కథ గొంతుకని పత్రికలు నొక్కేస్తున్నాయి

 

దోస్తు పలమనేరు బాలాజి, అతని మిత్రులు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ కథకులను చాలామందిని పిలుస్తూనే, కొత్త కథకులు కూడా తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేలా కొన్ని ప్రశ్నలను అందిస్తూ ఆహ్వానిస్తున్నారు. ఈ విషయంలో వారిని అభినందించి తీరాల్సిందే.
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకునే ఒక స్పేస్‌ను కల్పించినందుకు వారికి షుక్రియా కూడా..
చర్చకోసం వారు వేసిన ప్రశ్నల్లోంచి కొన్నింటికి నా స్పందన ఇది.
పత్రికలు కథా స్వరూపాన్నే కాక, భాషను, సబ్జెక్టును కూడా నిర్దేషిస్తున్నాయి.
1. భాష: నేను ఇంట్లో మాట్లాడేది ఉర్దూ. మా గల్లీల్లో మాట్లాడేది తెలంగాణ తెలుగు. చదివింది మాత్రం కోస్తాంధ్ర ‘ప్రామాణిక’ భాష. నేను ఏ భాషలో కథ రాయాలి? తెలంగాణలోని తెలుగు-ఉర్దూ కలగలిసిన మా కమ్మని భాషలో కథలు రాస్తుంటే కొందరు ‘కంగాళీ’ భాష అని ఆడిపోసుకుంటున్నారు. మా మీద బలవంతంగా రుద్దబడిన కోస్తాంధ్ర ప్రామాణిక భాషలోని వాక్య నిర్మాణాలు, పదాలు ఎంత వదిలించుకున్నా వదిలిపోని జిడ్డులాగా మమ్మల్ని హింస పెడుతున్నాయి. అది చూసి కంగాళీ కామెంట్లు చేస్తున్న వారు ప్రత్యక్షంగా కొందరే గాని, పరోక్షంగా ఎందరో.. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ఇచ్చిన ఎరుకలోంచి మేం గట్టిగా ప్రతిఘటించగలుగుతున్నాం కాని ఇన్నాళ్లు మా ప్రాంతపు ఎందరో రచయితల్ని కోస్తాంధ్ర భాషాగ్రేసరులు నంజుకుతిన్నారు. అంతేగాక భాష విషయంలో పత్రికలు కథా రచయితల్ని నానా హింస పెడుతున్నాయి. ‘మాండలిక’ పేరుతో కొన్ని ప్రాంతాల కథల్ని పత్రికలు నిరాకరిస్తున్నాయి. దాంతో ఎంతోమంది కథకులు కేవలం కోస్తాంధ్ర ప్రామాణిక భాషలోనే కథలు రాయలేక ఊరకుండిపోతున్నారు. నిజానికి తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ కథకులకు ఆత్మాభిమానం ఎక్కువ.
అందుకే కోస్తాంధ్ర మీడియా నిర్దేశిస్తే వారు గంగిరెద్దుల్లా తలలూపే స్వభావం ఏమాత్రం లేనివారు. దాంతో అలాంటివారు పత్రికలకు కథలే పంపని వాతావరణం మనం చూస్తున్నాం. ఈ విషయంలో కోస్తాంధ్రకు చెందిన అగ్రకులాల రచయితలు మాత్రం హాయిగా రాసుకుని, ఏ ఆటంకం లేకుండా అచ్చేయించుకోగలుగుతున్నారు. అట్లా కడుపు నిండిన కథలు ఎన్నో వస్తున్నాయి. కడుపు మండిన కథలకు మాత్రం తావు లేకుండా పోయింది.
రాసుకుని పుస్తకాలుగా మాత్రమే తీసుకొచ్చే శక్తి ఎంతమందికి ఉంటుంది? అలా చేయలేనివారు రాయడమే మానుకోవడం చూస్తున్నాం.
మా లాంటి వారము ఆ పత్రికలకు కథలు పంపాలంటే మా భాషలో రాసుకున్నది మళ్లీ వారి భాషలోకి అనువదించి పంపాల్సిన దుస్థితి పట్టింది. ఏ కొన్ని పదాలు, వాక్యాలు మావి పడ్డా అవేవో పంటికింద రాళ్లుగా వారు చూసే వాతావరణం గోస పెడుతున్నది. తెలంగాణలో వేముల ఎల్లయ్య, భూతం ముత్యాలు లాంటివారు దళిత కులాల వ్యావహారిక భాషలో రాస్తున్నారు. ఈ మధ్యే జూపాక సుభద్ర, గోగు శ్యామల లాంటివారు తమ మాదిగ స్త్రీల కథల్ని సంపుటాలుగా తీసుకువచ్చారు. వారి కథలేవీ ఈ పత్రికలు ముర్క గూడ చూసే పరిస్థితి లేదు. నేను, పసునూరి రవీందర్‌ లాంటివాళ్లం మా ప్రత్యేక భాషల్లో కథలు రాసుకున్నాక నమస్తే తెలంగాణ పత్రికకైతే అలాగే పంపడం, ఆంధ్రా పత్రికలకు పంపాలనుకుంటే మాత్రం వారి భాషలోకి తిరిగి అనువదించి పంపుతున్నాం. రచయితలు తమ భాషల్లో రాసుకున్న కథల్ని ఉన్నది ఉన్నట్లు వేసే పత్రికలు చాలా అవసరం అని మేం భావిస్తున్నాం.
2. సబ్జెక్టు: పత్రికలు రచయితలు రాయాల్సిన సబ్జెక్టును కూడా నియంత్రిస్తున్నాయి. కుల ప్రస్తావన ఉన్న కథలను చాలా వరకు పత్రికలు అచ్చుకు స్వీకరించడం లేదు. మత ప్రస్తావన ఉన్న ఎన్నో కథలు నిరాకరించబడుతున్నాయి. ముఖ్యంగా యాజమాన్యాల కులం, ప్రాంతం కథల సబ్జెక్టును చెప్పకనే నియంత్రించడం బహిరంగ రహస్యమే. మాదిగ, మాల కథలు, పాకి పని చేసేవారి కథలు, మత ఛాందసం మీద వచ్చే కథలు, హిందూత్వ మీద వచ్చే కథలు అచ్చుకు నిరాకరించబడుతున్నాయి.
3. నిడివి: నిడివి అనేది మరీ సమస్యగా మారింది. పత్రికల్లో రెండు పేజీల కథలు కొన్ని పత్రికలు, మూడు పేజీల కథలు కొన్ని పత్రికలు వేస్తున్నాయి. అచ్చులో చూసుకోవాలంటే ఆ నిడివిలోకి కుదించి రాయాల్సిన అగత్యం రచయితలకు పట్టింది. దాంతో కథకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కథలు ఎన్నో కత్తిరింపులకు గురయ్యే పరిస్థితి ఉంది. గతంలో రచయితలు రాసిన కథల్ని కళ్లకు అద్దుకుని అచ్చేసుకున్న పరిస్థితి. ఇవాళ కత్తిరింపులతో రచయితల మనసులు చిన్నాభిన్నం చేస్తున్న దుస్థితి.
‘సారంగ’ లాంటి రెండు మూడు వెబ్‌ పత్రికలు మాత్రమే కథల్ని ఉన్నది ఉన్నట్లు అచ్చేస్తూ కొంతవరకు ఈ ఖాళీని పూరిస్తున్నాయి.
వెరసి ఏ హద్దులు గీయకుండా కథల్ని అచ్చేసేందుకు, కథా చర్చలకు ఏ అడ్డూ చెప్పని ఒక పత్రిక అవసరం ఎంతైనా ఉంది. రచయితలే అందుకు ఒక ట్రస్ట్‌గా ఏర్పడి ప్రయత్నిస్తే మంచిదేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పత్రికలు గానీ, ఇక ముందు వచ్చే పత్రికలు గానీ యాజమాన్యాల ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యమిచ్చే వాతావరణం బలపడిపోయింది.
– స్కైబాబ

