ఎల్లా కురిపించిన నిప్పుల వాన!

 –నిశీధి

నిప్పులు కురిపించాల్సిన కవులు నియమాలు నిబంధనల ప్రవాహంలో  ప్రాణం లేని కట్టెలుగా కొట్టుకుపోతూ కొత్త ఒరవడిని కాదనే కవి గుంపులుగా మారిపోతూ కావు మంటున్న కవికులకాకుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ సారి ఏ కవి /కవయిత్రి ని పరిచయం చేయాలో ఏ కవిత గురించి మనం తెలుసుకోవాలో క్లిక్ అయింది!
సోఫెస్టికేషన్ తక్కువయింది అని చెప్పి   “నవ్వినపుడు  ప్రపంచం నీతో కలిసి నవ్వుతుంది కాని ఏడుపు  ఎప్పుడు వంటరే  అన్న జీవిత సత్యాన్ని Laugh, and the world laughs with you;  Weep, and you weep alone “అంటూ అతి చిన్న పదాల్లో మనకి అందించిన “Solitude – ఒంటరితనం” ని తన మొదటి ప్రముఖ కవిత పేరుగానే కాకుండా తనకి మారు పేరు గా మార్చుకున్న అద్బుత కవయిత్రి  Ella Wheeler Wilcox (November 5, 1850 – October 30, 1919)  మాటలని  The Stuffed Owl: An Anthology of Bad Verse and Very Bad Poetry లో జమకట్టి న కవి ప్రపంచాన్ని  మనం క్షమించగలిగినా  అక్షరాల భిక్ష తో పేరో,  డబ్బో లేదా రెండునో గడిస్తూ కూడా కవులు  అంటేనే ద్వేషాసూయలతో పాడు బడ్డ మట్టి కోటలు అని నిరూపించుకున్న సాటి కవులని వాళ్ళ కలాలు క్షమించగలవా ?
ella1
ప్రేమించడం ప్రేమించబడడం ఒకే సారి కావాలి అనే ఆశ  సూర్యరశ్మి రెండు వైపులా ఒకేసారి కమ్ముకోవాలి అనేంత దురాశ అని ఒకపక్క విఫల ప్రేమల వంటరితనాల గురించి చెప్తూనే భూమి మీద బిట్టర్నేస్ పెరిగిపోయింది ప్రేమోక్కటే దాన్ని తగ్గించేది , వీలయినంత ప్రేమించండి అంటూ చెప్పిన ప్రేమమయి కూడా తానే . జీవితం ఒక పాటలా సాగినప్పుడు ఆనందంగా ప్లెజెంట్ గా ఉండటం ఉండటం గొప్పేమీ కాదు , వెనక్కి మరలే మార్గం లేక అఘాతాల ముందు నిలబడ్డపుడు నీ చిరునవ్వు నిన్ను వీడకపోతేనే నువ్వో మనిషివి అని జీవితం ఎలా ఉండాలో  ఒక్క ముక్కలో నిర్వచించేసిన నిరాబండరత్వమూ తనదే .
అంతేకాదు మాట్లాడాల్సిన సమయంలో ప్రొటెస్ట్ చేయాల్సిన కాలాల్లో మౌనంగా ఉండటం అతి పెద్ద పాపం అంటూ  మనిషిలోంచి మొదటి పిరికివాడు పుట్టిన బలహీన క్షణం అదే అని  మౌన మేధావుల నిశబ్దాన్ని   నిలదీసిన నిక్కచ్చితనము ఆమెదే . ఈ రోజు , ఇన్నేళ్ళ  తర్వాత కూడా దాదాపు ఆమె ప్రతి కవితలో ప్రతి వాక్యం ఒక quotable quote గానే చెప్పుకోవచ్చు మనం-
ella3
నిజానికి అసలు చదువుకోవాలే కాని మూగజీవాల భాష నుండి మౌనమే తన భాషగా మాట్లాడే మనసు వరకు ఎల్లా సృజించని అంశం ఏమన్నా ఉందా అనిపిస్తుంది. అయితే ఎప్పటిలానే మనకున్న లిమిటేషన్స్ కి లోబడి అమాంతంగా అన్ని కవితలు ఒకోసారి చదువుకోలేక పోయినా ఎల్లాని కవయిత్రిగా నిలబెట్టిన solitudeలో పంక్తులు మాత్రం చదువుకొని పండగలకి పరమాన్నాలు తినడానికి ముందుకొచ్చి ఉపవాసాల పేదరికాల్లో మొహం చాటేసే మనల్ని వదిలేసే మనుష్యుల అమానుష్యం  గురించి మాత్రం చదువుకోవాల్సిందే .
ella4
Solitude
BY ELLA WHEELER WILCOX
 
