చేరతాను, కానీ..

Ghar-wapsi

అయ్యలారా!

మరీ సిగ్గులేకుండా అడుగుతున్నారు కదా

సరే, మీ కోరిక ప్రకారం మీ మతంలో చేరతా,

మీరు చేయమన్నవన్నీ చేస్తా..

కానీ, ముందు కొన్ని విషయాలు తేలాలి

కొన్ని గట్టి హామీలు కావాలి..!

ఇప్పటికే ఏన్నో దగాలు పడినవాడిని కదా,

ఇప్పటికే ఎన్నో చేతుల్లోపడి అసలు రూపు కోల్పోయినవాడిని కదా,

అందుకే ముందు జాగ్రత్త..!

ముక్కోటి దేవతల భక్తులారా!

ఇంతవరకు ఒక్క దేవుణ్నే కొలిచిన వాడిని కదా,

మీ మతంలో చేరాక, ఏ దేవుణ్ని కొలవాలి?

పంగనామాలు పెట్టుకోవాలా, పట్టెనామాలు పెట్టుకోవాలా?

మనుధర్మ మార్గీయులారా!

కులం లేని వాడిని కదా,

మీ మతంలో చేరితే ఏ కులంలో చేర్చుకుంటారు?

బ్రాహ్మణులు గొప్పవాళ్లంట కదా, వాళ్లలో చేర్చుకుంటారా?

మీ దేవతల గుళ్లలోకి కాదు, గర్భగుళ్లలోకి రానిస్తారా?

ఆ దేవతలకు నా చేతులతో స్నానాలు, పూజలు చేయనిస్తారా?

మంత్రాలదేముండిలెండి..

చిలకలు పలకడం లేదా, తంటాలుపడి నేర్చుకుంటాను

కులగోత్రాల పరాయణులారా!

ఇంతవరకు వాటి సొంటులేని వాడిని కదా,

మీ మతంలో చేరితే ఏ కులం వాళ్లను పెళ్లాడాలి?

నాకు పుట్టబోయే పిల్లలు ఎవరిని పెళ్లాడాలి?

గోవధ వ్యతిరేకురాలా!

గొడ్డుమాంసం తినేవాడిని కదా,

మీ మతంలో చేరాక ఏ మాంసం తినాలి?

గొడ్డుమాంసం మానుకుంటే పొట్లి మాంసం తినడానికి డబ్బులిస్తారా?

అసలు మాంసమే తినొద్దని అంటారా?

ఆ మాట మాత్రం అనకండి,

తరతరాలుగా ముక్కరుచి మరిగిన వాడిని కదా!

సంతాన సంఖ్యా నిర్దేశకులరా!

పిల్లలను కనడంపై ఆంక్షలెరగని వాడిని కదా,

మీ మతంలో చేరాక ఎంతమంది పిల్లలను కనమంటారు?

మీకు పడని మతం వాళ్ల సంఖ్యను దాటిపోడానికి

మీ మతం వాళ్లను గంపెడు పిల్లలను కనమని అంటున్నారు కదా

ఎక్కువ మందిని కంటే వాళ్లను సాకడానికి డబ్బులిస్తారా?

తక్కువ మందిని కంటే మీ మతంలోంచి తన్ని తగలేస్తారా?

మనిషికంటే మతమే గొప్పదనే మహానుభావులారా!

మనుషుల తర్వాతే మతాన్ని పట్టించుకునేవాడిని కదా,

మీ మతంలో చేరితే మనుషులనెట్లా చూడాలి?

కులాలుగానా, మతాలుగానా?

అంకెలుగానా, కోటాలుగానా?

కోటాగాడిని కదా,

కోటాలో ఉజ్జోగమొస్తే చేరాలా, చేరొద్దా?

చేరొద్దంటే బతికేదెట్లా?

అయ్యలారా!

ఇవన్నీ, ఇలాంటివన్నీ బతుకుపై ప్రశ్నలు..

చావుపై ప్రశ్నలూ ఉన్నాయి

చచ్చాక  పూడ్చడం మా ఆచారం

మీ మతంలో చేరాక

నేను చస్తే నా శవాన్ని ఏం చేస్తారు?

పూడ్చేస్తారా, కాల్చేస్తారా…?

ఆహ్వానితుడు

మీ మాటలు

 1. Aparichitudu says:

  మీరు చెప్పే ఘర్ వపసి ఇష్యూ మీ అభిప్రాయాలతో తో మాకు విభేదాలు లేవు. దానిని అపిమ్చాలి. కానీ ఈ విషయం చెప్పడానికి కవిత్వం అవసరం లేదు. మంచి వ్యాసం కావాలి.