మీ మాటలు

 1. shanti prabodha says:

  ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు ధన్యవాదాలు స్కైబాబా గారు. నేనూ భాష సమస్య ఎదుర్కొన్నాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతపు భాషలో, యాసలో రాసిన నవల “జోగిని “. విషయం మంచిది, సామాజిక స్పృహ ఉన్నది ఎన్నుకున్నారు కానీ.. భాషే మింగుడు పడడంలేదు అన్నవాల్లెందరో .. ఆ భాష వల్లేనేమో కొన్ని పత్రికలనుండి కథలు తిరుగు టపాలో వెనక్కి వస్తున్నాయి…
  ఒక రచయిత తన వ్యక్తిగత లేదా తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసినప్పుడు కలిగే స్పందనల్లోంచి, ఆలోచనల్లోంచి, అనుభుతుల్లోంచి, సంఘర్శనల్లోంచి వచ్చే రచనలు అందుకు తగ్గట్టుగా తానున్న సమాజపు భాష నుడికారం నుండే వస్తాయి. రావాలి కూడా. అట్లా కాకుండా పత్రికల కోణంలో చూసి, వాటి యాజమాన్యాల పాలసి ప్రకారం వాటి అవసరాలు తీర్చడం కోసం కాదుగా మనం రాసేది రాయాల్సింది… అయితే ఆయా పత్రికలకు ఉండే కొన్ని పరిమితులని (స్పేస్) మనం గౌరవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రింటు పత్రికల్లో. అదే అంతర్జాల పత్రికల్లో ఆ సమస్య ఉండదు.

 2. “ వెరసి ఏ హద్దులు గీయకుండా కథల్ని అచ్చేసేందుకు , కథా చర్చలకు ఏ అడ్డూ చెప్పని ఒక పత్రిక అవసరం ఎంతేనా వుంది. రచయితలే అందుకు ఒక ట్రస్ట్ గా ఏర్పడి ప్రయత్నిస్తే మంచిదేమో ఆలోచించాలి.” – స్కైబాబా గారి ఆలోచన బాగుంది. వారే ఆ దిశలో ప్రయత్నం ప్రారంభిస్తే వారి మీద బలవంతంగా రుద్దబడిన కోస్తాంధ్ర ప్రామాణిక భాషలోని వాక్య నిర్మాణాల , పదాల జిడ్డును వదిలించుకొని , ఆ హింస నుండి బయటపడవచ్చు. యాజమాన్యాల ఆంక్షలు వుండవు కూడా.
  స్కైబాబా గారు ఈ వ్యాసాన్ని కోస్తాంధ్ర ప్రామాణిక భాష లో కాకుండా వారు కోరుకున్న విధంగా వ్రాస్తే బాగుందేది , ఎందుకంటే ` సారంగ ‘ లో వున్నది వున్నట్లు అచ్చేసుకోవచ్చు కనుక.

 3. ఎంత చెత్త కథైనా మాండలికం ఉంది కాబట్టి పొగడాలా. కోస్తావారి మీద ఈ కుళ్ళు ఎందుకో. గ్రామీణ రైత్వారీ కోస్తా యాస మీరెప్పుడైనా విన్నారా. సాహిత్యంలో పేరు తెచ్చుకోడానికి ఏదో ఒకటి అద్దం పెట్టుకోవాలి కాబోలు. జయప్రకాష్ గారు చెప్పినట్లు మీరు మీరు కోరుకున్న భాషలో ఈ వ్యాసం రాయొచ్చుగా. .

 4. rajendara mogili says:

  స్కైబాబా గారి ఆవేదన ఆలోచనాత్మకం. కోస్తాంధ్ర గూర్చి వీరికి బాగా తెలిసినట్టుగా వుంది. రాయలసీమ నుంచి మాండలికం రాసిన వారు వుత్తరాంధ్ర భాష రాసిన వారు గొప్పగా ఆదరణ పొందారా? సీనియర్ కథకులు స్కైబాబా గారికే తెలియాలి. సొంత భాష రాస్తే తెలంగాణ వాళ్ళు అవమనాలు చెందారట. ఇంట్లో మాట్లాదేదే రాయమని చెప్పిన గిడుగును సింహాసనం మీద కూర్చోబెట్టారా. ఆయన తెలంగాణ వాడే అయి వుండాలి. నోరు తెరిస్తే వైదిక పదాల కంపు అని శ్రీ శ్రీ మాటలు పడ్డాడు. ఆయనది ఘట్కేసర్ అని స్కైబాబాకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. యెండ్లూరి సుధాకర్ మల్లె మొగ్గల గొడుగు రాస్తే మాదిగ భాష రాస్తున్నడని పెద్ద పరేషాన్ అయ్యింది. ఆయనది కాజీపేట కాబట్టే అలా జరిగింది. `దెంగెయ్` అని సీమాంధ్రులని బూతులు తిట్టి అదే సీమంధ్ర అంతా తన అధూరే పుస్తక ఆవిష్కరణ జరుపుకున్న స్కైబాబా సీమాంధ్రను దాని ఖర్మానికి వదిలి తెలంగాణ ప్రజల కోసం రాసుకోక ఇంకా వాళ్ళను ఆడి పొసుకొవడం యెందుకు… వాళ్ళు చదవాలని తాపత్రయం చెందడం యెందుకు. సీమాంధ్రులను మీరు `దొస్త్` అనకండి స్కై బాబా గారు. మీకు అలవాటైన బూతులను వాడితే బాగుంటుంది.

  • రాజేంద్ర గారూ ! స్కైబాబా గారు సీమాంధ్రులను కోస్తాంధ్ర ప్రామాణిక భాషలోనే తిట్టారు , వారికి బాగా అర్థం కావాలని ! అది అప్పటి అవసరం మరి ! సీమాంధ్రులు పెద్దగా పట్టించుకోలేదు , కాని స్కైబాబా గారి పుస్తకావిష్కరణకు అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున యేర్పాట్లు చేశారు. కారణం వారికి అన్ని భావజాలాలు కలిగిన వారితో సత్సంబంధాలు వున్నాయి కాబట్టి ! కనుక స్కైబాబా గారికి సీమాంధ్రులు ` దోస్త్ ‘ లే మరి !!

 5. ari sitaramayya says:

  “అట్లా కడుపు నిండిన కథలు ఎన్నో వస్తున్నాయి. కడుపు మండిన కథలకు మాత్రం తావు లేకుండా పోయింది.”

  పోయిన సంవత్సరం మీ కథను మా DTLC (డిట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్) సభ్యులు విమర్శించినందుకు ఆగ్రహించి కడుపునిండిన వారి విమర్శలూ కడుపుమండిన వారి విమర్శలూ వేరుగా ఉంటాయి అని రాశారు మీరు (పుస్తకం.నెట్). మళ్ళా ఆ పదప్రయోగం వాడుతున్నారు కాబట్టి ఒక విషయం గుర్తొచ్చింది. తెలుగులో “కడుపునిండిన” మాటకు విరుద్ధం “కడుపుమండిన” కాదు, “కడుపుకాలిన.” కడుపు మండటం అంటే కోపం రావటం, ఆకలిగా ఉండటం కాదు. కాబట్టి మీరు చెప్పదల్చుకుంది, “అట్లా కడుపు నిండిన కథలు ఎన్నో వస్తున్నాయి. కడుపు కాలిన కథలకు మాత్రం తావు లేకుండా పోయింది.”

  ఎవరికీ తెలిసిన భాషలో వారు రాసుకుంటే ఏ ఇబ్బందీ లేదు. మరొకరి భాషలో రాసేటప్పుడు నేను రాసిందే కథా, నేను వాడిందే భాషా అంటే అందరూ అంగీకరించకపోవచ్చు.

 6. raghavareddy says:

  స్కై బాబా రాసిన `దెంగెయ్` పొయంను ఎవరైనా ఇక్కడ షేర్ చేయగలరా

  • P.Jayapakasa Raju. says:

   షేర్ చేస్తె బాగుండదేమో సర్ !

  • పూర్తిగా గుర్తు లేదు…. చివర-
   `భాడ్ఖవ్… దెంగెయ్` అని వుంటుంది.
   చిన్నప్పటి నుంచి `భాడ్ఖవ్` అనే మాట వింటున్నా దాని అర్ధం `తార్పుడుగాడు` అని అప్పుడు తెలుసుకున్నాను.
   సీమాంధ్రులంతా తార్పుడుగాళ్ళని స్కైబాబ ఈ కవితలో అభిప్రాయ పడ్డారు.

   • స్కైబాబా గారు వుద్యమ సందర్భంగా వ్రాసిన కవితలలో రెండు అద్భుతమైన కవితలు ` సారంగ ‘ పాఠకులకోసం.

    తల్వార్.
    ——
    ఆరీ..ఆంధ్రోడా !
    పువ్వు – రాయి – బోనం – బతుకమ్మ
    డప్పు – దరువు – ఆట – పాట
    ప్రక్రుతి అంతా మీకు ఎదురుతిరిగిందిరా
    ప్రక్రుతికి విరుధ్ధంగా నిలిచిన మీ ఉనికిని
    వేర్లతో సహా పెరికెయ్యడమే ఇక తరువాయి.

    మొహం పై పువ్వు
    మనసులో ముల్లు
    ఇంకా ఎన్నాళ్ళు ఆడతార్రా నాటకం
    ఇన్నాళ్ళు మేస్తిరి గదరా..
    మనిషి ముసుగుల్లో ఉన్న పందికొక్కుల్లాగా
    ధ్ధూ.. నీ యవ్వ
    మొహంపై ఉమ్ముతున్నా ఇంకా వేలాడుడేంద్రా
    సిగ్గూ శరం లేనోళ్ళలాగా ..
    నీతి తప్పినోళ్ళార్రా – నియ్యతి లేనోళ్ళార్రా
    నిప్పుల మీద నీళ్ళు సల్లుదామని చూస్తున్నార్రా
    ఇక్కడ నీళ్ళే నిప్పై మండుతయ్ బిడ్డా
    కన్నీళ్ళు నిప్పు రవ్వలై లేస్తయ్
    ఔ…
    మా కణం కణం రాజుకొని
    అణువణువూ నిప్పై ఎగుస్తున్నది
    మా నేల తల్లి నేర్పిన ఓర్పే – మమ్మల్నింకా ఆగబడ్తున్నది
    ఓపికకూ హద్దుంటది బిడ్డా
    ఇంకా మా ఓపికను పరీక్షించొద్దు
    దేహాలు తల్వార్ లై లేస్తయ్
    నంగి నంగి వేషాలొద్దు
    నక్క తెలువులు ఇంకా చూపెట్టొద్దు
    కనలి కనలి అగ్నిగుండమై ఉన్నోళ్ళం
    రగిలి రగిలి రక్త కాసారమై మరుగుతున్నోళ్ళం
    ఇంకొక్క చాన్సిద్దామనే ఊకున్నం
    లేదంటే – ఒంటితో మంటను రాజేస్తున్నోళ్ళం కదా
    కత్తిసాము చెయ్యడం కష్టమేం కాదు మాకు
    దేహాన్ని చిటికలో భస్మం చేస్తున్న వాళ్ళం
    అడ్డొస్తే అడ్డంగా నరకడం పెద్ద పనేం కాదు మాకు
    గోస తీస్తున్నది మేము
    తీర్పులు మీరు చెప్తార్రా !
    మేడలు కట్టుకున్న మీ ఆధిపత్యం
    మేము నినదిస్తే బీటలు వారుతుంది
    మా శ్రమ శక్తిని మా సంపదను దోచి
    ఎన్ని అక్రమ నిర్మాణాలు చేసిన్రో
    లెక్కలు తేలాలి బిడ్డా