 
Laugh, and the world laughs with you;
    Weep, and you weep alone;
For the sad old earth must borrow its mirth,
    But has trouble enough of its own.
Sing, and the hills will answer;
    Sigh, it is lost on the air;
The echoes bound to a joyful sound,
    But shrink from voicing care.
Rejoice, and men will seek you;
    Grieve, and they turn and go;
They want full measure of all your pleasure,
    But they do not need your woe.
Be glad, and your friends are many;
    Be sad, and you lose them all,—
There are none to decline your nectared wine,
    But alone you must drink life’s gall.
Feast, and your halls are crowded;
    Fast, and the world goes by.
Succeed and give, and it helps you live,
    But no man can help you die.
There is room in the halls of pleasure
    For a large and lordly train,
But one by one we must all file on
    Through the narrow aisles of pain.
మరోసారి మనకింకా తెలియని మరో స్వరాన్ని పరిచయం చేయటానికి ఇపుడు వీడ్కోలు తీసుకుంటూ

*

మీ మాటలు

 1. తిలక్ బొమ్మరాజు says:

  ఒకానొక తత్వమేదో మీ కవిత్వంలో నాకు కనిపిస్తుంది నిశీధి గారు,మీరు పరిచయం చేసే కవులూ మరియు కవయిత్రులు కూడా అలాగే అనిపిస్తారు.తెలియని గొప్ప కవిత్వాన్ని పరిచయం చేస్తున్నారు మాకు.
  ఈ వాక్యాలు మొత్తం జీవితాన్ని కట్టిపడేసేలా రాసారు ఈ కవయిత్రి…
  Laugh, and the world laughs with you;
  Weep, and you weep అలొనె
  నిజంగా ఎంతటి నిగూడత దాగిన కవిత్వాన్ని పరిచయం చేసారో.మనిషెప్పుడూ నిత్య అన్వేషి .ఇక్కడ మీరు రాస్తున్న వ్యాసాల్లో ఇటువంటి అక్షరాల అన్వేషణ కాస్త అయిన నెరవేరుతోంది.అభినందనలు నిశీధి గారు.

 2. Sharada Sivapurapu says:

  జీవితం ఒక పాటలా సాగినప్పుడు ఆనందంగా ప్లెజెంట్ గా ఉండటం ఉండటం గొప్పేమీ కాదు , వెనక్కి మరలే మార్గం లేక అఘాతాల ముందు నిలబడ్డపుడు నీ చిరునవ్వు నిన్ను వీడకపోతేనే నువ్వో మనిషివి అని జీవితం ఎలా ఉండాలో ఒక్క ముక్కలో నిర్వచించేసిన నిరాబండరత్వమూ తనదే .
  చాలా చక్కటి పరిచయం నిశీజీ బాగుంది

 3. మంగు శివ రామ ప్రసాద్ says:

  ‘నవ్వినపుడు ప్రపంచం నీతో కలిసి నవ్వుతుంది కాని ఏడుపు ఎప్పుడు వంటరే’ అన్న జీవిత సత్యాన్నిఅనేక కోణాలలో ఎక్కడా అన్వయ క్లిష్టత లేకుండా హృదయానికి హత్తుకునేట్టుగా ఆవిష్కరించారు కవయిత్రి ఎల్లా వీలర్. జీవతానుభవసారాన్నంతా కాచి వడబోసిన కవిత. ఎందరో దేవుళ్ళు, ఎన్నో తెగలు, ఎన్నో దారులు ఎడతెగని దారపుపోగుల్లా, కాని ఈ విషాద ప్రపంచానికి కావలసింది మాత్రం కేవలం దయా బిక్షే ఒక్కటే అనే భావన ఆమె హృదయ స్పందనగా ఈ కవితలో ప్రతిధ్వనిస్తుంది.