 2. N Venugopal says:

  అపరిచితుడు గారూ,

  బాగుంది. మూడు నెలలుగా ఇంత తక్కువ స్పందన ఉందేమిటని ఆందోళన పడుతున్నాను. నా నిస్సహాయ ఆగ్రహాన్ని వీక్షణం సంపాదకీయంలోనూ, సారంగ మీద ఒక వ్యాసం లోను, ఇంకా అచ్చుకు ఇవ్వని ఒక కవిత లోను ప్రకటించాను. మీ కవిత ఒక ఉపశమనం. కృతజ్ఞతలు. అభినందనలు.

 3. N Venugopal says:

  ఆహ్వానితుడు గారూ,

  కవిత బాగుంది. నిజానికి మీ కవిత నాకొక ఉపశమనం. మూడు నెలలుగా ఈ పరిణామం పట్ల ఇంత తక్కువ స్పందన ఉందేమిటని ఆందోళనతో ఉన్నాను. నా నిస్సహాయ ఆగ్రహాన్ని వీక్షణం సంపాదకీయంలో, సార6గ వ్యాసంలో, ఇంకా అచ్చుకు ఇవ్వని ఒక కవితలో కొంతవరకు వ్యక్తీకరించాను. అందువల్ల కూడ మీ కవిత చాల నచ్చింది. కృతజ్ఞతలు, అభినందనలు…

 4. ఆహ్వానితుడు గారూ,
  కులం లేని వాడినమ్టున్నావ్ ఏ దేశం నాయనా మీదీ. మాదేశమ్ లో కులం లేకుండా మతం లేదు . మతం లేకుండా మనిషి ఉండదు,మానవత్వం ఉండదు. కులంలెకుమ్డా కూడు ఉండదు. మీరడిగిన ప్రశ్నలన్ని మంచివే గానీ ఆ ప్రశ్నలకు మా వూర్లో జవాబులు వుండవు.

  • Thirupalu meeru samaadhaanam kandi meeru dhairyanga manushulantha sammanam ani చెప్పండి

   Ilaanti vishayalu kontha mandhi dhesha samaigrathaku bhangam kakiginchela vaadu kontunnaru

 5. చాలా బాగుంది.

 6. నిశీధి says:

  హమ్మయ్య ఫైనల్లీ ఈ టాపిక్ మీద ” ధైర్యం ” చేసి ఒకరు ఒక మంచి కవిత అందించారు , మన అల్ ఇజ్ వెల్ సొసైటీ లో స్తబ్దుగా ఎవరు భయపెడితే వాళ్ళకి భయపడి బ్రతికేసే మనల్ని నిద్ర లేపటానికి ఇంకా ఇలాంటి కవితలు ఎన్ని రావాలో. కుడోస్ సర్ .

  • Nee drustilo samajam ante yenti? Matham ante yenti?
   Oak prashna santhanam gurchi meeku thelisina 4 lines wrayali ani oka request

 7. buchireddy gangula says:

  సర్

  కవిత భాగుంది

  ఏమి మిగల్చకుండా — N. VENU… గారు మంచి వ్యాసం రాశారు —

  మీ పేరుతో రాస్తే — తప్పుఎమిటి ??? భయం దేనికి ????
  PEN…NAMES… ఎందుకండి ???????????????
  —————————————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 8. This is a serious issue……thanq for the effort u have put in

 9. డియర్ ఆహ్వానితుడు,
  నువ్వు నమ్ముతున్న దేవుడు ఉండే మతంలో వర్గాలు లెవా? హెచ్చుతగ్గులు లెవా?
  రిజర్వేషన్ లేకుండా ఉండే కులలొఅ చేర్చుకుంటే ఒప్పుకుంటావా?
  కుహన తార్కికతను పక్కన పెట్టి చేతనైతే అన్ని మతాలను మాట మౌద్యాన్ని విమర్సిమ్చంది.
  అయిన మత ఆహ్వానాల పట్ల ఇన్నాలుఅ లేని బాధ ఇప్పుడు ఇంత హటాత్తుగా ఎందుకు మొదలిమ్ది.
  ఇతర మతాలూ ఇన్నాలుగా మత ఆహ్వానాలు ,బలవంతపు మతమార్పిడులు లోపాయికారీ మతమార్పిడులు చేసినప్పుడు లేని బాధ ఆవేదన కవిత్వం అనీ ఇప్పుడెందుకు బయటకు వస్తున్నాయి?