    బేవఖూఫుల్లారా !ఇంకా ఐక్యత గురించి మాట్లాడకుర్రా
    మీరు మెక్కిన మా ఆస్తినంతా కక్కిస్తాం
    మా నేల మీకు వుమ్మడి ఆస్తి ఎట్లా అయ్యిందిరా
    మీ ఇంటినో మీ ఇంటోన్నో
    ఉమ్మడి ఆస్తి అంటే ఊరుకుంటార్రా
    చాలు మీ నఖరాలు
    తట్టా బుట్టా సర్దుకోవాలె
    బెజవాడకు మెయిలు కడతం
    బద్మాష్ లంతా భగాయించాలె
    మళ్ళీ సూడొద్దు మా హైదరాబాద్ దిక్కు
    మజాకైతున్నాద్రా .. ! ఇజ్జత్ తక్కువ నా కొడకల్లారా ..
    ఊకుంటుంటే ఉపాయాలెక్కువ జేస్తున్నరేం రా
    బొక్కలిరగ తంతం – ఉచ్చ పడాలె బిడ్డా
    అష్టదిగ్బంధనం చేస్తాం
    ఎటూ పారిపోలేరు – పాతరేస్తం కొడకా !

    ఇదే మా ఆఖరి పోరాటం
    ఈ మోఖా తప్పించిన్రో
    మా ఓపికల బంధనాలు విప్పుతాం
    నాలుకలు చీల్చడం కాదు
    అవసరమైతే అడ్డొచ్చే దుర్మార్గుల్ని
    పచ్చి చేపల్ని చీల్చినట్లు చీలుస్తాం
    ప్రజాస్వామ్యం మా నమ్మకాన్ని కూలదోస్తే
    మేము దాన్నే కూలదోస్తాం
    ఖబర్దార్ !

 7. ఆడ లేక మద్దెల ఓడు అంటే ఇదే .. నామిని గారి కథలు , ఖదీర్ కథలు రాలేదా … వేంపల్లి షరీఫ్ గారి కథలు రాలేదా .. ఎంత సేపు కోస్తావాళ్ళ మిద బురద చల్లడమే … ఐ విష్ పీపుల్ తో గ్రౌ అప్

 8. స్కైబాబా గారి మరో కవిత.

  దెంగెయ్ !
  =====

  ఇగెట్ల కలిసుంటం రా
  నా బతుకమ్మ నీకు తెల్వకపాయె
  నీ అట్ల తద్దె నా కంటక పాయె
  మొదట్నుంచి అంతా మోసమేనాయె
  నేలను దోస్తివి
  మా వోళ్ళను బీళ్ళను జేస్తివి
  ` గల గలా గోదారి కదులుపోతుంటేను … ‘
  ఇంకెంత కాలం పాడను నీ మోసపు పాటను
  ` మా తెలుగు తల్లికి మల్లెపూదండ … ‘
  ఇంకెంత కాలం నీ గారడీ పాట
  కడుపు కాలిన నాకు
  కడుపు నిండిన నీకు
  ఏకాభిప్రాయం ఎన్నటికొచ్చేన్రా
  నిజాల్ని నిలువునా తొక్కిపడ్తూ
  బరితెగించిన
  నీ మాటలు వింటనే ఉన్నం
  రోడ్ల మీదికి మేమొస్తే బంగ్లాలల్ల నువ్వు కులుకుతవా ?
  రగులుతున్న కడుపుల్నుంచి మేం నినదిస్తుంటే
  నువ్వు వంకర నవ్వులు నవ్వుతవా ?
  జైల్లల్ల మేం మగ్గుతుంటే దర్బార్ ల నువ్వు కూసుంటవా ?
  భాడ్ ఖావ్ !
  దెంగెయ్ నా కొడక.

  [ఐనాల గారితో కలిసి స్కైబాబా గారు వ్రాసింది. ]

  ఇందులో స్కైబాబా గారిని తప్పు పట్టాల్సిన పని లేదు. ఉద్యమం వుధ్రుతి అలాంటిది. వారి చేత అలాటి కవితలు వ్రాయిస్తది మరి !
  ఈ కవితలన్నీ ` సింగిడి ‘ తెలంగాణ రచయితల సంఘం ప్రచురించిన “ క్విట్ తెలంగాణ ” కవితా సంపుటి లోనివి.