 4. narayana sharma says:

  మీ వచనాన్నినేను చదవలేదు గతంలో. ఇప్పుడు సంతృప్తిగా ఉంది.
  నాకూ ఈ ఒంటరితనమంటేచాలా ఇష్టం.అందుకేనేమో ఈ రెండు కవితలూ నాకు బాగా నచ్చాయి.మొదటిదైతేమరీ..రాస్తు ఉండండి.మేం చదవాడానికి ఎదురు చూస్తుంటాం..

 5. వాసుదేవ్ says:

  మీ కవిత్వమెప్పుడు నాకొక అద్భుతమే…మీ వచనం కూడా కొత్త కాకపోయినా మీ ప్రతీ వ్యాసమూ కొత్త అనుభూతే. ఇదిగో ఇలా
  “The echoes bound to a joyful sound,
  But shrink from voicing care.” మీ వాక్యాలెలాగూ బావుంటాయి కానీ నాకు తెల్సిన ఈ పద్యం లో నాకు తెలీని O గొప్ప వాక్యాన్ని మళ్లి ఇలా చదివించి నందుకు ధన్యవాదాలండీ

 6. ఆర్.దమయంతి. says:

  చాలా బాగుందండి.
  ఒంటరితనం లోని తీపి విషాదం లా ఒక పట్టాన మాటకందని అనుభూతిలా..వుంది.
  అభినందనలు.

 7. aandhrudu says:

  నిప్పులు కురిపించాల్సిన కవులు నియమాలు నిబంధనల ప్రవాహంలో ప్రాణం లేని కట్టెలుగా కొట్టుకుపోతూ కొత్త ఒరవడిని కాదనే కవి గుంపులుగా మారిపోతూ కావు మంటున్న కవికులకాకుల ………….

 8. ఎప్పట్లానే మీ విశ్లేషణ అద్భుతమైన ఓ కవయిత్రిని మా మనసులో ప్రతిష్టించింది నిశీజి. మనుషులలోని అమానుషత్వాన్ని ప్రశ్నించే మీ కవితల్లానే మీ వ్యాసం కూడా. అభినందనలతో మరో పరిచయం కోసం ఎదురుచూపు..

 9. Vanaja Tatineni says:

  ప్రేమ కోసం ఆరాటపడే ఓ… అలుపెరుగని ప్రేమిక గురించి పరిచయం ఆకట్టుకుంది నిశీధి గారు నాకు ఆంగ్లం అంత బాగా రాదు . చదివి అర్ధం చేసుకోగలను . మన కవి మిత్రులలో కొంత మంది పరిచయం చేసిన కవి/కవయిత్రి ల గురించి ఆసక్తిగా తెలుసుకుంటాను.

  ఎల్లా గురించిన పరిచయం బావుంది మనసుని తాకింది . ముఖ్యంగా ” “నవ్వినపుడు ప్రపంచం నీతో కలిసి నవ్వుతుంది కాని ఏడుపు ఎప్పుడు వంటరే !” అన్న జీవిత సత్యాన్ని చెప్పినండుకేమో ! ఇక నుండి మీ పరిచయాలని అనుసరించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తాను . ధన్యవాదములు.

 10. ప్రసాదమూర్తి says:

  సాహితీప్రియులు మీకు చాలా రుణపడిపోతారు. అద్భుతమైన పరిచయాలు. చాలా ఆనందంగా వుంది చదువుతూ వుంటే

మీ మాటలు

*