 10. M.K.DHANUNJAYA MURTHY says:

  అయ్యా అపరిచితుడు గారు, మీ ప్రశ్నల లిస్టు లో కొన్ని సమాధానాలను కూడా ప్రశ్నలుగా సంధించారు. 1. ఇంతవరకు ఒక్క దేవుడిని ఆరాధించిన మీరు వాడి మతం లో చేరిన తర్వాత కూడా మీకిష్టమైన ఏదో ఒక్క దేవుడినే ఆరాధిస్తే సమస్య ఏంటి? అందునా వీడి మతం లో దేవుడ్ని ఎన్నుకోవడానికి choices బోలెడు. మీ మతం లో లాగా ఒక్కడ్నే కొలవాలనే రూల్ ఏమీ లేదు. 2. వాడు చేర్చుకునేది ఏముంది? నచ్చిన కులం లో మీరే చేరొచ్చు. 3. ఏ కులం వారినైనా పెళ్లి చేసుకొచ్చు. అలా చేసుకున్న వాళ్ళు బోలెడు మందున్నారు. 4. మీ పాత మతం లో మత గురువులు నుంచుని ఉపదేశాలు ఇచ్చే స్థానం లో మీరెప్పుడైనా నుంచుని వుండి ఉన్నట్లయితే, వీడి మతం లో కూడా గర్భ గుడిలోకి వెళ్ళొచ్చు, రాతి విగ్రహాలకు స్నానం చేయించొచ్చు, 5. గొడ్డు మాంసం తినడం మాననక్కర లేదు. నిరభ్యంతరంగా తినవచ్చు. అలా తింటున్న వాళ్ళు వాడి మతం లోనూ కొల్లలుగా వున్నారు. వీడి మతం లో నుండి ఇంకొకరిని వెలివేసే హక్కు వీడి మతం లో ఎవ్వరికీ లేదు. 6. పిల్లల్ని కనడం పై ఆంక్షలు ఎరుగని అపరిచితుడా, మరైతే ఇంకా నీకు బాధ ఎందుకు? వాడు కూడా పిల్లల్ని మందలు మందలు కనమనే కదా అంటున్నాడు? మీ పాత మతం లో మందలు మందలు పిల్లల్ని కంటే వాళ్ళు ఇస్తున్న మొత్తమంతే వీడి మతం లో కూడా ముట్టొచ్చు. 7. మీ పాత మతం లో మనుషులను వర్గాలు గా కాకుండా, మనుషులుగానే చూసే అలవాటు వున్నప్పుడు, ఇక సమస్య ఏంటి? వీడి మతం లో కూడా దాన్ని కొనసాగించవచ్చు. 8. కోటా లో వుజ్జోగం వస్తే, లక్షణంగా చేరొచ్చు. అలా చేరిన వాళ్ళు కోట్ల కొద్దీ వున్నారు. 9. చివరగా…ఎలాగు చచ్చింతర్వాత శవాన్ని కాలిస్తే ఏమి? పూడిస్తే ఏమి? దాని గురించి చింత ఎందుకు?…………ఇవన్నీ మీ కవిత్వం చదివిన తర్వాత నాకు కలిగిన అయోమయానికి స్పందన మాత్రమే. మీకిష్టం లేక పోతే, వాడు వెనక్కు రమ్మని పిలిచినంత మాత్రాన్న, వెళ్ళాల్సిన అవసరమే లేదనుకుంటా.

 11. So now, what do u want to write this so called poem?
  One line ans follow your insists which ever religion you belongs to you are follower of sanathana dharma that is what it is “thathvam asi”

  • .. chAturvarnyam mayA srushtam guna karma vibhAgasha: |
   The four characteristics which classify people based on character (attitude) and Action are created by me. Krishna in Geeta…

   Dear Siv,
   Please answer this question. Are the followers of sanatana dharma whole heartedly abided to this so called tenet? If they are really following this, then what about castes, same caste marriages, dalits. are you agreeing that character (attitude), and action come with birth?

 12. Is this attitude of yours is from birth? The society is not of good thought people and rules made for wrong thoughts. Sanathana never gives importance to birth now AM 47 was invented for protection now it is more used for violence, the fault is the human mind set and perception. Indians are highly adoptable people, the first thing what foreigner has done is taking out Sanskrit from education and bringing wrong perceptions on sanathana teachings.
  Questioning is very funny, and we always ask to others, intact first question should be self, am I following the oneness? If it is asked you yours self, are you? You don’t have to answer this to me or world, if u follow spread it. Now what ever the religion or region u follow, and you have this consciousness of oneness you are indirectly following sanathana by fulfilling ‘aham bramha’ ‘thathvam asi’ ‘vasudhaika kutumbakam’ ‘asambhadham madhyatho maanavaanam’ and so on so ఆన్

 13. akbar pasha says:

  మనుషుల్ని మింగేస్తున్న మతం, కులం సమస్యల పై కదిలించే కవిత

 14. Kadilimche kavitaa kaadu medilimche tavika..!!artham partham leni paityam..innaaallu leni avedana ippudenduku?

మీ మాటలు

*