 9. buchi reddy gangula says:

  విడి పోయాం — కలిసి బ్రతుకుదాం —
  అయినా తెలుగు భాష —విడి పోలేదు — ఏ ప్రాంతం అయినా ఒక్కటే
  స్కై బాబా గారు

  మొన్న సారంగ లో తెలంగాణా కథల బుక్ ప్రింట్ చేయాల ని — యి సారి తెలంగాణా
  వాళ్ళ కు ప్రత్యేక పత్రిక ఉండాలంటూ —-డబ్బు ఉంటె అన్ని ఉంటాయి —సర్
  స్కై బాబా గారు
  మీ ఆలోచన — మీ రాతలు — అంతా గుర్తింపు కోసం — డబ్బు రాబట్టడం కోసం –ఏదో
  హల్ చల్ — లేని పోనీ ఆలోచనలు
  సర్
  మీ పుస్తక అవిశికరణ — తాలుకా ల లో — జిల్లాల లో — చేసినపుడు యివన్ని గుర్తుకు
  రాలేదా స్కై బాబా గారు —
  మీ బుక్ ** మరో ప్రపంచం ** కాదు — మీరు శ్రీ శ్రీ కారు — ప్లస్ మీకన్నా మీ శ్రీమతి గారు
  మంచి రచయిత సర్
  డబ్బు ఎలా సేకరించాలా —ఏదో వ్యాపకం మీకు ఉండాలి — కాదా ??
  లేని పోనీ రాతలు —ప్రాంతాల వారిగా బురుధ చల్లు కోకుండా — బ్రతుకుదాం సర్
  తెలుగు భాష విడి పోలేదు –విడి పోదు
  ————————————————————-మిత్రుల కామెంట్స ను సమర్థిస్తాను — చక్కగా వివరించారు

  *********************************************************************************************
  బుచ్చి రెడ్డి గంగుల

 10. ఆర్.దమయంతి. says:

  యదా రాజ, తదా ప్రజా అంటే ఇదే కామోసు..

  • Damayanthi gaaru,
   I think you need to give an explanation,. otherwise your statement sounds you are generalizing.One need to be very mindful before one generalizes anything.
   I think you know very well, that you can not imply someones perspective to everyone.

   Thanks,
   Surabhi

 11. buchireddy gangula says:

  రాజులు ఎవ్వరు ?? ప్రజలు ఎవ్వరు?
  విశ్ద దికరిస్తారా –దమయంతి గారు
  —————————————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 12. చినవీరభధ్రుడు గోర్కి తోను ప్రేంచంద్ తో పోల్చింది ఇతడినా..!

 13. buchireddy gangula says:

  దమయంతి గారు —
  జవాబు రాయలేనప్పుడు కామెంట్ చేయడం దేనికి –??
  విడిపోయాం — యింకా –యిప్పుడు కూడా — ప్రాంతాల వారిగా కించ పరుచుకోవడం
  అవసరమా —
  డబ్బు ఉంటె ఎన్ని పత్రికలు — పుస్తకాలు అయినా వెలుగు లో కి తేవచ్చు –జగమెరిగిన సత్యం — —
  యీ మధ్యనే తెలంగాణా కథల పుస్తకం — పబ్లిష్ చేస్తున్నట్టు —సారంగ లో –పేస్ బుక్ లో
  రాశారు — యిప్పుడు పత్రిక అంటూ —???
  స్కై బాబా –గారు — ఏదో ఒక వార్త తో –సంచలనం తో —గుర్తింపు కోసం — డబ్బు సేకరించడం కోసం —రాతలు —పూతలు ???ప్రచారాలు ????
  యిక వారి పుస్తకాన్ని గ్రామాల్లో — తాలుకా ల లో — జిల్లాల లో –ఆవిష్కరణ జరిపింది -వాస్తవం —అది **కాలతిత వ్యక్తులు — చివరకు మిగిలేది —అసమర్థుని జీవ యాత్ర — ల స్థాయి లో లే దు —
  దమయంతి గారు — యివన్ని నిజా లండి —
  నిజాలు రాయడానికి — మాట్లాడటానికి భయం దేనికండి ???
  అఫ్సర్ గారు — యాకూబ్ గారు — ఖాదిర్ గారు — సలీం గారు —ఖాజా గారు — షాజహానా గారు –నా అబిమాన రచయితలు —
  నిండు కుండ తోనుకదు ????
  *******************************************************************
  బుచ్చి రెడ్డి గంగుల

 14. buchireddy gangula says:

  సారంగ — ఒక మంచి వెబ్ పత్రిక —
  స్థాయి ని కాపాడారు —
  రాసే రాతలకు
  చేసే పనుల కు
  చెప్పే మాటల కు –పొందిక ఉంటూ — అలా నడుచుకోవాలి
  అమెరికా అయినా అమలాపురం అయినా — character–counts—
  honesty– sincerity –creditability– respect—అవసరం —
  విడిపోయిన తర్వాత కూడా — ప్రాంతాల వారిగా — భాష ను — జీవిత విధానాన్ని — వ్యక్తులను — అవమానించడం ఎందుకు ?? దేనికి
  no- fabrication–// no-gossip– tell-the-truth–// WHY-FEAR—???
  అక్కడ అయినా -యిక్కడ అయినా –యీ జీవిత పరుగు పందెం లో
  గెలుపు ఎన్నడు –ఎప్పుడూ — డబ్బు దే —
  నిజం అందరికి తెలుసు —డబ్బుంటే ఎన్ని పత్రికలూ అయినా తీయవచ్చు —
  సభ్యత — సంస్కారం — మాటల్లో –చేతల్లో –రాతల్లో — కనిపించాలి –వినిపించాలి
  రానున్నది ద లిత శకం —ఒబామా యుగం లో యీ మెయిల్ తో బెదిరింపులు ???joke–??—————————
  బుచ్చి రెడ్డి గంగుల

  నోట్ — రామ స్వామి gaaru– thanks—ఫర్ యువర్ comment—

 15. అయ్యా స్కై బాబా గారూ,

  ఆంధ్రా వాడిని దెంగెయ్ అంటూ విషం కక్కుతున్నారు! మరి అలాటి వాళ్ల పత్రికల్లో మీ అమూల్యమైన కథలు ఎందుకు చెప్పండి? మీ భాషను గౌరవించే పత్రికల్లోనే మీ కథలు వేయించుకోండి. ఎలాటి ఎడిటింగూ లేకుండా వేసే వాళ్ళకే రాయండి. ఎందుకు ఆంధ్రా పత్రికల చుట్టూ తిరుగుతారు?

  పాపం వాళ్ల పాట్లు వాళ్లని పడనివ్వండి. మీ గొప్ప భాషలో మీ గొప్ప తెలంగాణా పత్రికలకే రాయండి.

