులు చెబుతున్న నిజాలు విని మాట్లాడితే బావుంటుంది. రాళ్లేసి కొట్టి చంపే వాళ్లు కూలీలా? నిరాయుధులా? చనిపోయినవాళ్లలో ఎంతటి కృూర స్వభావం వున్న కరడుగట్టిన నేరస్థులు వున్నారో ఇవాళ మీడియాలో వచ్చింది కదా, పత్రికల్ని కూడా తప్పుబడితే ఎలా? భద్రలోకులు అని అన్నారు. వాస్తవాలు వినడానికి కూడా అంగీకరించని భ్రమలోకుల్లా వుంటే ఎలా? ఈ భావజాలం ఎందుకు పనికొస్తుంది? జరిగింది కాల్పులా? ఎదురుకాల్పులా? కుట్రా.. కుత్సితమా? అనేది మెజిస్టీరియల్ విచారణలో తేలుతుంది. అది ఎన్ కౌంటరే, కాల్పులు జరిగింది ఏకపక్షమే అని తేల్చేయడానికి మనమెవ్వరం? మరో విషయం. పైన ఈ వ్యాసాన్ని సమర్ధించిన పెద్దాయన కూడా ఫేస్ బుక్ లో పోలీస్ గాయాలపాలయిన ఫోటోని షేర్ చేస్తూ లైక్ కొట్టాడు.
      దయచేసి ఇది చదవండి. అకారణంగా ఎవరినీ నిందించకండి.
      (• ఆంక్షలు, నిషేధాజ్ఞలు వారిని అడ్డుకోలేవు. పోలీసులు, జైళ్లు, కేసులు అసలే లెక్కలేవు. తమకు కావాల్సిన సరకు కోసం వారు ఎంతటి దారుణానికైనా తెగబడతారు. ఇందుకు గతంలో జరిగిన దారుణాలే ఉదాహరణ.
      • 2013 డిసెంబరులో ఇద్దరు అటవీ శాఖ అధికారులు డేవిడ్ కరుణాకర్, శ్రీధర్‌లను ఎర్రచందనం స్మగ్లర్లు అత్యంత పాశవికంగా దాడి చేసి చంపేశారు. మరో ముగ్గురు అటవీ శాఖ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు.
      • చామల రేంజ్‌లోని భాకరాపేట కనుమలో 2012లో అటవీశాఖ సిబ్బంది చొక్కలింగం, జయరామన్‌లను బంధించి వారిపై దాడిచేశారు.
      • శ్రీకాళహస్తిలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్‌ను లారీతో ఢీకొట్టి అత్యంత కిరాతకంగా చంపేశారు.
      • టాస్క్ ఫోర్సుకు చెందిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మల్లికార్జునను కూడా ఇలాగే, ఇదే రీతిన పొట్టనపెట్టుకున్నారు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆయనను భారీ వాహనంతో ఢీకొట్టి దారుణంగా చంపేశారు.
      • ఎర్ర స్మగ్లర్లను వెంబడిస్తోన్న టాస్క్ ఫోర్సు వాహనాన్ని కుప్పంబాదూరు సమీపంలో భారీ వాహనంతో ఢీకొట్టగా అది నుజ్జునుజ్జయ్యింది. అధికారులు, సిబ్బంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎస్సై అశోక్, నలుగురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. ఇవన్నీ కొన్ని సంఘటనలు.)

    • దేశరాజు శ్రీనివాస్ says:

