లైఫ్ ఈజ్ డ్యూటిఫుల్!

Mohan Rushi

ముఖ్యంగా నిన్ను నువ్వు అదిమి పట్టుకోవాలి. ఎల్లప్పుడూ బీ పాజిటివ్ రక్తాన్నే

ఎక్కించుకోవాలి. మొండి గోడల్లోంచి మొలాసిస్ పిండుకుని తాగాలి. రాజుగారి

కొత్త దుస్తుల్నే ధరించి చరించాలి. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆల్ ఈజ్ వెల్

పాటలనే పాడి పరవశించాలి.

చూసే కళ్ళల్లో అందాన్ని దిగ్గొట్టాలి. ఆకుపచ్చ కామెర్లు అంటించుకోవడానికి

ఆపరేషన్లు చేయించుకోవాలి. సంకనాకిపోయినా జీవితంలోని సౌందర్యాన్నే

కీర్తించాలి. చావుదెబ్బలు తగుల్తున్నా సమ్మదనాన్నే అభినయించాలి. జీలో

కాల్తున్నా జీమూతవాహనుడికే జిందాబాద్ కొట్టాలి.

ప్రేమించే హృదయాన్ని ఫ్రేము కట్టుకు తిరగాలి. నిజాల మీద నిప్పులు పోసి

పప్పులుడికే ప్లాన్లు వెయ్యాలి. మంట మండిస్తున్నా, మర్యాద రామన్న మాస్కులో

మూస్కోవాలి. ఒరిజినల్ ఫీలింగ్సన్నీ ఒజిమాండియాస్ సమాధిలో పాతిపెడ్తే,

అప్పుడు కదా, బతుకు బాగుపడేదీ, రేపటికి లేచి కూర్చునేదీ

                                                           – మోహన్ రుషి

మీ మాటలు

 1. srinivas sangishetty says:

  మనిషి మాంసాన్ని మెదడునీ పీక్కు తింటున్న కనపడని బాసుల గురించీ, బాధ్యతల పేరిట బాధపడుతున్న జీవితాల్నీ మోహన్ బాగా చెప్పిండు.

 2. రాఘవ says:

  ఓర్నీ దుంపదెగ…దూరానిగ్గూడా తెగిపొయ్యేటంత షార్పుగా సెప్పినవేందయ్యా సోఁవే!

 3. స్వామీ,..,.,,, ఉడికిస్తూ కూడా పప్పులుడికిస్తున్నారు,., :)

 4. Thirupalu says:

  //సంకనాకిపోయినా జీవితంలోని సౌందర్యాన్నేకీర్తించాలి.//
  పగటి వెషగాల్లని భలే పరామర్శించారు!

 5. c.v.suresh says:

  వ్య౦గ్యభరిత౦…! బ్రతుకుల్లోని డొల్లతనాన్ని ఉతికి ఆరేశారు……..మోహన్ గారు! దేశీ మూసల్లోను౦డి…..కవిత్వాన్ని ఎత్తి తీరాన వేశారు… ! అద్భుత౦ మోహన్ రుషి గారు….! అ౦తా సార్క్యాస్టిక్ గా రాస్తూనే.. చివరగా..

  “ఒరిజినల్ ఫీలింగ్సన్నీ ఒజిమాండియాస్ సమాధిలో పాతిపెడ్తే,

  అప్పుడు కదా, బతుకు బాగుపడేదీ, రేపటికి లేచి కూర్చునేదీ…..! అమేజి౦గ్.! ఓరిజినిలాటిని పాతేయాల్సి౦దే.. ! హాట్సాఫ్!!!
  సి.వి.సురేష్

 6. knvmvarma says:

  moahanaa saTairical poem mee kalam numchi koddigaa aaScharyam gaanuu marikomta kottagaanuu..sharaa maamuulugaa adbutamgaanuu umdi

 7. dasaraju ramarao says:

  సోకాల్డ్ వైట్ కాలర్ సొసైటి ని మార్చలేని ,ఏమీ చేయలేని బాధ లోంచి ఇట్లాంటి కవిత్వమే వస్తుంది… మోహన్ రుషి ఇందులో అరితేరిండు..

 8. ముఖ్యంగా నిన్ను నువ్వు అదిమి పట్టుకోవాలి. ఎల్లప్పుడూ బీ పాజిటివ్ రక్తాన్నే

  ఎక్కించుకోవాలి. మొండి గోడల్లోంచి మొలాసిస్ పిండుకుని తాగాలి. రాజుగారి

  కొత్త దుస్తుల్నే ధరించి చరించాలి. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆల్ ఈజ్ వెల్

  పాటలనే పాడి పరవశించాలి.
  అవును ఎవరిని వారు అదిమి పెట్టుకుని అదిమి పట్టుకుని ఉంచలేనప్పుడు ఏమవుతుందో తెలీదు గనకనా. బీ పాజితివే కాదండి నెగెటివ్ మనుషులకు నెగిటివ్ రక్టాలే ఎక్కించాలి లేపోతే వికటిస్తుంది మరి,,, గోడల్లోంచి మొలాసిస్ వస్తుందన్న మీ థీరీ కోటి వరహాల ఎత్తు.పాపం రాజు గారూ చిరిగినవే వేసుకుంటే ఏం బావుంటుంది … ఇవన్నీ చెప్పి ఆల్ ఈజ్ వెల్ అంటే ఎలా కనిపిస్తున్నాం మేం మీకు

  చూసే కళ్ళల్లో అందాన్ని దిగ్గొట్టాలి. ఆకుపచ్చ కామెర్లు అంటించుకోవడానికి

  ఆపరేషన్లు చేయించుకోవాలి. సంకనాకిపోయినా జీవితంలోని సౌందర్యాన్నే

  కీర్తించాలి. చావుదెబ్బలు తగుల్తున్నా సమ్మదనాన్నే అభినయించాలి. జీలో

  కాల్తున్నా జీమూతవాహనుడికే జిందాబాద్ కొట్టాలి.

