శృంగారం

Sringaram

 

~

ఒక మెరుపు వన్నె ఆకుపచ్చ నేపధ్యం. ఆశా వాగ్దానాల నిండు సారాంశం.

ఇద్దరు కలిసినప్పుడు

మొదట వుండే ఒక అపరిపూర్ణ మనఃస్తితిని  ఎదో చెప్తోంది అది.

ఈ ఆకుపచ్చ నేల మీద తెలుపుని వొంపాను, ఒక వలయంగా.

అప్పుడు ఆ ఇద్దరు వొక్కరై విశ్వ నర్తనం చేస్తున్నారు,

వలయాలు తిరిగే దర్వీషులై-

నిండుదనాన్నీ, కలయికనీ, సత్యాన్నీ వెతుక్కుంటూ.

ఆకుపచ్చ నేపధ్యంలో నృత్య ప్రవాహం;

దాని అంచుల మీద లోతులు కనిపిస్తూనే వుంటాయి మన కళ్ళకి-

అప్పుడిక ఎగసి పడుతుంది ప్రేమ!

Mamata Vegunta

Mamata Vegunta

మీ మాటలు

 1. Mamata Vegunta says:

  సారంగ రీడర్స్ కి, మో అభిమానులకి, నా మిత్రులకి, నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. I am overwhelmed by your response to the Mohanam series. Thank you!

  ఇలా ఈ చిత్రాలు సారంగ లో వేస్తారా అని నేను అనుమానంగా అడిగినా, వెంటనే మెచ్చుకుని ఒప్పుకునందుకు, I am obliged to Dr. Afsar. ప్రతి చిత్రానికి artist notes రాయమని చెప్పి, నేను రాసింది తెలుగులోకి అనువదించి, నగిషీ పెట్టినందుకు కూడా Dr. Afsar కి నా కృతజ్ఞతలు.

 2. kandu kuriramesh babu says:

  నాలుగేళ్ళు ఒక జీవిత కాలానికి తగ్గ సంక్రాంతి ముగ్గులను చేశాను ఛాయా చిత్రాల్లో. అందుకే ఈ సంక్రాంతి ఇంకా కాలు బయటకు పెట్టలేదు. మేలుకొనే లేదు. చుక్కలు గీతాలు మునివేళ్ళు పాదాలు ఏవీ వోధనుకున్నాను. కాని ఇక్కడ చూస్తే దేవతలను తమ గృహలకు శుబ సూచకంగా ఆహ్వా నించేమగువ కోరికల కన్నా నాకు ఈ పరిపూర్ణ శృంగం శాంతి నిచ్చింది. సంక్రాంతి. శుభాకాంక్షలు. ఇపుడిపుడే మీరెవరో తెలుస్తోంది. ఇలాంటి ఒక స్త్రీ, చిత్రలిపి, ఒకరుందని, ఒకటి చెబుతుందని తెలిసినందుకు అభినందనలు. మీ వికాసానికి, నిస్సంశయ వ్యక్తేకరణకి ఆనందాలు. దినం ఒకసారి చూడాలి, ఇరువురు అనిపించే ఫై వర్ణ చిత్రం ఒక హార్మొనీ. యూనియన్. గ్రీటింగ్స్.

  • Mamata Vegunta says:

   కందుకూరి రమేష్ బాబు గారు, రౌద్రమ్ రోమాంటిక్ గా ఉందంటే కొంచెం ఆలోచించాను. శృంగం సంక్రాంతి ముగ్గులా ఉందంటే సంబరపడిపోయాను. ధన్యవాదాలు.

 3. letters come dipped in
  one’s personal colours
  in their own way and
  they combine themselves to form
  yet another set of colours we call words;
  each word a spectrum
  in the hands of those
  who express them in multiples of
  colours hidden in myriad layers…
  ‘mo’ has/had a repository of
  inimitable colours that painted
  his personal mindscape
  as well the skyscape;
  now he sprays those heavenly hues
  on mamata just the way
  he showered his unconditional love…

  and when the unique hues, held captive
  all these years, decided to overflow
  she dare not arrest their flow…

  love you, mamata

 4. N Venugopal says:

  మమతా….

  ఎప్పట్లాగే

  నిబిడాశ్చర్యంతో

  అపార మమతతో….

  • Mamata Vegunta says:

   నిజం చెప్పొద్దూ, ఈ చిత్రానికి అందరి రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఉన్నాను. ‘నిబిడాశ్చర్యం’ – expect చేయలేదు సుమీ! Thank you Venu.

 5. మమత … dare not arrest their flow… as Indira says.

 6. Bharadwaj says:

  అకస్మాత్తుగా చూసాను.ఇంతకముందు తెలియదు నీ ప్రావీణ్యత గురించి. చాల బాగుంది.మనస్సు కి శాంతం కలిదిండి.ధన్యవాదములు మమత.

 7. మమతా అప్పుడప్పుడు సారంగ లో నిన్ను చూస్తున్నా. బాగుంది అనుకుంటున్నా చాల బాగుంది. నేను రజని గుర్తు పట్టావా .

  • Mamata Vegunta says:

   రజని.. తెలుసనుకుంటున్నా.. facebook.com/MamataVSingh లో మెసేజ్ చేయగలుగుతారా?

 8. మణి వడ్లమాని says:

  ఆ రంగుల కలయక రెండు హృదయాలలో తొణకిస లాడే ప్రేమ,
  నాలుగు కన్నుల అపురూపనర్తనం
  చూసే మనసులకి అందమైన వర్ణదృశ్యం…

  మమతా వచ్చే వారం కోసం ఎదురు చూస్తూ…….

  ..

 9. Mamata Vegunta says:

  మణి గారు.. వచ్చే వారం దరహాసంతో మీ ముందుకి..
  మమత

 10. కెక్యూబ్ వర్మ says:

  శృంగారానికి ప్రేమ నేపథ్యాన్ని జోడిస్తూ వర్ణ శోభితం చేసిన మీ చిత్రలిపి అమోఘం.. అనిర్వచనీయం మమతాజీ..

 11. నవరసాల్ని చిలికి, భావాల నుండి వర్ణాల వెన్నముద్దల్ని వెలికి తీస్తున్న మీ మోహనం……నిజంగా సుమనోహరం

 12. sudheer balla says:

  నాకు ఏమీ అర్థం కాలేదు , దర్వీషు లై అంటే అర్థం ఏంటి …… మీరు వేగుంట మోహన్

  ప్రసాద్ కి బంధువులా

మీ మాటలు

*