On an autumn night

autumn

Painting : Aruna

నీలోపలి వణుకు చూసే
గదినిండా చలి
నీ చేతుల్ని వెలిగించింది
చీకటి
**
నీ పిలుపువిని
నదుల్లోపలి ప్రతిధ్వనిలో
హృదయాన్ని దాచుకుని-
నీ సరిహద్దులు తెలీక
దిగంతరేఖని చెరిపివచ్చాను.
**
నీ పరిమళం భూమినిండాలని
గాలి తనని తాను చీల్చుకుపోయింది.
నంద కిషోర్

నందకిశోర్

 

మీ మాటలు

  1. దిగంతరేఖలు చెరిగిపోయి, గాలి చెలరేగిపోయిందా,.. ఇలా.,,

  2. మణి వడ్లమాని says:

    కవిత లో చిన్న పదాలు భావంలో అనంతాక్షారాలు. బావుంది నందకిశోర్

Leave a Reply to bhaskar k Cancel reply

*