      కంపు మీడియా, ఏం వాగినా, ఇంగిత జ్ఞానం లేని మనుషులు… ఎట్సెట్రా పద ప్రయోగాలు ఎన్ కౌంటర్ కంటే నీచమైన ప్రయోగాలు. ఇది ఏ రకపు సమాజపు సభ్యత? ఏ నాగరికుల లక్షణం? ఇక్కడ చర్చ చనిపోయిన వాళ్లు కూలీలో, ఖూనీకోరులో తెలుసుకోవాలన్నదే చర్చ. నిరాయుధాల్ని చేసి లాంటి మాటలు వాడారు. ఒకసారి టీవీల్లో వస్తున్న విజువల్స్, పత్రికలు రాస్తున్న వార్తలు, బాధితులు చెబుతున్న నిజాలు విని మాట్లాడితే బావుంటుంది. రాళ్లేసి కొట్టి చంపే వాళ్లు కూలీలా? నిరాయుధులా? చనిపోయినవాళ్లలో ఎంతటి కృూర స్వభావం వున్న కరడుగట్టిన నేరస్థులు వున్నారో ఇవాళ మీడియాలో వచ్చింది కదా, పత్రికల్ని కూడా తప్పుబడితే ఎలా? భద్రలోకులు అని అన్నారు. వాస్తవాలు వినడానికి కూడా అంగీకరించని భ్రమలోకుల్లా వుంటే ఎలా? ఈ భావజాలం ఎందుకు పనికొస్తుంది? జరిగింది కాల్పులా? ఎదురుకాల్పులా? కుట్రా.. కుత్సితమా? అనేది మెజిస్టీరియల్ విచారణలో తేలుతుంది. అది ఎన్ కౌంటరే, కాల్పులు జరిగింది ఏకపక్షమే అని తేల్చేయడానికి మనమెవ్వరం? మరో విషయం. పైన ఈ వ్యాసాన్ని సమర్ధించిన పెద్దాయన కూడా ఫేస్ బుక్ లో పోలీస్ గాయాలపాలయిన ఫోటోని షేర్ చేస్తూ లైక్ కొట్టాడు.

  31. “కంపు మీడియా, ఏం వాగినా, ఇంగిత జ్ఞానం లేని మనుషులు”

    ఇలా ఇష్టంవచ్చినట్లు మాట్లాడటం ఎన్‌కౌంటర్ కాదా? మీదగ్గరున్న మాటల్ని మీ ఇష్టమొచ్చినట్లు మీరువాడారు. వాళ్ళదగ్గరున్న తూటాలని వారికిష్టమొచ్చినట్లు వారువాడారు. రెండూ ఒకటేగా!

    జరిగింది కాల్పులో, ఎదురుకాల్పులో విచారణలోనే తేలాలితప్ప (ఇక్కడమళ్ళీ ఆ విచారణపై మనకు ఉండే నమ్మకంపైనే ఈ “తేలాలి” కాన్సెప్టు ఆధారపడుతుంది), మనం నాలుగు ఫోటోలుచూసి, freelance detectiveల్లాగా రువ్వేసే పరిశోధనాత్మక(అని మనకు మనం అనేసుకొనే) Sherlock Holmes styled వ్యాఖ్యలవల్లకాదు.

    ఏది ఏమైనా మన వ్యవస్థ ఇలాంటి ఉత్సాహమే లక్షలకోట్లు మింగినవాళ్ళమీద ఎందుకు చూపదు అన్న ప్రశ్న నాకూ ఉంది.

  32. ఎన్కౌంటర్ అత్యంత బాధాకరం , మనవ హక్కుల సంఘాల ద్వంద్వ విధానం ఇంకా బాధాకరం , హక్కులు కేవలం ఒక వర్గానికే ఉన్నాయా ?
    ఉదయం లేచిన దగ్గరనుండి , రాత్రి పడుకునే వరకు మనిషి తన హక్కులు కోసం పోరాడుతూనేఉంటాడు . ప్రభుత్వం లేదా రాజ్యం యొక్క కనీస బాధ్యత అయిన , తన పౌరులకి కనీస సౌకర్యాలు కల్పించడం , నీరు, ఇల్లు , తిండి మరి ఈ విషయాలలో కూడా మనిషి పోరాడుతూనే ఉన్నాడు రోజూ. నిజం చెప్పాలంటే ఈ ఎన్కౌంటర్ లోతుల్లో కి వెళితే ఇది కూడా ఒక కారణం .

    పాలెం బస్సు దుర్ఘటన లో , మనుషులు సజీవ దహనం అయినప్పుడు ఒక్కరు కూడా నోరెత్తలేదు , కనీసం ఖండించనూలేదు , అందులో ఒక వర్గం ప్రజలు ఎవరు లేరనేమో?? , ఎన్కౌంటర్ కి దీనికి పోలికలు లేకపోవచ్చు, అది రాజ్యం చేసిన హింస కావచ్చు , ఇది కాదు , కాని వ్యవస్థ లో లోపాల వల్ల నిందితులు తప్పించుకున్తున్నారని బాధితులు ధర్నాలు చేసినప్పుడు కనీసం అది ఒక హక్కు అని గుర్తించిన ఒక్క సంఘం కూడా లేదు .

    పెనుకొండ బస్సు దుర్ఘటన ??

    ప్రభుత్వాలు మారినా , ఈ హింస మారదు , కాని కేవలం “హింస” జరిగినప్పుడు మాత్రమే మనం ఎందుకు మాట్లాడాలి , కొంచెం ముందుగా మేల్కొంటే అది నివారించే అవకాశం ఉండేదేమో .