  ప్రేమించే హృదయాన్ని ఫ్రేము కట్టుకు తిరగాలి. అవునన్నా కాదన్నా ఇదైతే అక్షర సత్యమ. ఎక్కడు౦ద౦డీ ఈ ప్రేమ… ఉంటే మోహన్ రిషి ఇలా ఉండే వాడా/
  నిజాల మీద నిప్పులు పోసి

  పప్పులుడికే ప్లాన్లు వెయ్యాలి. మంట మండిస్తున్నా, మర్యాద రామన్న మాస్కులో

  మూస్కోవాలి. ఒరిజినల్ ఫీలింగ్సన్నీ ఒజిమాండియాస్ సమాధిలో పాతిపెడ్తే,

  అప్పుడు కదా, బతుకు బాగుపడేదీ, రేపటికి లేచి కూర్చునేదీ
  రేపు లేచి కూచోక పొతే కవితలు రాయద మీలాగా?

 9. ముఖ్యంగా నిన్ను నువ్వు అదిమి పట్టుకోవాలి. ఎల్లప్పుడూ బీ పాజిటివ్ రక్తాన్నే

  ఎక్కించుకోవాలి. మొండి గోడల్లోంచి మొలాసిస్ పిండుకుని తాగాలి. రాజుగారి

  కొత్త దుస్తుల్నే ధరించి చరించాలి. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆల్ ఈజ్ వెల్

  పాటలనే పాడి పరవశించాలి.
  అవును ఎవరిని వారు అదిమి పెట్టుకుని అదిమి పట్టుకుని ఉంచలేనప్పుడు ఏమవుతుందో తెలీదు గనకనా. బీ పాజితివే కాదండి నెగెటివ్ మనుషులకు నెగిటివ్ రక్టాలే ఎక్కించాలి లేపోతే వికటిస్తుంది మరి,,, గోడల్లోంచి మొలాసిస్ వస్తుందన్న మీ థీరీ కోటి వరహాల ఎత్తు.పాపం రాజు గారూ చిరిగినవే వేసుకుంటే ఏం బావుంటుంది … ఇవన్నీ చెప్పి ఆల్ ఈజ్ వెల్ అంటే ఎలా కనిపిస్తున్నాం మేం మీకు

  చూసే కళ్ళల్లో అందాన్ని దిగ్గొట్టాలి. ఆకుపచ్చ కామెర్లు అంటించుకోవడానికి

  ఆపరేషన్లు చేయించుకోవాలి. సంకనాకిపోయినా జీవితంలోని సౌందర్యాన్నే

  కీర్తించాలి. చావుదెబ్బలు తగుల్తున్నా సమ్మదనాన్నే అభినయించాలి. జీలో

  కాల్తున్నా జీమూతవాహనుడికే జిందాబాద్ కొట్టాలి.

  ప్రేమించే హృదయాన్ని ఫ్రేము కట్టుకు తిరగాలి. అవునన్నా కాదన్నా ఇదైతే అక్షర సత్యమ. ఎక్కడు౦ద౦డీ ఈ ప్రేమ… ఉంటే మోహన్ రిషి ఇలా ఉండే వాడా/
  నిజాల మీద నిప్పులు పోసి

  పప్పులుడికే ప్లాన్లు వెయ్యాలి. మంట మండిస్తున్నా, మర్యాద రామన్న మాస్కులో

  మూస్కోవాలి. ఒరిజినల్ ఫీలింగ్సన్నీ ఒజిమాండియాస్ సమాధిలో పాతిపెడ్తే,

  అప్పుడు కదా, బతుకు బాగుపడేదీ, రేపటికి లేచి కూర్చునేదీ
  రేపు లేచి కూచోక పొతే కవితలు రాయడ మీలాగా?

 10. mohan rishi says:

  థ్యాంక్యూ ఫ్రెండ్స్! :)

 11. మొకమ్మీద సిలుకు బట్టకప్పి పాత సెప్పుతో ఫెఢీన వాయించినట్ల–మనల్ని పిరిము సేసే జనాల్ని ఫోటోసేసి మోసుకోని తిరిగే మన బతుకులు సంకనాకి పోతావుండేది–అని బాగ సెప్పిండావప్ప మారాజా ఋషీ

 12. vijay kumar svk says:

  బతుకుతున్న బతుకులెక్క నిజంగా నిజంలా మనల్ని మనం చూస్కుని వెక్కిరించుకునేలా పరదా చాటుగా నిలబడి కొన్ని కన్నీళ్లు వోదులేస్కునేలా నిక్కార్సుగా పక్కనే కూసుని సూదితో నువ్ మనిషివిరా నాయనా అన్నట్టు ఉందే మోహన్ అన్నా :) :) చీర్స్….

 13. mohan rushi says:

  థ్యాంక్యూ !

మీ మాటలు

*