‘సారంగ’లో త్వరలో ‘జాయపసేనాని’ నాటకం

 

 నేపథ్యం

 

ఓరుగల్లును పరిపాలించిన గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు,బావమరిది..తర్వాతి కాలంలో తామ్రపురి( ఇప్పటి చేబ్రోలు)ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలిన “జాయపసేనాని” భారతీయ నాట్య శాస్త్రానికి సంబంధించి భరతముని చే రచించబడ్డ ప్రామాణిక గ్రంథమైన “నాట్య శాస్త్రము”ను సమగ్రముగా అధ్యయనము చేసి కాకతీయ మహాసామ్రాజ్య వివిధ ప్రాంతాలలోని ప్రజాబాహుళ్యంలో అప్పటికే స్థిరపడి ఉన్న స్థానిక నాట్యరీతులనుకూడా పరిగణనలోకి తీసుకుని “మార్గ”(classical) పద్ధతులతో పాటు “దేశీ” నాట్య రీతులనుకూడా ప్రామాణికంగా గ్రంథస్తం చేసి ప్రసిద్ధ “నృత్త రత్నావళి”ని క్రీ.శ.1254 లో ఆవిష్కరించాడు.దీన్ని శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తెలుగులోకి అనువదిస్తే అంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ 1969 లో పుస్తకంగా వెలువరించింది.

దీనిలోని ప్రధాన “దేశీ” నాట్యమైన శివతాండవ శృంగ నర్తనం “పేరిణి”నృత్యాన్ని డా.నటరాజ రామకృష్ణ తన జీవితకాల సాధనగా రూపొందించి 1985 లో శివరాత్రి పర్వదినాన చారిత్రాత్మక రామప్ప దేవాలయంలో నాలుగు లక్షలమంది వీక్షకుల సమక్షంలో పదివేల ప్రమిదలు ప్రాంగణంలో వందమంది కళాకారులతో “పేరిణి” నృత్యాన్ని ఒక ప్రపంచ రికార్డ్ గా ప్రదర్శించారు.

ఈ నేపథ్యంలో రాయబడ్డ గంట నిడివి గల నాటకం ఈ “జాయపసేనాని”.ఇది మొదట “ఆల్ ఇండియా రేడియో” లో జాతీయ నాటక సప్తాహంలో భాగంగా ప్రసారమైంది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం మొట్టమొదటగా ప్రభుత్వంచేత జనవరి 9,10,11 2015 తేదీల్లో వరంగల్లులో నిర్వహించతలపెట్టిన “కాకతీయ ఉత్సవాలు”లో భాగంగా ఈ “జాయపసేనాని” నాటకం ప్రదర్శించబడనున్నది.

ఈ నేపథ్యంలో..రామా చంద్రమౌళి చే రచించబడ్డ “జాయపసేనాని” నాటకం ఇప్పుడు..మన “సారంగ” పాఠకులకోసం.

2 copy

మీ మాటలు

  1. రామ చంద్ర మౌళి గారి jaayapasenani నాటకం రేడియో లో విన్నాను చాల ఉత్తేజకరంగా saagutundi
    meru maa అభిమాన సారంగలో prachuristunnanduku చాల santoshistoo eduru చూస్తున్నాం

    జ్యోతి vizag

  2. Subha,haidaraabaad says:

    “జాయపసేనాని”మీద సాహిత్యం చాలా తక్కువగా వచ్చింది.రేడియో లో నేనీ నాటకాన్ని విన్నాను.చాలా బాగుంది.మౌళి గారు ఒక పరిశోధనలా చేసి ఈ నాటకాన్ని రచించారు.ఇప్పుడు దీన్ని “కాకతీయ ఉత్సవాల్లో” ఒక దృశ్య నాటకంగా వేస్తూండడం “తెలంగాణా” కు దక్కుతున్న అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను.నాటకాన్ని చదువేందుకు ఎదురుచూస్తూ,

    శుభ,హైదరాబాద్

మీ మాటలు

*