  33. లక్ష్మణరావు says:

    “వస్తువు ఖరీదు పెరిగితే అది నేరమవుతుంది, ఆస్తి విలువ కొద్దీ నేర స్వభావం పెరిగిపోతుంది అనే లాజిక్‌ ఇపుడిపుడే అందరికీ అర్థం చేయిస్తోంది ప్రభుత్వం” బాగుంది.

  34. రాజ్యం మళ్ళీ పడగ విప్పింది. దాని భావజాల బోయలను పురికొల్పింది.

  35. 95% కులాలకి రిజర్వేషన్, ఉచిత బియ్యం , 5 రూపాయలకే భోజనం ఇంకా అనేక సామాజిక భద్రతా కలిగి ఉన్న తమిళనాడు నుంచి శేషాచలం అడవులకి వచ్చి చెట్లు దొంగతనం గా కొడుతున్నారంటే అవి ఎంత ఖరిదైనవొ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో అర్థం చేస్కోవచ్చు, పోలీసులు చేసింది ముమ్మాటికి సరైన పనే.

  36. Wilson Sudhakar says:

    జర్నలిస్ట్ కు మూడవ నేత్రం వుండాలి. అది రామ్మోహన్ గారికి వుంది. కంగ్రాట్స్

  37. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. కొందరు మిత్రులు ఎర్రచందనం కొట్టి వాళ్లు ఎంత కూలీ సంపాదిస్తున్నారో లెక్క చెప్పి ఈర్ష్యపడ్డారు. ఈర్ష్య పడనక్కర్లేదు. కూలీలు దొరక్క అక్కడ వ్యాపారులు, స్మగర్లు చాలా ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఆ రాతలు రాసిన వాళ్లు తమ ఉద్యోగాలేవో వాళ్లకిచ్చి లక్షలు సంపాదించే వాళ్ల ఘనమైన కూలీ ఉద్యోగాలను తీసుకోవచ్చు. అదృష్టప్రాప్తిరస్తు. ఇంకొందరు ఎర్ర చందనం చరిత్రను కూలీల ఆగడాల గురించిన చరిత్రను వివరించారు. వారు చేసింది ఒప్పా అని ఆగ్రహం వెలిబుచ్చారు. నా వ్యాసంలో అది సరైనదని ఎక్కడా చెప్పినట్టు లేదు. వారికలాగ ఎలా అర్థమైందో తెలీదు. వాళ్లు రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించారనుకోండి. మీరు రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించే పౌరాగ్రేసరులు కదా! వాటి ప్రకారమే పట్టుకుని శిక్షించండి. ఉన్నతవర్గానికి మధ్యతరగతికి చెందిన నేరస్తుల విషయంలో లేని ఆగ్రహం కూలీల దగ్గరే ఎందుకొస్తున్నది? కూలీ అనేసరికి నోరూ, చేయీ గన్ను అన్నీ ఇష్టమొచ్చినట్టు పేల్చొచ్చు అని అనుకోవడంలోనే మన దృక్పథం బయటపడుతుంది. వందలమంది వందలసార్లు విపులంగా చెప్పిన విషయాన్ని బాలగోపాల్‌ లాంటి వారు జీవితకాలం పాటు తమ రాతతోనూ చేతతోనూ చాటిచెప్పిన విషయాన్ని ఇపుడు మళ్లీ వివరించనక్కర్లేదనుకుంటాను. ఇక కశ్మీర్‌ గురించి చర్చించడానికి ఇక్కడ నిడివి సరిపోదు. వివరంగా చర్చించడానికి ఇది సందర్భమూ కాదు. కాకపోతే మీకు తెలిసిన యాసిన్‌ మాలిక్‌ అని ఎవరో రాశారు. నేను అంతటివాడిని కాను. డాంటన్‌ దగ్గర్నుంచి ప్రచండ దాకా అందరూ పేపర్ల వల్ల పుస్తకాల వల్ల ఎలా తెలుస్తారో ఆయనా అలాగే తెలుసు. మరీ పెద్దవాడిని చేయకండి సార్లూ! అరవ కూలీ నా కొడుకులను కాల్చి పడేసి భలే పని చేశారు, ఇంకో నా కొడుకు ఇట్లా తొంగి చూడకుండా ఉంటాడు అని వినిపించే మాటల్లో పనిచేసే అంశాలపై అందులో ఉన్న ఆస్తి కోణంపై నా ఆవేదన నేను పంచుకున్నాను. ఈ ఆవేదనను పంచుకున్న మిత్రులకు విభేదించిన మిత్రులకు కూడా మరొక్క సారి ధన్యవాదాలు.

