2002 ఆగస్టు 15.
సికింద్రాబాద్ స్టేషన్లో శబరి ఎక్స్‌ప్రెస్‌లోంచి దిగి ఆటో ఎక్కేలోగా తడిసి ముద్దయ్యాడు శేఖర్. ఇంటికి వొచ్చేసరికి అరగంట. ఆటో దిగాడు. గజగజా వొణికిపోతున్నాడు. ఆతడి కోసమే ఎదురుచూస్తో కమలిని. ఆ వాన నీళ్ల సవ్వడిలోనూ ఆటో ఆగిన చప్పుడు ఆమె చెవులకు. ఇంట్లోంచి ఒక్క పరుగున బయటకు వొచ్చింది. ఆటోవాలాకు డబ్బులిచ్చి, గేటు తీస్తున్నాడు శేఖర్. తల గిర్రున తిరిగింది. కాళ్లు సత్తువ కోల్పోయాయి.
అతని స్థితి చూసి, ప్రమాదం శంకించి, ఒక్క ఉదుటున అతడి వొద్దకు వొచ్చింది. ఆమె పట్టుకోబోయినట్లయితే కింద పడిపోయేవాడే. అతడి తడి ఒళ్లు కొలిమిలో పెట్టిన కర్రులా సలసలా కాలిపోతోంది. అతడి చేతిని తన భుజం మీద వేసుకొని, నెమ్మదిగా నడిపించుకుంటూ ఇంట్లోకి – కమలిని.
శేఖర్ నిల్చోలేకపోతున్నాడు. తనను కమలిని పట్టుకోవడం, ఇంట్లోకి తీసుకురావడం తెలుస్తూనే ఉంది. ఆమెకు దూరంగా జరగాలని మనసు కోరుకుంటుంటే, శక్తి చాలడం లేదు దేహానికి. ‘శ్రీనాథ్‌గాడి కింద నలిగిన ఆమె దేహానికి తన దేహం రాచుకోవడమా?’. తల నరాలు చిట్లినంత నొప్పి. తెలివితప్పిపోయాడు.
ఇంటరెస్టింగ్ స్టొరీ!
కృతజ్ఞతలు కేశవరావు గారూ…
కథ కథనం బాగుంది. ఇంత సాగదీయక్కర్లేదు అనిపించింది. కేరళ గుర్నిచి రాసారు, ఒక ఇన్ఫర్మేషన్ గ వుంది.
డైరీ ల periods mention chesaru, నిజానికి అంతల ఆమె parayi వ్యక్తి తో ఊరంతా తిరిగేసినట్లు, కొచెం అతిగా లేదు..ఎంత కథ ఇఎన ఇంతల బర్తేగిస్తేనేగని రెఅలిసతిఒన్ ఆమెలో రాలేదా..రాకుండా రాసార ఎనిపించింది, అధివస్తావంగా ఉంది. వాళ్ళిద్దరి మద్యలో ఒక అవాంతరం కి , ఆమెలో వుండే కోరికలు ఎఇల తీర్చటము అనేది anythikamu , నిజానికి ఆమెకు తెలుసు అందుకే ఆమె తన శరీరాన్ని వేరేవ్య్క్తికి పరచలేదు. రచయిత ఆమెను అమానుషంగా చిత్రీకరించాడు, వేరేల చిత్రీకరిస్తే బాగుండును. అంతల ప్రేమించిన వ్యక్తి కి ఇలా ద్రోహం…చేయటం నేరం అని గ్రహించటం లో కథకుడు కథ ని పండించాడు. గద్దరుగారు,Goreti Venkannagarlaku Eppatiki dhanyavadalu..mahamaneeshulu..goppollu..mahaneeyulu.
మీ అమూల్యమైన స్పందనను తెలియజేసినందుకు ధన్యవాదాలు భరద్వాజ గారూ. కథలో శేఖర్ అంటే కమలినికి వల్లమాలిన ప్రేమ ఉందనటంలో సందేహం అవసరం లేదు. హైదరాబాద్‌కు ఆమె ఎన్నో ఊహలతో వొచ్చింది. కానీ మార్కెట్ మాయలో పడిపోయింది. అది ఒక మనిషిలోని బలహీనత. ఆ బలహీనతకు ఎంతమంది ఇవాళ గురవుతున్నారో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనిలేదు, కుప్పలు తెప్పలుగా వెలిసిన, వెలుస్తోన్న భారీ షోరూంలే చెబుతున్నాయి. ఆ మాయపొర కప్పేయడంవల్లే కమలిని దారితప్పింది. అయితే సరైన సమయంలోనే ఆ మాయపొర తొలగి ఆమె కళ్లు తెరిచింది. అందుకే తిరిగి శేఖర్‌కు దగ్గర కాగలిగింది. ఏదో ఒక సమయంలో మనిషిలో రియలైజేషన్ వొస్తుంది. అంతా కోల్పోయాక వొచ్చే రియలైజేషన్ వల్ల ఉపయోగం తక్కువ. తానేం కోల్పోతున్నదో, ఆ కోల్పోతున్నప్పుడే వచ్చే రియలైజేషన్ వల్ల కోల్పోతున్నదానిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో కమలిని దాన్ని తిరిగి పొందగలిగింది. ఆ పరంగా చూస్తే కమలిని పాత్రను అమానుషంగా చిత్రించింది ఎక్కడ? మార్కెట్ మాయలో స్త్రీ పురుషులిద్దరూ పడుతుంటారు. ఒక స్త్రీ ఆ మాయలో పడితే ఆమె జీవితం ఎలా ఉంటుందో ఈ కథలో చిత్రీకరించాను. ఇది వాస్తవ జీవితాల నుంచి నేను కల్పించిన కథ.
కొంచెం సాగ దీసినట్టు ఉన్నా చాలా బాగుంది..
కథ , కథనం చాల బావుంది, శైలి మీద వర్క్ చేస్తే మంచి రచయిత అవుతారు. మంచి కథ కి థాంక్స్.