శాంతం

 

నవరసాల

ఒడిదుడుకుల రంగుల రాట్నం

చివ్వరికొచ్చేసాం ఇక-

ఒక ప్రశాంతమైన చివరకి- శాంతంగా!

ఏ ఉద్వేగాలూ లేని ఒక శూన్య స్థితిలోకి-

నిజానికి,

శాంతం అంటే

మిగిలిన అన్ని భావాల నించీ విముక్తి కాదు,

అన్ని రసాల భావోద్వేగాలనీ పునః ప్రతిష్ట చేసేది శాంతం.

ఇక్కడి తెలతెల్లని వలయం శూన్యం-

స్థిత ప్రజ్ఞత సాధించిన సమభావం.

నలుపులోంచి తెలుపులోకి అంతర్యానం

శాంతి రాహిత్యం నించి శాంతిలోకి కూడా ప్రయాణమే.

ఇక్కడి తెలుపు కేవలం ఒక చిన్ని బిందువే కావచ్చు

ఆ చిన్ని బిందువే కొత్త ఆరంభాలన్నిటినీ మేల్కొలిపే శక్తి.

అప్పుడు మళ్ళీ జీవన వలయంలోకి మనం-

Mamata Vegunta

మీ మాటలు

 1. ఈ నవరసాల యాత్ర శాంతంతో ముగిస్తుంది. ఈ 9 వారాలు నాతో ప్రయాణం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. నాకు ప్రతీ గురువారం ఒక ఎదురు చూపే, ఈ 9 వారాలు. మీ అభినందనలు, విశ్లేషణ, కామెంట్స్ నాకు చాల చాల ఇన్స్పిరేషన్.

  Dr Afsar కి న ధన్యవాదాలు. ఆర్టిస్ట్ నోట్స్ రాయమని వారే సజెస్ట్ చేసారు. In retrospect, that was a wise editorial decision for providing a context to be understood. ఈ నోట్స్ ని తెలుగులోకి అనువదించినందుకు, శిల్పాలలా చెక్కినందుకు కుడా వారికి నా ధన్యవాదాలు. With his pen, the texts became stronger, layered, and poetic.

  Emotions are all around us. Color fills our life. Yet we all see colors differently and experience these emotions differently. This was my attempt to define emotional cognition through art. I am glad that this series resonated with you.

  Though this is the end of the Mohanam series, it strangely feels like a beginning for me. మళ్లీ కలుద్దాం …

  మమత

  • Naveena Krishna Bandaru says:

   ఈ ఉరుకులపరుగుల గజిబిజి జీవిత పయనంలో
   అరిషడ్వర్గాల ప్రలోభంతో క్షిణ్స్తూ సాగుతున్న నేటి జీవన శైలి
   నిరాశ నిస్ప్రుహ ఈర్ష్యాద్వేషాల నడుమ నలిగి పోతున్న తరుణంలో
   ఎటు చూసినా అశాంతిమయం తో గాడాoధకారము తో నిండివున్నప్పుడు
   ఆశావహ దృక్పథం తో నిష్కల్మష మనస్చేదనలో ఆవృత్తమైన శ్వేత వర్ణం శాంతి కి ప్రతీకగా…
   నూతన్నో.త్త్జాన్ని నింపుతూ నిశ్చల స్థితికి పయనింపజేస్తున్నట్టుగా నేను అభివర్ణిస్తాను…

 2. ‘మోహనం సిరీస్’ ద్వారా ఆర్టిస్ట్ నోట్స్ చదవడం ఒక గొప్ప అనుభవం. ఒక పెయింటింగ్ లో ఆర్టిస్ట్ ఉపయోగించిన రంగులు ఏమి చెప్పాలనుకుంటున్నాయి ? ఏ ఏ రంగులు ఎలాంటి భావాలను చెప్తాయి? ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఏ రంగుని ఆర్టిస్ట్ ఎన్నుకోవచ్చు ? ఇలాంటి ఎన్నో విషయాలు సూక్ష్మంగా , బలమైన కవిత్వంతో తెలుసుకున్నాం ( పసివారితో పాఠాలుగా పంచుకున్నాం ) వీలైనంత త్వరగా మరో ‘ఇంద్ర ధనస్సు’తో మిమ్మల్ని ‘సారంగ’ లో కలవాలని ఆశిస్తూ Thank u Mam

 3. kandukuri ramesh babu says:

  నలుపుతో ఇంత శాంతి పంచడం నిజంగా శాంతి నిచ్చింది.
  వొక వర్ణంతోనే సుకమూ- శాంతి, మనోహరంగా చిత్రంచారు. బాగుందండి.

 4. Vani Devulapally says:

  Oka Chinni Thella Binduvu Valayaaluga maarina Sindhuvai Nalupu Telupula Jeevitha Dhagudu Moothatalo
  Shaanthi Raahithyam lonchi Shaanthi lokee nadipe Saahasaannisthundi !
  Nishshabda Yudhdha Meghaalni Cheelchukuni Chala Challagaa Varshinche oka Vaana Chinukai
  Prashaanthathani kuripisthundi!
  O koththa Aananda Aarambhaanikee
  Naandi Palukuthundi!

మీ మాటలు

*