అభినందనలు

మీదపడి రక్కే సమయాల్ని
ఓపికగా విదిలించుకొంటూ,
తోడేళ్ళు సంచరించే గాలిని
ఒడుపుగా తప్పించుకొంటూ,
బాట పొడవునా
పరచుకొన్న పీడకలల్ని
జాగ్రత్తగా దాటుకొంటూ,
శీతలమేఘాలు చిమ్మే కన్నీళ్ళలో
మట్టిపెళ్ళై చిట్లీ, పొట్లీ
మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతూ
చివరకు చేరుకొన్నావా!

నీకోసమే పుట్టిన
నక్షత్రాన్ని తెంపుకొని
తురాయిలో తురుముకొని
గులాబిరేకలు, మిణుగురుపిట్టలు
నిండిన విజయంలోకి
చేరుకొన్నావా మిత్రమా!
అభినందనలు.

-బొల్లోజు బాబా

baba

మీ మాటలు

  1. నిశీధి says:

    నీకోసమే పుట్టిన
    నక్షత్రాన్ని తెంపుకొని
    తురాయిలో తురుముకొని
    గులాబిరేకలు, మిణుగురుపిట్టలు
    నిండిన విజయంలోకి
    చేరుకొన్నావా మిత్రమా!
    అభినందనలు. సూపర్బ్ సర్ , చిన్న పదాల్లో పెద్ద తత్వం మీకే సొంతం

  2. Chaalaa baavundi baba garu

  3. Dr.Ch. Rama Krishna says:

    సాగ లేక సాగుతూ,తూగ లేక తూగుతూ, ఆగ లేక దూకుతూ……
    దాహం తో ఉన్న వారికి నీరు..
    కవితా దాహంతో ఉన్నవారికి మీరు …….

  4. డా. రామకృష్ణ గారు
    కవిత మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది సార్. థాంక్యూ

మీ మాటలు

*