లేమి

<
 02 copy

 
అద్దాలు
అక్షరాలు
అనుభవించే శరీరం లేదు

నీడని
నీటిని
తాకే నేత్రం లేదు

శబ్దాలు
మౌనాలు
దాటే మనసు లేదు

శోకాలు
నవ్వులు
దాచే వాక్యం రాయలేను

ఎన్నటికి ప్రేమిస్తాను
విరిగిన కలల్ని
తెలియని పదాల్తో

వొదిలెళ్ళే జ్ఞాపకాల్ని
ఎప్పటికీ మన్నించను

తీరిగ్గా నిద్రపోవాలిక

-ఎం.ఎస్. నాయుడు

naidu

మీ మాటలు

 1. కెక్యూబ్ వర్మ says:

  ఎన్నటికి ప్రేమిస్తాను
  విరిగిన కలల్ని
  తెలియని పదాల్తో…. బ్యూటిఫుల్ సర్..

 2. నిశీధి says:

  చిన్న పదాల్లో ఇంత భావం అందించడం మీకే సాధ్యం సర్ . ఇది అసలు చూడండి ఎన్నటికి ప్రేమిస్తాను
  విరిగిన కలల్ని
  తెలియని పదాల్తో ఎంత గొప్పగా ఉందో . కుడోస్

 3. prasad bhuvanagiri says:

  కొద్ది మాటలో కోటి అర్ధాలు – అభి నందనాలు

మీ మాటలు

*