మర్చిపోయిన చరిత్రలో చిందిన ఎర్ర చుక్కల కేకలు నావే!

untitled

బ్రిటిష్ సాహిత్యం తో ఎక్కువ స్నేహం చేసిన అన్ని భారతీయ భాషల లానే తెలుగు సాహిత్యంలో కూడా బైరాన్, బ్రౌనింగ్ , కీట్స్ , వర్డ్స్ వర్త్ లాంటి కొన్ని పాపులర్ పేర్లు (వాళ్ళు సాహిత్యానికి చేసిన సేవ యే రకంగాను తక్కువ చేయటం కాదు ఇక్కడ ) ఇంకా కొంచం ముందుకెళ్ళి సోవియట్ యూనియన్ దోస్తీ తో రష్యన్ సాహిత్యం అలవాటు అయ్యాక లియో టాలిస్టాయ్ , మాక్షిమ్ గోర్కీ లాంటి హేమాహేమిల పేర్లు విన్నా కూడా , అటు అమెరికన్ సాహిత్యం , ఇటు ఆఫ్రికన్ అమెరికన్ లేదా ప్యూర్ ఆఫ్రికన్ లిటరేచర్ తో మనకున్న పరిచయము తక్కువే అని చెప్పుకోవాలి . అందులోనూ పోయెట్రీ విషయం లో ఇంకా కొన్ని వందల వేల పోయెట్స్ గురించిన కనీస జ్ఞానం కూడా మనకి ఇంకా దూరంగానే ఉంది .

ఇంటర్నెట్ విస్తృతంగా వాడకంలోకి వచ్చాక అక్కడక్కడ  మాయ అంజేలో  లాంటి ఉద్వేగ రచయితలు పరిచయం అయినా , ఇంకా తెలుసుకోవాల్సిన కవులు , చదువుకోవాల్సిన కవిత్వం హిమాలయాలంత మిగిలే ఉంది . ఈ ప్రయత్నం లో ఎవరెస్ట్ ఎక్కలేకపోయినా ( మొత్తంగా అందరి గురించి తెలుసుకోలేకపోయినా ) కనీసం ఉన్నంతలో దగ్గరలో ఉన్న గుట్ట కొండ ఎక్కి కొంత తెలుసుకున్నాం అన్న తృప్తి కోసం ఈ సారి మనం పరిచయం చేసుకుంటున్న కవి అబ్రహం లింకన్ ని పులిట్జర్ ప్రైజులని తన జీవితం లో భాగం గా మార్చుకున్న కార్ల్ సాండ్బర్గ్ .

కార్ల్ సాండ్బర్గ్ , స్పానిష్ అమెరికన్ వార్ దగ్గరుండి చూసిన ఈ రచయిత పెద్దల యుద్ధపు తమాషాలో బలయిపోతున్న పేదల గుండెల చప్పుళ్ళ గురించే ఎక్కువ రాసారు అంటే వింత ఏమి లేదు కాని మూడు సార్లు తన సాహిత్య సేవలకి గాను పులిట్జర్ ప్రైజులు అందుకున్న గొప్ప రచయిత గ్రామర్ పరిక్షలలో ఫెయిల్ అవ్వటం మాత్రం విచిత్రంగా అనిపిస్తుంది . ముప్పైల కాలం లో అమెరికా జీవితాన్ని చూపడమే కాదు , ఇప్పటికీ చాలా దేశాల దుస్తితి కి కూడా వర్తించేలా ఉండే గ్రేట్ డిప్రెషన్ పీక్ స్టేజి లో ఉన్న సమయం లో సామన్య ప్రజల భాషలో రాసుకున్న ఈ కవిత చదవటం అదే సామాన్యుల హృదయం చదివినట్లే ఉంటుంది .

ఒక పూర్తీ పుస్తకం కి సరిపోయే దాదాపు ౩౦౦ పేజీల “ The people ,yes “   లో మొత్తం పాదాలు చదువుకోలేకపోయినా అందులో ప్రజలను మోసగించిన ప్రజాప్రభువులకి ప్రజాగ్రహం గురించి హెచ్చరిక చేసిన కొన్ని పాపులర్ పంక్తులు ఇలా ఉంటాయి .

 

“ నేను ప్రజలు _ఆకతాయిమూక_ గుంపు _ మాస్

ప్రపంచంలోని అన్ని గొప్ప పనులు నాద్వారే జరుగుతాయి తెలుసా

నేనే సృష్టికర్త , నేనే పనివాడు

ప్రపంచంలో అన్నం బట్టల తయారీ అంతా నేనే

 

చరిత్ర ని చూస్తున్న ప్రేక్షకుడిని నేనే , సాక్షము నేనే

లింకన్లు నేపోలియన్లు నా నుండే వస్తారు , చస్తారు ,

అలాంటి ఇంకెందరినో తయారు చేసేది నేనే

నేనే విత్తు భూమి నేనే నాగలి

….

…..

….

మర్చిపోయిన చరిత్రలో చిందిన   ఎర్ర చుక్కల కేకలు నావే

….

ప్రజలనబడే నేను

నిన్నటి పాఠాలు గుర్తుంచుకొని ఎపుడయితే

నిరుడు సంవత్సరాల వరకు జరిగిన దోపిడీని

నన్ను అవివేకి ని చేసి ఆడుకున్నదేవరో

మర్చిపోకపోతే

ఎగతాళి కి కూడా

ఇహ “ప్రజలు “ అనే వారే ఉండరు

అపుడు మిగిలేది

ఆకతాయిమూక_ గుంపు _ మాస్ మాత్రమే …..