  38. కె.కె. రామయ్య says:

    “ఉన్నతవర్గానికి మధ్యతరగతికి చెందిన నేరస్తుల విషయంలో లేని ఆగ్రహం కూలీల దగ్గరే ఎందుకొస్తున్నది? కూలీ అనేసరికి నోరూ, చేయీ గన్ను అన్నీ ఇష్టమొచ్చినట్టు పేల్చొచ్చు అని అనుకోవడంలోనే మన దృక్పథం బయటపడుతుంది “ రామ్మోహన్ గారు! మీ హృదయ సంవేదన, మీ ధర్మాగ్రహం కు నెనర్లు.

  39. దేశరాజు శ్రీనవాస్ says:

    వాళ్లు చేసింది ఒప్పని నేనెక్కడ అన్నాను అంటూ రచయిత అమాయకంగా ప్రశ్నించడం విచిత్రంగా వుంది. వాళ్లు కట్టెలు ఏరుకునేందుకు వచ్చిన కడు పేదవారిగా చిత్రించే ప్రయత్నం మీ రాతల్లోనే కనిపిస్తుండగా ఎలా దాస్తారు? ఎలా బుకాయిస్తారు? వాళ్ల ఉద్యోగాలు మీరు తీసుకోండని చెప్పిన ఉచిత సలహా.. మిమ్మల్ని ప్రశ్నించిన అందరినీ స్మగ్లర్తుగా మారి దోచుకోమ్మనే సందేశంగా భావిస్తున్నాం. ఇది ఏ తరహా మానవత్వం. ? ఏ సమాజంలోని సంస్కారం? పోనీ అదే సలహా మేమిస్తే? మీరే మీ పవిత్రమైన ఉద్యోగాల్ని ఆ కూలీలకు ఇచ్చి వాళ్ల కడుపుబాధల్ని తీర్చవచ్చు కదా? ప్రతి వాదనకు సమర్థన వుంటుంది. కాకపోతే అది అడ్డగోలుగా వుండరాదు. నా వ్యాఖ్యలో నేను చాలా క్లియర్ గా చెప్పాను. ఊచకోత ఎప్పటికీ నీచమే. మానవ సమాజానికి అది సరైనది కాదు, న్యాయ విచారణ జరిగే లోపే మనమే న్యాయమూర్తిలా జడ్జిమెంటు కూడా ఇవ్వరాదు. ఏదైనా వారు కూలీలో, ఖూనీకోరులో తెలియకుండానే వాళ్లు కడు పేదలంటూ జాలి చూపించి వన్ సైడ్ తీసుకుని కరుణ కురిపించినంత మాత్రాన లోకాన మనకే ఆర్థ్రత వుందని సమాజం అనుకోదు. ముఖ్యంగా జర్నలిస్టు అనేవాడు రెండువైపులా ఒకేలా చూడాలి. ఎటు తప్పు వుంటే అటు ఎత్తి చూపాలి. వేరే కోణాలు తగిలించి పక్కదారి పట్టించరాదు.

  40. Thirupalu says:

    మాట కారి తనం వల్ల తాము చెప్పిమ్దే న్యాయం అయి పోదు. హృదయముంటే చూచి , మనసుంటే మాట్లాడాలి. ఇక్కడ చనిపోయిన వారిని ఏ వైట్ కాలర్ క్రిమినల్స్ తో పోలుద్దామ్. ఒక్క కలం పోటుతో కోట్లు దండుకునే వారినా? ఒక రాజకీయమ్ చేసి బిలియన్స్ ను స్విస్ బ్యాంక్లో దాచే వారినా?

  41. Md.Anwar says:

    ramohan garu epuudee chadivaaanu.. 2000 karapatralu tici panchutunnaanu.

  42. Md.Anwar says:

    ramohan garu epuudee chadivaaanu.. 2000 karapatralu tici panchutunnaanu.

  43. balasudhakarmouli says:

    దాటి వచ్చిన దశ పట్ల అంత వ్యతిరేకత ప్రదర్శించడం మన సమాజంలోని అప్రజాస్వామిక లక్షణాల్లో ఒకటి.

మీ మాటలు

*