నాలోని వాక్యానివి..

జయశ్రీ నాయుడు 

 

నువ్వొచ్చి వెళ్ళావు అన్నది ఒక వాక్యమే

కొన్ని జ్ఞాపకాల రూపు

ఆ గొంతుల్లో మెదులుతూనే వుంది

కొన్ని గుండె చప్పుళ్ళ అవ్యక్తానికి

కాలం చినుకుల్ని చేరుస్తూనే వుంది

అవును… నువ్వొచ్చి వెళ్ళావు…

గలగల మన్న ఒక నాదానంద ఝరి

 కళ్ళలోంచి మెరుపల్లె దూకి

పెదవుల్లో నవ్వై ఒదిగీ

అనిర్వచనీయ ఆత్మీయతగా

 ఎన్నిసార్లైనా పుడుతూనే వుంటుంది.

అవును… నువ్వొచ్చి వెళ్ళావు.

లోకపు ఆలాపనలెన్నున్నా

ఆ స్వర లహరి మళ్ళీ అంతర్ముఖం అవుతుంది.

అదృశ్య ప్రవాహం అన్వేషణా ధరిత్రిని శోధిస్తుంది.

వెళ్ళినా నువ్వొచ్చినట్టే వుంటుంది

శోధించిన దారులన్నీ అస్పష్ట దృశ్యాలే

 ఆలోచనా అంతర్జాలంగా

మెదడుకీ గుండెకీ లాగిన్ అవుతూనే వుంటాను

ప్రశ్న నీదైనా

సమాధానం వెతికేలోగా

 నాలో ఆత్మీయ అనంతాలు

తమని తాము ఆవిష్కరించుకుంటాయి

ఆవెలుగులే

ఇప్పటికీ చెప్తూనే వున్నాయి.

నువ్వొచ్చావు… కానీ వెళ్ళలేదు సుమా…

jaya

 *

మీ మాటలు

  1. ఆర్.దమయంతి. says:

    నువ్వొచ్చి వెళ్ళావు అన్నది ఒక వాక్యమే

    * ఒక్కో సారి ఒక జీవన సాహిత్యం కూడానేమో?!

    కొన్ని జ్ఞాపకాల రూపు

    ఆ గొంతుల్లో మెదులుతూనే వుంది

    * మధ్యలో ఏదో మిస్సైనట్టు అగుపిస్తోంది, జై!

    కళ్ళలోంచి మెరుపల్లె దూకి

    పెదవుల్లో నవ్వై ఒదిగీ

    అనిర్వచనీయ ఆత్మీయతగా

    ఎన్నిసార్లైనా పుడుతూనే వుంటుంది.

    * :-) బావుంది పదాల ఒలకపోత!
    అందుకే కదా అంటారు – ప్రేమకు పుట్టడమే తెలుసనీ!
    కొన్ని జ్ఞాపకాలకు కూడానేమో, బహుశా!

    ఆ స్వర లహరి మళ్ళీ అంతర్ముఖం అవుతుంది.

    అదృశ్య ప్రవాహం అన్వేషణా ధరిత్రిని శోధిస్తుంది.

    వెళ్ళినా నువ్వొచ్చినట్టే వుంటుంది

    * ఊహు? :-)

    శోధించిన దారులన్నీ అస్పష్ట దృశ్యాలే

    ఆలోచనా అంతర్జాలంగా

    మెదడుకీ గుండెకీ లాగిన్ అవుతూనే వుంటాను

    * :-) వండర్ఫుల్ ఎక్స్ప్రెషెన్ !

    ప్రశ్న నీదైనా

    సమాధానం వెతికేలోగా

    నాలో ఆత్మీయ అనంతాలు

    తమని తాము ఆవిష్కరించుకుంటాయి

    * బావుంది.

    * :-) వండర్ఫుల్ ఎక్స్ప్రెషెన్ !

    ప్రశ్న నీదైనా

    సమాధానం వెతికేలోగా

    నాలో ఆత్మీయ అనంతాలు

    తమని తాము ఆవిష్కరించుకుంటాయి

    * బావుంది.

    ఆవెలుగులే

    ఇప్పటికీ చెప్తూనే వున్నాయి.

    * ఎమనీ?

    నువ్వొచ్చావు… కానీ వెళ్ళలేదు సుమా…

    * ఈ ముగింపు ఒక్కటి చాలు. మళ్ళా మబ్బులొచ్చేందుకు. కాదూ?
    కంగ్రాట్స్….కంగ్రాట్స్.

