క్షణమైననేమి..

pulipati

డా.పులిపాటి గురుస్వామి

నా దుఃఖానికి
పరిచయమున్న తోడువి
 
ఇట్లా ఎప్పుడొచ్చావో
ఊగుతున్న కిటికీతెర
మెల్లగా తీసుకొని
చువ్వలమీదుగా
 
పిచ్చుకపిల్లలా
ఆత్మ మీద ఎప్పుడువాలి పోయావో
ఒక లిప్తపాటు
 
పూర్వ జన్మ ని
గుర్తు  చేస్తున్నావా…!
పునర్జన్మని
కల్పిస్తున్నావా…!
 
ఏమంటారో…!
ఆటంకాలకు తెలియకుండా
ఆలోచన శుభ్రపడుతుంది
 
నీ శబ్దానికి
అనునాదమౌతున్న
నాడులలయది పరవశం
 
దశాబ్దాల దూరం
భ్రమలోకి ఇంకిపోయింది
 
సమాంతర దుఃఖం
ఎప్పటికీ
కళకళలాడుతుంది

*

మీ మాటలు

  1. నిశీధి says:

    Nice expression .

  2. నైస్ సర్ ..చాల బాగుంది

  3. DR PULIPATI GURUSWAMY says:

    నిశీధి గారు నమస్తే…
    థాంక్యు …
    వొక్కో సారి చెప్పాలనుకున్నది చెప్పేసాక
    ఒక హాయి కలుగుతుంది…
    మీరు బాగుందన్నాక ఇంకా రెట్టింపు కలిగింది.

  4. DR PULIPATI GURUSWAMY says:

    విజయ్ గారు నమస్తే.
    కృతజ్ఞతలు …

Leave a Reply to DR PULIPATI GURUSWAMY Cancel reply

*