  మైనారిటీ పేరుతో, ప్రాంతం పేరుతో విద్వేషాన్ని మీ కథల్ని వేసుకునే అదృష్టం పాపం ఆంధ్ర పత్రికలు చేసుకోలేదని సర్ది చెప్పుకోండి. పొండి

 16. కమల్ says:

  ప్రశాంతంగా బ్రతకాల్సిన మనుషులకు ఈ అంతర్జాలం అన్నది అనవసరపు రాద్దాంతంలాగ కనపడుతున్నది. ఇదిగో ఇలాంటి వ్యాసాలు చదివాక అనవసరపు బి.పి .. ఆవేశాకవేశాలు మనుషుల్లో రగులుతాయేమో అని అనిపిస్తుంది. అంటే ఇంట్లో ప్రశాంతంగా వుండక డబ్బులు ఖర్చు పెట్టి మరీ అనారోగ్యాలు తెచ్చుకోవడం అంటే ఇలాంటిదే అవుతుందేమో…??

  ఎక్కడైనా సరే ప్రతి ముప్పై కిలోమీటర్లకు మాట్లాడే వాడుక భాషతో పాటుగా పాక్షికంగా జీవణ శైలి, సంస్కృతి అన్నీను మారుతూ వుంటాయి. కాని అందరూ పుస్తకాల ద్వారా చదువుకోవడానికి ఒక “ప్రమాణిక భాష” అంటు నిర్మించుకొని వుంటారు. ఆ ప్రామాణికమైన భాషకు ఏ ప్రాంతీయ మాండలికంతో కూడుకొని వుండదు. అదొక కేవలం పుస్తక భాష మాత్రమే అవుతుంది.

  ఇక ఈ కవిగారు గోషిస్తున్నట్లుగా ఎక్కడా కూడ పుస్తక బాషలో కోస్తాంధ్ర, కానీ లేక గుంటూర్, ప్రకాశం, నెల్లూరి జిల్లాల మాండలికం కాని కలిసి వుండదు. మరెలా ఈయనగారు ప్రామాణిక తెలుగు భాషకు కోస్తాంద్ర యాసలుంటాయి అని వ్యాక్యానిస్తున్నారో అర్థమే కాదు.

  అసలు తెలంగాణ తెలుగు, కోస్తాంద్ర ప్రమాణిక భాష అనే పదబందమే విచిత్రంగా వున్నది. కోస్తాంద్రకు ప్రమాణిక భాష ఏంటి.. విచిత్రంగా..? ఈయన గారు కవి కాబట్టి ఏ పదబందం వాడినా కూడ అదొక ప్రమాణికంగా పరిగణిస్తున్నారా ఈ సారంగ పత్రిక వాళ్లు..? హచ్చు తెలుగు వేరు, ప్రాంతాల వారిగా వాడుక భాష వేరు ఇంత చిన్న విషయాన్ని కూడ విస్మరిస్తున్నారేంటో ఈ భాషా కోవిదులు..?

  ఇక ఈయన గారి ఆరోపణలు.. మాండలికాలలో రాస్తున్న కథలను అంగెకరించట్లేదు అని కదా..? మరి పైన ఎవరో ఉదహరించినట్లుగా యామినీ, మధురాంతక రాజారాం, ప్రస్తుతం నరేంద్ర, శాంతి నారాయణ, చిలుకూరి దేవపుత్ర, వి.ఆర్.రాసాని, పులికంటి కృష్ణారెడ్డి, ఇనయతుల్లా, జి.ఆర్.మహర్షి, దాదా హయూత్, సింగమనేని నారాయణ, మహమ్మద్ కదీర్ బాబు, అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య, బి.యస్.రాములు ఇంకా చాలా మంది రాయలసీమ, కోస్తాంద్ర, తెలంగాణ మాండలికాలలో రాస్తున్న రచయతల కథలను ఎలా ప్రచురణకు అంగీకరిస్తున్నారో మరి..? కేవలం ఈయన గారి కథలను మాత్రమే అంగీకరించట్లేదా లేక ఈయన గారి కథల్లోని కథాంశం గురించి ఏవైనా అభ్యంతాలుండి వాటిని ప్రచురణకు స్వీకరించట్లేదా..? ఎందుకీ పలాయన వాదం..?

  ఇక ఈయన గారు తెలంగాణ ఉద్యమంలో రాసినవి చదువుతుంటే వాటిని కవితలని అంటారా..? అవి చదువుతుంటే నాలాంటి వారికి రక్తం ఉడుకుతుందే.. వాటిని కవితలంటారా..? లేక బజారు మనుషుల్లా తిట్టే తిట్లంటారా..? పైగా ఉద్యమ ఉదృతిలో వచ్చిన కవితలంటు సపోర్ట్ ఒకటి..? ఉద్యమ ఉదృతిలో ఒకరిని నరకాలనిపిస్తే నరికేస్తారా ఏంటి..? ఇంతకన్న ఉన్మాదం, పలాయనా వాదంకు మించినది ఏది వుండదు.

  “బాడ్ కావ్ దెంగేయ్” అట.. నాలాంటి వారు వింటే “అడ్డంగా నరికేస్తాం కొడక” అని అనుండే వాళ్లం ఖచ్చితంగా..!! ఏమ్ వారికేనా పౌరుషాలు.. ఇటువైపు వారికుండవా..? వారు మనుషులు కారా..? మళ్లీ ఈయనొక కవి.

  మళ్లీ పైగా తిట్టిన తిట్లన్నీ తిట్టేసి.. ఇక విడిపోయాం తెలుగు వారిగా కలిసుందాం అనే ఒక ఒక నయగార పాట పాడుతున్నారు. మానసికంగా ఎదుటి వారిని హింసించాక ఆ గాయాలు అంత తొందరగా మానతాయా..? పక్క ప్రాంతం వాళ్లు మనుషులనుకొంటున్నారా లేక యంత్రాలనుకొంటున్నారా..?

 17. కోపం, ఆవేశం ప్రకటించేందుకు ఒక పద్దతంటూ ఉంది. ఎంత విప్లవమైనా ఎంత ఉద్యమైనా ఎదుటివాళ్ల గురించి ఇలా బజారు భాష వాడటం భావ దారిద్ర్యం తప్ప ఇంకొకటి కాదు. ‘ఏం వాళ్ళు వాడలేదా కధల్లో, కవిత్వాల్లో బూతులు‌‌’ అంటారేమో ఫలానా స్వభావం ఉన్న పాత్రను తిట్టడానికి, వ్యక్తీకరించడానికి కట్టగట్టి ఒక వర్గం ప్రజల పట్ల నీచంగా మాట్లాడటానికి నక్కకూ నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అయినా ఇలాంటివి అర్దమవుతాయి అనుకోవట్లేదు నేను.

