దేవి నట్టింట్లో వేసి వున్న కుక్కి మంచం మీద పడుకుని వుంది . . ఆమె చూపు ఇంటి చూరుకి అంటుకుని వుంది . విపరీతమైన నీరసం వారం నుండీ , దగ్గు .. దగ్గి దగ్గి లుంగ చుట్టుకుని పోతుంది . ఈ మధ్యనంతా ఆమె చూపు ఇంటి చూరుని అంటుకుని వుంటుంది . దాదాపు నెల నెలన్నర క్రితం వాళ్ళ ఇంటికి వచ్చిందో పిచుకుల జంట . అన్యోన్యంగా పుల్లా పుడకా ఏరుకుని వచ్చి బూజు వేళ్ళాడుతున్న వాళ్ళ ఇంటి చూరులో గూడు కట్టుకున్నాయి . వీళ్ళకే తిండి లేదు మనమెందుకు భారమనుకున్నాయో ఏమిటో ఎప్పుడూ ఇంట్లో మేత కోసం వెతకవు . ఎప్పుడైనా మగ పిచుక ఏదో పని వున్నట్లు దేవీ వాళ్ళ అమ్మ గెంజి వార్చిన గిన్నె దగ్గర కిచ కిచ మంటూ గెంతుతుంది .
Chinna katha anukoni chadivaanu. Pichhukale anukoni.Kaani…Pedda katha. Touching..
కథలు పెజీలకుపెజీలు అవసరం ఉండదు చిన్నకత,చివరి వాక్యం అద్భుతం .బాగా రాశా రండి .