చరిత్ర మనలోనే ఉంది!

నిశీధి

చరిత్రలంటూ ఏమి ఉండవు , అప్పుడెప్పుడో జరిగింది అంటూ మనల్ని మనం మభ్యపెట్టుకోవటం తప్ప చరిత్రలు మనతోనే మన నీడల్లా నడుస్తూనే ఉంటాయి , ప్రపంచంలో ఎదో ఒక మూల ఎదో ఒక రకపు ఇన్ జస్టిస్ జరిగినంతకాలం మన చరిత్రలు చెప్పుకొని రాబోయే తరాలు ” అలా కూడా ఉండేవారట ” అని విస్తూపోయేంత అసహ్యంగా మనలో ఇంకిపోయి .

ఎంత నిజం కదా ఈ రోజుకి కూడా ఎవరు ఏమి తినాలి, ఆవుని తినాలా లేదా ఆవులు తినే గడ్డి మనం కూడా తిని బ్రతకాలా , ఎవరు ఏమి కట్టుకోవాలి ఉల్లిపోరలాంటి చీరల్లో సెక్సీ గా కనిపిస్తే ఎక్కువ వైకల్యం పుడుతుంది కాని వొళ్ళు కనిపించే బట్టలు వేస్తే వచ్చే మూడ్ పోతుంది చస్ వీల్లేదు చీరలు కట్టాల్సిందే అంటూ రూల్స్ , అలాగే ఎవరికి శరీరం మీద ఎవరికి హక్కులు ఉండాలి , లేదా మొత్తం ఆడ జాతిని శారిరకంగానో మానసికంగానో అమ్మి కొనుక్కొనే వ్యాపారాలు చేయటానికి గుత్తహక్కులు ఎవరికి ఉండాలి లాంటి చెవుల్లో రక్తం తెప్పిస్తున్న స్టేట్మెంట్లు విని విని మనుష్యులు అంటేనే విరక్తి కలిగి ఓదార్పు కోసం అలైస్ ని చదువుతుంటే ఇదుగో సరిగ్గా ఈ వాక్యాలు , నిజమే కదా ఎవరి హక్కులు వాళ్ళకి లేకుండా చేయటమే నయా మానవత్వపు రూల్ అయినప్పుడు చరిత్ర మనలోనే ఉంది, పూర్తి మనమై ఉంది .

పై వాక్యాల్లో అలైస్ (Alice Malsenior Walker :born February 9, 1944) నడిచే నిజంలా అనిపిస్తే అది మన తప్పేమీ కాదు నిజాయితీగా ఎలాంటి అనవసరపు ఊహాత్మకత లేకుండా ఖచ్చితంగా తను చెప్పాలనుకున్న విషయం చెప్పగలిగే ధైర్యం చూపే తన రచనలది . రేసిజపు దాష్టికంలో మునిగి తేలే జాతులలో మగవారికంటే ఆడవారి పరిస్థితి ఇంకా ఎంత దారుణమో ( వీళ్ళు అటు రేసిజం ఇటు మేల్ చావనిజం రెండు భరించాలిగా ) చెప్పే అలైస్ వాకర్ వాక్యాలు చదవటం నిజంగా గొప్ప అనుభవం , చదివినంత సేపు అదో లోకం , మన జీవితాలు తన పదాల్లో చదువుకుంటున్న అనుభూతి వెరసి కొన్ని క్షణాలు వేదన ఎదో ఘోస్ట్ రూపంలో పట్టి మనసుని అల్లకల్లోలం చేస్తూన్నంత బాధ . నిజ జీవితంలో అలాంటి మనుష్యులే కనబడుతుంటే ఏమి చేయలేని నిస్సహాయత ఎదో బలంగా మనల్ని పూనుకొని తను రాసిన పుస్తకాల్లో కొన్ని క్యారెక్టర్స్ ని గొంతు పిసికి చంపేయాలన్నంత ఉద్రేకం , అనుభవిస్తే కాని అర్ధం కాని భావన అది . శవాల మధ్య బ్రతికుండే క్వాలిఫీకేషన్ మనకేమి ఉందో చెప్పగలిగే , ప్రశ్నించే Be nobody’s darling; Be an outcast.Qualified to live Among your dead స్థైర్యం అది .

alice6

ఎలాగు టాపిక్ వచ్చేసింది కాబట్టి అదే కవితలో వాక్యాలు కొన్ని ఇలా ” జీవితం ఎప్పుడు వైరుధ్యాల వెల్లువే , పిచ్చి జనం చేతిలో రాళ్ళ నుండి తప్పించుకోవడానికి దాన్నే చుట్టుకొని బ్రతకాలి ” ” వంటరి నడకని గర్వంగా ఆస్వాదించు లేకపోతే కటినమయిన మనసున్న ఫూల్స్ తో నువ్వెంతో ఇష్టపడే ఇసుక తిన్నెలు పంచుకోవాలి ( ఓహ్ హౌ ఐ లవ్ దిస్ లైన్ ) అంటూ

Be nobody’s darling;
Be an outcast.
Take the contradictions
Of your life
And wrap around
You like a shawl,
To parry stones
To keep you warm.
Watch the people succumb
To madness
With ample cheer;
Let them look askance at you
And you askance reply.
Be an outcast;
Be pleased to walk alone
(Uncool)
Or line the crowded
River beds
With other impetuous
Fools.

Make a merry gathering
On the bank
Where thousands perished
For brave hurt words
They said.

But be nobody’s darling;
Be an outcast.
Qualified to live
Among your dead.