  స్కైబాబా గారు నా కెంచి మీకో సలహా. ఇగమీద మిమ్మల్ని మీరు, వేరేటోళ్ళతోని ‘తెలంగాణ ఉద్యమ కవి‌‌’ అని పిలిపించుకోకుండ్రి, ఇంత దిగజారుడు భాష వాడిన ఉద్యమమా మీది పదిమందిల తలెత్తుకోలేకుంట ఐతది మాకు. తెలంగాణా వచ్చిన కారణంగా(నైనా) మన పోతన్న, సోమనాథుడు, దాశరథి, కాళోజీ గురించి తెల్సుకుందామని.. ఆళ్ళ రాతలు సదువుకుందామని అన్కుంటున్న జనాల్లో ఒకడిని… మిమ్మల్ని మీరు తెలంగాణా కవి గా చెప్పుకోవద్దు. వాళ్ళతో పాటు మీలాంటి వాళ్ళను ఊహించుకుంటే సిగ్గుతో సచ్చిపోవాలి అనిపిస్తుంది. రేపు ఎపుడన్నా మీకు ఇసొంటి కవిత్వాలు కతలు రాయలనిపిస్తే, ‘తల్వార్‌‌’, ‘బాడ్‌‌కవ్… ‘ లాంటి భాషను ఉపయోగించాలి అనిపిస్తే మీ కలం కదలకూడదని ఆ అల్లాకు మనస్ఫూరిగా మొక్కుకుంట.

 18. Get well soon says:

  మజాకైతున్నాద్రా .. ! ఇజ్జత్ తక్కువ నా కొడకల్లారా ..
  ఊకుంటుంటే ఉపాయాలెక్కువ జేస్తున్నరేం రా
  బొక్కలిరగ తంతం – ఉచ్చ పడాలె బిడ్డా
  అష్టదిగ్బంధనం చేస్తాం
  ఎటూ పారిపోలేరు – పాతరేస్తం కొడకా ! ……

  సార్ స్కైబాబా గారు.
  ఇలా మీరు రాసారా…. మరి మీ పౌరుషం ఏమయ్యింది.
  పలమనేరు వెళ్ళి సీమాంధ్రుల భోజనం ఎలా తిన్నారండీ…
  భాడ్కవ్ ల అన్నం తింటే మీరు భాడ్కవ్ అయిపోరూ….

 19. బుచ్చిరెడ్డి గారికి,
  రెండుసార్లు నన్ను ఉదహరించి స్కైని విమర్శించడం సరైంది కాదనిపించి రెండు మాటలు రాయకుండా ఉండలేకపోతున్నాను, ఎవరు మాట్లాడ్డం లేదు కాబట్టి-
  స్కైతో నన్నుగాని, నాతో పాటు చాలామందిని పోల్చలేమండీ. స్కై రాయడంతోపాటు ఆచరించి చూపుతాడు. అలాగే ఎందరినో ప్రోత్సహించి వారి రచనలతో ఎన్నో సంకలనాలు తీసుకువచ్చాడు. తన రచనల కన్నా అందరి రచనల పట్ల ఎక్కువ తపన పడే స్వభావం స్కైది. బహుశా స్కై వయసువాళ్లు ఎవరూ కూడా అతను చేసినంత వర్క్‌ చేశారని నేను అనుకోను.
  డబ్బులు సేకరించడం కోసం స్కై ఇలా చేస్తుంటాడని అన్నారు మీరు. డబ్బు మీద ధ్యాస ఉండే స్వభావమే ఉంటే సాహిత్యంలో ఇంతగా వర్క్‌ చేసేవాడు కాదు స్కై. నిజానికి తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా స్కై సాహిత్య, సామాజిక కార్యకర్తగా పనిచేస్తూనే వచ్చాడు. భద్ర జీవితం గురించి ఏనాడూ ఆలోచించలేదు. మొన్నే ఆత్మగౌరవం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేయడం అందుకు నిదర్శనం. హైదరాబాద్‌ వచ్చి 16 సంవత్సరాలైనా నిల్‌ బ్యాలెన్స్‌లో ఉన్నాం మేము. అవేవీ తెలియకుండా మీరలా మాట్లాడ్డం భావ్యం కాదు. నిజానికి ఇది అందరికి తెలిసిన విషయమే.
  కమ్యూనిస్టులకు, మావోయిస్టులకు, ఆరెస్సెస్‌ వాళ్లకు ఫుల్‌ టైమర్స్‌ ఉంటారు. వాళ్లకు ఆ సంస్థలే గౌరవ వేతనం ఇస్తుంటాయి. స్కైలాంటి అస్తిత్వ ఉద్యమాల నుంచి వచ్చినవారికి అలాంటి సంస్థలేమీ వెనక లేవు. చాలా కష్టాలు పడి ఇలాంటివారు పనిచేస్తున్నారు. తాము వేసే పుస్తకాలకు, కార్యక్రమాలకు మిత్రులే చందాలు వేసుకుంటుంటారు. నేను కూడా అలా చందాలు ఇచ్చినదాన్నే. మనం చేయలేకపోతున్న పనులు మిగతావాళ్లు చేస్తుంటే మనమూ ఒక చెయ్యి వేయాలే గానీ ఏదో ఒకటి గాలికి మాట్లాడేయడం సరి కాదు. బహుశా స్కై ముస్లింవాదిగా, తెలంగాణవాదిగా గట్టిగా పనిచేయడం పట్ల వ్యతిరేకతతో అతన్ని మీలాంటివారు విమర్శించడం పనిగా పెట్టుకున్నారని అనిపిస్తుంది. తెలంగాణ అస్తిత్వం, ముస్లిం అస్తిత్వం వేరు వేరు అంటుంటాడు స్కై. స్కై రచనల్లో ఆ తీవ్రత ఉంటుంది. స్కై రాసిన ముస్లింవాద కవితలు కూడా ఒకసారి ఇక్కడి మిత్రులు చదివితే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ వచ్చేశాక అప్పటి ఉద్యమ కవితలను ఇప్పుడిక్కడ ఉదహరించడం వృధా. కథా భాష, పత్రికల నియంత్రణ అనే విషయాన్ని పక్కదారి పట్టించారు.
  చివరగా- ‘అధూరె’ సంపుటి సభలు జరిగిన చోటల్లా స్కై తన కథల గురించి కాకుండా ముస్లింల సామాజిక నేపథ్యం గురించే మాట్లాడాడు. ఆ విషయాన్ని ఆ పుస్తకం రీప్రింట్‌లో చూడొచ్చు.

