ఓ కప్పు సూర్యోదయం

picasso

 

 

 

 

 

 

 

తూర్పు కొండల్లో… రూపాయి కాసులా
పొద్దు పొడుచుకొస్తున్నప్పుడు
ఆమె… చీకటిని వెన్నెలను కలిపేసి
మిణుక్ మంటున్న నక్షత్రాలను
ఓ చెంచాడు పోసి
కప్పుడు సూర్యోదయాన్ని అతడికిస్తుంది
ఆ పొద్దంతా… అతని కంటిలో
మీగడ తరకలాంటి
ఆమె నవ్వు నిలచిపోతుంది

* * *

దరల మంటల్లో మండిన రూపాయి
పడమటి కొండల్లో పొద్దయి వాలుతున్నప్పుడు
ఆమె… కాసింత దుఃఖాన్ని పోసి
అదేపనిగా కన్నీరును కాచి
ఓ కప్పుడు చీకటిని అతడికిస్తుంది
ఆ రాత్రంతా…
వడలిన మల్లెమొగ్గలాంటి ఆ ఇంటిలో
విరిగిన పాల వాసనేస్తుంది

-మొయిద శ్రీనివాసరావు

Moida

మీ మాటలు

 1. Murali M. Mallareddy says:

  శ్రీను గారు…చాలా బావుంది!

 2. చాలా బావుంది శ్రీనివాస్ గారు.

 3. వాసుదేవ్ says:

  చిన్నదైనా సిసింద్రీలా వెలిగిందీ కవిత శ్రీనివాస్ గారూ…..ఎప్పటికీ గుర్తుండిపోయే కవితల్లో ఇదొకటవుతుంది. అభినందనలు.

 4. బాగుంది శీను..అభినందనలతో

 5. రెడ్డి రామకృష్ణ says:

  బాగుంది శ్రీనివాస రావుగారు .అభినందనలు.కానీ చిన్న సందేహం. మళ్లీ తెలవారుతున్దాలేదా! అని

  • srinivasrao says:

   Tappaka telavaarutundi ramakrishna gaaru. Ippudu manam chikatlo vunnam ani cheppalani naa prayatnam. Mi salahaalanu soochanalanu sadaa aasisthu

 6. srinivasrao says:

  Spandinchina andariki danyawaadaalu

 7. కవిత extraordinary గా ఉంది. మొదటి భాగం ఒక master piece. రెండవ సగం ఒకె.

 8. మంచి కవిత లోకమ్ ఎ రిగి రాచారు మిత్రమా

 9. buchireddy gangula says:

  మంచి x.మంచి ..కవిత సర్

  ———————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 10. narayana sarma says:

  ఒక ప్రతీకని ఒకేవాతావరణంలో రెండు స్వభావాలతో వాడటం కొత్తగా కనిపిస్తుంది..ఒక సాధారణ సంఘటనను కళాత్మకంగా చిత్రించారు.సారాంశంగా చెప్పిన జీవితం అందులోని లేమికి సంబంధించిన ధ్వని..ఇవన్నీ కవితను ఉద్దీపితం చేస్తాయి.ఈ కాలానికి అభివ్యక్తి ఎంతగా గమనించదగ్గ స్థాయికి చేరుకుందో ఈ కవితను చూస్తే అర్థం అయిపోతుంది..

 11. కష్ట సుఖాలను కలబోసి
  వాస్తవాన్ని రంగరించి
  కవితా చిత్రానిఉ వేవ్సారు.

 12. Srinivasarao says:

  Thanks for one and all

 13. హార్ట్ టచింగ్ . నైస్ నారేషన్ .వ్రాస్తూ ఉండండి

 14. balasudhakarmouli says:

  వైవిధ్యమైన కవిత. కొత్త రూపాన్ని తొడుక్కుంది. చాలా బాగుంది.

 15. balasudhakarmouli says:

  మొదటి దాన్లో వొకసారి చీకటి ప్రస్థావన వచ్చింది కాబట్టి.. నేను కవితను చదువుకునేటప్పుడు రెండో దాన్లో మళ్లీ చీకటి అని కాకుండా యింకోటి అదే భావాన్ని ధ్వనించేట్టు… వుంటే బాగుణ్ణనిపించింది.

  • Srinivasarao says:

   మిత్రమా చీకటిని డికాషన్ కి ఇండికేషన్ గా వాడాను. అక్కడ చీకటికి బదులు ఏ పదం బావుంటుందో సూచన చేయగలవు. దన్యవాదాలు

 16. Srinivasarao says:

  మీరు మీ అభిప్రాయాన్ని ప్రకటించారు. అలాగే ఎందుకు ప్రకటించారని నేను ఎలా అనగలను మిత్రమా ం

 17. రోజూ చూసే సూర్యుడినీ, చుక్కల్నీ, చీకటిని,

  మానవ సంబంధాల్లోని ప్రేమ ఆప్యాయతల నిర్వచనానికి పొదుపుగా విలువగా ఉపయోగించేసుకున్నారు.

  వాటిని అంతర్లీనంగా శాసిస్తున్న అర్ధికాన్ని చెప్పకనే నొక్కి చెప్పారు.

  చక్కనైన చిక్కనైన కవిత.

  అభినందన చందనాలు శ్రీనివాసరావు గారు.

  నారాయణ గరిమెళ్ళ.

 18. Srinivasarao says:

  మిత్రులారా నా ఈ చిన్న కవితకి మీ అమూల్యమైన అభిప్రాయాలను సూచనలను చేసి నన్ను ప్రోత్సహించినందుకు మరొకసారి మీ అందరికి దన్యవాధాలను తెలుపుకుంటున్నాను. కాని కవికి ఆశావాహ దృక్పధం తప్పనిసరిగా వుండాలి అది అతని కవితలలో ప్రతిఫలించాలి అన్నది నా అభిప్రాయం కాని నా ఈ కవిత నెగిటివ్ గా ముగిసింది. కావున పొజటివ్ గా ముగిసి వుండాలన్నది నా అభిప్రాయం కూడా. లేదా రెండవ బాగం మొదటిదిగా మొదటి భాగం రెండవదిగా వున్నా బాగున్ననిపించింది. ఈ విషయాలపై మరింత జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం వుంది. అలగే రామక్రిష్ణ మౌలి మరికొందరి మిత్రుల సలహాలను తప్పక ద్రుష్టిలో వుంచుకుంటానని తెలియజేస్తూ…

మీ మాటలు

*