ఊర్మిళ కల

బతుకు పలక పై తుడపలేని కొన్ని పిచ్చి గీతలు

వెలుతుర్లో వికృత రూపాల్లా వెక్కిరి స్తుంటాయి

లైట్లార్పి నిద్రపోవాలని కళ్ళు మూసుకున్నాకా

టార్చి ఒకటి లోపల  వెలుగుతుంది.

 

నడిచివచ్చిన దారమ్మటే వెనక్కి రమ్మంటుంది

ఇక మొదలవుతుంది ఒక వెదుకులాట

మసక మసకగా కనిపించీ కనిపించని

మనుషులకి రూపం పోసుకుంటూ, జీవం ఇచ్చుకుంటూ….

 

అనుకోకుండానే అమ్మలాంటి రూపం ఒకటి కనిపి స్తుంది

అలసిపోయినట్లున్నావు కాస్సేపు పడుకో,

అంటూ తన ఒడి చూపిస్తుంది

కిటికీ లోంచి చల్లని గాలి ఆనందంగా తలాడిస్తుంది

 

ఎప్పుడనగా తిందో ఎంటో….

మొహం చూడు తోటకూరకాడలా వాడుంది

ఏ మైనా పెట్టు! !!  ఆర్ద్రంగా నాన్న గొంతు పలుకుతుంది

అబ్బ ఇంత చక్కని ఆకలి వేసి ఎన్నాళ్ళయిందో!

 

ఎందుకు బెంగ మేమంతా లేమూ?

అంటారు అన్ననీ అక్కనీ పోలిన వారెవరో,

గుండె నిండా ఊపిరి నిండుతుంది చాలా రోజుల తర్వాత.

 

నవ్వుతూ చూ స్తారో తమ్ముడూ, ఒక చెల్లీ

ఇంకొక సారి జాలీగా జారుడుబండ మీంచి జారతాను

వీధి తలుపు ఓరగా వేసినా నిద్ర పోతానేమోనని తెరిచే కూర్చున్నా

చెయ్యి పట్టుకుని తీస్కెళుతుంది స్నేహితురాలు

చెట్ల ఆకులు ఒకటికొకటి రాసుకున్న గల గల శబ్దం

గోడమీద దేవుడి బొమ్మలో కళ్ళనిండా కరుణే

xxx

 

 

అబ్బబ్బ, ఇంత లేటుగా లే స్తే

వంటెపుడు చే స్తావు, ఆఫీసు కెప్పుడెళ్ళాలి?

తెరిచిఉన్న కిటికీ లోంచి వెచ్చని కిరణం ఒకటి కళ్ళల్లో గుచ్చుకుంటుంది

హడావిడిగా లేచి అద్దంలో మొహం చూసుకుంటే..

కళ్ళచుట్టూ ముడతలు, నల్లటి వలయాలు

అసలు నిద్ర పోయినట్లే లేదే, ఇన్నేళ్ళుగా కల కంటున్నానా?????

 

-శారద శివపురపు

sarada shivapurapu

 

 

 

మీ మాటలు

  1. గోడమీద దేవుడి బొమ్మలో కళ్ళనిండా కరుణే

  2. sreedhar parupalli says:

    చదివించారు శారద శివవరపు గారు. అబ్బ ఇంత చక్కని ఆకలి వేసి ఎన్నాళ్ళయిందో! వ్యక్తీకరణ అంటారో అభివ్యక్తి అంటారో..ఉర్మిళ నిద్ర కవిత నచ్చింది. నిద్ర చెదిరాకనే కదా కలలు తెలిసేది?

  3. sreedhar parupalli says:

    క్షమించాలి. శివపురపు అని రాశాను.

  4. Sharada Sivapurapu says:

    ధన్యవాదాలు సద్లాపల్లి చిదంబర రెడ్డి గరూ, శ్రీధర్ పారుపాల్లి గారు.

  5. ఎంత బాగా రాసారో. అలాంటి కల కూడా అందనంత లోతుల్లో ఉన్నాము.

  6. నిశీధి says:

    Life truth woven carefully . kudos madam

  7. Sharada Sivapurapu says:

    ధన్యవాదాలు రమాసుందరి గారు, నిశీధి గారు

  8. Ento jagrattaga gisina varna chitram la undandi mi kavita. Enta mandi ila kalagani untaru kadaa. Enta teligga sunnitamga simplega kavitwikarincharo. Hatsoff.

  9. NS Murty says:

    శారద గారూ,

    చాలా చక్కని కవిత. తక్కువ మాటలలో “కల”లోని కాంక్ష, నిజజీవితంలో కలగా మిగిలిపోవడాన్ని బాగా చూపించారు. అభినందనలు.

  10. Sharada Sivapurapu says:

    ధన్యవాదాలు ప్రసూన రవీంద్రన్ గారు, ఎన్ ఎస్ మూర్తి గారు.

Leave a Reply to Sharada Sivapurapu Cancel reply

*