 20. buchireddy gangula says:

  షాజహానా గారు

  మీరంటే గౌ రవం — అబిమానం –ఒక మంచి రచయిత్రి అని నా ఒపీనియన్
  యిక నేను అచ్చమయి నా తెలంగాణా వాది నే —యింతవరకు నాలుగు నా బుక్స్
  ప్రింట్ చేశాను —అందులో జయహో జై తెలంగాణా ఒకటి — వీ లు తో నవోదయ బుక్ స్టోర్ — కెల్లి అడిగి తెచ్చు కొండి — ఫ్రీ గా నే యివ్వ మని చెప్పాను — అయినా నేను రచయితను కాను — మిమ్ముల్ని — నా అభిమాన రచయితుల రచనులు చదివి ఏదో రాసాను —కవిత్వం లో ఆ ఆ లు దిద్దు తున్నా –
  ఓ సారి అలావా — బుక్ తీసుకొని ఆటా బోర్డు మీటింగ్ కు వెళ్లాను — తీరిక టైం లో
  coffe-shop– లో మిత్రులతో coffe–తాగుతూ ఆలవా తిరిగేస్తున్నాను —ఏం చాదువుతున్నావంటూ అ బుక్ ను గుంజు కొ న్నాడు — ఒక డాక్టర్ —
  బుచ్చన్న తురుకొల్ల పుస్తకం చదువుతున్నాదంటూ హేళన చేస్తూ అందరు నవ్వు తున్నారు — వాళ్ళ తో పేచి కి దిగాను — చాలాసేపు వాదించాను —
  అమెరికా అయినా – అమలాపురం అయినా — యింకా అదే తిరు —అవే నవ్వులు — ముస్లిమ్స్ అంటే — పరాయి వాళ్ళు అన్న భావన ?? దేనికో — మల్లి విల్లు చదుకున్న దద్దమ్మలు madam—
  నాకు కుల పట్టింపులు లేవు —జీవితం లో పంచాయితి అంటూ పెట్టు కొను —
  ఏదయినా ముఖం మిధ మాట్లాడుతాను — రాస్తాను
  విడి పోయాం — కలిసి బ్రతుకుతాం — అ తిరుగా ఉండాలి కాని — యింకా ప్రాంతాల వారిగా ద్వేషించుకుంటూ —- ఉండటం దేనికి ??– అ గేయాలు చదవండి –ఎలా ఉన్నాయో ??మొన్న కథా సంకలనం అంటూ — నేడు — తెలంగాణా కు పత్రిక అంటూ —
  డబ్బు ఉంటె —
  చాల సార్లు పేస్ బుక్ లో కూడా — డబ్బు — విరాళం అంటూ చూసి —అలా రాశాను
  madam— అ కామెంట్స్ చదవండి — అ ప్రాంతం వెళ్లి మీటింగ్ లు పెట్టి —-ఒక పుస్తకాన్ని అన్ని ఊళ్ళల్లో — ఆవిష్కరణ — అది చూడటానికి ఎబ్బెట్టు గానే ఉంటుంది —-ముస్లిం సామజిక నేపధ్యం అంటూ —నా ఒపీనియన్ లో అలా చెప్పుకోవడం మంచిధీ కాదనుకుంటాను

  బాబా garu———about– money—-sentence—I—-will–take–it–back—సారీ
  మాట్లాడుతాను —— లేక – కాల్

  —-చేయండి——–9494579966
  ———————————————————- buchi-reddy-gangula————–

 21. P.Jayaprakasa Raju. says:

  షాజహానా గారు స్కైబాబా గారిని విమర్శించినందుకు బాధపడ్డారు. అది సహజం.
  కాని ` తెలంగాణా వచ్చేశాక అప్పటి ఉద్యమ కవితలను ఇప్పుడిక్కడ ఉదహరించడం వ్రుధా ‘ అని వ్రాశారు. ఉద్యమ కవితలతో ఎలాటి సమస్య లేదు. ఆ కవితలలో వుపయోగించిన భాష పైనే అభ్యంతరం. ఆ సంపుటిలో స్కైబాబా గారు , తెలంగాణా శ్రీనివాస్ గారు , గుడిపల్లి నిరంజన్ గారు వ్రాసిన కవితలు , వారు వుపయోగించిన భాష యెంత నీచంగా వున్నవో చదివిన వాళ్ళకు తెలుసు. ఇప్పటికి మరచిపోలేకున్నారు. పత్రికలలో వాటిపై విమర్శలు వచ్చినప్పుడు కూడా కనీసం వారు పొరపాటని అంగీకరించలేదు . వాటిని సమర్ధించుకుంటూ , ప్రశ్నించడానికి కూడా వీలులేదన్నారు.
  ఇపుడు షాజహానా గారు బాధపడినట్లే , అపుడు అవి చదివిన వారిని కూడా బాధించాయని తెలుసుకోవాలి.

  • మంజరి లక్ష్మి says:

   మీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను.

 22. buchi reddy gangula says:

  జయప్రకాశ్ రాజు గారు

  మీ ఒపీనియన్ ను నేను సమర్థిస్తాను —అలా రాయడం నాకు
  కూడా సబబు గా అనిపించలేదు –
  గాలి మాటలు — గాలి చేతలు చేయను —
  రొండు సార్లు అలోచించి — ఉన్నదీ ఉన్నట్టు — మాట్లాడుతాను — రాస్తాను
  నిజం రాయడానికి — జంకు దేనికి ???
  ——————————————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

మీ మాటలు

*