అంటూ ప్రజలని మోసగించిన ప్రజాప్రభువులకో హెచ్చరిక చేస్తూ “

 

ఒరిజినల్ పోయెమ్ అవే పంక్తులు

 

“I am the people—the mob—the crowd—the mass.

Do you know that all the great work of the world is done through me?

I am the workingman, the inventor, the maker of the world’s food and clothes.

I am the audience that witnesses history. The Napoleons come from me and the Lincolns. They die. And then I send forth more Napoleons and Lincolns.

I am the seed ground. I am a prairie that will stand for much plowing. Terrible storms pass over me. I forget. The best of me is sucked out and wasted. I forget. Everything but Death comes to me and makes me work and give up what I have. And I forget.

Sometimes I growl, shake myself and spatter a few red drops for history to remember. Then—I forget.

When I, the People, learn to remember, when I, the People, use the lessons of yesterday and no longer forget who robbed me last year, who played me for a fool—then there will be no speaker in all the world say the name: “The People,” with any fleck of a sneer in his voice or any far-off smile of derision.

The mob—the crowd—the mass—will arrive then.”

వీలయితే మరో సారి మరో కవి , మరో ఉద్వేగభురితమయిన కవిత తో …

 -నిశీధి

మీ మాటలు

 1. దేవి వర్మ కొవ్వూరు says:

  నేడు మీ ద్వారా మాకు తెలియని ఓ కవి ని పరిచయం చేసారు.మీ ద్వారా మరింత మంది కవుల గురించి తెలుసుకోవాలన్న ఆశక్తి తో…దన్యవాదములు నిశీది గారు..!

  • నిశీధి says:

   థాంక్స్ దేవి గారు . లింక్ ఇచ్చిన ప్రతిసారి ఓపికగా మరీ చదివి కామెంట్ కూడా పెట్టడం సామాన్య మయిన విషయం కాదు ..ముందు ముందు ఇంకా మంచి రచనలు చదువుకుందాం

 2. kcubevarma says:

  Ilaa naaku teliyani praja kavulanu parichayam cheyadam baagundi Nisheeji.. Thanks a lot..

  • నిశీధి says:

   సర్ జీ ఇందులో మనకి తెలియకపోవటం రచయిత లకంటే కూడా రచనలే ఎక్కువ . చాల వరకు అందరు రాసిన రొమాంటిక్ అంశాల కవితలు పాపులర్ అయ్యాయి కాని మనసు మంది రాసే రచనలు మనకు తెలియవు అంతే . థాంక్స్ జీ

 3. తిలక్ బొమ్మరాజు says:

  మీరు రాయని కోణం అంటూ ఏది ఉండదు,కవిత్వాన్ని లిఖిస్తున్న మీ చేతివేళ్ళు ఇప్పుడిలా పరదేశ కవులను పరిచయం చేయడం వారి గొప్ప కవిత్వాన్ని అనువధించడం చాలా నచ్చింది.ఒక కవి గురించి అతని కవిత్వం గురించి రాయాల్సి వస్తే ఎంతో కొంత వెలితి రావొచ్చు,మీరు రాసింది కొంతే అయినా పరిపూర్ణంగా ఉంది నిశీధి గారు.
  పదాలతో మీరు చేసే ఇంద్రజాలం భలేగా ఉంటుంది,అరే ఇవి మన తెలుగు అక్షరాలేనే ఎంత అందంగా ఉన్నాయో అనిపిస్తుంది వాటిని మీలో చూసిన ప్రతిసారి.మనః పూర్వక అభినందనలు నిశీధి గారు/\

  • నిశీధి says:

   భలేగా రాసాను అంటూనే నేను ఎలా పదాలను భావాలను వధించానో ముచ్చటగా చెప్పారు హ హ థాంక్స్ తిలక్ గారు . ఇంకా చదువుకుందాం వధిస్తునో వాదిస్తునో , ప్రేమిస్తునో .

 4. వాసుదేవ్ says:

  ఓ కవి గురించి కవిత గురించో చెప్పాల్సివచ్చినప్పుడు ఏది చెప్పాలి ఏది అవసరంలేదన్న విషయాన్ని హంసలా విడదీసి చూడటం చాలా తక్కువమందికే తెలుస్తుంది. అదెలాగో ఈ వ్యాసం ద్వారా మీరు చెప్పారు. ఇలా ఓ కవినో కవయిత్రినో ఎలా పరిచయం చేయాలో నేను నేర్చుకున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్పితీరాలి నిశీధిజీ! అనువాదానికి మీరెంచుకున్న పద్యామూ నడుస్తున్న చరిత్రలో తప్పక చదవాల్సినదిగా ఉంది. కంగ్రాట్స్.

 5. నిశీధి says:

  కవి పరిచయాలు అలవాటు చేసుకుందే మీ ఆర్టికల్స్ చదివి సర్ , కాకపోతే ఎంచుకున్న పద్యాలు బ్యాక్గ్రౌండ్స్ లో కాస్త వైవిధ్యం ఉంది అంతే . థాంక్స్ అ టన్

మీ మాటలు

*