అద్భుతం!

Adbhutam

ఈ విశ్వమంతా ఒక అంతిమ అద్భుతం.
అసలు మనమంటూ ఎలా వచ్చాం ఇక్కడికి?
మనం మాత్రమే వున్నామా ఇక్కడ?

ఈ ఆకాశం అంతిమ ఆర్ట్ గ్యాలరీ.
నక్షత్ర సమూహాలన్నిటినీ చూస్తున్నామా లేదా?!
ఒక్కో నక్షత్ర సమూహం ఒక కళా ఖండం!

ఈ ఆకాశమే అంతిమ పెయింటింగ్.
ఇది కాన్వాస్ లో వొదగని అనంతం.
నలుపు కన్నా గాఢం.
ఏ రంగులోనూ ఇమడని రహస్యం.

అవును, ఈ అనంతమైన విశ్వంతో నా సంతోషాల యాత్రని చిత్రిస్తాను నేను:
అనేక సార్లు, ఆ నక్షత్రాల నగల పెట్టిలోంచి
కొన్ని వజ్రపు తునకల్ని ఏరుకొస్తాను,
నావైన నక్షత్ర సమూహాల్నీ రచిస్తూ వుంటాను.

నాకేమాత్రం తెలియని
అపరిచిత లోకాల అన్వేషణలో
నక్షత్ర కెరటాల మీద దూసుకు వెళ్తాను.

ఆహా! నా అద్భుతాల ఆకాశం!

Mamata Vegunta

Mamata Vegunta

మీ మాటలు

 1. Rammohanrao says:

  నూతనంగా ఉంది

 2. Naveena Krishna Bandaru says:

  సకల కళల సమ్మోహనం ఈ విశ్వం,
  అనంత సృష్టి లో నిక్షిప్తమ్య్ ఉన్న ప్రకృతి నిగూడ రహస్యలకు నిలువు ధర్పణం…

  మానవ మనుగడను నిరంతరం ప్రశ్నిస్తూ నిత్య నవీన శకాలను అవిష్కరిస్తూ,
  విశ్వ జగతి వినూత్న విన్యాసాలకు తార్కాణం…

  తారా కూటమి తళుకుబెళుకుల తో మోహరించిన ఈ అనంత వలయ ఆహ్లాదబరిత చిత్ర లేఖనం,
  అద్భుతాలకు అందని అనిర్వచనీయ అమోఘ ముగ్ద మనోహరం…

  • Vijay Jonnalagadda says:

   ఇది మది లో ఆలోచనలును రేకేతించే నిగూడ భావం నిండిన కవిత, నీ సునిశితమయిన ఆలోచనలను సృష్టి లోని రహస్యలను అద్భుతమైన పదాజాలం తో ఒక తాటితో బందించావు మిత్రమా !!!

   దేశభాషలందు తెలుగు లెస్స అన్న పదాలన్ని మరోసారి స్మరించుకున్నా!!!

 3. నిజంగా మా కవిత ఆకాశమంత అద్భుతంగా వుంది.సింప్ల్య్ superb

 4. ఈ చిత్రం నిశ్శబ్దంగా, నిగూఢంగా, దాని పేరులాగే అద్భుతంగా ఉంది .

 5. mercy suresh jajjara says:

  చాల బాగుంది అనంతంగా

 6. AMAZING Series!!

  భావాల్ని రంగుల్లో…. అవే రంగుల్ని అక్షరాల్లో!! మొదటిసారి ఇంత అద్భుతంగా మీరే నాకు పరిచయం చేశారు!
  థాంక్యూ సో మచ్!

 7. మణి వడ్లమాని says:

  చాలా అద్భుతంగ ఉంది కవిత మమతా! మాటలు పేలవంగా ఉంటాయేమో అనిపిస్తోంది

 8. Jayashree Naidu says:

  బ్యూటిఫుల్ వన్ మమత గారు…

 9. chandolu chandra sekhar says:

  నవరసాల భావ లను రంగులలో వొదిగి మనొఆకసము లో చిత్ర సంగిత స మ్మే ళన తో రసరమ్య లోకం లో విహరింప జేసారు

మీ మాటలు

*