పేనిన పావురం

OLYMPUS DIGITAL CAMERA

ఫోటో: కొట్ర ధనుర్ధర్ (పదేళ్ళు)

నన్ను నేను దూరంగా విసిరేస్తున్న క్షణం

నా నుండి విడిపోయి ఎక్కడో పడతాను ఎవ్వరికీ కనబడకుండా

నాలుగు రాళ్ల మధ్య ముఖం తొలుచుకుంటూ  అద్దం మీద జారే చెమట చినుకునవుతాను


నువ్విలారా అంటూ ఎవరో పిలుస్తారు కొంతకాలానికి

నిర్లిప్తతను  రువ్వుతున్న తాయిత్తు ఉన్నపళాన అడ్డుపడుతుంది

తటాలున కళ్ళలో కొన్ని సమాధులు పుడతాయి

వాటిని  కడుగుతూ కాలం  గడిపే పనిలో ఇంకొన్నాళ్ళు


ఒత్తుకుపోయిన ఈతముళ్ళు పాడుబడిన సముద్రంలో కట్టుకున్న కాంక్రీట్  పాలస్

కెరటాల గోడల నడుమ నీ శరీరాన్ని తాకుతున్న పరాన్న బ్యాక్టీరియాలు

మళ్లీ  మళ్లీ నిన్ను గుర్తుచేస్తూ పాడుబడిన జ్ఞాపకాలు ఓ పక్కన 


క్షణానికో జననం చూసుకుంటూ మరుక్షణమే మరణానికి చుట్టమయ్యే 

రేగిపూల  ఆత్మలు నీళ్ళలో కాలుతూ బూడిదయ్యే  నేను 

కొత్త గీతలకు  చుక్కలద్దుతూ ఉదయం 


పచ్చని పావురాలు  కక్కుతున్న నీలపు రక్తం పూసుకున్న ఆకాశం 

మరోసారి కిందకు దూకుతూ మిగిలిన స్థాణువులు  మిణుగురులై 

ఈదుతున్న నేల  పెల్లుబీకుతున్న కాగితపు ఆలోచనలు 


ఇప్పుడిక ఏరుకోవాలి  నన్ను నేను అన్ని మూలల్లో మూలాలుగా

-తిలక్ బొమ్మరాజు

15-tilak

మీ మాటలు

 1. నిశీధి says:

  క్షణానికో జననం చూసుకుంటూ మరుక్షణమే మరణానికి చుట్టమయ్యే నేను …..మీరెప్పుడు అక్షరాలని పోగేసినా ఎదో దుఖం

  • తిలక్ బొమ్మరాజు says:

   థాంక్యూ నిశీధి గారు మీకు నచ్చినందుకు .

 2. sreedhar parupalli says:

  క్షణానికో జననం చూసుకుంటూ మరుక్షణమే మరణానికి చుట్టమయ్యే
  రేగిపూల ఆత్మలు ………………………….బాగా రాశారు తిలక్.

  • తిలక్ బొమ్మరాజు says:

   ధన్యవాదములు శ్రీధర్ గారు.

 3. koratamaddi vani says:

  క్షణానికో జననం చూసుకుంటూ మరుక్షణమే మరణానికి చుట్టమయ్యే
  రేగిపూల ఆత్మలు నీళ్ళలో కాలుతూ బూడిదయ్యే నేను ……కవిత చాలా బావుంది తిలక్ గారు

మీ మాటలు

*