    • Jayashree Naidu says:

      అక్షరాన్ని ప్రేమించే మృదు భాషిణివి
      నచ్చిన భావాలి ఆస్వాదిస్తూ
      వెన్ను తట్టి మరిన్ని భావాల్ని వాక్యాల్లోకి అనువదించే స్నేహానివి…
      నీ కామెంట్ నాకెప్పుడూ ఓ ఆత్మీయ ఆలింగనమే దమయంతీ…

  2. చాలా బావుంది జయశ్రీ గారు!

  3. Sai Padma says:

    ప్రశ్న నీదైనా

    సమాధానం వెతికేలోగా

    నాలో ఆత్మీయ అనంతాలు

    తమని తాము ఆవిష్కరించుకుంటాయి

    ఆవెలుగులే

    ఇప్పటికీ చెప్తూనే వున్నాయి.

    నువ్వొచ్చావు… కానీ వెళ్ళలేదు సుమా….. బావుంది జయా జీ .. వెళ్ళనివ్వకుండా మీరు కట్టిపడేసిన విధానం కూడా ..ఆత్మికంగా ఉంది

    • Jayashree Naidu says:

      ఇలా నీ ఆత్మీయ పదాలు చదివి చాన్నాళ్ళే అయ్యింది
      వ్రుత్తి ఒక్కో సారి ప్రవ్రుత్తి మీద ఆధిపత్యం చేస్తున్నప్పుడు… కొంత సమయం పూర్తిగా వృత్తిలోనే మమేకమై పోవాల్సి వస్తుంది.
      ఆ అసహాయత లోలోపలే భావాల్ని మధిస్తున్నప్పుడు ఆ క్షణాలు ఊపిరాడనివ్వవు. ఈ కవిత రాసాక కలిగిన రిలీఫ్ లో … మరోసారెప్పుడూ ఇంత గాప్ తీసుకోకూడదని అనిపించింది.
      జయా జీ — ఎంటో… కొత్తగా వుంది.. పద్మా జీ..

  4. e.r.sathyanarayana says:

    “నువ్వొచ్చి వెళ్ళావ్” ఒక నిండిన వాక్యం,ఒక నిండైన భావమున్న వాక్యం. మమతలలో మునిగి తృప్తి పడ్డ మనసు త్రెన్పెమో ఈ కవిత.

    • Jayashree Naidu says:

      థాంక్స్ అ లాట్ సత్యనారాయణ గారు…
      కవితలు రాయడం లేదని మీరు స్పన్దించినపుడు.. ఇలా ఎదురు చూసే వాళ్ళుండటమూ ఓ అదృష్టం అనిపించింది
      కవితలోని అక్షరాలను ఇంతగా మనసుకు తీసుకునే ఆప్తులుండటమూ అదృష్టమే…

  5. సంధిస్తున్న ప్రశ్నలు సాగర తీరపు గులక రాళ్ళే..

    గెంతుల కేరింతల పలవరింతలెన్నున్నా అవి పిల్ల కాలువల చిలిపి చేష్టలే..

    తేలిక పడేలోగా మరింత ప్రేమలోతుల్లోకి ఒదిగించుకుంటూ..
    మాటల్లో నిండుకోని భావాలని వాక్యాలుగా

    అనునిత్యం నూతనంగా మళ్ళీ మళ్ళీ వాక్యమై బంది అయ్యేందుకు ఉవ్విల్లురుతూనే ఉంటుంది మనసు.

    • Jayashree Naidu says:

      మనసు మాయే అదీ…
      రాక వెంట వచ్చే కొన్ని నవ్వులూ
      వెళుతూ మిగిలిపోయే జ్ఞాపకాలు — కొంత సుగంధం ఇలా వాక్యాలుగా మళ్ళీ మళ్ళీ బంధించు కోవడం — ఆ క్షణాల ప్రేమకు సార్థకత కదా.. రఘూ.. :)

  6. బాలసుధాకర్ మౌళి says:

    గుండెని తట్టే కవిత.. ఆలోచనలకు పురిగొలుపుతుంది.

    • Jayashree Naidu says:

      కవితపై మీ స్పందనకు కృతజ్ఞతలు బాల సుధాకర్ మౌళి గారు..

  7. paresh n doshi says:

    నువ్వు వచ్చావు వెళ్ళలేదు ; బాగుంది .
    కొందరంటే వచ్చి తమను కొంత అలా వదిలి వెళ్తుంటారు .

  8. Jayashree Naidu says:

    పరేష్ గారు…
    చాలా ఆలాస్యంగా గా మీ కామెంట్ చూసాను. థాంక్ యూ సో మచ్

    నిజమే కొందరంతే
    వాళ్ళూ వెళ్ళిపోయినా మనదగ్గరే వుంటారు

  9. ముగింపే కాదు. మొత్తం బావుంది. :)

  10. Jayashree Naidu says:

    :) థాంక్యూ అపర్ణ

Leave a Reply to Jayashree Naidu Cancel reply

*