ఇదొక్కటే కాదు Expect Nothing పోయెమ్ లో అయితే ఏకంగా నిరాశలు నీ తలుపులు తట్టిన క్షణానికి నీ జీవితం అంటే నీకు పూర్తి సంతోషం కలిగి ఉండాలి , నిరాశే నిరాశ పడేంత సంతోషం అంటూ చెప్తారు , అందులోనే ఇంకో చోట “ ఒకసారి బ్రతకటం అంటూ మొదలు పెట్టాక నీ చిన్న బుర్ర బోలెడు అపనమ్మకాలు భయాల మధ్య ఇరుక్కుపోయి బెంగగా ఉంటుంది , ఆ భయాలు వదిలించుకున్న క్షణం జీవితం నుండి ఇహ ఎక్స్పెక్ట్ చేసేది ఏమి ఉండదు అని ఎంత క్లియర్ గా చెప్తారో చూడండి.

Expect Nothing
Expect nothing. Live frugally
On surprise.
become a stranger
To need of pity
Or, if compassion be freely
Given out
Take only enough
Stop short of urge to plead
Then purge away the need.

Wish for nothing larger
Than your own small heart
Or greater than a star;
Tame wild disappointment
With caress unmoved and cold
Make of it a parka
For your soul.

Discover the reason why
So tiny human midget
Exists at all
So scared unwise
But expect nothing. Live frugally
On surprise.

Alice Walker :

ఎంత చదువుకున్నా తరగని తాత్వికత , ఎంత నేర్చుకున్నా సరిపోని జ్ఞానం తన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ప్రపంచం ఆమెకి, ఆమె జీవితాన్నే అక్షర రూపంగా దిద్దిన ది కలర్ పర్పుల్ నవలకి గుర్తింపుగా సాహిత్యంలో ఒక పులిట్జర్ ప్రైజ్ సమర్పించుకుంది .

alice7

 

ఈ వ్యాసం మొదలు పెట్టడం సమకాలిన భారతదేశంలో పరిస్థితులు కంపేర్ చేయటం తో మొదలు అయింది కాబట్టి ఇంకా ఒక్క మాట చెప్పి ముగిస్తాను , యుగాల క్రితమే గొప్ప తాత్వికత సాధించేసిన దేశం ఇక్కడ స్త్రీలు పూజింపబడతారు అని గొప్పలు పోయే మన దేశంలో ఈ రోజు ఆడవారి జీవితానికి చీకటి ఖండంగా దేశ జాతీయులు అని చెప్పుకొనే అలైస్ అపుడేప్పుడో ది కలర్ పర్పుల్ లో రాసిన స్త్రీల జీవితాన్ని కంపేర్ చేస్తే పెద్ద తేడాలు ఏమి ఉండవు రంగుల్లో తప్ప అనేందుకో ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ మధ్య .

~

మీ మాటలు

  1. తిలక్ says:

    నిశీధి గారు మీ పరిచయాలు బాగుంటాయి.ఇలా కొత్త కవయిత్రులను,వారి అనుభవాలను మీరిలా తర్జుమా చేసి మాకో కొత్త సంతోషాన్నిస్తున్నారు.అనువాదం అంత సులభమేమీ కాదు.రాసిన ప్రతి పదాన్నీమనసు భుజాల మీద మోసుకెళ్ళి భావప్రకటన చేయడం మీ అనువాదాల్లో నాకు నచ్చుతుంది చాలా.కంగ్రాట్స్ నిశీధి గారు.

  2. మంచి కవయిత్రిని పరిచయం చేశారు. కేవలం ఆమె జీవిత వివరాలు కాకుండా ఆమె తాత్త్వికతను వివరించడం బాగుంది. ఆమెలోని‘‘తరగని తాత్వికత , ఎంత నేర్చుకున్నా సరిపోని జ్ఞానం’’ గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగించేలా చక్కని శైలిలో ఉందీ వ్యాసం. జెండర్ సమస్యల్ని బాగా పట్టుకున్నారు. అభినందనలు

  3. Kcube Varma says:

    మీరేం చెప్పినా ఇక్కడి జీవితాలకు కంపేర్ చేసి చెప్పడం ఆ కవులను కవయిత్రులను మనలోని వారుగా సహానుభూతి చెందేట్టు చేస్తారు. అభినందనలు ధన్యవాదాలు నిషీజీ.

  4. వాసుదేవ్ says:

    “ఒకసారి బ్రతకటం అంటూ మొదలు పెట్టాక నీ చిన్న బుర్ర బోలెడు అపనమ్మకాలు భయాల మధ్య ఇరుక్కుపోయి బెంగగా ఉంటుంది”…ఇంతవరకూ చాలా రచయితలూ తత్వజ్ఞానులూ జీవితాన్నుంచే తాత్వికతని తీసుకుని మళ్ళీ ఏదో చెప్పటానికి ప్రయత్నించారు. కానీ దానికి భిన్నంగా తాత్వికతని జీవితానికి ఆపాదించి ఆ కోణంలోంచే జీవితాన్ని నిర్వచించే వాకర్ గురించి మీదైన శైలిలో చాలా క్లుప్తంగా ఆవిష్కరించిన తీరు ఎప్పటిలా అభినందనీయం. వెల్ డన్ నిశీధి జీ!

  5. ఇంకా కొంచెం వివరించి ఉంటె బాగా ఉండెది.

  6. vijay kumar says:

    Appude ayipoyindaa ?

    Thanks for getting back some left out emotional moments….

  7. మృత్యుంజయరావు says:

    Expect Nothing
    Expect nothing
    Wish for nothing larger
    Than your own small heart
    Or greater than a star
    మంచి కవితను పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు నిశీధి గారూ!

Leave a Reply to Kcube Varma Cancel reply

*