పదాల ప్రేమలో…

    వాణి కొరటమద్ది

దు:ఖాన్ని  వీడలేక మనసంతా
తుఫాను నాటి కడలిలా అల్లకల్లోలమే
భావాలకై తడుముకుంటూ
మనసంత శోధిస్తూ
లోతుల్ని  తవ్వుకుంటూ
     అక్షరాల ప్రపంచాన్ని హత్తుకుంటాను
మిళిత బిందువువులెన్నో
అక్షరాలుగా మారిపోయాయి
తడిసిన కనులు అలసిపోయి
బాధను ప్రకటిస్తుంటాయి
నీటిని ఆర్పుకుంటూ
కాగితం సొట్టలతో ఉబ్బిపోతుంది
తల్లడిల్లే మనసులానే
సహజత్వాన్ని కోల్పోతుంది
ముడుచుకున్న కాగితంలో
ఇంకిన కన్నీళ్ళు కనిపిస్తూ
మనసులోని  అశ్రువులన్నీ
ఆవిరైనట్లు అనిపిస్తూ
అక్షరాలనే హత్తుకుంటాను
పదాల ప్రేమలో
విహంగమై విహరిస్తుంటాను
అక్షరాల స్నేహంతో
చెలిమి విలువ తెలిసింది
భావాలే ప్రకటిస్తూ అనుక్షణం
            ~
vani

మీ మాటలు

 1. విలాసాగరం రవీందర్ says:

  మీ అక్షర ప్రేమ బాగుంది మేడం.

 2. నిశీధి says:

  మంచి భావం , ఇంకొంచం చదవాలన్న కోరిక మిగిలిపోయింది

 3. vani koratamaddi says:

  స్పందించిన మిత్రులకు కృతజ్ఞతలు

 4. Vanaja Tatineni says:

  చక్కగా ఉంది . .వాణి గారు

 5. mehdi ali says:

  భావాలకై తడుముకుంటూ
  మనసంత శోధిస్తూ
  లోతుల్ని తవ్వుకుంటూ
  అక్షరాల ప్రపంచాన్ని హత్తుకుంటాను
  మిళిత బిందువువులెన్నో
  అక్షరాలుగా మారిపోయాయి
  తడిసిన కనులు అలసిపోయి
  బాధను ప్రకటిస్తుంటాయి…. అద్భుతంగా రాసారు

 6. vani koratamaddi says:

  హృదయపూర్వక ధన్యవాదాలు రవీందర్ గారు, నిశీధి గారు, వనజ గారు,మెహది ఆలీ గారు

మీ మాటలు

*